Karan Johar Response On Katrina Kaif Marriage Invitation - Sakshi
Sakshi News home page

Koffee With Karan: కత్రినా-విక్కీ పెళ్లికి పిలవకపోవడం ఇబ్బందిగా అనిపించింది: కరణ్

Published Tue, Sep 27 2022 8:18 PM | Last Updated on Tue, Sep 27 2022 8:51 PM

Karan Johar Responded On Katrina Kaif Marriage Invitation - Sakshi

బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో కాఫీ విత్ కరణ్. తాజాగా ఫినాలే ఎపిసోడ్‌లో కరణ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బాలీవుడ్ జంట కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ వివాహానికి పిలవకపోవడంపై కరణ్ జోహార్ స్పందించారు. పదమూడో ఎపిసోడ్‌లో తన్మయ్ భట్, డానిష్ సైత్, కుషా కపిల, నిహారిక పాల్గొన్నారు. ఈ నలుగురితో కాఫీ విత్ కరణ్ షో చాలా సరదాగా సాగింది. విక్కీ కౌశల్,  కత్రినా కైఫ్‌ల వివాహానికి పిలవకపోవడం చాలా ఇబ్బందికరంగా అనిపించిందని ఈ సందర్భంగా కరణ్ వెల్లడించారు.
 (చదవండి: ఆ టాలీవుడ్‌ హీరోను బాలీవుడ్‌లో లాంఛ్‌ చేయనున్న కరణ్‌ జోహార్‌)

కరణ్ జోహార్ మాట్లాడుతూ  'విక్కీ, కత్రినా వివాహానికి పిలవకపోవడం నాకు ఇబ్బందిగా మారింది. ఆహ్వానం అందలేదని ఒప్పుకోవడం కష్టంగా అనిపించింది. ఈ విషయంలో చాలామందికి నాపై సానుభూతితో పాటు సందేహాలు వచ్చాయి. మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించలేదని అడిగారు. మీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి  కదా  ప్రశ్నించారు. విక్కీ-కత్రినా వివాహానికి అనురాగ్ కశ్యప్‌ను కూడా ఆహ్వానించలేదని తెలుసుకున్నప్పుడు కాస్త ఉపశమనం లభించింది' అని అ‍న్నారు. కాగా.. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ గతేడాది డిసెంబర్ 9న ఘనంగా వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఫోర్ట్ బర్వారాలో జరిగిన ఈ వేడుకకు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత పెళ్లి ఫోటోలను కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement