హీరోహీరోయిన్ల అరుదైన ఫొటో | Ranbir Kapoor, Aishwarya Rai Bachchan’s 18 year old image surfaced | Sakshi
Sakshi News home page

హీరోహీరోయిన్ల అరుదైన ఫొటో

Published Wed, Sep 28 2016 3:15 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

హీరోహీరోయిన్ల అరుదైన ఫొటో

హీరోహీరోయిన్ల అరుదైన ఫొటో

ఈ ఫొటోలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ పక్కనున్న యువకుడిని గుర్తించారా. అతడు మరెవరో కాదు బాలీవుడ్ యువ హీరో రణబీర్ కపూర్. వయసులో కంటే చిన్నవాడైన రణబీర్ తో కలిసి ఐశ్వర్యరాయ్ తాజాగా 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాలో నటించింది. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల క్రితం తీసుకున్న ఈ ఫొటో వార్తల్లోకి వచ్చింది.

రిషికపూర్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ‘ఆ ఆబ్ లాత్ ఛలే’  సినిమాలో అక్షయ్ ఖన్నా సరసన ఐశ్వర్య నటించింది. ఈ సినిమాకు రణబీర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. షూటింగ్ సమయంలో అమెరికాలో ఐశ్వర్యతో కలిసి రణబీర్ ఫొటో దిగాడు. రమీ జాఫ్రే ఈ ఫొటోను ట్వీట్ చేశారు. భవిష్యత్ లో వీరిద్దరూ కలిసి నటిస్తారని ఊహించలేదని జాఫ్రే పేర్కొన్నారు.

కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాలో రణబీర్, ఐశ్వర్య నటించారు. అనుష్క శర్మ కూడా ఈ సినిమాలో ఉన్నప్పటికీ రణబీర్, ఐశ్వర్య మధ్య సన్నివేశాలు చర్చనీయాంశంగా మారాయి. దీపావళి కానుకగా అక్టోబర్ 28న 'ఏ దిల్ హై ముష్కిల్' ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement