ఆ సినిమాల రిలీజ్ డౌటే..! | ban on screening Ae Dil Hai Mushkil, Raees films | Sakshi
Sakshi News home page

ఆ సినిమాల రిలీజ్ డౌటే..!

Published Thu, Oct 6 2016 2:48 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

ఆ సినిమాల రిలీజ్ డౌటే..!

ఆ సినిమాల రిలీజ్ డౌటే..!

భారత్ పాక్ల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులు సినీరంగం మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో స్పందించిన చిత్ర పరిశ్రమ, పాకిస్థానీ నటులు, సాంకేతిక నిపుణులపై బ్యాన్ విధించింది. ఆ కళాకారులు పనిచేసిన సినిమాలు రిలీజ్ విషయంలో కూడా ఆంక్షలు విధించింది. దీంతో స్టార్ హీరోలతో పాటు, బడా ప్రొడ్యూసర్లు కూడా చిక్కులు పడ్డారు.

కరణ్ జోహర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఏ దిల్ హై ముష్కిల్, షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన రాయిస్ సినిమాలతో పాటు షారూఖ్, కరణ్లు సంయుక్తంగా నిర్మిస్తున్న డియర్ జిందగీ సినిమాల రిలీజ్ను 'సినిమా ఓనర్స్ ఎగ్జిబిటర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా' వ్యతిరేకిస్తోంది. అయితే యూనిట్ సభ్యులు రిలీజ్కు ఇబ్బంది కలింగిచవద్దని అభ్యర్తిస్తున్నా.. అసోషియేషన్ మాత్రం ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామంటూ ప్రకటించింది. శుక్రవారం జరగనున్న కమిటీ సమావేశంలో ఈ సినిమా రిలీజ్పై నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement