Raees
-
రయీస్ పసిడి పంచ్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్–జూనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు మొహమ్మద్ రయీస్ స్వర్ణం సాధించాడు. ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన 46–48 కేజీల ఫైనల్ బౌట్లో రయీస్ 5–0తో బికాస్ (త్రిపుర)పై ఏకపక్షంగా విజయం సాధించాడు. మిగతా బౌట్లలో తెలంగాణ కుర్రాళ్లు రజతంతో తృప్తిపడ్డారు. 42–44 కేజీల విభాగంలో కె. ఆంజనేయులు 0–5తో మీసాల రవి (జార్ఖండ్) చేతిలో, 52–54 కేజీల కేటగిరీ ఫైనల్లో మధుసూదన్ యాదవ్ 0–5తో అజయ్ పటేల్ (రాజస్తాన్) చేతిలో పరాజయం చవిచూశారు. ఆంధ్రప్రదేశ్ బాక్సర్లలో జెర్రిపోతుల భానుప్రకాశ్, నెల్లి అభిరామ్ టైటిల్స్ సాధించగా... బాలగణేష్ రన్నరప్‌గా నిలిచాడు. 36–38 కేజీల ఫైనల్లో భానుప్రకాశ్ 5–0తో సాహిల్ సుభా (ఉత్తరప్రదేశ్)పై, 40–42 కేజీల తుదిపోరులో అభిరామ్ 5–0తో రూపేశ్ కుమార్ (రాజస్తాన్)పై విజయం సాధించారు. 32–34 కేటగిరీ టైటిల్ పోరులో బాలగణేష్ 0–5తో మనీశ్ సింగ్ (ఢిల్లీ) చేతిలో కంగుతిన్నాడు. -
విజేతలు నవీద్, రయీస్
జూనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన బాక్సర్లు మొహమ్మద్ నవీద్, మొహమ్మద్ రయీస్ సత్తా చాటారు. ఎథిక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నారు. 46 కేజీల వెయిట్ కేటగిరీ ఫైనల్లో మొహమ్మద్ నవీద్, జి. అనీశ్‌పై గెలుపొందగా... 48 కేజీల విభాగంలో మొహమ్మద్ రయీస్, చైతన్యను ఓడించాడు. ఇతర ఫైనల్ మ్యాచ్‌ల్లో 50 కేజీల విభాగంలో మొహమ్మద్ బిన్ ఉస్మాన్ (హైదరాబాద్), అజయ్‌పై, 52 కేజీల విభాగంలో పవన్ కల్యాణ్ (రంగారెడ్డి) బి. శ్రీనివాస్‌పై, 54 కేజీల విభాగంలో త్రిజోత్ సింగ్ (హైదరాబాద్) భరత్‌పై, 57 కేజీల విభాగంలో ఎన్. హరీశ్ (హైదరాబాద్) ఏవీ పవన్‌పై, 60 కేజీల విభాగంలో బి. హర్షిత్ (ఖమ్మం) సాయిపై, 63 కేజీల విభాగంలో ఎం. వేణు (హైదరాబాద్) ఆర్. రాహుల్‌పై, 70 కేజీల విభాగంలో రాకేశ్ యాదవ్ (రంగారెడ్డి) జి. హనుమాన్‌పై, 75 కేజీల విభాగంలో ఆర్యవ్ మిశ్రా (హైదరాబాద్) రంగా రోహిత్‌పై, 80+ కేజీల కేటగిరీలో పి. సాయిరామ్ డి. విశాల్‌పై గెలుపొంది విజేతలుగా నిలిచారు. 80 కేజీల విభాగంలో ఎస్. హర్షవర్ధన్, 66 కేజీల విభాగంలో ఎన్. సౌరభ్లకు ఫైనల్లో బై లభించింది. -
షారూఖ్ అరెస్ట్ తప్పదా..?
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈ ఏడాది మొదట్లో విడుదలైన తన మూవీ రాయిస్ ప్రమోషన్ సందర్భంగా ఆయన ప్రవర్తించిన తీరు ఇబ్బందుల్లో పడేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాయిస్ ప్రమోషన్ కోసం షారూఖ్ రైల్లో ప్రయాణించారు. ప్రతీ స్టేషన్ లోనూ అభిమానులను పలకరిస్తూ ఉత్సాహపరుస్తూ సాగారు. అయితే వడోదరా స్టేషన్లో మాత్రం పరిస్థితి అదుపు తప్పి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో షారూఖ్ ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ ఏడాది జనవరి 23న రాయిస్ మూవీ ప్రమోషన్లో భాగంగా షారూఖ్ వడోదరా స్టేషన్‌కు చేరుకున్నారు. షారూఖ్ వస్తున్నాడన్న విషయం ముందే తెలియటంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడి చేరుకున్నారు. అభిమానులను మరింత ఉత్సాహ పరిచేందుకు టీషార్ట్స్, బాల్స్‌ను వాళ్లు మీదకు విసిరాడు షారూఖ్. దీంతో తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి మరణించాడు. కొంత మంది గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు షారూఖ్ ఖాన్, రాయిస్ బృంద నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని కోర్టుకు తెలిపారు. షారూఖ్‌తో పాటు రాయిస్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్పై ఐపీసీ సెక్షన్ 304 ఏ 2 (నిర్లక్షంగా వ్యవహరించి ఓ వ్యక్తి మరణానికి కారణం కావటం) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణలో ఉన్న ఈ కేసు కారణంగా షారూఖ్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. -
మేకింగ్ ఆఫ్ మూవీ - రాయిస్
-
రూ. 267 కోట్ల కలెక్షన్లు వచ్చాయి
ముంబై: బాలీవుడ్ సినిమా రేయీస్కు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు వస్తున్నాయి. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 267 కోట్ల రూపాయలు వచ్చాయి. జనవరి 25న విడుదలైన ఈ సినిమా 17 రోజుల్లో ఇంత మొత్తాన్ని వసూలు చేసింది. దేశీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్లోనూ బాగానే కలెక్షన్లు వస్తున్నాయి. రాహుల్ దొలాకియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుక్‌తో పాటు పాకిస్థాన్ నటులు మహీరా ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించారు. సన్నీ లియోన్ ఓ ఐటమ్ సాంగ్‌లో నర్తించింది. -
రివ్యూలు బాగున్నా.. కలెక్షన్లు అంతమాత్రమే
ముంబై: ఒకేరోజు విడుదలైన బాలీవుడ్ సినిమాలు రేయీస్, కాబిల్లకు బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందన వస్తోంది. వసూళ్లలో రేయీస్ దూసుకెళ్తుండగా, కాబిల్ వెనుకబడింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నా కాబిల్ సినిమాకు రోజురోజుకూ కలెక్షన్లు పడిపోతున్నాయి. జనవరి 25న విడుదలైన కాబిల్ ఏడు రోజుల్లో 61.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఆదివారం వరకు ఈ సినిమాకు చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాగా సోమవారం నుంచి బాగా తగ్గాయి. సోమవారం 4 కోట్లు, మంగళవారం 3.5 కోట్ల రూపాయలు వచ్చాయి. కాబిల్లో హృతిక్ సరసన యామీ గౌతమ్ నటించింది. కాగా జనవరి 25న విడుదలైన రేయీస్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఓవర్సీస్లో 62.56 కోట్లు, దేశంలో 152.61 కోట్ల రూపాయలు వచ్చాయి. -
రూ. 200 కోట్లు దాటిన కలెక్షన్లు
ముంబై: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన రేయీస్ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. జనవరి 25న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఓవర్సీస్లో 62.56 కోట్లు, దేశంలో 152.61 కోట్ల రూపాయలు వచ్చాయి. దీంతో ఈ సినిమాకు మొత్తం 215.17 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. రేయీస్ సినిమాకు నిలకడగా కలెక్షన్లు వస్తున్నాయి. దేశీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్లో కూడా సత్తాచాటుతోంది. రాహుల్ దొలాకియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుక్‌తో పాటు పాకిస్థాన్ నటులు మహీరా ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించారు. కాగా జనవరి 25వ తేదీన రేయీస్తో పాటు విడుదలైన హృతిక్ రోషన్ సినిమా కాబిల్కు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చినా కలెక్షన్ల వేటలో వెనుకబడింది. -
నా జీవితంలో రాజకీయాల్లోకి రాను: హీరో
ముంబై: తన జీవితంలో రాజకీయాల్లోకి రానని, రాజకీయాలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోనని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అన్నాడు. తనకు నటన మాత్రమే ఇష్టమని, తాను సినిమా హీరోనని, జీవితాంతం నటుడిగా ఉండేందుకు ఇష్టపడతానని చెప్పాడు. రాజకీయాల గురించి తనకు ఏమీ తెలియదని, ఏ మాత్రం ఆసక్తి కూడా లేదని అన్నాడు. షారుక్ నటించిన తాజా చిత్రం రేయీస్ బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. రేయీస్తో పాటు హృతిక్ రోషన్ నటించిన కాబిల్ సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. షారుక్ ఈ విషయంపై స్పందిస్తూ ప్రతి సినిమాకు స్థానం, బిజినెస్ ఉంటుందని చెప్పాడు. ఏ సినిమా కూడా మరో సినిమాకు పోటీ కాదని, బిజినెస్‌ను దెబ్బతీయదని అభిప్రాయపడ్డాడు. తాము ఊహించినదాని కంటే రేయీస్ ఎక్కువ బిజినెస్ చేసిందని షారుక్ చెప్పాడు. రాహుల్ దోలకియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాకిస్థాన్ నటులు మహీరా ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించారు. -
కింగ్‌ఖాన్‌తో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
-
దుమ్మురేపుతున్న 'రాయిస్'.. తొలి రికార్డు!
షారుఖ్ ఖాన్ తాజా సినిమా 'రాయిస్' భారీ వసూళ్లతో వందకోట్ల క్లబ్బు వైపు దూసుకుపోతున్నది. ఐదురోజుల్లో దేశీయంగా రూ. 93. 24 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా త్వరలోనే వందకోట్ల క్లబ్బులో అడుగుపెట్టనుంది. దీంతో ఈ ప్రతిష్టాత్మక లిస్ట్‌లో చోటు సాధించిన ఏడో షారుఖ్ సినిమాగా రికార్డు సొంతం చేసుకోనుంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో అత్యధిక ప్రారంభ వసూళ్లు సాధించిన సినిమాగా బాక్సాఫీస్ రూల్ చేస్తున్న 'రాయిస్' ఆదివారం రూ. 17.8 కోట్లు సాధించింది. అయితే, ఈ సినిమాకు పోటీగా దిగిన హృతిక్ రోషన్ 'కాబిల్' సినిమా కూడా మంచి వసూళ్లే రాబడుతున్నది. సంజయ్ గుప్తా దర్శకత్వంలో వైవిధ్యమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా తొలి ఐదురోజుల్లో దేశీయంగా రూ. 67.46 కోట్లు సాధించింది. ఆదివారం షారుఖ్ సినిమాకు గట్టిపోటీనిస్తూ.. 'కాబిల్' రూ. 15.61 కోట్లు సాధించడం గమనార్హం. బుధవారం విడుదలైన షారుఖ్ 'రాయిస్' సినిమా.. తొలిరోజు రూ. 20.42 కోట్లు, రెండో రోజు రూ. 26.30 కోట్లను వసూలు చేసింది. మూడో రోజు రూ. 13.11 కోట్లు, నాలుగో రోజు రూ. 15.61 కోట్లు, ఐదో రోజు రూ. 17.80 కోట్లు సాధించిందని, మొత్తంగా 'రాయిస్' రూ. 93.24 కోట్లు రాబట్టిందని తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. ప్రస్తుత వారంలోనూ వసూళ్లు ఈ సినిమాకు కీలకం కానున్నాయని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ స్టామినాతో పోల్లుకుంటే ఈ కలెక్షన్లు తక్కువేనని చెప్పాలి. ఇతర బాలీవుడ్ సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, ఆమిర్‌ఖాన్ సినిమాల ఓపెనింగ్స్‌తో పోల్చుకుంటే షారుఖ్ వెనుకబడినట్టేనని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. షారుఖ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధానపాత్రలో రాహుల్ దోలాఖియా దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయిస్' సినిమాకు విమర్శకుల నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అయినా షారుఖ్‌ను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండటంతో మొదట్లో 'కాబిల్' కన్నా మెరుగైన వసూళ్లు ఈ సినిమా రాబట్టింది. అయితే, రానురాను 'కాబిల్' సినిమాకు కూడా ఆదరణ పెరుగుతుండటంతో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల మధ్య పోటాపోటీ నెలకొంది. -
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న 'రాయిస్'
-
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న 'రాయిస్'
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న 'రాయిస్' షారుఖ్ ఖాన్ తాజా సినిమా 'రాయిస్' భారీ వసూళ్లు రాబడుతున్నది. హృతిక్ రోషన్ 'కాబిల్' సినిమాతో పోటీపడినా.. షారుఖ్ 'రాయిస్' కలెక్షన్లలో పైచేయి సాధించింది. రెండురోజుల్లో ఈ సినిమా దేశీయంగా రూ. 46.72 కోట్లు కొల్లగొట్టింది. బుధవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ. 20.42 కోట్లు, రెండో రోజు రూ. 26.30 కోట్లను వసూలు చేసింది. ఓవర్సీస్లో మరో తొమ్మిది కోట్లు తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ స్టామినాతో పోల్లుకుంటే ఈ కలెక్షన్లు తక్కువేనని చెప్పాలి. ఇతర బాలీవుడ్ సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, ఆమిర్‌ఖాన్ సినిమాల ఓపెనింగ్స్‌తో పోల్చుకుంటే షారుఖ్ వెనుకబడినట్టేనని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. షారుఖ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధానపాత్రలో రాహుల్ దోలాఖియా దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయిస్' సినిమాకు విమర్శకుల నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అయినా షారుఖ్‌ను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండటంతో 'కాబిల్' కన్నా మెరుగైన వసూళ్లు ఈ సినిమా రాబడుతున్నది. ఐదు రోజుల ఓపెనింగ్ వీకెండ్ ఉండటం కూడా 'రాయిస్' కలిసి వచ్చే విషయం. వసూళ్లు ఇలాగే నిలకడగా కొనసాగితే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. 'రాయిస్' సినిమాకు అద్భుతమైన వసూళ్లు సాధిస్తున్నదని, తొలిరెండురోజుల్లో దేశీయంగా రూ. 46.72 కోట్లు, ఓవర్సీస్లో రూ. 9.53 కోట్లు ఈ సినిమా రాబట్టిందని, మున్ముందు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరింతగా దూసుకుపోయే అవకాశముందని బాలీవుడ్ ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. -
రెండు సినిమాల్లో దేనికి కలెక్షన్లు ఎక్కువ..!
ముంబై: ఒకే రోజు విడుదలై, బాక్సాఫీసు వద్ద పోటీపడ్డ బాలీవుడ్ తాజా సినిమాలు రాయిస్, కాబిల్.. ఓపెనింగ్ కలెక్షన్లలో రాయిస్ టాప్‌లో నిలిచింది. షారుక్ ఖాన్ నటించిన రాయిస్, హృతిక్ రోషన్ నటించిన కాబిల్ సినిమాలు బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. రాయిస్ తొలి రోజు 20.42 కోట్ల రూపాయలు వసూలు చేయగా, కాబిల్కు 10.43 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. రెండో రోజు గురువారం రిపబ్లిక్ డే సెలవు దినం కావడంతో ఈ సినిమాలకు ఇదే స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశముందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. కాబిల్ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు రావడంతో కలెక్షన్లు ఊపందుకుంటాయని భావిస్తున్నారు. రాయిస్‌లో షారుక్ గ్యాంగ్‌స్టర్‌గా నటించగా, కాబిల్లో హృతిక్ అంధుడి పాత్రలో నటించాడు. -
ఆ హీరో.. నన్ను దారుణంగా మోసగించాడు: నిర్మాత
50-50శాతం థియేటర్లు ఇవ్వలేదు నాకు 150 కోట్ల నష్టం రావొచ్చు షారుఖ్‌ఖాన్ హీరోగా తెరకెక్కిన 'రాయిస్' సినిమాపై హృతిక్ రోషన్ తండ్రి, నిర్మాత రాకేష్ రోషన్ బాహాటంగా అసంతృప్తిని వెళ్లగక్కారు. అందుకు కారణం లేకపోలేదు. హృతిక్ హీరోగా తెరకెక్కిన 'కాబిల్' సినిమాను ఈ రోజున (జనవరి 25న) విడుదల చేస్తామని ఎంతో ముందుగానే రాకేశ్ ప్రకటించారు. ఆ తర్వాత పలుసార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన షారుఖ్ 'రాయిస్' కూడా బుధవారమే ప్రేక్షకుల ముందుకు రావాలని నిశ్చయించింది. దీంతో రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వద్ద టైటానిక్ క్లాష్ తప్పలేదు. షారుఖ్ తన సినిమా విడుదల తేదీని మార్చుకుంటారని అంతా భావించారు. షారుక్ దిగిరాలేదు. హృతిక్యే పెద్ద మనస్సు చేసుకొని.. రెండు సినిమాలు ఒకేసారి విడుదలైనా తమ మధ్య విభేదాలు రాకుండా చూస్తామని చెప్పాడు. దీంతో రెండు సినిమాలకు దేశంలోని థియేటర్లను 50:50శాతం పంచుకోవాలని మొదట భావించారు. కానీ, చివరి నిమిషంలో రాకేష్ రోషన్‌కు షాక్ ఇస్తూ 'రాయిస్'కు అనుకూలంగా 60:40 శాతం థియేటర్లను పంచారు. దీంతో బిత్తరపోయిన రాకేష్ తన సినిమాను షారుఖ్ మోసం చేశారని వాపోతున్నారు. 'నేను వేరేవాళ్ల సినిమా గురించి మాట్లాడాను. నా సినిమా కాబిల్ గురించే మాట్లాడుతాను. సినిమా విడుదల విషయంలో మేం షాక్‌కు గురయ్యాం. బాధపడ్డాం. నిరాశ చెందాం. ఇలా జరుగుతుందని ఊహించలేదు. గతవారం ఎగ్జిబిటర్లందరితోనూ మాట్లాడి వారికి గంట సినిమా కూడా చూపించాం. 50-50శాతం థియేటర్లు ఇవ్వాలని కోరాం. అందుకు వారు ఒప్పుకొన్నారు కూడా. దుబాయ్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ ఇలా ప్రపంచమంతటా 50-50 షేర్‌కు అంగీకారం కుదిరింది. కానీ ఆ తర్వాత వారు చేసింది మమ్మల్ని బాధించింది. మేం మోసపోయామనిపించింది. ఇలా చేయడం సరికాదు. రెండు పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు 50-50 థియేటర్ల పంపకాలు ఉండాలని నిర్మాతలంతా కోరుకుంటారు' అని పేర్కొన్నారు. దర్శకుడు, నిర్మాత అయిన రాకేశ్ రోషన్ 90వ దశకంలో షారుఖ్‌కు ఎన్నో హిట్ సినిమాలు అందించాడు. షారుఖ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన 'కరణ్ అర్జున్' సినిమాను కూడా ఆయనే తీశారు. థియేటర్లను 60-40 శాతం పంపకాలు చేయడం వల్ల తనకు నేరుగా 150 కోట్ల నష్టం వస్తుందని, ఒకేసారి రెండు సినిమాలు చూసేంత డబ్బు ప్రజల వద్ద ఉండదని, కాబట్టి థియేటర్ల పంపకాల్లో జరిగిన అన్యాయం వల్ల తన సినిమా కలెక్షన్లు తగ్గిపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా దేవుడు తనకు అండగా ఉన్నాడని, తనకేమీ కాదని అన్నారు. షారుఖ్ తీరుపై ఆయన పరోక్షంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
షారూఖ్.. చాలా కాలం తరువాత..!
-
షారూఖ్.. చాలా కాలం తరువాత..!
కొద్ది రోజులుగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, రాయిస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ఈ సినిమా విడుదలవుతోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరో షారూఖ్ ఖాన్ పాల్గొంటున్నాడు. సాధారణంగా బాలీవుడ్ హీరోలు ప్రచారం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ప్రత్యేక విమానాలను వాడుతుంటారు. కానీ రాయిస్ ప్రచారం కోసం షారూఖ్, ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలలో ప్రచారం నిర్వహించాలంటే ట్రైన్ జర్నీనే కరెక్ట్ అంటున్నాడు షారూఖ్. ఈ సందర్భంగా మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నాడు. షారూఖ్, స్మగ్లర్‌గా నటిస్తున్న ఈ సినిమా విశేషాలను తెలియజేస్తూ ఇదో రియలిస్టిక్ సినిమా అందుకే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కొత్త అమ్మాయి అయితే కరెక్ట్ అని భావించాం.. ఎంతో మందిని ఆడిషన్ చేసిన తరువాత మహిరను సెలెక్ట్ చేశామన్నారు. అంతేకాదు ట్రైన్ ప్రయాణంపై స్పందించిన షారూఖ్, చాలా కాలం తరువాత ఇండియన్ రైల్వేస్‌లో ప్రయాణించటం ఆనందంగా ఉందన్నారు. -
సినీ తారలపై అభిమానం ప్రాణం తీసింది
వడోదరా: రైలులో వచ్చిన సన్నీ లియోన్‌ను చూసి అభిమానులు రెచ్చిపోయారు. ఆమె కూర్చున్న బోగీని వందలమంది చుట్టుముట్టారు. కొందరు గాజు కిటికీలపై దబాదబా చప్పుడు చేయగా, ఇంకొందరు రైలు పైకెక్కి హంగామా చేశారు. అభిమానుల వీరంగాన్నిచూసి నిశ్చేష్టురాలైన హీరోయిన్ విండో కర్టెన్ మూసేసింది. అయినాసరే అభిమానులు ఆగలేదు. ఇంతలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. అదే రైలులో ప్రయాణిస్తోన్న సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌ది కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే. వేలమంది ఒకేసారి దూసుకురావడం తొక్కిసలాటకు దారితీసింది. సన్నీ లియోన్, షారూఖ్ ఖాన్‌లను చూసేందుకు భార్య, కూతురితో వచ్చిన ఓ వ్యక్తి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయాడు. గుజరాత్‌లోని వడోదరా రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. జనవరి 25న విడులకానున్న ’రయీస్’ సినిమా ప్రచారంలో భాగంగా హీరో షారూఖ్‌ఖాన్, ఆ సినిమాలో ’లైలా ఓ లైలా..’పాటలో నర్తించిన సన్నీ లియోన్, చిత్రబృందంలోని ఇతరులు సోమవారం రైలు యాత్ర చేపట్టారు. సెంట్రల్ ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే అగస్ట్ క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో వీరు ప్రయాణించారు. సన్నీ లియోన్ బురఖా ధరించి రైలు ఎక్కినట్లు తెలిసింది. ఇంజన్ మార్పిడి కోసం గుజరాత్‌లోని వడోదర స్టేషన్లో రైలును కాసేపు నిలిపారు. అప్పటికే పలు మాధ్యమాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున స్టేషన్‌కు చేరుకున్నారు. అవసరమైన మేరకు భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో అభిమానుల రూపంలో వచ్చిన ఆకతాయిలకు అడ్డులేకుండాపోయింది. సన్నీ లియోన్ కూర్చున్న బోగీని వందలమంది చుట్టుముట్టి నానా హంగామా చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇటు షారూఖ్‌ను కూడా అభిమానులు చుట్టుముట్టారు. పోలీసుల సూచనమేరకు.. షారూఖ్ రైలు దిగకుండా డోర్ వద్దే నిలబడి అభిమానులకు అభివాదం చేశారు. 10 నిమిషాల తర్వాత ఇంజన్ సిద్ధం కావడంతో రైలు బయలుదేరింది. అప్పుడుకూడా కొందరు వ్యక్తులు రైలును వెంబడించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు మళ్లీ లాఠీలకు పనిచెప్పారు. అక్కడున్నవారిని బయటికి తరిమేశారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న తోపులాటలో వడోదరకే చెందిన ఫరీద్ ఖాన్ షెరానీ ప్రాణాలు కోల్పోయాడు. ఊపిరి అందకపోవడం వల్లే అతను చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. 50ఏళ్ల ఫరీద్.. షారూఖ్ వీరాబిమాని అని, భార్య, కూతురితో కలిసి అభిమాన తారలను చూసేందుకు వచ్చాడని పోలీసులు తెలిపారు. కానీ బంధువులను రిసీవ్ చేసుకోవడానికే ఫరీద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాడని అతని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఢిల్లీలో రైలు దిగిన వెంటనే షారూఖ్ ఈ ఘటనపై స్పందించాడు. ఫరీద్ మృతి దుదృష్టకరమని, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చెబుతున్నానని షారూఖ్ అన్నాడు. -
విషాదంగా మారిన ’రయీస్’ ప్రమోషన్
-
రాయిస్ మూవీ స్టిల్స్
-
షారూఖ్ సినిమాలో బాహుబలి
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన భారీ చిత్రం బాహుబలి. తొలి భాగంతో రికార్డ్ కలెక్షన్లు సాధించిన బాహుబలి, ఇప్పుడు సీక్వల్తో మరింత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న బాహుబలి పార్ట్ 2, ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్లాన్ చేస్తున్నారు. తొలి భాగానికి చేసినట్టుగానే మూడు నెలల ముందు నుంచే పబ్లిసిటీని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం తొలి టీజర్‌ను షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన రాయిస్‌తో పాటు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. షారూఖ్ స్మగ్లర్‌గా కనిపిస్తోన్న రాయిస్ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్నరాయిస్తో పాటు బాహుబలి టీజర్‌ను రిలీజ్ చేస్తే సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. -
ఆన్లైన్లో ‘లైలా’ దుమ్మురేపుతోంది!
-
ఆన్లైన్లో ‘లైలా’ దుమ్మురేపుతోంది!
బాలీవుడ్ శృంగార భామ సన్నీ లియోన్.. ’లైలా మై లైలా’ అంటూ ఉర్రూతలూగిస్తోంది. తొలిసారి షారుఖ్‌తో కలిసి ఆడిపాడిన ఈ అమ్మడు.. అదరగొట్టే స్టెప్పులు, టీజింగ్ లుక్‌తో ఆకట్టుకుంది. షారుఖ్‌ఖాన్ తాజా చిత్రం ’రాయిస్’లో ఓ స్పెషల్ ఐటెం సాంగ్‌లో నర్తించిన సన్నీ.. ఊహించినట్టే తన అందచందాలతో మతిపోగోడుతోంది. ఇటీవల ఆన్లైన్లో విడుదల చేసిన ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. షారుఖ్ గంభీరమైన లుక్ కనిపించగా.. ఐటెం సాంగ్‌కు కావాల్సిన ఘాటైన హుషారెత్తించే డ్యాన్స్‌లతో సన్నీ అలరించింది. కొంత కాలంగా భారీ బ్లాక్ బస్టర్స్ అందించటంలో ఫెయిల్ అవుతున్న షారూఖ్ 80వ దశకంనాటి కథతో 'రాయిస్'గా ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గుజరాత్‌కు చెందిన స్మగ్లర్‌గా కనిపించనుండగా.. అతని ఆట కట్టించేందుకు ప్రయత్నించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ గులామ్ పటేల్ పాత్రగా నవాజుద్దీన్ సిద్ధిఖీ నటిస్తున్నాడు. రాహుల్ దోలాఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షారూఖ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. 2017 జనవరి 26న రిలీజ్ అవుతున్న ఈ సినిమా హృతిక్ హీరోగా తెరకెక్కిన కాబిల్తో పోటిపడుతోంది. -
పాక్ నటి ప్రచారంపై ఠాక్రేకు షారుక్ హామీ
ముంబై: తన తాజా చిత్రం ‘రయీస్’ ప్రచార కార్యక్రమాల్లో పాకిస్తాన్ నటి మహీరా ఖాన్ పాల్గొనబోదని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేకు హామీ ఇచ్చారు. ఠాక్రేతో భేటీ సందర్భంగా ఈ హామీ ఇచ్చారని ఎంఎన్ఎస్ చిత్రపథ్ కర్మచారి సేన చీఫ్ అమీ ఖోప్కర్ సోమవారం చెప్పారు. రయీస్ ప్రదర్శనను తాము అడ్డుకోబోమని, ఈ సినిమాలో పాలుపంచుకున్న పాక్ నటులెవరూ ఇక్కడ ఉండరని అన్నారు. రయీస్ సినిమాలో మహీరా నటించారు. -
రాయిస్ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్
-
రాయిస్ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్
కొంత కాలంగా భారీ బ్లాక్ బస్టర్స్ అందించటంలో ఫెయిల్ అవుతున్న షారూఖ్, ఓ పీరియాడిక్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 80ల కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూఖ్, గుజరాత్లో స్మగ్లింగ్ చేసే రాయిస్ అలాంగా కనిపిస్తున్నాడు. షారూఖ్ ఆట కట్టించేందుకు ప్రయత్నించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ గులామ్ పటేల్ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ కనిపిస్తున్నాడు. రాహుల్ దోలాఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షారూఖ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాను ఈ ఏడాది రంజాన్‌కే రిలీజ్ చేయాలని భావించినా.., అదే సమయంలో సల్మాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ రిలీజ్ ఉండటంతో వాయిదా వేశారు. ప్రస్తుతం 2017 జనవరి 26న రిలీజ్ అవుతున్న ఈ సినిమా హృతిక్ హీరోగా తెరకెక్కిన కాబిల్తో పోటిపడుతోంది. భారీ అంచనాలున్న రాయిస్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. షారూఖ్ మాస్ లుక్‌లో ఆకట్టుకుంటున్న ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. -
అమ్మ నా మాటలు నమ్మలేదు: నటి
న్యూఢిల్లీ: ముస్లిం వ్యాపారవేత్త జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా రూపొందుతోన్న మూవీ ‘రాయిస్’. ఈ మూవీలో బాలీవుడ్ బాద్షా హీరో కాగా, పాకిస్తాన్ నటి మహీరాఖాన్ ఈ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఉడీలో పాక్ ఉగ్రదాడుల తర్వాత దాయాది దేశానికి చెందిన ఆర్టిస్టులపై నిషేధం, వారు నటించిన మూవీలను విడుదలను అడ్డుకోవాలంటూ 'రాయిస్', 'ఏ దిల్ హై ముష్కిల్' లపై ఇటీవల పెనుదుమారం చెలరేగింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మహీరా కొన్ని విషయాలను తెలిపింది. తన తల్లికి బాలీవుడ్ ఎంట్రీ విషయం చెప్పగా ఆమె పెద్దగా షాక్ కాలేదని, అయితే స్టార్ హీరో షారుక్ సరసన నటిస్తున్నానని చెబితే నమ్మలేదని చెప్పింది. 'నువ్వు అబద్దం చెబుతున్నావు, ఎందుకంటే షారుక్ లాంటి అగ్రహీరో మూవీతో ఎంట్రీ ఛాన్స్ దక్కడం ఎవరికైనా కష్టమే' అన్న మా అమ్మ ఈ విషయాన్ని నమ్మిన వెంటనే ఉద్వేగానికి లోనై ఒక్కసారిగా ఏడ్చేసిందని నటి మహీరా చెప్పుకొచ్చింది. మోహసినా అనే పాత్రలో తాను రాయిస్ లో కనిపించనుంది. వచ్చే ఏడాది జనవరి 26న మూవీని విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. -
బాలీవుడ్ బాద్షాకు బాహుబలి సాయం
రిపబ్లిక్ డే కానుకగా బాలీవుడ్లో రెండు భారీ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. షారూఖ్ హీరోగా తెరకెక్కిన రాయిస్‌తో పాటు, గ్రీకువీరుడు హృతిక్ లీడ్ రోల్లో తెరకెక్కిన కాబిల్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుండటంతో ఎవరిది పై చేయి అవుతుందని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ భారీ పోటిలో సత్తా చాటేందుకు షారూఖ్ ఖాన్, బాహుబలిని వాడేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రాయిస్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంస్థే బాహుబలి సినిమాను కూడా డిస్ట్రిబ్యూట్ చేయనుండటంతో.. సింగిల్ స్క్రిన్స్లో రాయిస్ రిలీజ్ చేసిన థియేటర్లకే బాహుబలి సినిమాను ఇస్తామన్నా కండిషన్ పెడుతున్నారట. దీంతో బాహుబలి లాంటి సినిమాను వదులుకోలేక రాయిస్‌ను కూడా తమ థియేటర్లలో రిలీజ్ చేసుందుకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. -
ఉడీ ఉగ్రదాడులపై నోరువిప్పిన పాక్ నటి
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉడీ ఉగ్రదాడులపై పాకిస్తాన్ ఆర్టిస్టులు ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. తొలుత ఫవాద్ ఖాన్ ఉడీలో జరిగిన ఉగ్రదాడులను ఖండించగా.. ప్రస్తుతం పాకిస్తాన్ నటి మహీరాఖాన్ సోషల్ మీడియా ద్వారా ఈ ఘటనను వ్యతిరేకించింది. ఉడీలో పాక్ ఉగ్రదాడులు, అనంతరం భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడంతో దాయాది దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పాక్ ఆర్టిస్టులపై నిషేధం విధించారు. మొదట ఫవాద్ ఖాన్ స్పందిస్తూ.. తన భార్యకు డెలివరీ ఉందని తాను మూడు నెలలుగా పాక్ లోనే ఉన్నానని, అయితే ఉగ్రదాడులు ఏ దేశం చేసినా తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పాడు. భవిష్యత్తులో తమ పిల్లలు ఎక్కడ ఉన్నా ఒప్పుకుంటారు కానీ ఉగ్రదాడులు జరిగే ప్రాంతాల్లో ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరని మహీరాఖాన్ తెలిపింది. ఇరుదేశాలు శాంతిని పాటించాలని, ఉగ్రదాడుల వల్ల ఎంతో ప్రాణనష్టం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తంచేసింది. గత ఐదేళ్లుగా నటిగా కొనసాగుతున్న తాను పాక్ గౌరవానికి భంగం వాటిల్లేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని పేర్కొంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'రాయిస్' సినిమాతో పాక్ నటి మహీరాఖాన్ బాలీవుడ్‌కు పరిచయం కానుంది. పాక్ ఆర్టిస్టులపై నిషేధం విధించడంతో 'రాయిస్' మూవీ షూటింగ్ మధ్యలోనే మహీరా పాక్ కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ముస్లిం వ్యాపారవేత్త జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా రూపొందుతోన్న ‘రాయిస్’ చిత్రంపై పాకిస్తాన్ లో ఇదివరకే ఆంక్షలు మొదలయ్యాయి. షారుఖ్ ఖాన్, మహీరా ఖాన్ జంటగా నటిస్తోన్న ‘రాయిస్’ను పాకిస్తాన్ లోనూ అధికారికంగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తుండగా.. సన్నీలియోన్, షారుక్ పై చిత్రీకరించిన ఆ ఐటం పాటపై పాక్ అభ్యంతరాలు లేవనెత్తడంతో అక్కడ ఈ పాటను కట్ చేసి మూవీ రిలీజ్ చేయనున్నారు. -
ఆ సినిమాల రిలీజ్ డౌటే..!
భారత్ పాక్‌ల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులు సినీరంగం మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో స్పందించిన చిత్ర పరిశ్రమ, పాకిస్థానీ నటులు, సాంకేతిక నిపుణులపై బ్యాన్ విధించింది. ఆ కళాకారులు పనిచేసిన సినిమాలు రిలీజ్ విషయంలో కూడా ఆంక్షలు విధించింది. దీంతో స్టార్ హీరోలతో పాటు, బడా ప్రొడ్యూసర్లు కూడా చిక్కులు పడ్డారు. కరణ్ జోహర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఏ దిల్ హై ముష్కిల్, షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన రాయిస్ సినిమాలతో పాటు షారూఖ్, కరణ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న డియర్ జిందగీ సినిమాల రిలీజ్‌ను 'సినిమా ఓనర్స్ ఎగ్జిబిటర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా' వ్యతిరేకిస్తోంది. అయితే యూనిట్ సభ్యులు రిలీజ్‌కు ఇబ్బంది కలింగిచవద్దని అభ్యర్తిస్తున్నా.. అసోషియేషన్ మాత్రం ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామంటూ ప్రకటించింది. శుక్రవారం జరగనున్న కమిటీ సమావేశంలో ఈ సినిమా రిలీజ్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. -
అక్కడ సన్నీ లియోన్ ఐటం నంబర్ కట్
ఓ ముస్లిం వ్యాపారవేత్త జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా రూపొందుతోన్న ‘రాయిస్’ చిత్రంపై దాయాది దేశంలో అప్పుడే ఆంక్షలు మొదలయ్యాయి. షారూఖ్ ఖాన్ హీరోగా, పాకిస్థానీ నటి మహీరా ఖాన్ హీరోయిన్ నటిస్తోన్న ‘రాయిస్’ను పాకిస్థాన్ లోనూ అధికారికంగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఆ సినిమా పాటల ఆల్బమ్ లో నాటి బాలీవుడ్ హిట్ సాంగ్ ‘లైలా ఓ లైలా..’ రిమిక్స్ వెర్షన్ కూడా ఉంది. షారూఖ్, సన్నీ లియోన్ లపై చిత్రీకరించిన ఆ ఐటం పాటలో ‘మసాలా’ కాస్త ఘాటుగానే ఉంటుందట. అయితే పాక్ లో విడుదలయ్యే ‘రాయిస్’లో ఆ ఒక్క పాటను మాత్రం కట్ చేయబోతున్నట్లు సమాచారం. (అప్పుడు చాలా భయమేసింది: సన్నీ లియోన్) పాక్ లో పుట్టిపెరిగి, బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తోన్న మహీరా ఖాన్ కు స్వదేశంలో ఉన్న ఆదరణతో వసూళ్లు రాబట్టవచ్చని ‘రాయిస్’ రూపకర్తల అభిప్రాయం. అయితే సన్నీ ఐటం నబంర్ పై మాత్రం పాకిస్థానీలు ఆగ్రహం వెలిబుచ్చే అవకాశం ఉందని, అందుకే ఆ పాటను తొలిగించి విడుదల చేయబోతున్నారని వార్తా సంస్థ‘ఏసియన్ ఏజ్’ పేర్కొంది. గౌరీఖాన్, రితేశ్ సిద్వానీ, ఫరాఖాన్ ల సంయుక్త నిర్మాణంలో రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహించిన ‘రాయిస్’ 2017 జనవరి 26న విడుదలకానుంది. (నావి బెడ్ రూమ్ కళ్లు, అసలు అలసిపోవు: షారూఖ్) -
షారూఖ్ సినిమాకు మరో హీరో అడ్డు
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా రాయిస్ రిలీజ్‌పై డైలామా కొనసాగుతోంది. షూటింగ్ ప్రారంభించిన సమయంలో ఈ సినిమాను రంజాన్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే అదే సమయంలో సల్మాన్ సుల్తాన్ రిలీజ్ ఉండటంతో షారూఖ్ తన సినిమాను వాయిదా వేసుకున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రాయిస్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే ఆ డేట్ కూడా షారూఖ్‌కు వర్క్ అవుట్ అయ్యేలా లేదు. అదే రోజు అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కుతున్న బాద్షాహోతో పాటు హృతిక్ లీడ్ రోల్లో రూపొందుతున్న కాబిల్ చిత్రాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే అజయ్ దేవగన్‌తో మాట్లాడిన రాయిస్ నిర్మాతలు పోటీనుంచి బాద్షాహోను తప్పించారు. కానీ కాబిల్ నిర్మాతలు మాత్రం అందుకు అంగీకరించటం లేదు. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన రాయిస్‌ను మరోసారి వాయిదా వేయడానికి షారూఖ్ టీం కూడా సిద్ధంగా లేదు. దీంతో మరోసారి షారూఖ్ స్వయంగా కాబిల్ టీంతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నాడట. సల్మాన్ కోసం డేట్ త్యాగం చేసిన షారూఖ్‌కి హృతిక్ సాయం చేస్తాడో.. లేదో..? -
'సుల్తాన్'తో పోటీపడలేక.. తోకముడిచిన సూపర్‌స్టార్!
బాలీవుడ్ సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సినిమాలంటే బాక్సాఫీస్ వద్ద ఉండే సందడే వేరు. అదే ఆ ఇద్దరు సూపర్స్టార్లు ఒకేసారి తమ సినిమాల్ని విడుదల చేస్తే.. ఆ పోటీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. అభిమానుల్ని ఉత్కంఠకు గురిచేస్తుంది. అలాంటి అతిపెద్ద పోరు ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఉంటుందని అంతా భావిస్తున్న సమయంలో ఊహించిన ట్విస్టు చోటుచేసుకుంది. ఈ ఏడాది దీపావళి పండుగ సమయంలో షారుఖ్ 'రాయిస్', సల్మాన్ 'సుల్తాన్' ఒకేసారి వస్తాయని ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. దాదాపు ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ కూడా ఖరారు చేశారు. బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేస్తుందని భావించిన ఓ పోటాపోటీ నుంచి షారుఖ్ అనూహ్యంగా తప్పుకున్నాడు. షారుఖ్ 'రాయిస్'ను వచ్చే ఏడాది విడుదల చేస్తామని తాజా చిత్ర దర్శక నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఎందుకిలా.. కారణమేమిటి? భారీ అంచనాలు రేకెత్తిన బాక్సాఫీసు మహాపోరు నుంచి షారుఖ్ ఎందుకు తప్పుకున్నాడంటే.. అందుకే ఆయన తాజా చిత్రం 'ఫ్యాన్' ఘోర పరాభవమే కారణమని వినిపిస్తోంది. నిజానికి బాక్సాఫీసు పోరు నుంచి ఆయన గతంలో ఎప్పుడు తప్పుకొని పారిపోలేదు. 2009లో ఓం శాంతి ఓ వర్సెస్ సావరియా, 2012లో జబ్ తక్ హై జాన్ వర్సెస్ సన్ ఆఫ్ సర్దార్, 2015లో బాజీరావు మస్తానీ వర్సెస్ దిల్వాలే వంటి హోరాహోరీ పోరులోనూ షారుఖ్ విజేతగా నిలిచాడు. నిజానికి 2015 ఆగస్టులో ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలవుతాయని తెలిసినప్పుడు షారుఖ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పండుగ సందర్భంగా ఎవరి సినిమాలు వారు విడుదల చేస్తారని, ఇందులో భయపడాల్సిందేమీ లేదని, నిజానికి తమ సినిమా పండుగ సందర్భంలో విడుదల చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. సల్మాన్ తో పోటీకి భయపడే ప్రసక్తే లేదని పరోక్షంగా కుండబద్దలు కొట్టాడు. కానీ 'ఫ్యాన్' ఘోర పరాభవం 'రాయిస్' సినిమా విషయంలో షారుఖ్ బిగ్ యూటర్న్ తీసుకున్నాడు. భారీ అంచనాలతో విడుదలై, మంచి రివ్యూలు తెచ్చుకున్నా.. 'ఫ్యాన్' సినిమా వంద కోట్ల క్లబ్బులో చేరలేకపోయింది. 'ఫ్యాన్' చేదు ఫలితం ప్రభావమే 'రాయిస్' చిత్ర తేదీని మార్చేలా షారుఖ్‌ను, చిత్ర నిర్మాతలను పూరికొల్పి ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఈ సినిమాను పండుగ రేసు నుంచి తప్పించి 2017 జనవరి 26న విడుదల చేయాలని నిర్ణయించామని 'రాయిస్' నిర్మాతలు రితేశ్ సిద్వాని, ఫర్హాన్ అఖ్తర్, హీరో షారుఖ్ ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. -
'నావి బెడ్ రూమ్ కళ్లు, అసలు అలసిపోవు'
న్యూఢిల్లీ: తన కళ్లంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారని బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అన్నాడు. 'నా కళ్లు బెడ్ రూమ్ కళ్లు. అవి చాలా సెక్సీగా ఉంటాయి. నా కళ్లు ఎప్పుడు అలసిపోయినట్లు కనిపించవు. అందుకే అమ్మాయిలు నా కళ్లంటే చాలు పడిచచ్చిపోతారు' అని అభిమానులతో లైవ్ ఛాటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా షారుక్ అభిప్రాయపడ్డాడు. రాహుల్ ఢోలకియా దర్శకత్వం వహిస్తున్న 'రాయిస్' మూవీ షూటింగ్ లో ప్రస్తుతం బిజిబిజీగా ఉన్నాడు షారుక్. ఆ మూవీ ప్రమోషన్లలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులతో ఛాటింగ్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మూవీలో తన పాత్ర ఎలా ఉండబోతుందన్న విషయాలు, ఆయన జీవిత సంఘటనలపై అభిమానుల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చాడు. తన కళ్లల్లో ఏదో మాయ ఉందని, అవే తనకు ప్లస్ పాయింట్ గా మారాయని వివరించాడు. తన చిన్న కుమారుడు అబ్ రామ్ తో కలిసి మూవీ చూడటమంటే చాలా ఇష్టమని, వారిద్దరూ కలిసి తన ఆల్ టైమ్ ఫెవరెట్ మూవీ 'మినియన్స్' (Minions)ని 200 సార్లకు పైగా చూశామని చెప్పాడు. రాయిస్ లో పాక్ నటి మహిరా ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. -
సల్మాన్‌తో కాదని అజయ్‌తో
ఈ ఏడాది రంజాన్‌కు బాలీవుడ్ తెర మీద భారీ యుద్ధం తప్పదని భావించారు అంతా. సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాతో పాటు, షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న రాయిస్ సినిమాలు ఈద్ బరిలో పోటీ పడతాయని అనుకున్నారు. అయితే సల్మాన్‌తో ఇప్పుడిప్పుడే బలపడుతున్న స్నేహం కారణంగా బరిలో నుంచి తప్పుకున్న షారూఖ్ తన సినిమాను వాయిదా వేసుకున్నాడు. దీంతో ఈద్ కు సోలోగా సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు సల్మాన్. అయితే ఈద్ బరి నుంచి తప్పుకున్న షారూఖ్, తన సినిమా రాయిస్‌ను దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. కానీ ఆ సమయంలో కూడా బాద్ షాకు పోటీ మాత్రం తప్పేలా కనిపించటం లేదు. అజయ్ దేవగన్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న శివాయ సినిమాను దీపావళికే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి సల్మాన్‌తో పోటీ వద్దని పక్కకు జరిగిన షారూఖ్, అజయ్ కోసం మరోసారి తన సినిమా వాయిదా వేసుకుంటాడా లేక బరిలో దిగుతాడా చూడాలి. -
స్టార్ హీరోల సినీ సంగ్రామం!
పెద్ద హీరోల సినిమాలు వస్తుంటే, చిన్న సినిమాలన్నీ పక్కకు తొలగి, దారి ఇవ్వడం రెగ్యులర్‌గా చూసే విషయమే. అలాగే, ఒక పెద్ద హీరో సినిమాకూ, మరో పెద్ద హీరో సినిమాకూ మధ్య కనీసం రెండు వారాలైనా గ్యాప్ ఉండేలా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చూసుకుంటూ ఉంటారు. తద్వారా రెండు సినిమాలకూ కలెక్షన్లలో ఇబ్బంది తగలకుండా జాగ్రత్తపడతారు. కానీ, ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజున రిలీజైతే? అదీ హిందీ చిత్రసీమలో... పైగా రంజాన్ పండుగ సీజన్లో అయితే? పరిస్థితి చూస్తుంటే, ఇప్పుడు అదే జరిగేలా ఉంది. సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘సుల్తాన్’, షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘రాయీస్’ చిత్రాలు రెండూ ఈ ఏడాది రంజాన్ పండుగ వేళ రిలీజయ్యేందుకు పోటీపడుతున్నాయి. నిజానికి, ఈ బాక్సాఫీస్ సంగ్రామం గురించి ఇప్పటికే ఈ ఇద్దరు హీరోల దగ్గరా పలువురు ప్రస్తావించారు. ఈ పోరాటాన్ని నివారించేందుకు ఏదో ఒక దోవ చూస్తామని ఇద్దరూ అన్నారు. అయితే, ఇప్పటి వరకు ఆ దోవ ఏదో తెలిసినట్లు కనిపించడం లేదు. తాజాగా ‘ఫ్యాన్’ చిత్ర ప్రచారంలో ఉన్న షారుఖ్ దగ్గర మళ్ళీ ఈ బాక్సాఫీస్ సంగ్రామం గురించి ప్రస్తావన వచ్చింది. ‘‘ఇది పరమ వికారమైన విషయం. ఒక సినిమా వ్యాపారాన్ని మరొక సినిమా తినేసేలా ఒకే రోజు రిలీజ్ చేసే కన్నా, సినిమాల రిలీజ్ డేట్స్ మార్చుకోవడం మంచిది. రంజాన్‌కు ఇంకా రెండు, మూడు నెలల టైమ్ ఉంది కదా! మేము కూర్చొని, మాట్లాడుకొని, నిర్ణయించుకొని, ఏదో ఒక పరిష్కారం చూస్తాం’’ అని షారుఖ్ అన్నారు. అయితే, ఇటీవలి కాలంలో రంజాన్ వచ్చిందంటే, సల్మాన్‌ఖాన్ సినిమా ఉండాల్సిందే. గత ఏడాది వచ్చిన ‘బజ్రంగీ భాయీజాన్’ ఎంత హిట్టో తెలిసిందే. కాబట్టి, రంజాన్ సీజన్ సల్మాన్‌దే అని ఫిక్స్ అయితే ఏం చేస్తామన్నారు షారుఖ్. ‘‘నేను ఫలానా ఈ స్టార్ కన్నా ఫలానా ఆ స్టార్ పెద్దవాడని నేను అనడం లేదు. కానీ, ‘సుల్తాన్’ చిత్ర నిర్మాత ఆదిత్యా చోప్రా సహా ఇతరులూ నా ఫ్రెండ్సే. కాబట్టి, అందరితో మాట్లాడి, సమస్య పరిష్కరించాలనుకుంటున్నా’’ అన్నారు. మొత్తానికి, షారుఖ్ జోక్యంతో ఈ బాలీవుడ్ బాక్సాఫీస్ సంగ్రామం ఆగుతుందని ఆశించవచ్చా? -
ఖాన్ల మధ్య పోటీ లేనట్టే
బాలీవుడ్ ఇండస్ట్రీలో రంజాన్ సీజన్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. టాలీవుడ్లో సంక్రాంతి సీజన్లో తలపడినట్టుగా బాలీవుడ్లో రంజాన్ సీజన్లో స్టార్ హీరోలు పోటీ పడతారు. అదే బాటలో ఈ సారి కూడా రసవత్తరమైన పోటీ తప్పదని భావించాయి సినీ వర్గాలు. అయితే అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేశాడు షారుక్. తన పాత మిత్రుడు సల్మాన్ ఖాన్‌తో ఈ మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పాడటంతో పోటీ వద్దని పక్కకు తప్పుకున్నాడు. ప్రేమ్ రతన్ థన్ పాయో సినిమా తరువాత సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమా సుల్తాన్. గత సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో సుల్తాన్ సినిమాను ఎలాగైన హిట్ చేయాలన్న కసితో సినిమా చేస్తున్నాడు కండలవీరుడు. ఇక షారూక్ పరిస్థితి కూడా అలాగే ఉంది. దిల్ వాలే సినిమాతో అభిమానులను నిరాశపరిచిన షారుక్, రాయిస్‌తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. దీంతో తాజా చిత్రాలు ఇద్దరు ఖాన్లకు కీలకం కానున్నాయి. ఈ రెండు సినిమాలు ప్రారంభమైన సమయంలో ఈద్‌కే రిలీజ్ చేస్తాం అంటూ ప్రకటించేశారు చిత్రయూనిట్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. ఇప్పటికే బాజీరావ్ మస్తానీతో పోటీ పడి నష్టపోయిన షారుక్ ఖాన్ మరోసారి రిస్క్ చేయడానికి సిద్ధంగా లేడు. అందుకే తానే ఓ అడుగు వెనక్కు వేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న సమయానికన్నా రెండు వారాలు ఆలస్యంగా రాయిస్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. -
కలయా? నిజామా? గిల్లి చూసుకున్నా!
కొన్ని కలలు నిజమైన వేళ నమ్మబుద్ధి కాదు. ఎంతగానో తపించే కోరిక నెరవేరితే.. ఇది నిజమా? భ్రమానా? అన్న సందేహం కలుగుతుంది. అలాంటి సమయంలోనే తమను తాము గిల్లుకొనో.. ఎదుటివారిని గిల్లో.. నిజమని కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటాం. తాజాగా బాలీవుడ్ హాట్ భామ సన్నీ లియోన్ కూడా ఇలాగే తనను పదేపదే గిల్లి చూసుకుంది. నిజమా? కాదా? అని సందేహపడింది. కారణం ఏమిటంటారా? కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించాలన్న ఆమె కోరిక నెరవేరడమే. 'మస్తీజాదే'తో తాజాగా మస్తీ చేసిన ఈ భామ 'రాయిస్' సినిమాతో షారుఖ్‌తో కలిసి ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడుతోంది. తొలిసారి 'రాయిస్' సెట్స్‌లోకి అడుగుపెట్టాక.. ఇది కలనా? నిజమా? అని భ్రాంతి కలిగిందంట.. అందుకే 'తొలిరోజు సెట్స్‌లో ఇది నిజమా? కాదా? అన్నది తెలుసుకోవడానికి నన్ను నేను పదేపదే గిల్లి చూసుకోవాలనుకున్నాను. ఇది నిజంగా అమేజింగ్ డే' అంటూ సన్నీ ఆనందం వ్యక్తం చేసింది. 'ప్రార్థించి, కోరి, అకుంఠిత దీక్షతో కష్టపడితే మీ కలలు నిజమవుతాయి. ఈ రోజు రావాలని ఎన్నో ఏళ్లుగా నేను కోరుకున్నాను. ప్రార్థించాను. థాంక్ గాడ్' అంటూ మరో ట్వీట్ చేసింది. 50 ఏళ్ల షారుఖ్ తాజా చిత్రం 'రాయిస్' ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్నది. 1980 నాటి 'ఖుర్బానీ' సినిమాలోని 'లైలా ఓ లైలా' పాటను ఈ సినిమా కోసం మళ్లీ వాడుకుంటున్నారు. ఒరిజినల్ ట్రాక్‌లో ఫిరోజ్ ఖాన్, జీనత్ ఆమన్ ఆడిపాడగా.. ఇప్పుడు ఆ ఫేమస్ పాటలో షారుఖ్, సన్నీ లియోన్ కలిసి చిందులు వేస్తున్నారు. 1st time on a film set where I kept wanting2pinch myself2see if it was real or a dream.Amazing 1st day! @rahuldholakia @ritesh_sid @iamsrk — Sunny Leone (@SunnyLeone) March 25, 2016 -
షారుఖ్ షూటింగ్‌కు 'అసహన' సెగ!
భుజ్ (గుజరాత్): దేశంలో మత అసహనంపై బాలీవుడ్ సూపర్ష్టార్ షారుఖ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. ఆయన తాజా సినిమా షూటింగ్‌ను అడ్డుకోవడానికి విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రయత్నించింది. గుజరాత్‌లోని భుజ్ ప్రాంతంలో జరుగుతున్న షారుఖ్ సినిమా 'రాయిస్' షూటింగ్ వద్ద వీహెచ్‌పీ కార్యకర్తలు బుధవారం ఆందోళన నిర్వహించారు. గత ఏడాది నవంబర్‌లో ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో తీవ్ర మత అసహనం ఉందని షారుఖ్ వ్యాఖ్యలు చేశాడు. 'మత అసహనం కలిగి ఉండటం, లౌకికంగా వ్యవహరించకపోవడం దేశంలో తీవ్రమైన నేరమే' అని ఆయన పేర్కొన్నాడు. షారుఖ్ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆయన వెనుకకు తగ్గారు. భారత్ అసహన దేశమని తాను ఎన్నడూ అనలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో షారుఖ్ సినిమా షూటింగ్‌కు భుజ్ పట్టణంలో అనుమతి ఇవ్వవద్దంటూ గతకొన్ని రోజులుగా వీహెచ్‌పీ కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు వ్యతిరేకంగా బుధవారం జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించిన ఆందోళనకారులు.. అక్కడి నుంచి షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి బయలుదేరారు. వారిని దారి మధ్యలోనే పోలీసులు అడ్డుకొని చెల్లాచెదురు చేశారని స్థానిక ఎస్సై ఎంబీ పర్మార్ తెలిపారు.