రూ. 200 కోట్లు దాటిన కలెక్షన్లు | Shah Rukh Khan’s film Raees crosses the 200-crore mark | Sakshi
Sakshi News home page

రూ. 200 కోట్లు దాటిన కలెక్షన్లు

Published Wed, Feb 1 2017 2:48 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

రూ. 200 కోట్లు దాటిన కలెక్షన్లు

రూ. 200 కోట్లు దాటిన కలెక్షన్లు

ముంబై: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన రేయీస్ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. జనవరి 25న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఓవర్సీస్లో 62.56 కోట్లు, దేశంలో 152.61 కోట్ల రూపాయలు వచ్చాయి. దీంతో ఈ సినిమాకు మొత్తం 215.17 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.

రేయీస్ సినిమాకు నిలకడగా కలెక్షన్లు వస్తున్నాయి. దేశీయ మార్కెట్తో పాటు ఓవర్సీస్లో కూడా సత్తాచాటుతోంది. రాహుల్ దొలాకియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుక్తో పాటు పాకిస్థాన్ నటులు మహీరా ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించారు. కాగా జనవరి 25వ తేదీన రేయీస్తో పాటు విడుదలైన హృతిక్ రోషన్ సినిమా కాబిల్కు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చినా కలెక్షన్ల వేటలో వెనుకబడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement