బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న 'రాయిస్'
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న 'రాయిస్'
షారుఖ్ ఖాన్ తాజా సినిమా 'రాయిస్' భారీ వసూళ్లు రాబడుతున్నది. హృతిక్ రోషన్ 'కాబిల్' సినిమాతో పోటీపడినా.. షారుఖ్ 'రాయిస్' కలెక్షన్లలో పైచేయి సాధించింది. రెండురోజుల్లో ఈ సినిమా దేశీయంగా రూ. 46.72 కోట్లు కొల్లగొట్టింది. బుధవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ. 20.42 కోట్లు, రెండో రోజు రూ. 26.30 కోట్లను వసూలు చేసింది. ఓవర్సీస్‌లో మరో తొమ్మిది కోట్లు తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ స్టామినాతో పోల్లుకుంటే ఈ కలెక్షన్లు తక్కువేనని చెప్పాలి. ఇతర బాలీవుడ్ సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, ఆమిర్‌ఖాన్ సినిమాల ఓపెనింగ్స్‌తో పోల్చుకుంటే షారుఖ్ వెనుకబడినట్టేనని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.
షారుఖ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధానపాత్రలో రాహుల్ దోలాఖియా దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయిస్' సినిమాకు విమర్శకుల నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అయినా షారుఖ్‌ను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండటంతో 'కాబిల్' కన్నా మెరుగైన వసూళ్లు ఈ సినిమా రాబడుతున్నది. ఐదు రోజుల ఓపెనింగ్ వీకెండ్ ఉండటం కూడా 'రాయిస్' కలిసి వచ్చే విషయం. వసూళ్లు ఇలాగే నిలకడగా కొనసాగితే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. 'రాయిస్' సినిమాకు అద్భుతమైన వసూళ్లు సాధిస్తున్నదని, తొలిరెండురోజుల్లో దేశీయంగా రూ. 46.72 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9.53 కోట్లు ఈ సినిమా రాబట్టిందని, మున్ముందు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరింతగా దూసుకుపోయే అవకాశముందని బాలీవుడ్ ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.