కింగ్‌ఖాన్ షారుఖ్ ఖాన్ మళ్లీ పుంజుకున్నాడు. వరుస ప్లాఫులు రావడంతో కొన్నాళ్లకు సినిమాకు గ్యాప్ ఇచ్చి.. పఠాన్‌తో సాలిడ్ హిట్ అందుకున్నాడు. అదే జోష్‌లో ఈ ఏడాది ‘జవాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. షారుఖ్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది.
బాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి రూ. 1100 కోట్ల రూపాయలు(29 రోజుల్లో) వసూళ్లు సాధించిన చిత్రంగా జావాన్ నిలిచింది. సినిమా విడుదలై నెల రోజులు అయినప్పటికీ..దేశ వ్యాప్తంగా రోజులు దాదపు రూ.కోటి వసూళ్లను రాబడుతోందంటే.. జవాన్ సృష్టించిన సునామీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆమిర్ తర్వాతే షారుఖ్
జవాన్ ఎన్ని రికార్డులు సృష్టించిన.. కలెక్షన్ల పరంగా మాత్రం దంగల్‌ని అందుకోవడం కష్టమే. ప్రపంచ వ్యాప్తంగా జవాన్ కలెక్షన్స్ రూ. 1103 కోట్ల వద్ద ఉన్నాయి. కేజీయఫ్ 2 (రూ. 1215 కోట్లు), ఆర్‌ఆర్‌ఆర్ (రూ.1230 కోట్లు), బాహుబలి 2 (రూ. 1780 కోట్లు), దంగల్ (రూ. 2400 కోట్లు) సినిమాలతో పోలిస్తే.. జవాన్ ఇంకా వెనకబడే ఉంది. ఇంకా చైనాలో జవాన్ చిత్రాన్ని రిలీజ్ చేయలేదు కాబట్టి.. ఒక వేళ అక్కడ కూడా హిట్ అయితే మాత్రం కేజీయఫ్ 2, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలను ఈజీగా క్రాస్ చేస్తుంది. ఈ చిత్రంలో షారుఖ్‌కి జోడిగా నయనతార నటించగా.. దీపికా పదుకొణె కీలక పాత్ర పోషించారు. విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు.
జవాన్ రికార్డులు
- విడుదలైన వారం రోజుల్లో రూ. 600 కోట్ల మార్క్‌ని దాటిన తొలి హిందీ చిత్రం
- అతి తక్కువ రోజుల్లో రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి చిత్రం
- పఠాన్ తొలి రోజు రూ. 57 కోట్లు సాధిస్తే.. జవాన్ రూ. 75 కోట్లు వసూళ్లు రాబట్టింది
- ఒక హీరో నటించిన రెండు సినిమాలు.. తొలి రోజు రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఏకైన ఇండియన్ స్టార్‌గా షారుఖ్ చరిత్రకెక్కాడు.
- బాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి రూ. 1100 కోట్ల రూపాయలు(29 రోజుల్లో) వసూళ్లు సాధించిన చిత్రం
Jawan 🤝 Making & breaking box office records every day! 🔥
— Red Chillies Entertainment (@RedChilliesEnt) October 6, 2023
Book your tickets now!https://t.co/B5xelUahHO
Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/JCdsrHFp6r
Comments
Please login to add a commentAdd a comment