నిరాశ పరిచిన షారుఖ్‌ సినిమా కలెక్షన్లు.. | Jab Harry Met Sejal box office collection Day | Sakshi
Sakshi News home page

నిరాశ పరిచిన షారుఖ్‌ సినిమా కలెక్షన్లు..

Aug 5 2017 7:53 PM | Updated on Sep 17 2017 5:12 PM

నిరాశ పరిచిన షారుఖ్‌ సినిమా కలెక్షన్లు..

నిరాశ పరిచిన షారుఖ్‌ సినిమా కలెక్షన్లు..

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ కొత్త చిత్రం ‘జబ్‌ హారీ మెట్‌ సెజల్‌’ సినిమా కలెక్షన్లు నిరాశ పరిచాయి.

ముంబాయి: బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ కొత్త చిత్రం ‘జబ్‌ హారీ మెట్‌ సెజల్‌’  సినిమా కలెక్షన్లు నిరాశ పరిచాయి. దేశ వ్యాప్తంగా తొలి రోజు రూ. 15.25 కోట్లు వసూలు చేసింది. భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న షారుఖ్‌ ఖాన్‌కు ఇది మింగుడు పడని విషయం. షారుఖ్‌, అనుష్క శర్మ జంటగా ఇంతియాజ్‌ అలీ తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల మందుకు వచ్చింది. పంజాబ్‌ టూర్‌ గైడ్‌ హారీ, గుజరాతీ యువతి సెజల్‌ మధ్య సాగే ఈ రొమాంటిక్‌ చిత్రం తొలి రోజు కలెక‌్షన్లు ఆశించిన స్థాయిలో లేవని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రముఖ ట్రెడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ఈ చిత్ర తొలి రోజు కలెక‌్షన్లను ట్వీట్‌ చేయడంతో పాటు.. లాంగ్‌ వీకెండ్‌ ఉండటంతో త్వరలోనే కలెక‌్షన్లు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తన గత చిత్రం రయీస్‌లో గ్యాంగ్‌స్టర్‌ పాత్ర పోషించిన షారుఖ్‌ ఈ చిత్రంలో పూర్తి స్థాయి ప్రేమికుడిగా కనిపించాడు. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో తొలి రోజు కలెక‌్షన్ల రికార్డులను పరిశీలిస్తే.. తొలిస్థానంలో బాహుబలి-2 ఉండగా.. ఈ చిత్రం నాలుగో స్థానంలో నిలిచింది. శుక్ర, శని, ఆదివారాలతో పాటు సోమవారం రక్షాబంధన్‌ కూడ తోడవడంతో ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్‌ దక్కించుకునే అవకాశం ఉందని తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement