Jab Harry Met Sejal
-
ఆ సినిమాపై నెటిజన్ల తిట్లవర్షం!
బాలీవుడ్లో చాలాకాలంగా హిట్ సినిమాలు లేని సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్. గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద పరాజయల పరంపర కొనసాగిస్తున్న కింగ్ ఖాన్ తాజా చిత్రం జబ్ హ్యారీ మెట్ సెజెల్. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీని చూసేందుకు అటు షారుఖ్ ఫ్యాన్స్, ఇటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరొందిన ఇంతియాజ్ అలీ తెరకెక్కించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదలైన నాటి నుంచి అటు విమర్శకులు, ఇటు ప్రేక్షకులు ఒకేరీతిలో మండిపడుతున్నారు. ఇదేం చెత్త సినిమా అంటూ దుయ్యబడుతున్నారు. ఇక పుణెలో ఓ వ్యక్తి ఈ సినిమా చూస్తూ.. ఆ విసుగును తట్టుకోలేక ఏకంగా విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కు 'కాపాడండి మేడం' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయింది. ఇదే ట్వీట్ కాదు.. ట్విట్టర్లో ఈ సినిమాపై సెటైర్లు, జోకులు, దూషణలు, చెత్త సినిమా అంటూ రివ్యూలు వెల్లువెత్తుతున్నాయి. 'జబ్ ఆడియెన్స్ మెట్ డిజాస్టర్' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హ్యారీ మెట్ సెజల్ బాధితుల కోసం ప్రధానమంత్రి నిధులు విడుదల చేస్తున్నారా? లేదా? అని సెటైర్లు వేస్తున్నారు. ఇంతియాజ్ అలీకి స్కిప్ట్ గురించి ఇంతకూడా పట్టింపు లేకపోవడం ఏమిటని దుయ్యబడుతున్నారు. మీరూ ఓ లుక్ వేయండి. When you book 6 PM show of #JabHarryMetSejal pic.twitter.com/WkArxo8f3H — 007 (@James_Beyond) August 6, 2017 Jab Harry Met Sejal is so bad that you can't even blame nepotism for it. — Daniel Fernandes (@absolutelydanny) August 5, 2017 Jab Harry Met Sejal review: Anushka Sharma lost the ring. Imtiaz ali lost the script. Shahrukh Khan lost the reputation. — Sunil- The Cricketer (@1sInto2s) August 4, 2017 Two die hard SRK fans watching Jab Harry Met Sejal. #JHMS pic.twitter.com/Hc4ammfTTf — Pakchikpak Raja Babu (@HaramiParindey) August 5, 2017 Jab Audience Met Disappointment. — Trendulkar (@Trendulkar) August 5, 2017 Is prime minister releasing funds for Jab Harry Met Sejal victims? — one tip one hand_ (@OneTipOneHand_) August 4, 2017 -
మేకింగ్ ఆఫ్ మూవీ - జబ్ హ్యారీ మెట్ సెజల్
-
నిరాశ పరిచిన షారుఖ్ సినిమా కలెక్షన్లు..
ముంబాయి: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం ‘జబ్ హారీ మెట్ సెజల్’ సినిమా కలెక్షన్లు నిరాశ పరిచాయి. దేశ వ్యాప్తంగా తొలి రోజు రూ. 15.25 కోట్లు వసూలు చేసింది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న షారుఖ్ ఖాన్‌కు ఇది మింగుడు పడని విషయం. షారుఖ్, అనుష్క శర్మ జంటగా ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల మందుకు వచ్చింది. పంజాబ్ టూర్ గైడ్ హారీ, గుజరాతీ యువతి సెజల్ మధ్య సాగే ఈ రొమాంటిక్ చిత్రం తొలి రోజు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రముఖ ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ చిత్ర తొలి రోజు కలెక్షన్లను ట్వీట్ చేయడంతో పాటు.. లాంగ్ వీకెండ్ ఉండటంతో త్వరలోనే కలెక్షన్లు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తన గత చిత్రం రయీస్‌లో గ్యాంగ్‌స్టర్ పాత్ర పోషించిన షారుఖ్ ఈ చిత్రంలో పూర్తి స్థాయి ప్రేమికుడిగా కనిపించాడు. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో తొలి రోజు కలెక్షన్ల రికార్డులను పరిశీలిస్తే.. తొలిస్థానంలో బాహుబలి-2 ఉండగా.. ఈ చిత్రం నాలుగో స్థానంలో నిలిచింది. శుక్ర, శని, ఆదివారాలతో పాటు సోమవారం రక్షాబంధన్ కూడ తోడవడంతో ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశం ఉందని తరణ్ ఆదర్శ్ ట్విట్ చేశారు. -
షోలో కుప్పకూలిన స్టార్ కమెడియన్
ముంబయి: ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ తాను నిర్వహిస్తున్న షోలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇటీవల జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం కపిల్ ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈవెంట్లలో పాల్గొనేందుకు కపిల్ సిద్ధమవుతున్నారు. ఒత్తిడి కారణంగానే ఆయన అస్వస్థతకు గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. కపిల్ షో రద్దు కావడం ఇది తొలిసారేం కాదు. ఓసారి లండన్‌లో పరేశ్ రావల్, కార్తీక్ అర్యాన్, కృతి కర్బందా సెట్లో రెడీగా ఉన్న సందర్బంలో షో నిర్వాహకుడు కపిల్ శర్మ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఒత్తిడిలో ఉన్న కపిల్ అధిక రక్తపోటు, షుగర్ సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు డాక్టర్లు చెప్పారు. అసలేం జరిగింది? బాలీవుడ్ బాద్షా 'కింగ్' షారుక్ ఖాన్, అనుష్క శర్మ నటించిన లేటెస్ట్ మూవీ 'జబ్ హ్యారీ మెట్ సెజల్'. ఈ మూవీ ప్రమోషన్ కోసం హీరోహీరోయిన్లు కపిల్ శర్మ షోకు రావాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారం ఈవెంట్‌కు హాజరయ్యారు. సరిగ్గా కాసేపట్లో షో మొదలవుతుందనగా కపిల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. షో సహ నిర్వాహకులు, సిబ్బంది చికిత్స నిమిత్తం కపిల్‌ను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. షో రద్దు కావడంతో షారుఖ్, అనుష్కలు తిరిగి వెళ్లిపోయారు. టీఆర్పీ రేటింగ్స్ కోసం అధిక ఒత్తిడికి లోను కావడమే కపిల్ అనారోగ్యానికి కారణమై ఉంటుందని భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి.