Pathaan Movie Beats Bahubali 2, Becomes Biggest Hindi Film at Box Office - Sakshi
Sakshi News home page

Pathaan Box Office Collection: ‘పఠాన్‌’ కొత్త చరిత్ర.. ‘బాహుబలి’ రికార్డు బద్దలైంది

Published Sun, Mar 5 2023 9:01 AM | Last Updated on Sun, Mar 5 2023 10:31 AM

Pathaan Movie Beats Bahubali 2, Becomes Biggest Hindi Film At Box Office - Sakshi

హిందీలో ‘బాహుబలి’ని దాటేశాడు ‘పఠాన్‌’. షారుక్‌ ఖాన్‌ టైటిల్‌ రోల్‌లో రూపొందిన హిందీ చిత్రం ‘పఠాన్‌’. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం జనవరి 25న విడుదలైంది. ఇటీవల ఈ చిత్రం రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించి, ఓ రికార్డును నమోదు చేసుకుంది. కాగా హిందీలో అత్యధిక నెట్‌ బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ సాధించిన టాప్‌ ప్లేస్‌ (దాదాపు రూ. 510 నెట్‌ కలెక్షన్స్‌)లో  ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ఉండేది. ఈ రికార్డును ‘పఠాన్‌’ చిత్రం అధిగమించింది.

‘‘హిందీలో నెట్‌ బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ పరంగా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ రికార్డును అధిగమించిన షారుక్‌ ఖాన్, చిత్రదర్శకుడు సిద్దార్థ్‌ ఆనంద్, యశ్‌రాజ్‌ సంస్థకు శుభాకాంక్షలు. రికార్డులు ఉన్నది బ్రేక్‌ కావడం కోసమే’’ అని ట్వీట్‌ చేశారు ‘బాహుబలి’ నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ. ‘బాహుబలి’లాంటి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్‌. మేం మరింత కష్టపడటానికి ఆ సినిమా స్ఫూర్తిగా నిలిచింది’’ అని యశ్‌ రాజ్‌ సంస్థ ట్వీట్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement