Shah Rukh Khan Pathaan Available For Rs 110 In Theatres On February 17 - Sakshi

Pathaan Movie: వెయ్యికోట్లకు చేరువలో పఠాన్‌.. తగ్గిన టికెట్‌ రేట్లు!

Published Thu, Feb 16 2023 2:08 PM | Last Updated on Thu, Feb 16 2023 3:08 PM

Shah Rukh Khan Pathaan Available for Rs 110  in Theaters on February 17 - Sakshi

షారుక్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ పఠాన్‌. దీపికా పదుకొణె కథానాయికగా నటించగా జాన్‌ అబ్రహం విలన్‌గా మెప్పించాడు. ఈ సినిమా ఊహించని స్థాయిలో ఘన విజయం సాధించింది. ఇండియన్‌ బాక్సాఫీస్‌ చరిత్రలో ఏకంగా రూ.600 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఈ సందర్భంగా యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ ప్రొడక్షన్స్‌ సినీ ప్రేమికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఫిబ్రవరి 17వ తేదీని పఠాన్‌ సినిమా రూ.110కే అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది.

సాధారణ థియేటర్లతోపాటు పీవీఆర్‌, ఐనాక్స్‌, సినీపోలిస్‌ వంటి అన్ని మల్టీప్లెక్స్‌లోనూ 110 రూపాయలకే పఠాన్‌ చూడవచ్చని తెలిపింది. మరింకే.. పఠాన్‌ను ఫ్రెండ్స్‌తో లేదా ఫ్యామిలీతో మరోసారి చూసేయాలనుకుంటే రేపే దగ్గర్లోని థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి ఆస్వాదించండి. ఇక పఠాన్‌ విషయానికి వస్తే జనవరి 25న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.970 కోట్లు రాబట్టింది. అందులో ఒక్క ఇండియాలోనే రూ.605 కోట్లు కాగా ఓవర్సీస్‌లో రూ.365 కోట్లు రాబట్టడం విశేషం.

చదవండి: అమ్మకు క్యాన్సర్‌.. అనాధాశ్రమంలో వదిలేశా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement