Shah Rukh Khan Stylish Watch Cost Will Mind Blowing - Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: పఠాన్‌ సక్సెస్‌ ఈవెంట్‌.. షారుక్‌ చేతికి పెట్టుకున్న వాచ్‌ అన్ని కోట్లా?

Feb 10 2023 2:59 PM | Updated on Feb 10 2023 4:06 PM

Shah Rukh Khan Stylish Watch Cost Will Mind Blowing - Sakshi

దీపికా పదుకొణె షేర్‌ చేసిన వీడియోలో సైతం అదే వాచీతో దర్శనమిచ్చాడు. దీంతో అందరూ ఈ చేతిగడియారం ఖరీదెంత? అని ఆరా తీస్తున్నారు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పఠాన్‌. జనవరి 25న రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.877 కోట్లు రాబట్టింది. సినిమా సక్సెస్‌తో ఒక్క చిత్రయూనిటే కాదు బాలీవుడ్‌ మొత్తం ఫుల్‌ ఖుషీ అవుతోంది. హిందీ చిత్రపరిశ్రమకు మళ్లీ మంచిరోజులొచ్చాయని అంతా సంబరపడుతున్నారు. కాగా ఇటీవల జరిగిన పఠాన్‌ సక్సెస్‌ ఈవెంట్‌లో షారుక్‌ తన చేతికి ఖరీదైన బ్లూ కలర్‌ వాచ్‌ ధరించాడు. తాజాగా దీపికా పదుకొణె షేర్‌ చేసిన వీడియోలో సైతం అదే వాచీతో దర్శనమిచ్చాడు. దీంతో అందరూ ఈ చేతి గడియారం  ఏ బ్రాండ్‌కు చెందినది? దీని ఖరీదెంత? అని ఆరా తీస్తున్నారు.

ఆ విషయానికి వస్తే.. షారుక్‌ ధరించిన వాచ్‌ 'అడెమర్స్‌ పిగెట్‌' అనే లగ్జరీ వాచ్‌ బ్రాండ్‌కు చెందినది. దీని ఖరీదు అక్షరాలా రూ.4.98 కోట్లని తెలుస్తోంది. ఇకపోతే షారుక్‌కు కోట్లు విలువ చేసే బీఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్‌, బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్‌, ఆడి సహా మరికొన్ని కార్లు ఉన్నాయి. అలాగే మన్నత్‌లో రూ.200 కోట్లు విలువ చేసే ఇల్లు కూడా ఉంది.

చదవండి: ఆర్థికసాయం కోసం అభిమాని ఎదురుచూపులు, గుర్తుపట్టి సాయం చేసిన బన్నీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement