bahubali 2
-
'ముందు వెళ్లి మీ భర్తను అడగండి'.. స్టార్ హీరో భార్యకు స్ట్రాంగ్ కౌంటర్!
ఇటీవలే యానిమల్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం యానిమల్ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం రిలీజ్ తర్వాత పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. స్త్రీ విద్వేష చిత్రమని చాలామంది ప్రముఖులు సైతం మండిపడ్డారు. అయితే ఈ సినిమాపై అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సైతం విమర్శలు గుప్పించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. బాహుబలి-2, కబీర్ సింగ్ సినిమాలు సైతం స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. అయితే తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన విమర్శలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆమె పేరును ప్రస్తావించకుండానే చురకలంటించారు. ఒకసారి అమిర్ ఖాన్ నటించిన దిల్ సినిమా చూడాలని ఆమెకు సలహా ఇచ్చాడు. సందీప్ మాట్లాడుతూ.. 'నేను ఆమెకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు అమీర్ ఖాన్ని వెళ్లి అడగండి. ఆయన నటించిన దిల్ సినిమాలో దాదాపు అమ్మాయిపై రేప్‌కు ప్రయత్నించే పరిస్థితిని సృష్టించాడు. కానీ ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తాడు. కానీ చివరికి అతనితోనే ప్రేమలో పడుతుంది. మరీ ఇదంతా ఏమిటి? ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై ఎలా దాడి చేస్తారో అర్థం కావడం లేదు' అని యానిమల్ దర్శకుడు తెలిపారు. కాగా..ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. -
బాహుబలి 'కట్టప్ప' రెమ్యునరేషన్, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
తెలుగు సినిమా ప్రేక్షకులు సత్యరాజ్‌ను చూడగానే 'కట్టప్ప' అంటూ ఉంటారు. అంతలా 'బాహుబలి' సినిమాతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకు తగ్గట్టుగా తన పాత్రలో కట్టప్పగా ఒదిగిపోయారు సత్యరాజ్. కెరీర్ ప్రారంభంలోనే కొన్ని తెలుగు చిత్రాలలో విలన్‌గా కనిపించిన ఆయన తర్వాత పలు ప్రత్యేకమైన పాత్రలతో మెప్పించారు. తమిళనాటలో కూడా కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలే చేశారు. తర్వాత స్టార్ హీరోగా కొనసాగారు. అనంతరం కేరెక్టర్ రోల్స్ లోకి మారిపోయారు. అప్పటి నుంచీ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ సత్యరాజ్ కేరెక్టర్ యాక్టర్‌గా అలరిస్తూనే ఉన్నారు. (ఇదీ చదవండి: ఎయిర్‌పోర్టులో ప్రభాస్ చెంపపై కొట్టిన యువతి.. వీడియో వైరల్) సత్యరాజ్ అసలు పేరు రంగరాజ్. నేడు ఆయన 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అక్టోబర్ 3, 1954 కొయంబత్తూర్‌లో సత్యరాజ్ జన్మించారు. తండ్రి సుబ్బయ్య డాక్టర్. కొయంబత్తూరులోనే సత్యరాజ్ బి.ఎస్సీ వరకు చదువుకున్నారు. ఆయనకు నటులు ఎమ్.జి.రామచంద్రన్, రాజేశ్ ఖన్నా అంటే ఎనలేని అభిమానం. వారి స్ఫూర్తితో ఎలాగైన వెండితెరపై మెరవాలని ఆయనలో ఆశ చిగురించింది. కానీ ఆయన తల్లికి మాత్రం ఇష్టం లేదు. అయినా అది లెక్క చేయకుండా చెన్నైకి పయనమయ్యాడు సత్యరాజ్. మొదట తమిళ హీరో సూర్య తండ్రి శివకుమారు అప్పట్లో టాప్ హీరో. ఆయనను కలిసి ఎలాగైనా సినిమా అవకాశం ఇప్పించాలని ప్రాధేయపడ్డారు. (ఇదీ చదవండి: 100 సినిమాల్లో నటించిన దేవయాని.. టీచర్‌గా చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది) తల్లిదండ్రులకు ఇష్టంలేని పని చేయడం ఎందుకని, వారు చెప్పినట్లు చదువు పూర్తి చేయమని చెప్పి వెనక్కు పంపించేశాడు. కానీ, సత్యరాజ్ చెన్నైలోనే ఉంటూ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలా కమల్ హాసన్ హీరోగా నటించిన 'సట్టం ఎన్ కైయిల్' చిత్రంలో తొలిసారిగా ఒక కీలకమైన పాత్రలో కనిపించారు సత్యరాజ్. అందులో ప్రధాన విలన్‌కు అనుచరునిగా సత్యరాజ్ నటించారు. తర్వాత 1985లో కార్తిక్ రఘునాథ్ రూపొందించిన 'సావి' చిత్రంలో తొలిసారి హీరోగా కనిపించారు సత్యరాజ్. అనేక అవార్డులు నటుడు సత్యరాజ్‌కు తమిళనాడు ప్రభుత్వ కలైమామణి అవార్డు, MGR అవార్డు, పెరియార్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు, విజయ్ అవార్డు వంటి లెక్కలేనన్ని అవార్డులు వరించాయి. బాహుబలిలో కట్టప్పగా ఆయన పాత్రను యావత్ ప్రపంచానికి తీసుకెళ్లింది. ఆస్తి విలువ సత్యరాజ్‌కు మిర్చి సినిమాతో మంచి పాపులారిటి దక్కింది. అప్పట్లో ఒక సినిమాకు సుమారు రూ. 2 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. సత్యరాజ్‌కు చెన్నైలో స్వంత ఇల్లు ఉంది. అతను తన కుటుంబంతో కలిసి ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ ఇంటి విలువ దాదాపు రూ.5 కోట్లు అని టాక్. అలాగే, అతని వద్ద ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్, ఇన్నోవా అనే మూడు కార్లు ఉన్నాయి. అతనికి నాగమ్మాళ్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఉంది. ప్రస్తుతం దీని ద్వారా ఆయన భారీగానే ఆదాయాన్ని పొందుతున్నట్లు చెబుతున్నారు. అతని మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. -
100 కోట్లు గ్రాస్...!
-
మహిశ్మతిపై పుష్ప రాజ్ యుద్ధం
-
‘పఠాన్’ కొత్త చరిత్ర.. ‘బాహుబలి’ రికార్డు బద్దలైంది
హిందీలో ‘బాహుబలి’ని దాటేశాడు ‘పఠాన్’. షారుక్ ఖాన్ టైటిల్ రోల్లో రూపొందిన హిందీ చిత్రం ‘పఠాన్’. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం జనవరి 25న విడుదలైంది. ఇటీవల ఈ చిత్రం రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, ఓ రికార్డును నమోదు చేసుకుంది. కాగా హిందీలో అత్యధిక నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించిన టాప్ ప్లేస్ (దాదాపు రూ. 510 నెట్ కలెక్షన్స్)లో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ ఉండేది. ఈ రికార్డును ‘పఠాన్’ చిత్రం అధిగమించింది. ‘‘హిందీలో నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ రికార్డును అధిగమించిన షారుక్ ఖాన్, చిత్రదర్శకుడు సిద్దార్థ్ ఆనంద్, యశ్‌రాజ్ సంస్థకు శుభాకాంక్షలు. రికార్డులు ఉన్నది బ్రేక్ కావడం కోసమే’’ అని ట్వీట్ చేశారు ‘బాహుబలి’ నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ. ‘బాహుబలి’లాంటి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్. మేం మరింత కష్టపడటానికి ఆ సినిమా స్ఫూర్తిగా నిలిచింది’’ అని యశ్ రాజ్ సంస్థ ట్వీట్ చేసింది. Congratulations to @iamsrk sir, #SiddharthAnand @yrf and the entire team of #Pathaan on crossing @BaahubaliMovie 2 Hindi NBOC. Records are meant to be broken and I am happy it was none other than @iamsrk who did it! 😃 https://t.co/cUighGJmhu — Shobu Yarlagadda (@Shobu_) March 4, 2023 -
16 రోజుల్లో రూ. 300 కోట్లు.. బాహుబలి 2 రికార్డు బద్దలు..
సుమారు నాలుగేళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్. ఆయన తాజాగా నటించి సూపర్ బ్లాక్‌బ్లస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'విక్రమ్'. కమల్‌తోపాటు విజయ్‌సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించిన ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాతో పవర్ఫుల్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు కమల్ హాసన్. అయితే ఈ మూవీ విడుదలైన 16 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లలో సగం అంటే రూ. 150 కోట్లు ఒక్క తమిళనాడు రాష్ట్రం నుంచే వచ్చాయట. దీంతో ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో ఉన్న బాహుబలి 2 సినిమా కలెక్షన్ల రికార్డును విక్రమ్ బద్దలు కొట్టినట్లయింది. వచ్చే రోజుల్లో విక్రమ్ మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఇటీవల ఈ సినిమా సక్సెస్ సాధించిన సంతోషంలో చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి, థియేటర్ యజమానులకు స్పెషల్ పార్టీ ఇచ్చింది మూవీ యూనిట్. మూవీని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. చదవండి: 'విక్రమ్' సక్సెస్ డిన్నర్ పార్టీ.. విందులోని వంటకాలు ఇవే.. చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ కామంతో కళ్లు మూసుకుపోతే.. -
అఅఆ వసూళ్లు బాహుబలి–2 కంటే ఎక్కువ!
‘‘అమర్ అక్బర్ ఆంటోనీ (అఅఆ) సాధించిన వసూళ్లను ఇప్పటి లెక్కలకు అన్వయిస్తే ‘బాహుబలి 2’ వసూళ్ల కంటే ఎక్కువ’’ అని అమితాబ్ బచ్చన్ అన్నారు. అమితాబ్ బచ్చన్, రిషీ కపూర్, వినోద్ ఖన్నా ముఖ్య పాత్రల్లో దర్శకుడు మన్మోహన్ దేశాయ్ తెరకెక్కించిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఈ సినిమా విడుదలై మే 27కి 43 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పట్లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి భారీ వసూళ్లు సాధించింది. బచ్చన్, రిషీ, వినోద్ ఖన్నా కెరీర్లలో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిపోయింది. 43 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమితాబ్ ఓ ఆశ్చర్యకరమైన పోస్ట్‌ను తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ‘‘మన్మోహన్ దేశాయ్ ఈ కథను నాకు చెప్పడానికి వచ్చినప్పుడే ఈ టైటిల్ (అమర్ అక్బర్ ఆంటోనీ) చెప్పారు. కానీ అప్పటి సినిమాలకు పెడుతున్న స్టయిల్లో లేదు. వర్కౌట్ అవుతుందా? అని సందేహించాను కూడా. కట్ చేస్తే సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఆ రోజుల్లో సుమారు ఏడు కోట్ల 25 లక్షల వరకూ ఈ సినిమా వసూలు చేసింది. ఒకవేళ ప్రస్తుత లెక్కలతో పోలిస్తే ‘బాహుబలి 2’ని దాటేస్తుందని ట్రేడ్ చెబుతోంది. ‘‘అఅఆ’ సినిమా ముంబైలో 25 థియేటర్స్‌లో దాదాపు 25 వారాల పాటు ఆడింది. ఇంకా ఆడుతోంది’’ అని అప్పట్లో బయ్యర్లు నాతో అన్నారు. ఇప్పుడు అలాంటివి జరగడం లేదు. ఆ రోజులు పోయాయి’’ అన్నారు అమితాబ్. -
దెబ్బకు ట్వీట్ డెలిట్ చేశాడు!
సినీ ప్రేమికులందరికీ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేరు తెలిసే ఉంటుంది. బాలీవుడ్లో ఆయన ఇచ్చే రివ్యూలకు, చెప్పే బాక్సాఫీస్ కలెక్షన్లపై అందరికీ ఎంతో నమ్మకం ఉంటుంది. అయితే ఈ సారి ఆయన చెప్పిన బాక్సాఫీస్ లెక్కలు తప్పాయి. అందులోనూ బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని తక్కువ చేసి చూపడంతో ఆ చిత్ర నిర్మాత తరణ్ ఆదర్శ్‌కు చురకలంటించారు. ఆ దెబ్బతో ఆయన ఆ ట్వీట్‌ను డెలిట్ చేసేశాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ప్రపంచవ్యాప్తంగా అవేంజర్స్ ఎండ్ గేమ్ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఎండ్‌గేమ్ చిత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతూ హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిందని.. బాహుబలి2 రెండో స్థానంలోకి వెళ్లిందని ట్వీట్ చేశాడు. ఆ తర్వాతి స్థానంలో మరో మూడు, నాలుగు హిందీ సినిమాల పేర్లు ఉన్నాయని తెలిపాడు. అయితే బాహుబలి నిర్మాత అయిన శోభు యార్లగడ్డ ఈ ట్వీట్‌కు స్పందించారు. మీరు లిస్ట్‌లో చేర్చిన సినిమాలను తక్కువ చేయాలని మాట్లాడటం లేదు.. కానీ మీరు చేసిన పోలిక మాత్రం సరైంది కాదు ఎందుకుంటే బాహుబలి2 అనేది కేవలం హిందీలో డబ్ కాగా ఆ చిత్ర వసూళ్లను.. మిగతా చిత్రాలతో ఎలా పోలుస్తారు అంటూ ప్రశ్నించారు. మిగతా సినిమాలన్నీ ఇండియా పాన్ సినిమాలని, అన్ని భాషల్లో కలిపి సాధించిన వసూళ్లతో బాహుబలి2ను ఎలా ఒకటిగా పరిగణిస్తారంటూ ట్వీట్ చేశారు. దీంతో తరణ్ ఆదర్శ్ తాను చేసిన ట్వీట్‌ను తొలగించారు. Not to take away the success any of the films listed below, I don't think this is a right comparison and doesn't put things in perspective especially from veteran trade analyst like yourself! BB2 one language (predominantly North India) vs all other films all languages pan India https://t.co/IP2d2BbMEK — Shobu Yarlagadda (@Shobu_) May 3, 2019 -
ఇన్‌స్టాగ్రామములో అడుగుపెట్టారు
ఏంటీ.. డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ‘ఇన్‌స్టా గ్రామము’ అనే కొత్త యాప్ వచ్చిందనుకుంటున్నారా? అదేం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌నే సరదాగా ఇన్స్టాగ్రామము అన్నాం. రీసెంట్‌గానే ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అకౌంట్ క్రియేట్ చేసిన నాలుగైదు రోజులకు కూడా అప్డేట్స్ ఏం పోస్ట్ చేయలేదు ప్రభాస్. ‘సాహో’కు సంబంధించిన అప్డేట్ను ఏదైనా పోస్ట్ చేస్తారని ఫ్యాన్స్ అందరూ ఊహించారు. కానీ ప్రభాస్ ‘బాహుబలి2’లో ఓ స్టిల్‌ను పోస్ట్ చేశారు. ఇది ఫ్యాన్స్‌ను కొద్దిమేరకు నిరుత్సాహపరిచినా రాబోయే అప్డేట్స్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తారని ఊహించవచ్చు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌ను సుమారు 90 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆయన నటిస్తున్న ‘సాహో’ ఆగస్ట్ 15న విడుదలకు సిద్ధం అవుతోంది. -
ఆ నటుడికి జపనీయుల బర్త్‌డే విషెస్
బాహుబలి సినిమాతో ప్రపంచానికి భారతీయ సినిమా సత్తాను చాటిచెప్పారు. ఈ సినిమా ప్రపంపవ్యాప్తంగా భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా జపాన్‌లో ఈ సినిమా రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలోని హీరో, విలన్‌కే గాక.. ఓ పాత్రలో నటించిన ఆర్టిస్ట్‌కు సైతం విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. తన నటనతో అందరినీ మెప్పించిన సుబ్బరాజుకు జపాన్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. నిన్న (ఫిబ్రవరి 27) సుబ్బరాజు పుట్టినరోజు. బాహుబలితో జపాన్‌లో క్రేజ్ సంపాదించుకున్న సుబ్బరాజుకు.. అక్కడి అభిమానులు వినూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేశారు. వారంతా కేక్‌ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అలాగే సుబ్బరాజు కార్టూన్ బొమ్మలతో కూడిన ఫోటోలను షేర్ చేశారు. అంతేకాకుండా బోలెడన్ని గిఫ్ట్‌లను సుబ్బరాజుకు పంపించారు. వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో సుబ్బరాజు షేర్ చేశాడు. Thank u soo very much for this unconditional ❤️ 🙏🙏🙏🙏 pic.twitter.com/mcgaYM0k6K — subbaraju (@actorsubbaraju) February 27, 2019 Just received all the love from japan 🇯🇵 💃❤️🎁🍭 pic.twitter.com/VZpgtvSeAq — subbaraju (@actorsubbaraju) February 27, 2019 -
సైమాలో ‘బాహుబలి 2’ హవా!
దక్షిణాది చలన చిత్ర అవార్డుల కార్యక్రమం దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలకు చెందిన తారలందరూ ఈ సైమా వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో టాలీవుడ్‌కు సంబంధించి బాహుబలి2కి అవార్డుల పంట పండింది. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫర్ ఇలా బాహుబలి అవార్డుల వేటను కొనసాగించింది. అవార్డులు స్వీకరించిన అనంతరం బాహుబలి బృందం దిగిన ఫోటోను షేర్ చేశాడు సినిమాటోగ్రఫర్ కె.కె.సెంథిల్‌కుమార్. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది. సైమా అవార్డుల వివరాలు.. ఉత్తమ చిత్రం : బాహుబలి ది కంక్లూజన్ ఉత్తమ దర్శకుడు : SS రాజమౌళి (బాహుబలిది కంక్లూజన్) ఉత్తమ నటుడు : ప్రభాస్ (బాహుబలిది కంక్లూజన్) ఉత్తమ నటి : కాజల్ అగర్వాల్ (నేనే రాజు నేనే మంత్రి) ఉత్తమ సహాయనటుడు : ఆది పినిశెట్టి (నిన్ను కోరి) ఉత్తమ సహాయనటి : భూమిక చావ్లా(MCA) ఉత్తమ సంగీత దర్శకుడు : MM కీరవాణి (బాహుబలిది కంక్లూజన్) ఉత్తమ పాటల సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ(ఫిదా) ఉత్తమ నేపథ్య గాయకుడు : కాల భైరవ (బాహుబలిది కంక్లూజన్) ఉత్తమ నేపథ్య గాయని : మధుప్రియ (ఫిదా) ఉత్తమ ప్రతి నాయకుడు : రానా దగ్గుబాటి (బాహుబలిది కంక్లూజన్) ఉత్తమ నటుడు( తొలి పరిచయం) : ఇషాన్ (రోగ్) ఉత్తమ నటి( తొలి పరిచయం) : కళ్యాణి ప్రియదర్శన్ (హలో) ఉత్తమ దర్శకుడు( తొలి పరిచయం) : సందీప్ రెడ్డి వంగా(అర్జున్ రెడ్డి) ఉత్తమ ఛాయాగ్రహకుడు : సెంథిల్ కుమార్ (బాహుబలిది కంక్లూజన్) ఉత్తమ హాస్య నటుడు : రాహుల్ రామకృష్ణ(అర్జున్ రెడ్డి) ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ : రానా దగ్గుబాటి(బాహుబలిది కంక్లూజన్.. ది ఘాజి ఎటాక్.. నేనే రాజు నేనే మంత్రి) ఉత్తమ చిత్రం(విమర్శకులు) : గౌతమిపుత్ర శాతకర్ణి ఉత్తమ నటుడు(విమర్శకులు) : నందమూరి బాలకృష్ణ (గౌతమిపుత్ర శాతకర్ణి) ఉత్తమ నటి(విమర్శకులు) : రితిక సింగ్ (గురు) -
బాహుబలి అంటే ఆ మాత్రం ఉండాల్సిందే!
బాహుబలి తెలుగు సినిమా సత్తాను చాటింది. ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేసింది. రాజమౌళి సృష్టించిన ఈ కళాఖండం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ సైమా 2018 అవార్డ్స్‌లో తన స్టామినా ఏంటో చూపింది. పన్నెండు కేటగిరిలో ఈ మూవీ నామినేట్ అయి వార్తల్లో నిలిచింది. ఉత్తమ చిత్రం, నటుడు, నటి, సహాయ నటుడు, సహాయ నటి, సంగీత దర్శకుడు, ప్లే బ్యాక్ సింగర్ మేల్ అండ్ ఫీమేల్, సినిమాటోగ్రఫర్, దర్శకుడు, పాటల రచయిత ఇలా నామినేట్ అయి అందరినీ ఆశ్చర్యపరిచింది. కలెక్షన్లతో దుమ్ముదులిపిన బాహుబలి అవార్డుల్లో కూడా తన సత్తా చాటుతుంది. The Biggest Blockbuster of all time on Indian cinema @BaahubaliMovie receives 12 nominations in various categories for the 2018 @siima awards @ssrajamouli #Prabhas @RanaDaggubati #AnushkaShetty @tamannaahspeaks @meramyakrishnan @Shobu_ @arkamediaworks @actorsubbaraju #SIIMA2018 pic.twitter.com/HV8TonlL2R — BARaju (@baraju_SuperHit) August 5, 2018 -
‘కుమార వర్మ’కు జపనీయుల జేజేలు
భారతీయ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పిన బాహుబలికి.. భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అందులోని నటీ నటులకు కూడా అదే స్థాయిలో గుర్తింపు లభించింది. బాహుబలి 2లో కుమార వర్మ పాత్ర పోషించిన సుబ్బరాజుకు జపాన్ అభిమానులు ఫిదా అయిన సంగతి తెలిసిందే. సుబ్బరాజు పాత్ర వారిని విపరీతంగా ఆకట్టుకుంది. ఆయన కోసం సోషల్ మీడియాలో సైతం విపరీతమైన చర్చ నడించింది. ఇటీవల జపాన్ వెళ్లిన సుబ్బరాజ్‌కు అక్కడి అభిమానులు జేజేలు పలికారు. సుబ్బరాజు కూడా కుమార వర్మ వేషంలోనే బహుబలి 2 స్పెషల్ స్క్రీనింగ్‌కు వెళ్లి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బాహుబలి టీమ్ ట్విటర్లో షేర్ చేసింది. మా కుమార వర్మపై మీ ప్రేమకు ధన్యవాదాలు.. అతని ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాం అంటూ పేర్కొంది. సుబ్బరాజు జపాన్ వెళ్లడంపై అక్కడి అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుబ్బరాజ్ కూడా వారితో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. అక్కడి అభిమానుల కోరిక మేరకు బాహుబలి 2లోని కత్తితో చెక్కను రెండుగా చీల్చే సన్నివేశాన్ని సరాదాగా చేసి చూపించారు. సుబ్బరాజు జపాన్ రావడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలో బల్లాలదేవ పాత్రలో నటించిన రానా కూడా సుబ్బరాజుకు ట్విటర్లో అభినందనలు తెలిపారు. -
సుబ్బరాజుకు జపాన్ అభిమానులు ఫిదా
-
‘సీఎం శివగామి, రాయ్ కట్టప్ప’
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ అసంతృప్తి నేత కుమార్ విశ్వాస్ మరోసారి పార్టీ కన్వీనర్ గోపాల్ రాయ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో ఎమ్మెల్యే అమానుతుల్లాను లక్ష్యంగా చేసుకొన్న గోపాల్ రాయ్ ఇప్పుడు తనపై అదే విధంగా కక్షకట్టారని విమర్శించారు. బాహుబలి-2 సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ గోపాల్ రాయ్‌కు సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. సినిమాలో శివగామి దేవి తనకు ఎవరైనా ఎదురుతిగితే అంతం చేయడానికి కట్టప్పను ఉసిగొల్పుతుందని, చివరకు కొడుకు బాహుబలిని కూడా చంపేయిస్తుందని, ఇప్పుడు పార్టీలో కూడా అదే పరిస్థితి నెలకొని ఉందని కుమార్ విశ్వాస్ అన్నారు. అధిస్థానానికి ఎదురు తిరిగితే తమ పార్టీ అధినేత కేజ్రీవాల్, తిరుగుబాటుదారులపై గోపాల్‌రాయ్ అనే కట్టప్పను ప్రయోగిస్తారని దుయ్యబట్టారు. పార్టీలోని చాలామంది కార్యకర్తలు తనని రాజ్యసభ సభ్యుడిగా చూడాలనుకున్నారని, ఈ విషయంపై పార్టీలో ఎన్నిక కూడా నిర్వహించాలని సూచించానని అన్నారు. కానీ తన మాటను పార్టీ పక్కన పడేసిందని, కావాలనే వ్యాపార వేత్త సుశీల్ గుప్తా, చార్టెడ్ అకౌంటెంట్ ఎన్డీ గుప్తా, పార్టీ నేత సంజయ్ సింగ్‌లను పార్టీ ఎంపిక చేసిందని విమర్శించారు. ఇది పార్టీలో నిజాలు మాట్లాడినందుకు దక్కిన ఫలితం అన్నారు. ఇది తన బలిదానంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అయితే దీనిపై పార్టీ సీనియర్ నేత స్పందించారు. గోపాల్ రాయ్‌పై కుమార్ విశ్వాస్ ఆరోపణలు చేసినప్పటికీ ఆయన్ను పార్టీ బుజ్జగించే ప్రయత్నం చేసిందని అన్నారు. ఒకవేళ పార్టీ కుమార్‌ను నిర్లక్ష్యం చేస్తే రాజస్తాన్ ఎన్నికల ఇన్చార్జ్గా విశ్వాస్ను ఎందుకు ఎంపిక చేస్తారంటూ ప్రశ్నించారు. ఇక రాజ్యసభ ఎన్నికల విషయానికి వస్తే శుక్రవారం నామినేషన్ల గడువు ముగిసింది. 8 వరకూ నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఉంది. జనవరి 16న ఎన్నికలు జరగనున్నాయి. -
భాయ్.. బాలీవుడ్‌ను బతికించాడు!
ప్రతిసారీ రంజాన్‌కు కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ది ఒక సినిమా రావడం, అది సూపర్‌హిట్ అవ్వడం సర్వసాధారణం. ఈ ఏడాది జూన్‌లో, రంజాన్ సీజన్లో ‘ట్యూబ్‌లైట్’ అనే సినిమాతో వచ్చాడు సల్లూభాయ్! అయితే అది డిజాస్టర్. సల్మాన్ ఖాన్ సినిమా పరిస్థితి ఇలా అయినా మిగతా సినిమాలన్నా ఆడతాయిలే అనుకున్నారంతా! కానీ ఆ మిగతా సినిమాలూ అంతంతే ఆడాయి. దీంతో ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ డీలా పడిపోయింది. తెలుగు సినిమా ‘బాహుబలి–2’ అక్కడ డబ్ అయి పెద్ద హిట్ అవ్వడం తప్పితే, స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. ఉన్నవాటిల్లో బాగా ఆడిందంటే, ఒక్క ‘గోల్మాల్ అగైన్’ మాత్రమే! ఈ నేపథ్యంలో బాలీవుడ్‌కు 2017 బ్యాడ్ ఇయర్ అని ట్రేడ్ చెప్పుకుంటూ ఉంటే, మళ్లీ భాయే స్వయంగా వచ్చి కొత్తగా ఊపిరి పోశాడు. అదీ తన కొత్త సినిమా ‘టైగర్ జిందా హై’తో! జూన్‌లో పోతోనేమి, డిసెంబర్లో వచ్చి బాక్సాఫీస్‌ను గట్టిగానే కొల్లగొడుతున్నాడు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమా అయిన ‘టైగర్ జిందా హై’ గత శుక్రవారం విడుదలై, అందరి అంచనాలను అందుకుంటూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సల్మాన్ ఖాన్ గత చిత్రం ‘ట్యూబ్‌లైట్’ ఇండియాలో మొత్తం రన్లో 120 కోట్ల రూపాయలు వసూలు చేస్తే, ‘టైగర్ జిందా హై’ ఐదే ఐదు రోజుల్లో 173.07 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు రాబట్టింది. క్రిస్మస్ లాంగ్ వీకెండ్ సినిమాకు బాగా కలిసొచ్చింది. దీంతో వంద కోట్ల క్లబ్లో ఎక్కువ సినిమాలున్నా (12) స్టార్‌గా సల్మాన్ ఖాన్ అవతరించాడు. వీక్డేస్లోనూ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గకపోవడంతో మూడువందల కోట్ల క్లబ్‌లోనూ ‘టైగర్ జిందా హై’ చేరుతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇప్పటికే సల్మాన్ ఖాతాలో రెండు మూడు వందల కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలున్నాయి. అవి భజ్రంగీ భాయ్‌జాన్ (320.34 కోట్లు), సుల్తాన్ (300.45 కోట్లు). డబుల్ సెలెబ్రేషన్..! ఇక ‘టైగర్ జిందా హై’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూంటే, సల్మాన్‌ఖాన్ ఆనందానికి అవధుల్లేవు. ఈ జోరులోనే ఆయన తన పుట్టినరోజును (డిసెంబర్ 27) కూడా గ్రాండ్‌గా జరుపుకున్నాడు. సన్నిహితులు, ‘టైగర్ జిందా హై’ టీమ్‌తో కలిసి తన ఫామ్‌హౌస్‌లో సల్మాన్ బర్త్‌డే చేసుకున్నాడు. బర్త్‌డే సర్ప్రైజ్..! బర్త్‌డే సందర్భంగా తాను కొత్తగా చేయబోతున్న సినిమాను అనౌన్స్ చేసి, అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు సల్మాన్. ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’లతో తనకు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన అలీ అబ్బాస్ జాఫర్తోనే సల్మాన్ కొత్త సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు ‘భరత్’ అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. అతుల్ అగ్నిహోత్రి, భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా భాయ్ సెంటిమెంట్ ప్రకారం.. అభిమానులకు పండగ కానుకగా వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది. కేక్ కట్ చేస్తూ... కత్రినాతో... ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో... -
రికార్డులు తిరగరాస్తున్న 'టైగర్'.. భారీ వసూళ్లు!
ముంబై: సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'టైగర్ జిందా హై' రికార్డులు తిరగరాస్తూ.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అంచనాలకు మించి వసూళ్లు రాబడుతూ.. మూడురోజుల్లోనే వందకోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టేసింది. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మూడోరోజుల్లో రూ. 114.93 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్ సినీ చరిత్రలో అత్యధిక ప్రారంభ వసూళ్లు సాధించిన రెండో సినిమాగా 'టైగర్ జిందా హై' ఘనత సొంతం చేసుకుంది. 'బాహుబలి-2' తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. మొత్తానికి వరుస ప్లాపులతో డీలాపడిన బాలీవుడ్‌కు కొత్త జీవం నింపేలా ఈ కలెక్షన్లు ఉండటం గమనార్హం. ఈ సినిమాకు యావరేజ్ రివ్యూలు వచ్చినా.. సల్మాన్ ఛరిష్మా కారణంగా భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మౌత్‌టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తొలిరోజు శుక్రవారం రూ. 33 కోట్లు, రెండోరోజు శనివారం రూ. 34.10 కోట్లు తన ఖాతాలో వేసుకోగా.. ఆదివారం ఏకంగా 45.53 కోట్లు కలెక్ట్ చేసి.. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. నేడు క్రిస్మస్ సందర్భంగా సోమవారం కూడా సెలవు కావడంతో ఈ సినిమా ప్రారంభ వసూళ్లు మరింతగా దుమ్మురేపే అవకాశం కనిపిస్తోంది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా అన్నిచోట్ల దూసుకుపోతున్న 'టైగర్ జిందా హై' సినిమా మూడురోజుల్లో రూ. 114.93 కోట్లు వసూలుచేసిందని తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. అసాధారణరీతిలో వసూళ్లు రాబడుతున్న 'టైగర్ జిందా హై'.. ఇప్పటికే సల్మాన్ ఖాన్ సినిమా 'సుల్తాన్' రికార్డులను తిరగరాసింది. సుల్తాన్ మూడురోజుల్లో రూ. 104 కోట్లు వసూలుచేయగా.. టైగర్ అంతకుమించి రాబట్టడం గమనార్హం. సల్మాన్, కత్రినా కైఫ్ జంటగా అలీ అబ్బాస్ తెరకెక్కిన ’టైగర్ జిందా హై’ .. ఏక్ థా టైగర్ చిత్రానికి సీక్వెల్. -
బాహుబలిని ఢీకొట్టిన విక్రంవేదా.. దుమ్మురేపిన అర్జున్‌రెడ్డి, ఘాజీ!
2017లో విడుదలైన టాప్ -10 భారతీయ సినిమాల జాబితాను ప్రముఖ సినిమా సమాచార వెబ్సైట్ ఐఎండీబీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో బాహుబలి-2ను అధిగమించి తమిళ క్రైమ్ థిల్లర్ మూవీ 'విక్రమ్ వేదా' టాప్ పొజిషన్‌ను సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే, ఈ జాబితాలో మూడు తెలుగు సినిమాలు ఉండటం విశేషం. టాప్-10 ఇండియన్ సినిమాల్లో మొదటిస్థానంలో విక్రమ్ వేదా ఉండగా.. రెండో స్థానంలో రాజమౌళి వెండితెర దృశ్యకావ్యం 'బాహుబలి-2', కొత్త దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కించిన ట్రెండ్ సెట్టర్ 'అర్జున్‌రెడ్డి' మూడోస్థానంలో ఉన్నాయి. రాణా దగ్గుబాటి హీరోగా కొత్త దర్శకుడు సంకల్ప్‌రెడ్డి రూపొందించిన 'ద ఘాజీ అటాక్' సినిమా ఆరోస్థానంలో నిలిచింది. ఐఎండీబీ యూజర్లు ఇచ్చిన రేటింగ్స్, రివ్యూల ఆధారంగా ఈ టాప్-10 జాబితాను ప్రకటించింది. ఇటు ప్రేక్షకులూ, అటు విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలే ఈ జాబితాలో ఉండటం విశేషం. క్రైమ్ థిల్లర్‌గా తెరకెక్కి కోలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన 'విక్రమ్ వేదా' తొలిస్థానంలో నిలువగా, రాజమౌళి 'బాహుబలి-2' రెండోస్థానంలో నిలిచింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 సాధించిన విజయం, కలెక్షన్ల ముందు 'విక్రమ్ వేదా' విజయం చిన్నదేనని చెప్పాలి. ఇక తెలుగు ట్రెండ్‌సెట్టర్, విజయ్ దేవరకొండను సూపర్‌స్టార్‌ను చేసిన 'అర్జున్‌రెడ్డి' ఈ జాబితాలో మూడోస్థానాన్ని దక్కించుకొంది. నాలుగోస్థానంలో ఆమిర్ఖార్ తెరకెక్కించి అతిథి పాత్ర పోషించిన 'సీక్రెట్ సూపర్‌స్టార్' నిలువగా.. ఇర్ఫాన్ ఖాన్, సబా ఖామర్ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్"హిందీ మీడియం' ఐదోస్థానాన్ని దక్కించుకుంది. రాణా హీరోగా మూడు (హిందీ, తమిళం, తెలుగు) భాషల్లో విడుదలైన ఘాజీ సినిమా ఈ జాబితాలో ఆరోస్థానంలో నిలువగా.. ఇక, ఈ ఏడాది అక్షయ్ కుమార్ నటించిన రెండు సినిమాలు 'జాలీ ఎల్ఎల్బీ- 2', టాయ్‌లెట్ ఏక్ ప్రేమకథ.. ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. సామాజిక అంశాలు నేపథ్యంగా తీసుకొని తెరకెక్కిన 'టాయ్‌లెట్' ఏడో స్థానంలో నిలువగా.. కోర్టుడ్రామాగా తెరకెక్కిన జాలీ ఎల్ఎల్బీ-2 సినిమా ఎనిమిదో స్థానంలో నిలిచింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ భారీ బడ్జెట్ చిత్రం 'మెర్సల్' ఎనిమిదో స్థానంలో నిలువగా.. మమ్మూటీ, స్నేహ జంటగా తెరకెక్కిన మలయాళ మూవీ ది గ్రేట్ ఫాదర్ ఈ జాబితాలో పదోస్థానంలో నిలిచింది. తెలుగులో వెంకటేశ్ హీరోగా ఈ సినిమా రీమేక్ కానున్నట్టు తెలుస్తోంది. -
గూగుల్ సెర్చ్‌లోనూ ‘బాహుబలే’!
న్యూఢిల్లీ: ఈఏడాది ఇంటర్నెట్లో అత్యధికులు శోధించిన అంశాల్లో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి–2’ చిత్రం తొలిస్థానంలో నిలిచినట్లు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తెలిపింది. క్రికెట్‌కు సంబంధించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) రెండోస్థానంలో, ‘లైవ్ క్రికెట్ స్కోర్’ అనే పదం మూడోస్థానంలో నిలిచాయి. వెతికిన అంశాలను బట్టి వీటిని 9 కేటగిరీలుగా చేశారు. వీటితో పాటు బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ దంగల్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, బద్రీనాథ్ కీ దుల్హానియా చిత్రాలు, చాంపియన్స్ ట్రోఫీ తదితర అంశాలు టాప్–10లో ఉన్నాయి. జీఎస్టీ, బిట్‌కాయిన్, జల్లికట్టు, బీఎస్3 ప్రమాణాల గురించీ వెతికారు. ఆధార్– పాన్‌కార్డు అనుసంధానం, జియో ఫోన్ కొనడం ఎలా? హోలీ రంగుల్ని పోగొట్టుకోవడం ఎలా? అంశాలనూ శోధించారు. ఈఏడాదికి ‘సెక్సియెస్ట్ ఏషియన్ మ్యాన్’గా బాలీవుడ్ నటుడు షాహీద్ కపూర్ ఎంపికయ్యారు. -
అందరి కళ్లు బాహుబలి 2నే వెతికాయి
సాక్షి, హైదరాబాద్ : బాహుబలి -2 : ది కన్‌క్లూజన్ మరో రికార్డు సొంతం చేసుకుంది. 2017కు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో అత్యంత ఎక్కువసార్లు శోధించిన అంశంగా ముందు వరుసలో నిలిచింది. 2017 సంవత్సరంలో అత్యంత ఎక్కువగా నెటిజన్లు శోధించిన టాప్ ట్రెండింగ్ అంశాల జాబితాను గూగుల్ ప్రకటించింది. అందులో ఇప్పటికే పలు రికార్డులను బద్ధలు కొట్టి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బాహుబలి 2 తొలి స్ధానం దక్కించుకుంది. అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్), లైవ్ క్రికెట్ స్కోర్ అనేది మూడో సెర్చింగ్ వర్డ్‌గా నిలిచింది. మొత్తం మీద శోధించిన టాప్ అంశాలు, టాప్ ట్రెండింగ్ వార్తలు, టాప్ ట్రెండింగ్ ఎంటర్ ట్రైనర్స్, టాప్ ట్రెండింగ్ మూవీస్, టాప్ ట్రెండింగ్ సాంగ్స్, స్పోర్టింగ్ ఈవెంట్స్, టాప్ ట్రెండింగ్ నియర్ మి, టాప్ ట్రెండింగ్ హౌ టు, టాప్ ట్రెండింగ్ వాట్ ఈజ్ వంటి పేరిట మొత్తం తొమ్మిది అంశాలతో జాబితాను సిద్ధం చేసి గూగుల్ విడుదల చేసింది. మొత్తంగా చూసినప్పుడు బాలీవుడ్ అంశాలు, క్రీడలకు సంబంధించినవి ఉన్నట్లు కూడా వెల్లడించింది. -
ఇప్పుడు కేరళ రికార్డ్ కూడా!
ఈ రికార్డు, ఆ రికార్డు అని లేకుండా ‘బాహుబలి 2’ ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ బ్రేక్ చేసేస్తోన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్.. 50రోజులకు దగ్గరపడుతున్నా, కలెక్షన్ల వర్షం మాత్రం ఎక్కడా తగ్గించలేదు. దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మళయాలం.. ఇలా నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని రాష్ట్రాల్లో హిట్‌గా నిలిచింది. సోమవారం వరకూ ఒక్క కేరళ మినహా అంతటా ‘బాహుబలి’దే రికార్డు కాగా, నిన్నటితో అక్కడ కూడా ఈ ఫీట్ సాధించింది. మళయాల సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘పులి మురుగన్’ 70 కోట్ల మేర గ్రాస్ వసూళ్లతో ఇంతకుముందు కేరళలో టాప్ కలెక్షన్స్ పరంగా ఆ రికార్డును ‘బాహుబలి–2’ బ్రేక్ చేసింది. -
‘యాంటీ’ ముసుగు.. పైరసీ లొసుగు
♦ బాహుబలి–2 పైరసీ ముఠా నాయకుడి వ్యవహారం ఇదీ ♦ ఢిల్లీలో యాంటీ పైరసీ వింగ్ అంటూ కార్యాలయం ♦ అక్కడి నుంచే పైరసీ సినిమాల దందా, బెదిరింపులు ♦ త్వరలో సినీ రంగంతో సీసీఎస్ పోలీసుల సమావేశం సాక్షి, హైదరాబాద్: బాహుబలి–2 చిత్రాన్ని పైరసీ చేయడమే కాదు.. నిర్మాతలకు ‘సిని మా’చూపించిన ముఠా నాయకుడి స్టైలే వేరు. ఢిల్లీ కేంద్రంగా పైరసీకి వ్యతిరేకంగా పోరాడే ఏజెన్సీ ఏర్పాటు చేసి.. దాని ముసుగులోనే అనేక చిత్రాలను పైరసీ చేయడంతో పాటు విక్రయించి, నిర్మాతల్ని బెదిరించి సొమ్ము చేసుకుంటున్నాడని సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ముఠాను సోమవారం అరెస్టు చేసిన పోలీసులు.. విచారణలో అనేక కీలకాంశాలను గుర్తించారు. ప్రీతంపురలో ఆఫీస్ ఏర్పాటు చేసి.. ఢిల్లీకి చెందిన రాహుల్ మెహతా ప్రీతంపురలో కార్యాలయం ఏర్పాటు చేసి.. జితేందర్కుమా ర్ మెహతా, తౌఫీఖ్, మహ్మద్ అలీతో పాటు మరికొందరిని ఉద్యోగులుగా తీసుకున్నాడు. తమది సినిమా పైరసీకి వ్యతిరేకంగా పనిచేసే యాంటీ పైరసీ వింగ్ అని ప్రచారం చేసుకు న్నాడు. దీని ముసుగులోనే కొత్త చిత్రాల పైరసీని ప్రోత్సహించడం ప్రారంభించాడు. యాంటీ పైరసీ వింగ్ కావడంతో బాలీవుడ్‌తో నూ పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యం లోనే బాహుబలి–2 పైరసీ సీడీ చేతికి వచ్చిన వెంటనే రాహుల్ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌నే సంప్రదించగలిగాడు. ఎక్కడా నేరుగా పాల్గొనడు.. పైరసీ సినిమాల విక్రయం, ఆ సీడీలు చూపిం చి నిర్మాతల్ని బెదిరించి డబ్బు గుంజడంతో దిట్టగా పేరున్న రాహుల్ మెహతా ఏ సంద ర్భంలోనూ నేరుగా పైరసీ చేయడు. తన అను చరులతో చేయించడమో, పైరసీ సీడీలను చేజిక్కించుకుని దందాలకు దిగడమో చేస్తుం టాడు. 2015లో బాహుబలి చిత్రాన్ని సైతం ఈ ముఠా పైరసీ చేసింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ కేంద్రంగా తన అనుచరులతో ఈ పని చేయించి.. నెట్లో పెట్టి సొమ్ము చేసుకు న్నాడు. అయితే బాహుబలి–2 పైరసీ ఎలా చేశారనే విషయాన్ని రాహుల్ పట్టించుకోలే దు. సీడీ తన చేతికి రాగానే బేరసారాలకు దిగాడు. పటిష్ట సెక్షన్ల కింద కేసు నమోదు.. సాధారణంగా పైరసీకి సంబంధించి కాపీ రైట్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. దీంతో నిందితులు తేలిగ్గా బెయిల్ పొంది బయటకు వస్తున్నారు. దీన్నే ఆసరాగా చేసుకున్న రాహు ల్ గ్యాంగ్ దాదాపు 30 హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలను పైరసీ చేసింది. దీన్ని గమనించిన సీసీఎస్ పోలీసులు.. బాహు బలి–2 ఉదంతంలో డిస్ట్రిబ్యూటర్ను మోసం చేయడం, అంతా కలసి కుట్రపన్నడం, నిర్మాతలను బెదిరించడం.. ఎపిసోడ్లను పరిగణనలోకి తీసుకుని ఆయా సెక్షన్లనూ జోడించి కేసు నమోదు చేశారు. దీంతో నిందితులకు తేలిగ్గా బెయిల్ లభించదని, నేరం నిరూపణ అయితే ఎక్కువకాలం శిక్ష పడుతుందని అధికారులు చెప్తున్నారు. -
‘బాహుబలి 2’కి ఎ సర్టిఫికెట్!
అవును.. ఇది జోక్ కాదు.. నిజం... ‘బాహుబలి 2’కి సెన్సార్ బోర్డ్ ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఆల్రెడీ సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఏప్రిల్ 28న సినిమా కూడా విడుదలైంది. ఇప్పుడు సర్టిఫికెట్ జారీ చేయడ మేంటి అనుకుంటున్నారా? మరదే ట్విస్ట్. ఈ సర్టిఫికెట్ ఇక్కడిది కాదు. సింగపూర్ సెన్సార్ బోర్డు ఇచ్చినది. ఈ చిత్రంలో మితిమీరిన హింస, రక్తపాతం ఉందని భావించి, సింగపూర్ సెన్సార్ బోర్డ్‌వారు ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేశారు. భారత్‌లో ‘బాహుబలి 2’ చిత్రాన్ని పిల్లలు చూసి భలే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, సింగపూర్ పిల్లలకు మాత్రం ఈ సినిమా చూసే ఛాన్స్ లేకుండా పోయింది. త్వరలో అక్కడ ఈ చిత్రం విడుదల కానుంది. -
డబ్బులిస్తారా.. నెట్లో పెట్టమంటారా!
► బాహుబలి నిర్మాతలకే బెదిరింపు ►బ బరి తెగించిన పైరసీ ముఠా ► ఆరుగురిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: బాహుబలి–2 చిత్రాన్ని పైరసీ చేసిన అంతర్రాష్ట్ర ముఠా నేరుగా హైదరాబాద్‌కు వచ్చి నిర్మాతలతో బేరసారాలకు దిగింది. ఢిల్లీ, బిహార్ కేంద్రాలుగా జరిగిన ఈ వ్యవహారం గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి మంగళవారం వెల్లడించారు. ఇదీ సినిమా ప్రదర్శితమయ్యే విధానం.. చిత్ర నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్మాతలు దాన్ని సాఫ్ట్‌కాపీ రూపంలోకి మారుస్తారు. దీన్ని బ్రాడ్కాస్టర్లకు అందించడంతో వారి సర్వర్‌లో నిక్షి ప్తంచేస్తారు. ఈ బ్రాడ్కాస్టర్లు సినిమా సాఫ్ట్‌కాపీని ఎన్క్రిప్షన్లోకి (కోడ్ లాంగ్వేజ్) మార్చేస్తారు. దీన్ని డీక్రిప్షన్కు (సాధారణ చిత్రరూపం) చేసే ‘కీ’ నిర్మా తలకు అందిస్తారు. ఈ ‘కీ’ని వాడుకునే థియేటర్ల యాజమాన్యాలు చిత్రాన్ని ప్రదర్శిస్తాయి. చిన్న లోపం పసిగట్టిన పాత ఉద్యోగి.. బాహుబలి–2 నిర్మాతలు ఆరుగురు బ్రాడ్కాస్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీటిలో యూఎండబ్ల్యూ డిజిటల్ సర్వీసెస్ ఒకటి. గతంలో ఈ సంస్థలో మోను అలియాస్ అంకిత్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. థియేటర్లోని సర్వర్‌లో సినిమా కాపీ అవుతుందని తెలుసుకున్నాడు. దీంతో బాహుబలి–2కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని బిహార్‌కు చెందిన దివాకర్‌ను సంప్రదించాడు. అతడి థియేటర్లోనే సర్వర్‌కు ఓ ల్యాప్‌టాప్ అనుసంధానించి చిత్రానికి సంబం ధించిన హెచ్డీ ప్రింట్‌ను వాటర్‌మార్క్‌తో పాటు కాపీ చేశాడు. ఈ కాపీని వినియోగించి వీలున్నంత సంపాదించడానికి పట్నాకు చెందిన చందన్‌కు సమాచారం ఇచ్చాడు. పాత ముఠాతో జతకట్టిన చందన్.. 2015లో విడుదలైన బాహుబలి చిత్రం సైతం పైరసీకి గురైంది. నిర్మాతల ఫిర్యాదు మేరకు దీనికి సంబంధించి మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో కేసు నమోదైంది. అప్పట్లో పోలీసులు ఢిల్లీకి చెందిన రాహుల్ మెహతాతో పాటు అతడి అనుచరులు జితేందర్‌కుమార్ మెహతా, తౌఫీఖ్, మహ్మద్ అలీల్ని అరెస్టు చేశారు. వీరి ద్వారానే బాహుబలి–2 కాపీని కూడా క్యాష్ చేసుకోవాలని భావించిన చందన్ విషయం వారికి చెప్పాడు. దీంతో రాహుల్ రంగంలోకి దిగాడు. వారానికి రూ.15 లక్షల చొప్పున డిమాండ్.. హైదరాబాద్ వచ్చిన రాహుల్ నిర్మాతలైన ఆర్కా మీడియాను సంప్రదించాడు. తన వద్ద చిత్రం హెచ్డీ ప్రింట్ ఉందని.. సినిమా ప్రదర్శితమైనన్ని రోజులూ వారానికి రూ.15 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఏ వారానికి చెల్లించకపోయినా వెంటనే ఇంటర్నెట్లో పెట్టేస్తానంటూ బెదిరించాడు. దీనిపై ఫిర్యాదును అందుకున్న ఇన్స్పెక్టర్ చాంద్‌భాష నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసి మూలాలు కనుగొంది. ఢిల్లీ, బిహార్‌ల్లో వరుసదాడులు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు రాహుల్, జితేందర్, తౌఫీఖ్, అలీ, దివాకర్, చందన్‌లను అరెస్టు చేశారు. గతంలోనే అనేక సినిమాల పైరసీ ఈ ముఠా అనేక బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలను పైరసీ చేసింది. ఢిల్లీలో పట్టుకున్న రాహుల్, జితేందర్, తౌఫీఖ్, అలీలను న్యాయస్థానం ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసి హైదరాబాద్ వెళ్లి పోలీసుల ఎదుట హాజరవ్వాల్సిందిగా ఆదేశించింది. మిగిలిన ఇద్దరినీ బిహార్ నుంచి తీసుకువస్తున్నాం. పరారీలో ఉన్న మోను కోసం గాలిస్తున్నాం. – అవినాష్ మహంతి, సీసీఎస్ డీసీపీ -
‘బాహుబలి’తో మార్కెట్ పెరుగుతుందని..
– విజయేంద్రప్రసాద్ ‘‘బాహుబలి’ విడుదల తర్వాత రెండు ప్రశ్నలు నన్ను వెంటాడాయి. ఒకటి –‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని’. ‘బాహుబలి–2’తో ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. రెండోది – ‘శ్రీవల్లీ’ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేద్దామని’. చాలా రోజులుగా ఈ చిత్రబృందం రెండో ప్రశ్న అడుగుతున్నారు. ‘బాహుబలి–2’ తర్వాత ‘శ్రీవల్లీ’ విడుదల చేస్తే మార్కెట్ పెరుగుతుందనే ఆలోచనతో వెయిట్ చేశాం. జూన్‌లో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు విజయేంద్రప్రసాద్. ఆయన దర్శకత్వంలో రజత్, నేహా హింగే జంటగా సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన చిత్రం ‘శ్రీవల్లీ’. మంగళవారం హైదరాబాద్‌లో ‘శ్రీవల్లీ’ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ‘‘ఇది ఎరోటిక్ థ్రిల్లర్ మూవీ. మనసును కొలవగలిగితే, చూడగలిగితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది’’ అని విజయేంద్రప్రసాద్ చెప్పారు. ‘‘మా ధైర్యం, బలం అన్నీ విజయేంద్రప్రసాద్‌గారే. ఆయన కథ, దర్శకత్వంపై నమ్మకంతో మూడు భాషల్లో ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు నిర్మాతలు. -
బాహుబలి 2 నిర్మాతకు బెదిరింపు ఈమెయిల్
హైదరాబాద్: భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘బాహుబలి 2’ చరిత్ర సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే బాహుబలి 2ని పైరసీ భూతం వదల్లేదు. తాజాగా బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డకు ఓ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. బీహార్ రాజధాని పాట్నా నుంచి ఓపైరసీ గ్యాంగ్ రూ. రెండుకోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేకపోతే హెచ్డీ సినిమాని ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేస్తామని బెదిరించింది. అయితే దీనిపై వెంటనే స్పందించిన యార్లగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మఫ్టీలో వెళ్లిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నేడు కోర్టులో హాజరు పరచనున్నారు. -
‘ప్రభాస్ కంటే ఆమెకు ఎక్కువ పేరు వచ్చేది’
హైదరాబాద్: హీరోయిన్ శ్రీదేవి ‘బాహుబలి 2’ అవకాశం వదులుకోవడం పట్ల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో నటించివుంటే ప్రభాస్ కంటే ఆమెకు ఎక్కువ పేరు వచ్చేదని అభిప్రాయపడ్డాడు. ‘బాహుబలి 2లో శ్రీదేవి నటించకపోడం నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. ఆమె కెరీర్లో అత్యద్భుతమైన ఈ చిత్రం కూడా చేరివుంటే బాగుండేది. బాహుబలి 2 సినిమాలో శ్రీదేవి బోనికపూర్ నటించివుంటే ప్రభాస్ కంటే ఎక్కువ క్రెడిట్ ఆమెకు దక్కేది. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా తర్వాత ఆమె నటించిన చిత్రం ఇదే అయ్యేద’ని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. బాహుబలి సినిమాలో నటించే అవకాశాన్ని శ్రీదేవి వదులుకున్నట్టు అంతకుముందు వార్తలు వచ్చాయి. రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవి సంప్రదించారని, రెమ్యునరేషన్ ఎక్కువ అడగడంతో నిర్మాతలు వెనక్కు తగ్గినట్టు గుసగుసలు వినిపించాయి. బాహుబలి సిరీస్ రికార్డు విజయంతో దీనికి సంబంధించిన ప్రతి విషయం ప్రేక్షకులకు ఆసక్తి గొల్పుతోంది. ఇప్పటికే రూ. 1000 కోట్ల వసూళ్లు సాధించిన ‘బాహుబలి 2’ రూ.1500 కోట్ల మైలురాయిని అందుకునే దిశగా దూసుకెళ్తోంది. -
థౌజండ్‌వాలా..
1,000 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా బాహుబలి–2 రికార్డు 10 రోజుల్లోనే ఘనత ప్రచారంలో సరికొత్త పుంతలు బీబీసీలో ప్రత్యేక కథనం బాహుబలిగా నన్ను ఎంచుకుని ‘వన్స్ ఇన్ ఏ లైఫ్‌టైం’ పాత్రను ఇచ్చినందుకు రాజమౌళికి కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరించినందుకు నా అభిమానులకు, ప్రేక్షకులకు రుణపడి ఉంటా. కేవలం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ చిత్రానికి ఇంత ఆదరణ లభించడం చాలా ఆనందంగా ఉంది. – ప్రభాస్ సాక్షి, హైదరాబాద్ 2017 మే 7... 105 సంవత్సరాల చరిత్ర గల భారత సినిమా సింహాసనంపై తెలుగు సినిమా కూర్చున్న రోజు. ఖాన్లు, కపూర్లు, బచ్చన్‌లకే సాధ్యంకాని రూ.1,000 కోట్ల వసూళ్లను (అన్ని భాషల్లో కలిపి) మన తెలుగు సినిమా బాహుబలి–2 కేవలం పది రోజుల్లోనే సాధించేసింది. ఈ విషయాన్ని ‘బాహుబలి’అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ధ్రువీకరించారు. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ చిత్రరాజం వసూళ్ల ప్రభంజనం ప్రారంభమైంది. మొదటిరోజు దేశంలోని 29 రాష్ట్రాల్లో బాహుబలివే రికార్డు వసూళ్లు(తమిళనాడులో మార్నింగ్ షోలు పడకపోవడంతో అక్కడ రికార్డు రాలేదు). రాజమౌళి కల, ప్రభాస్, రానా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల కష్టం, నిర్మాతల ధైర్యానికి భారతీయ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రారంభమే ప్రభంజనం! బాహుబలి ప్రారంభమయ్యే నాటికి తెలుగు సినిమా మార్కెట్ రూ.50–70 కోట్లు మాత్రమే. అలాంటిది రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఓ ప్రాంతీయ సినిమా నిర్మాణం అంటే అందరూ నోరెళ్లబెట్టారు. మొదలైన రోజు నుంచే సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. మొదటి భాగం విడుదలయ్యే నాటికి ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. వాటన్నిటిని అందుకుంటూ మొదటి భాగమే అద్భుత విజయం సాధించింది. ఆ స్థాయి విజయాన్ని అసలు ఊహించనే లేదని చిత్రబృందం అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చింది. మొదటి భాగం విడిచిపెట్టిన ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’అనే ప్రశ్న రెండేళ్ల పాటు ప్రేక్షకులను రెండో భాగంపై ఆసక్తిని మరింత పెంచింది. రెండో భాగం విడుదలయ్యే నాటికే ఈ చిత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని తెలిసినా రూ.1,000 కోట్ల క్లబ్లో చేరుతుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ పది రోజుల్లోనే బాహుబలి ‘మ్యాజిక్ ఫిగర్’ను చేరింది. సమీప భవిష్యత్తులో మరే చిత్రం అందుకోలేని రికార్డులను బాహుబలి సృష్టిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టింది. మొదటి వారాంతానికే 10 మిలియన్ డాలర్లను కొల్లగొట్టిన బాహుబలి, ఆ తర్వాత మూడు రోజులకే దంగల్(12.36 మిలియన్లు)ను దాటేసింది. ఈ శనివారానికి బాహుబలి 15.2 మిలియన్లను దాటింది. లాంగ్ రన్లో 20 మిలియన్ల మార్కును అందుకుంటుందని అంచనా. ఆదివారం హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద ప్రభాస్ అభిమానుల ‘వెయ్యి కోట్ల’ సంబరాలు ప్రచారంలో సరికొత్త అధ్యాయం సినిమా ప్రచారంలో బాహుబలి కొత్త అధ్యాయానికి తెరతీసింది. ఆదాయానికి వీలున్న ఏ విభాగాన్నీ నిర్మాతలు వదిలిపెట్టలేదు. వర్చువల్ రియాలిటీ, టీవీ, యానిమేటెడ్ సిరీస్, బాహుబలి ఉత్పత్తులు, నవలలు, కామిక్ పుస్తకాలు ఇలా ప్రతి రంగంలోకి బాహుబలి ప్రవేశించింది. మొదటి భాగం ప్రారంభమైన నాటి నుంచి నటీనటుల పుట్టినరోజులకు టీజర్లు, మేకింగ్ వీడియోలు, పరీక్షలకు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియోలు, కామెడీ స్కిట్లు ఇలా కనీసం నెలకొక్క విషయమైనా వార్తల్లో ఉంటూ ప్రజల్లో ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. మొదటి భాగం విడుదల సమయంలో పాత్రల పరిచయం అంటూ మూడు రోజులకో పోస్టర్ వదలడం కూడా భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి. ఇక రెండో భాగం విషయానికి వస్తే సినిమా కంటే ఇతర అంశాలే ఎక్కువగా వార్తల్లో నిలిచాయి. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘ద రైజ్ ఆఫ్ శివగామి’పుస్తకం అమెజాన్ బెస్ట్ సెల్లర్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఓ సినిమాకు ఎలా ప్రచారం చేయాలో రాజమౌళిని చూసే నేర్చుకోవాలంటూ ఎంతో మంది కితాబిచ్చారు. బాహుబలిపై బీబీసీ కథనం.. ఈ సినిమాకు లభిస్తున్న ప్రశంసలన్నీ ఓ ఎత్తయితే, దీనిపై ప్రతిష్టాత్మక బీబీసీ చానెల్లో కథనం రావడం మరో ఎత్తు. భారతీయ సినిమా రికార్డులన్నీ ఈ చిత్రం బద్దలుగొట్టిందని, అమెరికాలో ఈ వారం విడుదలైన అన్ని చిత్రాల్లో(హాలీవుడ్ సహా) బాహుబలి వసూళ్ల పరంగా మూడో స్థానంలో నిలిచిందని ఈ కథనంలో తెలిపారు. ఇందుకోసం వారు రాజమౌళి, అనుష్కను ఇంటర్వూ్య చేశారు. బాలీవుడ్ ప్రముఖుల శీతకన్ను... తమ సినిమాలు, సహచర నటుల సినిమాలు, అవార్డులు వచ్చినప్పుడు విపరీతంగా స్పందించే బాలీవుడ్ ప్రముఖులు బాహుబలిపై అస్సలు స్పందించలేదు. పెద్ద హీరోలైన ఖాన్ త్రయం ఆమిర్, షారుక్, సల్మాన్‌లు స్పందించకపోగా.. ద్వితీయ శ్రేణి హీరోలైన హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ వంటి హీరోలు కూడా నోరెత్తడం లేదు. వరుణ్ ధావన్, కరణ్ జోహార్, శేఖర్ కపూర్ వంటి ప్రముఖులు మాత్రం బాహుబలిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. మరిన్ని భాషల్లోకి... తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ‘బాహుబలి–2’విడుదలైన విషయం తెలిసిందే. మరికొన్ని భాషల్లోకి ఈ చిత్రం అనువాదం అయ్యే అవకాశం ఉంది. ‘‘బాహుబలి సినిమాను మొదట చైనీస్ భాషలోకి అనువదించాలనుకుంటున్నాం. చైనీస్ మార్కెట్‌ను అంచనా వేసి, స్క్రీన్స్‌ను నిర్ణయిస్తాం. ఆ తర్వాత జపనీస్, కొరియన్, తైవాన్ భాషల్లో అనువదించాలనే ఆలోచన ఉంది. అక్కడ కూడా ప్రేక్షకులు ‘బాహుబలి’సినిమాను ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నాం’’అని ‘బాహుబలి’నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ఓ ప్రకటనలో తెలిపారు. చరిత్ర సృష్టిస్తుందని ఊహించలేదు.. ‘బాహుబలి విజయం సాధిస్తుందనే అనుకున్నాను కానీ, చరిత్ర సృష్టిస్తుందని ఊహించలేదు. ప్రస్తుతం బాహుబలి విజయం అందించిన ఆనందంలో ఉన్నాను. రికార్డులున్నవి బద్దలు కొట్టడానికే. ఈ రికార్డు కూడా ఎప్పుడైనా బద్దలు కావచ్చు. బాహుబలి తెలుగు సినిమా హద్దులను చెరిపేసింది’– విజయేంద్ర ప్రసాద్, కథా రచయత అతి పెద్ద మైలురాయి.. ‘భారతీయ సినిమా చరిత్రలో అతి పెద్ద మైలురాయిని అతి పెద్ద చిత్రం సాధించింది’ – కరణ్ జోహార్, ప్రముఖ హిందీ దర్శక నిర్మాత మైలురాయి చేరుకున్నందుకు అభినందనలు ‘భారతీయ సినిమా చరిత్రలోనే తొలిసారి రూ.1,000 కోట్ల మార్కు అందుకున్నందుకు రాజమౌళి, ప్రభాస్, చిత్ర బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు’– పవన్ కల్యాణ్ ఊహించనిది నిజమైంది.. ‘అస్సలు ఊహకే అందనిది నిజమైంది. తెలుగు సినిమా పరిశ్రమను తలెత్తుకునేలా చేసినందుకు రాజమౌళి, అతని బృందానికి అభినందనలు’– మహేశ్ బాబు -
బాహుబలి 2 చూసి 3రోజులైనా.. : దేవీశ్రీ ప్రసాద్
హైదరాబాద్ : బాహుబలి 2 చూసి ఇప్పటికే మూడు రోజులవుతుంది.. సినిమా పూర్తయిన తర్వాత థియేటర్ నుంచి అయితే బయటికి రాగలిగాను గానీ, బాహులి సినిమా నుంచి మాత్రం ఇంకా బయటకు రాలేకపోతున్నానని సంగీత దర్శకుడు దేశ్రీ ప్రసాద్ ట్విటర్లో పేర్కొన్నారు. బాహుబలి2 అనేది కేవలం భారీ వ్యయంతో నిర్మించిన చిత్రం మాత్రమే కాదు, పెద్ద కలలు నెరవేరాలంటే ఎక్కువ కష్టపడాలి. అప్పుడే ఎలాంటి సందేహం లేకుండా లక్ష్యాన్ని సాధిస్తావు. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అనేది అసలు మ్యాటరే కాదని దేవీ తెలిపారు. అద్భుతమైన స్టోరీ లైన్ , ఉత్కంఠను పెంచే స్రీన్ ప్లే, ఒళ్లు గగుర్పొడిచే విజువల్స్, దిమ్మతిరిగే నటన అంటూ సినిమా పై ప్రశంసల ఝల్లు కురిపించారు. తాను అనుకున్నట్టుగా సినిమాను అందమైన శిల్పంలా చెక్కిన దర్శకుడు జక్కన్న పర్ఫెక్షన్.. సినిమా చూస్తున్నంతసేపు సీట్ ఎడ్జ్‌లో కూర్చునేలా చేశాయని తన అనుభూతిని వ్యక్తం చేశారు. వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్, లొకేషన్స్, బడ్జెట్‌ను పక్కన పెడితే బాహుబలి సినిమా తనను మంత్రముగ్ధున్ని చేసిందని పేర్కొన్నారు. ఎన్నిసార్లు అరుస్తూ, క్లాప్స్ కొట్టానో నాకే తెలియదు. కనీసం ఇలాంటి కలను కనాలనే సాహసం కూడా చాలా మంది చేయలేరు, హ్యాట్సాఫ్ రాజమౌళి సర్ అంటూ ఓ నోట్‌ను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీనికి రాజమౌళి థ్యాంక్స్ అంటూ రీప్లే ఇచ్చారు. ఒక ప్రాంతీయ చిత్రం వంద కోట్ల వసూళ్లు సాధించటమే కష్టంగా ఉన్న సమయంలో 1000 కోట్లు వసూళ్లు చేసిన తొలి చిత్రంగా బాహుబలి2 రికార్డు సృష్టించింది. -
బాహుబలి 2 : 1000 కోట్ల క్లబ్లో తొలి భారతీయ సినిమా
గత శుక్రవారం(28 ఏప్రిల్) రిలీజ్ అయిన బాహుబలి 2, ఇప్పటికీ కాసుల పంట పండిస్తోంది. విడుదలైన అన్ని చోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే అన్ని రికార్డ్ లను బద్దలు కొట్టి ఇండియాస్ బిగెస్ట్ బాక్ల్ బస్టర్ గా నిలిచిన బాహుబలి 2, ఇప్పుడు సరికొత్త రికార్డ్ లను నెలకొల్పే దిశగా దూసుకుపోతుంది. ఈ ఆదివారం ఉదయానికి వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర తీసింది. ఒక ప్రాంతీయ చిత్రం వంద కోట్ల వసూళ్లు సాధించటమే కష్టంగా ఉన్న సమయంలో 1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డ్ సృష్టించింది బాహుబలి. శని, ఆదివారాల్లో కలెక్షన్లో ఊపందుకోవటంతో అనుకున్న సమయం కన్నా ముందే బాహుబలి 2 ఈ రికార్డ్ ను అందుకుంది. అంతేకాదు నార్త్ అమెరికా వంద కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగానూ బాహుబలి రికార్డ్ సృష్టించింది. ట్రెడ్ ఎనలిస్ట్ అంచనాలను తలకిందులు చేస్తూ దూసుకుపోతున్న బాహుబలి ఫుల్ రన్ లో 1500 కోట్ల వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు. The UNTHINKABLE has happened: #Baahubali2 is the FIRST INDIAN FILM to cross ₹ 100 cr in NORTH AMERICA on Sat. ALL RECORDS SHATTERED @Rentrak — taran adarsh (@taran_adarsh) May 7, 2017 This poster says it all... #Baahubali2 is the JEWEL of INDIAN CINEMA... pic.twitter.com/QURPnhFznz — taran adarsh (@taran_adarsh) May 7, 2017 ₹ 300 cr Club and its members...#PK [2014]#BajrangiBhaijaan [2015]#Sultan [2016]#Dangal [2016]#Baahubali2 [2017] Nett. HINDI. India biz — taran adarsh (@taran_adarsh) May 7, 2017 #Baahubali2 RECORDS... Crossed ₹ 50 cr: Day 2 ₹ 100 cr: Day 3 ₹ 150 cr: Day 4 ₹ 200 cr: Day 6 ₹ 250 cr: Day 8 ₹ 300 cr: Day 10 Nett... HINDI — taran adarsh (@taran_adarsh) May 7, 2017 #Baahubali2 packs a SOLID ₹ 25 cr + on Sat... Creates a new record: FASTEST to reach ₹ 300 cr Club [Day 10]... Nett biz. HINDI. India biz. — taran adarsh (@taran_adarsh) May 7, 2017 -
బాహుబలి–2కు రూ.200 కోట్ల బీమా!
‘బాహుబలి–2’ సినిమాకి రూ.200 కోట్లమేర నిర్మాతలు బీమా చేయించారు. ప్రైవేట్ రంగ ఫ్యూచర్ జెనరాలి ఇన్సూరెన్స్ కంపెనీ తన ఫిల్మ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఈ కవరేజ్‌ను ఆఫర్ చేసింది. సినిమా ప్రి–ప్రొడక్షన్, పోస్ట్–ప్రొడక్షన్ సమయంలో అనుకోని ప్రమాదాల వల్ల సంభవించే నష్టాలన్నింటినీ ఈ కవరేజ్ భర్తీచేస్తుందని ఫ్యూచర్ జెనరాలి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. సినిమాలోని నటీనటులు మరణించడం, అనారోగ్యానికి గురవడం సహా సహజసిద్ధంగా లేదా ప్రమాదవశాత్తు అనుకోని విధంగా షూటింగ్‌కు అంతరాయం కలిగించే అంశాలన్నింటికీ ఈ పాలసీ వర్తిస్తుంది. షూటింగ్ సమయంలో పరికరాలకు డ్యామేజ్ జరిగితే దాన్ని కూడా పాలసీ కవర్ చేస్తుంది. -
‘బాహుబలి-2’ మీకు నచ్చలేదా? అయితే..!
సినీ పండితులు ముందే చెప్పారు. అభిమానులు ఎప్పుడో ఊహించారు. అంతా అనుకున్నట్టుగానే భారీ అంచనాలతో విడుదలైన ‘బాహుబలి-2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తున్నది. ఇప్పటికే రూ. 500 కోట్ల క్లబ్బులో చేరిన ఈ సినిమా భారత సినీ చరిత్రలో వెయ్యికోట్ల క్లబ్బులో చేరిన తొలి సినిమాగా రికార్డు సృష్టించిన ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు సినీ పండితులు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా కొంతమందికి ‘బాహుబలి-2’ సినిమా నచ్చి ఉండకపోవచ్చు. అలా ఈ సినిమా నచ్చనివారు ఎవరైనా ఉంటే వారికోసం దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన స్టైల్ ముందుకొచ్చారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వర్మ ‘బాహుబలి-2’ సినిమాను మాత్రం ప్రశంసలతో ఆకాశానికెత్తేశారు. ఈ నేపథ్యంలోనే ‘ఎవరికైనా ‘బాహుబలి-2’ సినిమా నచ్చకపోతే వారిని చూసి నేను బాధపడతాను. వారికి మానసిక వైద్యుడి సాయం అవసరముంది. అలాంటి వారి డాక్టర్ బిల్లు స్వచ్ఛంద సేవ కింద నిర్మాత శోభూ భరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని వర్మ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ప్రేక్షకులు ‘బాహుబలి-2’ ఆదరిస్తున్న పరిస్థితిని చూస్తుంటే.. ఈ సినిమా చూడటానికి అరుణగ్రహం నుంచి గ్రహాంతరవాసులు స్పేస్‌షిప్‌లో భూమికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ తనదైన స్టైల్లో పేర్కొన్నారు. Be sad on person who disliked #Baahubali2 as he/her needs psychiatric help nd I request producer @Shobu_ in to pay doctor bill for charity — Ram Gopal Varma (@RGVzoomin) 29 April 2017 -
ఆమ్రపాలి ’బాహుబలి’ కలెక్షన్స్
-
బాహు బలమెంత
-
కట్టప్పా... టికెట్లు ఎక్కడప్పా !
♦ బ్లాక్‌లో ‘బాహుబలి–2’ టికెట్లు ♦ ఇద్దరు ప్రజాప్రతినిధులే సూత్రధారులు ♦ తొలి వారంలో రూ.300కోట్ల దోపిడీకి పన్నాగం ♦ థియేటర్ల వద్ద టికెట్లు నిల్... బ్లాక్‌లో ఫుల్ ♦ చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం సాక్షి, అమరావతిబ్యూరో : ‘బాహుబలి–2’ బ్లాక్ టికెట్ల దందా బాక్సాఫీస్ రికార్డు బద్దలు కొడుతోంది. అధికారిక కలెక్షన్ల సంగతేమో గానీ... విజయవాడకు చెందిన ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధుల బ్లాక్ దందాలో మాత్రం కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ‘బాహుబలి–2’పై వ్యామోహాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దల సన్నిహిత నిర్మాత ఒకరు రంగంలోకి దిగారు. అమరావతి పరిధిలో బ్లాక్ టికెట్ల దందా బాధ్యతను ఆయన విజయవాడకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులకు అప్పగించారు. వీరిద్దరూ దశాబ్దాల క్రితం బ్లాక్ టికెట్ దందాలో సన్నిహితంగా మెలిగిన వారే కావడం విశేషం. వీరిలోఒకరు ప్రస్తుతం వివాదాస్పద రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. మరొకరు కాల్‌మనీ రాకెట్‌కు సూత్రధారిగా ఉన్నారు. బ్లాక్ టికెట్ల దందా గురించి పూర్తిగా తెలిసిన ఇద్దరు నేతలు మళ్లీ ‘బాహుబలి–2’తో జూలువిదిల్చారు. తమ వర్గీయుల ద్వారా టికెట్ల ధరలను అమాంతం పెంచేసి బ్లాక్ దందాకు తెగించారు. అమరావతి ఆ ఇద్దరిదే... ఆకాశాన్ని తాకుతున్న ‘బాహుబలి–2’ వ్యామోహం విజయవాడలోని ఇద్దరు ప్రజాప్రతినిధులకు తమ గతం గుర్తుకు వచ్చింది. వెంటనే కలిసి కట్టుగా రంగంలోకి దిగారు. అయితే అప్పటికే అమరావతితోపాటు వైజాగ్, సీడెడ్, కర్ణాటకలోని అన్ని థియేటర్లను ప్రభుత్వ పెద్దల సన్నిహితుడైన ఒక నిర్మాత తన గుప్పెట్లో పెట్టుకున్నారు. ఆయన్ను కలిసి అమరావతి పరిధిలోని థియేటర్లను తమకు విడిచిపెట్టాలని విజయవాడకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు మంతనాలు జరిపారు. మరోవైపు మూడు, నాలుగు ప్రాంతాల్లో టికెట్ల విక్రయాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం కష్టమని ఆ నిర్మాత భావించారు. అందుకే అమరావతి వరకు 50:50 నిష్పత్తిలో బ్లాక్ టికెట్ల దందాను పంచుకునేలా వారిద్దరితో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. ఒక్కో టికెట్ రూ.2వేల నుంచి రూ.3వేలు! ఇద్దరు ప్రజాప్రతినిధులు స్వయంగా రంగంలోకి దిగడంతో ‘బాహుబలి’ టికెట్ బ్లాక్ మార్కెట్ దందాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. తమకు అమరావతిలో బ్లాక్ దందా అప్పగించిన నిర్మాతతో కుదిరిన ఒప్పందానికి మించి టికెట్ల రేట్లు పెంచేయడం గమనార్హం. అధికారిక టికెట్ రేట్లతో నిమిత్తం లేకుండా అమరావతి పరిధిలోని 335 స్క్రీన్లలో రెండు దశల్లో బ్లాక్ దందా చేస్తున్నారు. మొదటి దశలో గురువారం రాత్రి రెండు బెనిఫిట్ షోలతోపాటు శుక్ర, శని, ఆదివారాల్లో అన్ని షోల టికెట్ల ధరను అమాంతం పెంచేశారు. బెనిఫిట్ షో టికెట్ ధరను సాధారణ థియేటర్లలో రూ.వెయ్యి నుంచి రూ.1,500 చొప్పున నిర్ణయించారు. మల్టీ ఫ్లెక్స్‌లలో రూ.2వేల నుంచి రూ.3వేల చొప్పున విక్రయించారు. ఇక శుక్ర, శని, ఆదివారాలకు సంబంధించి సాధారణ థియేటర్లలో ఒక్కో టికెట్ ధర రూ.500 నుంచి రూ.వెయ్యి, మల్టీప్లెక్స్‌లలో రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు నిర్ణయించారు. రెండో దశ టికెట్లు రేపటి నుంచి విక్రయం ! రెండో దశలో సోమవారం నుంచి వచ్చే ఆదివారం వరకు టికెట్లు బ్లాక్ చేశారు. వాటి విక్రయాలు శనివారం నుంచి ప్రారంభిస్తారని తెలుస్తోంది. మొదటి రెండురోజుల్లో సినిమాపై క్రేజ్‌ను అంచనా వేసి అప్పుడు టికెట్ ధరలు నిర్ణయించాలని భావిస్తున్నారు. మొదటి దశలో నిర్ణయించిన రేట్లకు తగ్గకుండా చూడాలన్నది వారి వ్యూహమని తెలిసింది. అమరావతి పరిధిలో మొదటి వారంలో రూ.241.50కోట్లు బ్లాక్ దందాలో కొల్లగొట్టాలని భావిస్తున్నారు. సదరు నిర్మాతతో కుదిరిన ఒప్పందం మేరకు అనుకున్న బ్లాక్ టికెట్ల రేట్లను ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులు మరో 25శాతం పెంచారు. తద్వారా మరో రూ.60కోట్లు అదనంగా జేబుల్లో వేసుకోవాలన్నది వారి పన్నాగం. పత్తాలేని అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధుల అండతో దాదాపు అన్ని టికెట్లు బ్లాక్‌లోనే విక్రయిస్తున్నారు. థియేటర్ల వద్ద లైనులో నిలుచున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. ఆన్‌లైన్‌లోనూ టికెట్లు అందుబాటులో లేకుండాపోయాయి. థియేటర్ల వద్దే ప్రజాప్రతినిధుల అనుచర బృందాలు దర్జాగా బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తుండటం గమనార్హం. పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటమే లేదు. విజయవాడ, గుంటూరులలో కొన్ని విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. క్రిమినల్ కేసులు బుక్ చేయండి : కలెక్టర్ విజయవాడ : బాహుబలి–2 సినిమా టికెట్లను బ్లాక్‌లో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి. లక్ష్మీకాంతం గురువారం రాత్రి అధికారులను ఆదేశించారు. బ్లాకులో టికెట్లు విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని జిల్లాలోని రెవెన్యూ, పోలీసు అధికారులకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. యాజమాన్యాలు తప్పు చేస్తే థియేటర్లను కూడా సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సినిమాటోగ్రఫీ యాక్ట్ సెక్షన్–9 ప్రకారం కేసులు నమోదు చేయాలని, ఎవరినీ ఉపేక్షించ వద్దని కలెక్టర్ సూచించారు. -
'బాహుబలి 2 మైండ్ బ్లోయింగ్’
హైదరాబాద్: యావత్తు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బాహుబలి: ది కంక్లూజన్' సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా చూసినవారంతా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. భావోద్వేగాలు చాలా బాగా పండాయని అంటున్నారు. ‘బాహుబలి 2’ గురించి వర్ణించడానికి మాటలు రావడం లేదని హీరోయిన్ నివేదిత థామస్ ట్వీట్ చేసింది. సినిమా మైండ్ బ్లోయింగ్ అని ఆకాశానికెత్తింది. తామంతా గర్వించేలా ఈ చిత్రం ఉందని ప్రశంసించింది. సినిమా చూస్తున్నంతసేపు భావోద్వేగాలను ఆపులేకపోయానని హీరో నిఖిల్ ట్వీట్ చేశాడు. ‘బాహుబలి’ సిరీస్ కొనసాగాలని ఆకాంక్షించాడు. ప్రతిచోటా బాహుబలి మేనియా కన్పిస్తోందని హీరో వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. ఈ సినిమా చూడటానికి అమితాసక్తితో ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నాడు. భల్లాలదేవపై శివుడు ఏవిధంగా తలపడతాడో చూడాలనివుంది. ఇలాంటి చిత్రరాజాన్ని అందించినందుకు దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు తెలిపాడు. కోల్‌కతాలోనూ బాహుబలి హల్చల్ చేస్తున్నాడని హీరోయిన్ రాధిక ఆప్టే తెలిపింది. ఐనాక్స్ మల్టీఫెక్స్‌లోని వరుసగా 17 షోలు వేస్తున్నారని వెల్లడించింది. నాలుగు తెరలపైనా బాహుబలిని ప్రదర్శిస్తున్నారని ట్వీట్ చేసింది. ‘ఒక మనిషి విజన్. 500 సాంకేతిక నిపుణుల రక్తం, కన్నీరు చిందించి.. ఆరేళ్లపాటు శ్రమ పడి సృష్టించిన అద్భుతం బాహుబలి 2’ అని హీరో సాయి ధరమ్ తేజ్ ట్విటర్ లో పేర్కొన్నాడు. -
బాహుబలి.. వసూళ్లపై అధికార దందా
♦ కాసుల కోసం టీడీపీ నేతల కక్కుర్తి ♦ టికెట్ల ధరలు భారీగా పెంపు ♦ రెవెన్యూ.. పోలీస్ యంత్రాంగం మౌనం ♦ కొత్త కలెక్టర్ కల్పించుకోవాలంటున్న జనం చిత్తూరు (అర్బన్): బాహుబలి–2 విడుదల కావడానికి ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. రెండేళ్ల క్రితం విడుదలైన బాహుబలి మొదటిభాగం డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించడంతో ఈ సారి ఆ సొమ్ముపై చిత్తూరులోని కొందరు టీడీపీ నాయకుల కన్ను పడింది. భారీగా టికెట్ల ధరలను పెంచేసి అమ్ముకుంటున్నారు. జిల్లా కలెక్టర్ కల్పించుకుంటే తప్ప ఈ వ్యవహారంలో తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. వసూళ్లపైనే దృష్టి.. బాహుబలి–2 (కన్‌క్లూజన్) సినిమాపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ నెల 28న చిత్తూరు నగరంలోని నాలుగు థియేటర్లలో చిత్రాన్ని ప్రదర్శించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చిత్రం విడుదలైన 15 రోజుల్లో బాక్సు కొన్న మొత్తం వచ్చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇక్కడే సినిమాపై టీడీపీ నాయకుల కన్ను పడింది. ఎలాగైనా సినిమా ప్రదర్శనను తమ చేతుల్లోకి తీసుకోవాలని.. వచ్చే భారీ వసూళ్లలతో జేబులు నింపుకోవాలని స్కెచ్ వేశారు. తొలిరోజు ప్రదర్శించబడే ఫ్యాన్సీ షోను అభిమాన సంఘ నాయకులు చేజిక్కించుకోవడం, రూ.50 టికెట్లను ఏకంగా రూ.200 వరకు అమ్ముకోవడం ఇక్కడ అందరూ చేసేదే. అయితే ఫ్యాన్సీ షోతో పాటు వారం రోజుల గ్రాస్ కలెక్షన్‌ను ఎలాంటి పెట్టుబడి లేకుండా తమ కైవసం చేసుకోవడానికి చిత్తూరు నగరంలో దాదాపు 12 ఏళ్లుగా ప్రభాస్ అభిమాన సంఘ నాయకుడిగా పనిచేస్తున్న వ్యక్తికి తొలుత చెక్ పెట్టారు. అసలు ఈ వ్యక్తి ప్రభాస్ అభిమాని కాడని.. అసలైన ప్రభాస్ అభిమానుల సంఘ అధ్యక్షుడిని తానేనంటూ కొత్త వ్యక్తి తెరపైకి వచ్చాడు. ఫ్యాన్సీ షో నిర్వహణ బాధ్యత తామే దక్కించుకున్నట్లు పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చేశాడు. చివరకు ఈ వ్యవహారంలో హీరోప్రభాస్ కల్పించుని ఫోన్లో అభిమానులతో మాట్లాడారు. ఎలాంటి గొడవలు లేకుండా చిత్ర ప్రదర్శన నిర్వహించాలని ఆదేశించారు.కాగా నాలుగు థియేటర్లలో ప్రదర్శితమయ్యే ఫ్యాన్సీ షోల్లో తనకు వాటాలు ఇవ్వాలని టీడీపీ నాయకుల షరతుతో చిత్ర ప్రదర్శనకు లైన్ క్లియర్ చేసుకున్నా రు. ఫ్యాన్సీ షోలతో వచ్చే డబ్బులతో నిరుపేదలకు తాము సేవా కార్యక్రమాలు చేస్తుంటే.. టీడీపీ నాయకులు ఇలా దందాలకు దిడం భావ్యం కాదని ప్రభాస్ అభిమానుల సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతులు కలిపిన నిర్వాహకులు..? టీడీపీ నేతల ప్రణాళికలకు చిత్తూరులోని మూడు థియేటర్లను నిర్వహిస్తున్న వ్యక్తి చేతులు కలిపినట్లు సమాచారం. బాహుబలి–2 చిత్ర ప్రదర్శనలో తొలి 15 రోజులపాటు రూ.50 విక్రయించే టికెట్లను రూ.150కు విక్రయించడానికి ఒప్పందం చేసుకున్నారు. తనకు ఒక్కో టికెట్టుకు రూ.వంద, మిగిలిన రూ.50 టీడీపీ నేతలకు ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలిసింది. పోలీసు, రెవెన్యూ అధికారుల నుంచి ఇబ్బందులు వస్తే మీరే చూసుకోవాలంటూ టీడీపీ నేతల నుంచి హామీ కూడా తీసుకున్నారు. తాను చెప్పిన రేట్లకు టికెట్లు విక్రయిస్తేనే బాక్సు వారం రోజులకు లీజుకు ఇస్తానని మరో థియేటర్ నిర్వాహకుడిని బలవంతంగా ఈ రొచ్చులోకి లాగారు. ఇప్పటికే ఈ వ్యవహారం పోలీసులకు, రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లింది. అయితే చిత్తూరులో టీడీపీ నాయకులు గీసిన గీతను దాటని పోలీసు, రెవెన్యూ అధికారులు ఇప్పుడు కూడా మౌనం వహిస్తున్నారు. జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ ప్రద్యూమ్న థియేటర్ల బ్లాక్ టికెట్ల వ్యాపారానికి చెక్ పెట్టాలని సగటు ప్రేక్షకుడు కోరుకుంటున్నారు. -
బాహుబలి 2 స్పెషల్ షో రద్దు
ముంబయి: ముంబయిలో బాహుబలి-2 ప్రత్యేక ప్రదర్శనను రద్దు చేశారు. ఈ మేరకు బాహుబలి చిత్రం హిందీ హక్కులు తీసుకున్న ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ప్రకటించారు. బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా మృతి నేపథ్యంలో ఆయనకు సంతాపంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో బాలీవుడ్ సీని ప్రముఖులకు వేసే ప్రత్యేక ప్రదర్శన కూడా ఆగిపోయింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు 'వినోద్ ఖన్నా' గురువారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్న ఆయన ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన బ్లాడర్ క్యాన్సర్ కారణంగా మృతి చెందారు. 1968లో సినీ రంగ ప్రవేశం చేసిన వినోద్ ఖన్నా తనదైన నటన..డైలాగ్స్ డెలివరీతో అభిమానులను ఆకట్టుకున్నాడు. విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన తరువాత హీరోగా మారి 141 చిత్రాల్లో నటించారు. ఆయన చివరి చిత్రం 'దిల్ వాలే'. -
‘బాహుబలి 2’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!
ముంబై: ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురుచూస్తున్న ‘బాహుబలి 2’ ఎలా ఉండబోతోంది. ఈ ప్రశ్నకు మరికొద్ది గంటల్లో సమాధానం లభించబోతోంది. ముంబైలో ఈరోజు రాత్రి బాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రీమియర్ వేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టాక్ బయటకు వచ్చింది. ‘బాహుబలి 2’ అద్భుతంగా ఉందని ఈ సినిమాను వీక్షించిన కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు వెల్లడించారు. బాహుబలి మొదటి భాగం కంటే ఎంతో గొప్పగా, మెరుగ్గా ఉందని సెన్సార్ బోర్డు సభ్యుడొకరు ‘డీఎన్ఏ’ పత్రికతో చెప్పారు. ‘మొదటి భాగంతో పోలిస్తే బాహుబలి 2 ఎక్కువసేపు ఉంటుంది. దాదాపు మూడు గంటలపాటు సాగుతుంది. ఉత్కంఠభరితంగా సాగే కథనంతో మనకు సమయమే తెలియదు. సింగిల్ ఫ్రేమ్, షాట్, డైలాగుల్లో ఒక్క పదం కూడా కట్ చేయలేదు. ఒక్క కట్ కూడా చెప్పలేదు. పోరాట సన్నివేశాలు చాలా బాగా తీశారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు హాలీవుడ్ కంటే సూపర్‌గా ఉన్నాయి. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 కంటే కూడా బాగున్నాయి. ప్రేక్షకులు తప్పకుండా హ్యాపీగా ఫీలవుతార’’ని తెలిపారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయాన్ని ప్రేక్షకులకు వదిలేయాలని, ఇది ఆడియన్స్ ను ఆశ్చర్యచకితులను చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రభాస్, రానా పోటీపడి నటించారని ప్రశంసించారు. ‘రెండు సింహాలు దీటుగా తలపడినట్టు వీరిద్దరూ నటించారు. కొన్ని సన్నివేశాల్లో కంటతడి కూడా పెట్టిస్తారు. దీని గురించి నేను వెల్లడించను. ఈసారి ఇద్దరూ సమానంగా ఆకట్టుకుంటార’ని వివరించారు. -
‘బాహుబలి’ నిర్మాత సంచలన ఆరోపణలు
హైదరాబాద్: ఎమిరేట్స్ విమానంలో సిబ్బంది జాతివివక్ష వ్యాఖ్యలు చేయటంతోపాటు అనాగరికంగా వ్యవహరించారని ‘బాహుబలి’ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ(46) ఆరోపించారు. దుబాయ్‌లో బాహుబలి చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్‌కు వస్తుండగా.. ఎమిరేట్స్ సిబ్బంది తమ బృందంతో వ్యవహరించిన తీరును ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌కు ఎమిరేట్స్ ఈకే526లో వస్తున్నాం. గేట్బీ4 వద్దనున్న విమాన సిబ్బంది మా బృందంతో అనాగరికంగా వ్యవహరించారు. దారుణంగా ప్రవర్తించారు. ఈ సిబ్బందిలో ఒకరికి జాతివివక్ష ఉందని అర్థమైంది. నేను ఎమిరేట్స్‌లో తరచూ ప్రయాణిస్తాను. కానీ ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు’ అని శోభు ట్వీట్ చేశారు. ఆ విమానంలో ప్రయాణించిన బాహుబలి బృందంలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నటులు ప్రభాస్, రానా, అనుష్క ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి సినిమా రేపు(శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
బ్లాక్ బలి!
-
బాహుబలి2 ఆన్లైన్ టికెట్ల మోసం
-
బాండ్... జేమ్స్ బాండ్
ప్రభాస్ ఇటువంటి డైలాగులు చెబితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎందుకంటే... సుజీత్ దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ జేమ్స్ బాండ్ సై్టల్లో ఉంటుందట! ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను ఏప్రిల్ 23న, టీజర్‌ను ఏప్రిల్ 28న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ‘బాహుబలి–2’ రిలీజయ్యే థియేటర్లలో టీజర్‌ను ప్రదర్శించనున్నారు. ‘‘ప్రభాస్ క్యారెక్టర్, సినిమా సై్టలిష్‌గా ఉంటాయి. అలాగే, ప్రేక్షకులందర్నీ ఆకట్టుకునే ఎమోషన్స్, డ్రామా సినిమాలో ఉన్నాయి. మే నెలాఖరున చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు దర్శకుడు సుజీత్. ఇంకా చిత్రీకరణ ప్రారంభించకుండా టీజర్‌ను ఎలా విడుదల చేస్తున్నారని దర్శకుణ్ణి అడిగితే... ‘‘కేవలం టీజర్ కోసమే ఒక్క రోజు షూటింగ్ చేశాం. ప్రస్తుతం టీజర్‌కు సంబంధించిన వర్క్ ముంబైలో జరుగుతోంది’’ అన్నారు. ఈ సినిమాకు ‘సాహో’ టైటిల్ ఖరారు చేశారట. ఇంత బడ్జెట్లోనే సినిమా తీయాలనే బౌండరీలేవీ నిర్మాతలు పెట్టుకోలేదట! అబుదాబిలో తీయబోయే యాక్షన్ సీక్వెన్స్‌కి 35 కోట్లు ఖర్చు అవుతుందట. సినిమానూ అంతే స్థాయిలో భారీగా నిర్మిస్తారట. యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ స్నేహితులు వంశీ, ప్రమోద్ నిర్మించనున్న ఈ చిత్రానికి స్టంట్స్: కెన్నీ బాట్స్, కెమేరా: మది, సంగీతం: శంకర్–ఎహసన్–లాయ్. -
కట్టప్ప క్షమాపణ చెప్పాలి..
బొమ్మనహళ్లి : కన్నడ ప్రజలకు, కావేరి నీటి విషయంలో చులకనగా మాట్లాడిన బాహుబలి కట్టప్ప పాత్రదారుడు, తమిళనటుడు సత్యరాజ్ క్షమాపణ చెప్పాలని కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈమేరకు సత్యరాజ్‌కు వ్యతిరేకంగా మంగళవారం బొమ్మన హళ్లిలో ధర్నా నిర్వహించారు. అంతకు ముందు కోడిచిక్కనహళ్లి రోడ్డు నుంచి బేగూరు రోడ్డులో బొమ్మనహళ్లి సర్కిల్ వరకు సత్యరాజ్ దిష్టిబొమ్మకు శవ యాత్ర నిర్వహించారు. బెంగళూరు నగర జిల్లా సంచాలకుడు ఎస్.రాజేష్ మాట్లాడుతూ.. సత్యరాజ్ కన్నిడిగులకు క్షమాపణ చెప్పని పక్షంలో బాహుబలి–2 సినిమాను నగరంలో విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం దిష్టి బొమ్మను దహనం చేశారు. బొమ్మనహళ్లి కార్యాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, అధ్యక్షుడు సయ్యద్ దస్తగిరి, ఉపాధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి చంద్రమోహన్గౌడ తదితరులు పాల్గొన్నారు. -
'బాహుబలి–2' వర్కింగ్ స్టిల్స్
-
‘బాహుబలి–2’ తమిళ ఆడియో విడుదల
తమిళసినిమా(చెన్నై): దర్శకుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి–2‘ చిత్రానికి సంబంధించి తమిళ ఆడియో ఆదివారం చెన్నైలో విడుదలైంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 28న విడుదల కాబోతుంది. చెన్నైలో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తోపాటు దర్శకుడు కె.రాఘవేంద్రరావు, కోలీవుడ్ ప్రముఖులు కలైపులి థాను, కేఆర్, నటుడు ధనుష్, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, ఆర్కే సురేష్, నటుడు రాంకీ, నిరోషా దంపతులు పాల్గొన్నారు. -
జ్ఞానోదయం అయింది!
సినిమాకి రీక్యాప్‌లా అసలేం జరిగిందంటే... ‘బాహుబలి–2’ ప్రీ–రిలీజ్ వేడుక గత నెల 26న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అన్ని కళ్లూ ఆ వేడుకను చూడాలనుకున్నాయి. అదే జరిగింది. అలాగే అన్ని నోళ్లూ ఆ రోజు కీరవాణి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకున్నా యి. ‘‘నేను ఎక్కువగా బ్రెయిన్లెస్ దర్శకులతో పని చేశా. వేటూరి, సిరివెన్నెల తర్వాత తెలుగు సినిమా సాహిత్యం అంపశయ్య పై ఉంది’’ అని ఆ రోజు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. ఎవరి అభిప్రాయాలను వాళ్లు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉన్నట్లే, ఆ అభిప్రాయాలను విమర్శించే హక్కు కూడా అందరికీ ఉంటుంది. ‘కీరవాణిగారూ.. ఎందుకయ్యా మీకు ఇవన్నీ..’ అంటూ దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఓ వీడియో ద్వారా పేర్కొన్నారు. ఇతర ప్రముఖులెవరైనా కీరవాణికి సలహాలిచ్చారేమో. అందుకే సోమవారం ట్విట్టర్లో కీరవాణి ఈ విధంగా స్పందించారేమో! ► మీ సలహా తప్పకుండా పాటిస్తా తమ్మారెడ్డి భరద్వాజ్‌గారూ... థ్యాంక్స్.. ఒక ట్వీట్లో ‘మోస్ట్లీ’ అనే పదం వాడాను. అది చాలామందిని బాధపెట్టింది. కానీ, టీబీ (తమ్మారెడ్డి భరద్వాజ్) వంటి పెద్దవారు మంచి సలహా ఇచ్చారు. టీబీ సలహాకు సంబంధించిన కొన్ని ట్వీట్స్‌ను తొలగించాను. ►మనం ఎప్పటికీ విద్యార్థులమే.. తప్పులు చేస్తుంటాం. అయితే తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి వారే మన తప్పులను సరిదిద్దగలరు. ► గౌరవనీయులైన దర్శకులందరూ మేథావులని సడన్‌గా నాకు జ్ఞానోదయం కలిగింది. ఎవరైనా తెలివితక్కువవారు ఉన్నారంటే.. అది నేనేనేమో! ► నేను తప్ప అందరూ సృజనాత్మకత కలిగినవారే. ఎంత ఎదిగినా అందరూ ఒదిగి ఉంటున్నవారే. ► నాకు ఎవరో ఒక నిఘంటువు పంపారు. అందులో పొగరుకి ‘ఎమ్.ఎమ్.కె’ (అంటే ఎం.ఎం. కీరవాణి) అని అర్థం ఉందట. ఆ పుస్తకం మొత్తం చదువుతాను. ► ప్రపంచంలో ఉన్న దర్శకులందరూ గొప్పవారు. వారితో పనిచేసేందుకు నేను తహతహలాడుతున్నాను. కానీ, నేను ఓల్డ్ బ్రెయిన్లెస్ కంపోజర్‌ని కాబట్టి, అవకాశాలు తక్కువ వస్తాయనుకుంటున్నా. ► కేవలం ఐదు నిమిషాల్లోనే బుర్ర లేని నా మతిని తమ్మారెడ్డి భరద్వాజ్ వాష్ చేశారు. ► ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు. ► తమ్మారెడ్డి భరద్వాజ్‌గారికి మళ్లీ థ్యాంక్స్. త్యాగయ్యగారికి ధన్యవాదాలు. ► నాకు పాటల రచయితలందరూ ఇష్టమే. ఎంతో కష్టపడి వాళ్లు రాస్తున్న పాటలంటే ఇష్టమే. వాళ్లను ఎలా మరచిపోయాను? (నేను వృద్ధుణ్ణి అయిపోతున్నా). ► వేటూరిగారికి 100 మార్కులు, సిరివెన్నెల సీతారామశాస్త్రికి 90, మా నాన్నగారికి 35, నాకు 10 మార్కులేనని నా అభిప్రాయం. మిగతా వారందరూ 11 మార్కుల నుంచి 89 మార్కుల మధ్యలో ఉంటారు.. ► ఇటీవల సాయిగారు టీవీ ప్రోగ్రామ్ చూశారు. ఆ ప్రోగ్రామ్‌లో టాలీవుడ్లో కంపోజర్స్ కొరత ఉందని అన్నారు. ఆ మాటలను నేను వ్యతిరేకించాను. ఆయన్ను ఎడ్యుకేట్ చేశాను. ► నిజానికి రైటర్స్ కొరత అధికంగా ఉంది. వాళ్లకు తక్కువ పారితోషికం ఇస్తున్నారు. ► తన 30 ఏళ్ళ అనుభవంలో మా నాన్నగారు నాకు 20 పాటలకంటే తక్కువగా రాశారు. ఎందుకంటే ఆయన అవుట్‌సైడర్ కదా. నేను బంధు ప్రీతిని సపోర్ట్ చేస్తాను. చంద్రబోస్‌గారు నాకు బావ. ఆయన నాకోసం చాలా పాటలు రాశారు. (వ్యంగ్య ధోరణిలో) ► నెపోటిజమ్‌ను (బంధు ప్రీతిని) నేను నమ్ముతాను. వసుధైక కుటుంబాన్ని ప్రోత్సహిస్తాను. ఒకవేళ అది తప్పయితే నాలాంటి బుర్రలేనివారిని బాగుచేయండి. ► రాజమౌళి నా మీద కోపంగా ఉన్నాడు. ‘బాహుబలి–2’ వర్క్‌ని కంప్లీట్ చేయమని రాజమౌళి తొందరపెడుతున్నాడు. ఎందుకంటే ఆర్కా మీడియా ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయాలనుకుంటోంది. మళ్లీ కలుద్దాం మిత్రులారా. ► అనంత శ్రీరామ్ పాటలు రాయడం మానేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాటలు రాస్తున్నారు. దాంతో ప్రతిభ ఉన్న రచయితలకు అవకాశాలు తగ్గుతున్నాయి. ► నిజమే... తెలుగు లిరిక్స్ అంపశయ్యపై లేవు. కానీ అనంత శ్రీరామ్ మాత్రం సంక్షోభంలో ఉన్నాడు. ► నీతి వాక్యాలు, దేశభక్తి పాటలే రాయమని మాత్రమే దర్శకులు తనను అడుగుతున్నారని అనంత శ్రీరామ్ చెప్పాడు. ► డ్యూయెట్లు, ఐటమ్ సాంగ్స్ హీరోలు, హీరోయిన్లు, సింగర్స్.. వీళ్లంతా రాసేస్తున్నారని అనంత శ్రీరామ్ అన్నాడు. -
కాంగ్రెస్‌లో అంతా కట్టప్పలే..!
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! ‘బాహుబలి–2 వస్తున్నది... ఫస్ట్ డే రోజే చూడాలె’ అన్నడు నర్సింగ్. ‘అవ్‌గనీ... గీపారి బాహుబలి ఏషం ఎవరేసిండ్లే...?’ అని అడిగిండు యాదగిరి. ‘ఎవరేసుడేందిరా? బాహుబలి అంటే ప్రభాసే కదా...?’ అన్నడు నర్సింగ్. ‘అరెవారీ... నీకు గింతగూడ జన్రల్ నాలెడ్జ్ లేదురా. మొన్న తెలంగాణ అసెంబ్లీల జానారెడ్డి సారేమన్నడు. కాంగ్రెస్ పార్టీకి ఒక బాహుబలి ఒస్తడు... పార్టీని గెలిపిస్తడు అని అన్నడు కదా...’ అన్నడు యాదగిరి. ‘అవ్ అవ్... జానారెడ్డి సారు గా మాట అనంగనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి అసొంటోళ్లు లేసి జానారెడ్డే మా బాహుబలి అని చెప్పిండ్లు కదా ’ అన్నడు నర్సింగ్. ‘జానారెడ్డి లెక్కల బాహుబలి అంటే రాహుల్ గాంధీ. కోమటిరెడ్డి లెక్కల జానారెడ్డే బాహుబలి. జానారెడ్డి అంటే పడనోళ్లకు మరో లీడర్ బాహుబలి. ఇగ కొంతమంది లీడర్లయితే మాకంటే బాహుబలి ఎవరున్నరు అని మనసుల అనుకున్నరు. మరి వీళ్లల్ల రాజమౌళి ఎవరికి బాహుబలి వేషమిస్తడో ఏందో చూడాలె’ అన్నడు యాదగిరి. ‘మొత్తానికి కాంగ్రెసోళ్లందరు బాహుబలికి బాగనే ప్రచారం చేస్తున్నరు... అసలు కాంగ్రెస్‌ల ఎంతమంది బాహుబలులు ఉన్నరే?’ అని అడిగిండు నర్సింగ్. ‘కాంగ్రెస్‌ల బాహుబలులు ఉన్నారో లేదో తెల్వదుగనీ... కట్టప్పలు మాత్రం మస్తు మందున్నరు’ అన్నడు యాద్గిరి. ‘కాంగ్రెస్‌ల ప్రతి ఒక్కడూ కట్టప్పనే. జానా బాహుబలి అయితే పొన్నాల కట్టప్ప అయితడు... కోమటి రెడ్డి బాహుబలి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కట్టప్ప అయితడు’ అని యాదగిరి చెబుతుంటే... ‘మరి అట్లయితే భళ్లాల దేవుడెవర్రా?’ అని అడిగిండు నర్సింగ్. ‘పిసిసి ప్రెసిడెంట్ కుర్చీల ఎవరు కూసుంటే వాళ్లే భళ్లాల దేవుడు’ అన్నడు యాదగిరి. అబ్బర నాయనా... మస్తు చెప్పినవ్... అన్నడు నర్సింగ్. – ఓరుగల్లు శ్రీ -
వేల మంది భుజాలపై మేం నిలబడ్డాం: రాజమౌళి
‘‘డార్లింగ్ ఫ్యాన్స్... మీకు ప్రభాస్ (రోప్ సహాయంతో గాల్లోంచి కిందకు, వేదికపైకి ప్రభాస్ దిగారు) ఎంట్రీ ఓకేనా? ఇప్పుడు మీరు చూసింది చాలా చాలా తక్కువ. సినిమాలో ఇంకా ఎక్కువ... చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్నేళ్లు ఇంత కష్టపడి సినిమా చేసి ఈ వేదికపై ఇంతమంది ఉన్నామంటే... కారణం మేము కాదు. ఈ చిత్రానికి పనిచేసిన ఎన్నో వేల మంది. వాళ్లందరి భుజాలపై మేం నిలబడి ఉన్నాం’’ అన్నారు దర్శకుడు రాజమౌళి. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన సినిమా ‘బాహుబలి: ద కంక్లూజన్’. అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రధారులు. ఎం.ఎం. కీరవాణి స్వరకర్త. ‘బాహుబలి: ద బిగినింగ్’కి కొనసాగింపుగా తీసిన ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి జరిగింది. ఈ వేడుకలో ఎవరెవరు ఏమన్నారంటే... తప్పని తేలింది... తల తెగింది!: ప్రభాస్ ‘‘రెండున్నరేళ్లు ఓ సినిమా, రెండేళ్లు ఓ సినిమా కోసం ఎదురు చూసిన డార్లింగ్స్ (ఫ్యాన్స్) అందరికీ థ్యాంక్స్. మీ కోసమైనా ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి ట్రై చేస్తా. మా ‘బాహుబలి’ టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, నిర్మాతలు... అందరికీ థ్యాంక్స్. హిందీలో సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి నిర్మాతలు కరణ్ జోహార్, అనిల్ తడాని చాలా హెల్ప్ చేశారు. హిందీ ప్రేక్షకులు చాలామందికి మా ముఖాలు తెలీదు. కరణ్ జోహార్ సమర్పణ అనే పేరు వల్ల ఉత్తరాదిలో పెద్ద హిట్టయింది’’ అంటూ ‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా’, ‘వాడిది తప్పు అని తేలింది... తల తెగింది’ అనే డైలాగులు చెప్పి ఫ్యాన్స్‌ను అలరించారు. రాజమౌళితో సినిమా జోక్ కాదు: నిర్మాత ప్రసాద్ దేవినేని శోభు, నేనూ ‘బాహుబలి’కి నిర్మాతలమైనా... నాలుగేళ్ల శోభు హార్డ్‌వర్క్, ప్యాషన్ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. రాజమౌళితో సినిమా తీయడం జోక్ కాదు. అంత ఈజీ అసలు కాదు. హి ఈజ్ టోటల్లీ హార్డ్ వర్కింగ్ అండ్ ప్యాషనేట్ అబౌట్ ద ఫిల్మ్. నిర్మాత కూడా అతనితో సమానంగా హార్డ్‌వర్క్ చేయాలి. శోభు అంత హార్డ్ వర్క్ చేశాడు. ‘బాహుబలి’ ఓ విచిత్రమైన సినిమా!: రాజమౌళి ఎన్నో వేలమంది కష్టం ‘బాహుబలి’ సినిమా. వాళ్లందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. కృష్ణంరాజుగారి దీవెనలు మాకెప్పుడూ ఉంటాయి. మమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూస్తారు. ఆయన ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని నా కోరిక. మా గురువుగారు రాఘవేంద్రరావుగారికి థ్యాంక్స్. ‘బాహుబలి’ ఎంత విచిత్రమైన సినిమా అంటే... ఫైట్స్‌కి ఫైట్ మాస్టర్ ఉండడు. డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు. డ్యాన్సులకు ఫైట్ మాస్టర్ కావాలి. సీన్స్‌కి ఫైట్ మాస్టర్ కావాలి. ప్రతి సీన్లోనూ ఏదొకటి కదులుతుంది. అన్నిటికీ రిగ్గింగ్ కావల్సిందే. కింగ్ సాల్మన్ మాస్టర్ ఈ ఐదేళ్లూ మాతోనే ఉండి పనిచేశారు. ప్రపంచంలో ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ రిగ్గర్. మా ఆవిడ (రమా రాజమౌళి) కాస్ట్యూమ్స్ గురించి చెప్పడం లేదు. ఆవిడ గురించి ఏవీ (ఆడియో విజువల్) ప్లే చేశాం. మరీ ఎక్కువ పొగిడేస్తే మాట వినదు. స్టైల్‌గా ఈ మాట అనేసినా మళ్లీ భయం వేస్తోంది. నేనూ మనిషినే కాబట్టి హిట్స్ వచ్చినప్పుడు పొగరు, గర్వం పెరుగుతాయి. అలాంటప్పుడు ఓ మొట్టికాయ వేసి నన్ను నేలకు దించుతూ, ఫ్యామిలీ లైఫ్‌ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలో నేర్పిస్తున్న నా భార్యకి థ్యాంక్స్. మరో స్టైలిష్ట్ ప్రశాంతికీ థ్యాంక్స్. మా అబ్బాయి కార్తికేయ నిర్మాత కావాలనుకుంటు న్నాడు. వాడికి దర్శకత్వమంటే ఆసక్తి లేకపోయినా ఈ సినిమాకి సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. మంచి నిర్మాత అవుతాడు. ఎందుకంటే... వాడికి ప్రతి రూపాయి లెక్కే. కార్తికేయ ఇచ్చిన ఐడియాతో ‘బాహుబలి–2’ ట్రైలర్ కట్ చేశాం. మకుట టీమ్ నా హోమ్ వీఎఫ్ఎక్స్ స్టూడియో వంటిది. పీట్ అండ్ టీమ్‌కి థాంక్యూ. డీఓపీ సెంథిల్ కుమార్, ఎడిటర్ తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, మా కల్యాణ్ (కోడూరి) అన్న, ‘బాహుబలి’ చిత్ర బృందం అందరికీ థ్యాంక్స్. ఆయన, నేనూ కొట్టుకున్నంత : రాజమౌళి మా సినిమా వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కమల్ కణ్ణన్, నేనూ కొట్టుకున్నంత ఎవరూ కొట్టుకోరు. మేమిద్దరం స్పెండ్ చేసినంత టైమ్ ఎవరూ స్పెండ్ చేయరు. విజువల్ ఎఫెక్ట్స్‌పై నాకు చాలా గ్రిప్ ఉందని ప్రశంసిస్తుంటారు. వీఎఫ్ఎక్స్కి సంబంధించినంత వరకూ కమల్ కణ్ణన్‌గారు నా టీచర్. ఓ రోజు వీఎఫ్ఎక్స్ వర్క్‌ని బాగుందని చెప్పిన నేను ఆ తర్వాత రెండు రోజులకు అందులో చిన్న సమస్య ఉంది. మళ్లీ వర్క్ చేయొచ్చా? అనడుగుతా. తిట్టుకుంటూనే పని చేసిన కమల్ కణ్ణన్‌కి థాంక్స్. ఇది ‘బాహుబలి’ నామ సంవత్సరం: కె. రాఘవేంద్రరావు ఏప్రిల్ 28న ఉగాది అని విన్నాను. ఈ ఏడాదిని బాహుబలి నామ సంవత్సరంగా పిలుచుకోవచ్చు. అందరూ గొప్పగా యాక్ట్ చేశారు. తీశారు. గ్రాఫిక్స్, ఫిక్సెల్స్ నాకు తెలీవు. సినిమా గురించి చెప్పమంటే ఏమని చెప్పను? నిర్మాతలు శోభు, ప్రసాద్‌ల ధైర్యమని చెప్పనా? ప్రభాస్–రానాల యుద్ధమని చెప్పనా? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చెప్పనా? నన్ను సెట్‌కు రమ్మని రాజమౌళి చాలా సార్లు పిలిచినా... కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సి వస్తుందేమోనని వెళ్ళలేదు. బహుశా ‘బాహుబలి 3’ తీస్తే వెళ్లాలని ఉంది. నేను తీసినవాటిలో ‘అడవి రాముడు’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’ సినిమాలు ఉన్నాయి. ‘అడవిరాముడు’లో ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని’ పాట ఉంది. ఇప్పుడైతే ఈ సాంగ్‌ను ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు మహా పురుషులవుతారు. తరతరాలకు తరగని బాహుబలులవుతారు’ అని రాయించేవాణ్ణి. ‘బొబ్బిలి బ్రహ్మన్న’కు ‘బొబ్బిలి బాహుబలి’ అని పేరు పెట్టేవాణ్ణి. కొందరు అవార్డుల గురించి మాట్లాడతారు. నాకైతే ఇప్పుడు ‘బాహుబలి’ అని బిరుదు ఇస్తే తీసుకోవాలని ఉంది. ఇస్తే హ్యాపీగా ఫీలవుతాను. జేమ్స్ కామెరూన్ సరసన చేరే సత్తా రాజమౌళికి ఉంది: కరణ్ జోహార్ ఇండియన్ మూవీని మరోమెట్టు ఎక్కించే వేదికపై ఉన్నానన్న భావన కలుగు తోంది. ఇండియన్ సినిమాకు ‘బాహుబలి’ గర్వకారణం. రాజమౌళికి ఇండియన్ ఫీల్మ్ మేకర్‌గానే కాదు, గ్లోబర్ ఫిల్మ్ మేకర్‌గా పేరు సంపాదించగల టాలెంట్ ఉంది. నిజానికి ఇది ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’ కాదు. ఎందరో ఫిల్మ్ మేకర్స్‌కు బిగినింగ్‌గా చెప్పవచ్చు. జేమ్స్ కామెరూన్ వంటి ప్రపంచ స్థాయి డైరెక్టర్ల సరసన చేరగల సత్తా రాజమౌళికి ఉంది. నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ల ధైర్యానికి మెచ్చుకోవాలి. ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కా యాక్టింగ్ రియల్లీ అమేజింగ్. ఏప్రిల్ 28 కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ప్రభాస్ మిగతా హీరోల్లా కాదు: కీరవాణి రాజమౌళి ఇలా హిట్ సినిమాలు తీస్తూ ఎంతో పైకి రావాలి. ఇంతటి గొప్ప సినిమాలో పాటలు పాడటమే కాదు.. రాసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ప్రభాస్‌కు గర్వంలేదు. తనకు దైవ బలం, మంచి మనసు ఉన్నాయి. మిగతా హీరోల్లా ఉండటం ప్రభాస్‌కు చేత కాదు. ప్రతి క్షణం గుర్తుండిపోతుంది: రానా ‘కాలం కరిగిపోయే క్షణాల సమూహమైతే.. ‘బాహుబలి’ చిత్రం కలకాలం నిలబడే శాశ్వత శిల్పం’ అని రెండేళ్ల క్రితం చెప్పాను. నా మాటను నిజం చేసిన ప్రేక్షకులకు, ‘బాహుబలి’ అభిమానులకూ ధన్యవాదాలు. ఇప్పుడు మాహిష్మతికి తిరిగి వెళ్లలేనా? తిరిగి చూడలేనా? అన్న చిన్న బాధ ఉంది. అప్పుడప్పుడు కన్నీరు కూడా వచ్చింది. మాహిష్మతి రాజ్యంలో గడిపిన ప్రతిక్షణం నా జీవితంలో గుర్తుండిపోతుంది. ప్రభాస్ మంచి కోస్టార్. ఈ సినిమాలో శివగామి రమ్యకృష్ణగారైతే బయట వల్లిగారు. రాజమౌళిగారికి థ్యాంక్స్. ఈ సినిమాలో పనిచేసిన అందరితో తిరిగి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఎవరూ డబ్బు గురించి ఆలోచించలేదు: నిర్మాత శోభు యార్లగడ్డ ‘బాహుబలి’ ఓ నేషనల్ బ్రాండ్‌గా నిలిచినందుకు హ్యాపీగా ఉంది. రెండో పార్ట్ ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక థియేటర్లలో విడుదల కానుండటం ఆనందంగా ఉంది. వేలమంది టెక్నిషియన్లు ఐదేళ్లు పని చేయకపోతే ఈ అద్భుత ఘనత మాకు దక్కేది కాదు. టాలెంట్, హార్డ్ వర్కింగ్ల కాంబినేషన్ రాజమౌళి. ఈ సినిమా కోసం పని చేసిన ఎవరూ డబ్బు గురించి ఆలోచించలేదు. కెరీర్ పీక్ టైమ్‌లో ఉన్నప్పుడు ఓ సినిమా కోసం ఎవ్వరూ నాలుగేళ్లు ఇవ్వరు. ప్రభాస్ ఇచ్చాడు. ఈ వేడుకలో సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ, తమన్నా, అనుష్క తదితరులు పాల్గొన్నారు. ముంబయ్ మీడియా అరిచినప్పుడు గర్వపడ్డా – రాజమౌళి నేను కమర్షియల్ సినిమాలు చేస్తూ, కమర్షియల్ హీరోయిజమ్‌ను ఎలివేట్ చేస్తూ, నాకు నచ్చిన విధంగా సినిమాలు తీసుకుంటూ వచ్చాను. హీరోయిజమ్ ఎలా ఉండాలని ఎప్పటికప్పుడు ఆలోచించు కుంటూ, తర్వాత స్థాయికి తీసుకు వెళ్తూ సినిమాలు చేసుకుంటూ వచ్చాను. ప్రతి సినిమాలో ప్రతి హీరోకి ఒక ఎలివేషన్ ఇచ్చాను. ‘బాహుబలి’లో ప్రభాస్‌కి ఏం ఇచ్చానని నన్ను నేను ప్రశ్నించుకు న్నప్పుడు... తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ గురించి, నా గురించి అందరికీ తెలుసు. మొన్న ట్రైలర్ లాంచ్‌కి ముంబయ్ వెళ్లాం. ఓన్లీ మీడియాను మాత్రమే ఆహ్వానించాం. అక్కడికి వెళ్లగానే... ఇప్పుడు మీరు (ప్రేక్షకులు) ఎలా అరుస్తున్నారో? అలా అరిచారు. ఎవరు అరుస్తున్నారని చూస్తే... ముంబయ్‌లో మీడియా జనాలు. ప్రభాస్ ఎంట్రీకి విపరీతంగా అరిచారు. అప్పుడు దర్శకుడిగా గర్వపడ్డా. కంట తడిపెట్టిన రాజమౌళి! వేదికపైన చిత్రబృందం ఒక్కొక్కరి ఆడియో విజువల్ ప్రదర్శించిన సమయంలో వారి కోసం ప్రత్యేకంగా స్వరపరిచిన పాటను వినిపించారు. రాజమౌళి కోసం రాసిన పాటను కీరవాణి పాడగా.. వేదికపైనే ఉన్న రాజమౌళి కంట తడిపెట్టారు. ఆ పాట ఏంటంటే... ఎవ్వడంటా... ఎవ్వడంటా...? బాహుబలి తీసింది. మా పిన్నికి పుట్టాడు ఈ నంది కాని నంది.. ఎవ్వరూ కనంది. ఎక్కడా వినంది. శివుని ఆన అయ్యిందేమో.... హిట్లు మీద హిట్లు వచ్చి ఇంతవాడు అయ్యింది. పెంచింది రాజ నందిని.. కొండంత ప్రేమతో... ఎంతెంత పైకి ఎదిగిన అంతంత ఒదుగువాడిగా చిరుయువై యశస్సుతో.. ఇలాగే సాగిపొమ్మని పెద్దన్న నోటి దీవెన.. శివుణ్ణి కోరు ప్రార్థన. -
నాకు నేనే బాస్
తెలుగులో బుర్ర తక్కువ దర్శకులు ఎక్కువ ‘‘ఇకపై నేను సంగీత దర్శకుడిగా కొనసాగితే... నాకు నేనే బాస్! దర్శకుడితో సహా నా బాణీలకు ఎవరూ బాస్‌గా ఉండరు. ఈ నిర్ణయం నా బాధ్యతను పెంచుతుంది. నా అభిప్రాయంలో ‘సంగీత దర్శకుడు తన ఆధీనంలో ఉండడు అనే ఐడియాను ఏ దర్శకుడూ ఇష్టపడడు. తెలుగు చిత్ర పరిశ్రమలో బుర్ర తక్కువ (బ్రెయిన్లెస్) దర్శకులు ఎక్కువ. అలాంటోళ్లు ఉన్నంత వరకూ నేను స్వరకర్తగా కొనసాగే అవకాశాలు తక్కువ’’ అని ఘాటుగా స్పందించారు ఎం.ఎం. కీరవాణి. తమ్ముడు రాజమౌళి, కుటుంబ సభ్యులపై ప్రశంసల వర్షం కురిపించిన కీరవాణి, ఆయన పనిచేసిన దర్శకుల్లో కొందరిని మూగ మనుషులు, చెవిటోళ్లు అంటూ విమర్శలు చేశారు. ‘‘నా క్రమశిక్షణ, నా సతీమణి (శ్రీవల్లి) స్ట్రాంగ్ సపోర్ట్ వల్ల చిత్ర పరిశ్రమలో గౌరవం సంపాదించుకున్నా. తనే నా శివగామి. తను కూడా నేను రిటైర్ కాకూడదని కోరుకుంటోంది. కానీ, నేను నిర్ణయించుకున్నా’’ అని ఆదివారం మధ్యాహ్నం ట్విట్టర్లో రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన, తర్వాత నిర్ణయం మార్చుకున్నారు. ‘‘నా స్వీయ నిబంధనల మేరకు స్వరకర్తగా నా ప్రయాణం సాగుతుంది’’ అని సాయంత్రం 5.30 గంటలకు ప్రకటించారు. అంతకు ముందు ట్విట్టర్లో కీరవాణి చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా... ఈ ప్రయాణంలో అన్నీ పాఠాలే నా ప్రయాణం మౌళి (సంగీత దర్శకుడిగా కీరవాణి తొలి చిత్రం ‘మనసు మమత’ దర్శకుడు) గారితో మొదలైంది. 27 ఏళ్ల తర్వాత ఈ రోజు నేనిక్కడ రాజమౌళితో ఉన్నాను. ఈ ప్రయాణంలో ఎలాంటి చీకూ చింతలు లేవు. కేవలం పాఠాలు మాత్రమే నేర్చుకున్నాను. దేవుడు నన్ను కీర్తి ప్రతిష్ఠలు, పరాజయాలు... రెండిటితో ఆశీర్వదించాడు. రాజమౌళి మాట వింటాడు... ఇతరులు వినరు! నేనెక్కువగా బుర్ర తక్కువ దర్శకులతోనే పనిచేశా. వాళ్లు నా మాటలు వినేవారు కాదు. రాజమౌళికి నేను బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడానికి కారణం అతను నా మాట వింటాడు. దర్శకులు నేను ఓ సంగీత దర్శకుణ్ణి మాత్రమే అనుకుంటారు. మంచి సలహా ఇచ్చినా తీసుకోరు. కథ వినేటప్పుడే నేను చేసిన చాలా చిత్రాలు ఫ్లాప్ అవుతాయని ఊహించా. కానీ, ఆ చిత్రదర్శకులు చెవిటోళ్లు. ఆ చెవిటితనం వల్ల మంచి బాణీలకు హాని కలగదు. కానీ, మంచి సలహా ఇచ్చినప్పుడు స్వీకరించలేని చెవిటితనం దర్శకుడికీ, చిత్రానికీ, నాకూ హాని చేస్తుంది. నా శ్రేయోభిలాషుల కోరిక మేరకు నేను సంగీత దర్శకుడిగా కొనసాగితే... చెవిటి, మూగ దర్శకులతో ప్రయాణించాలను కోవడం లేదు. ఎందుకంటే... ఓ స్వరకర్తగా నేను ఎప్పుడూ గర్వపడలేదు. నాలోని రచయితను చూసి గర్వపడుతుంటాను. రాజమౌళిని ఎవరూ చేరుకోలేరు! నేను రాజమౌళితో ఉన్నంతవరకూ అతన్నెవరూ చేరుకోలే రు. రాజమౌళికి పని పట్ల భక్తి, ప్రేమ ఉన్నంత వరకూ అతని స్టాండర్డ్స్‌ను ఎవరూ చేరుకోలేరు. ఇది వంద శాతం నిజం. ఇది నా వేదవాక్కు. రాజమౌళి తర్వాత ఎస్.ఎస్. కాంచి (కీరవాణి తమ్ముడు)పై ఆశలు ఉన్నాయి. అతని అభిప్రాయాలతో నావి వంద శాతం కలుస్తాయి. మా నాన్నగారు (శివశక్తి దత్తా) బహు ముఖ ప్రజ్ఞాశాలి. గొప్ప ఆర్టిస్ట్.. గొప్ప సంస్కృత రచయిత. ఆయన కుమారుడిగా పుట్టినందుకు గర్విస్తున్నా. కానీ, ఆయన తీసిన ‘చంద్రహాస్’ సినిమా నాకు నచ్చలేదు. తమన్‌కి ఆత్రుత ఎక్కువ! రెండేళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు మిశ్రమ స్పందన వచ్చింది. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యాన్స్‌తో సహా 99 శాతం మంది నేను రిటైర్ కాకూడదని కోరుకు న్నారు. కొందరు మాత్రమే సంతోషపడ్డారు. వాళ్లందరూ సోషల్ మీడియాలో అజ్ఞాత ఐడీల నుంచి స్పందించినవాళ్ళే. అనంత శ్రీరామ్ (రచయిత) ఒక్కడే ధైర్యంగా నా ముఖం మీద రిటైర్మెంట్కు మద్దతు తెలిపాడు. తమన్ (సంగీత దర్శకుడు) అయి తే పలుమార్లు నా అసిస్టెంట్ జీవన్ (సంగీత దర్శకుడు జేబీ) దగ్గర నా రిటైర్మెంట్ గురించి ఆత్రుతగా ఆరా తీశాడు. తమన్ నా ఫ్యానే కానీ, జీవన్‌లాంటి మంచి ప్రోగ్రామర్ అతనికి కావాలి. ‘బాహుబలి’ సక్సెస్‌పై ఎవరికీ కాన్ఫిడెన్స్ లేదు దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్, ‘వారాహి’ సాయిగారితో సహా ‘బాహుబలి’ సక్సెస్‌పై ఏ ఒక్కరూ కాన్ఫిడెంట్‌గా లేరు. ‘అంబికా’ కృష్ణ ఊహ తప్పిస్తే నేనొక్కడినే ఈ చిత్రం అసాధారణ విజయంపై నమ్మకంగా ఉన్నాను. నేను క్రాంతికుమార్గారిని (దర్శక–నిర్మాత) మిస్ అవుతున్నా. ఆయన అహంకారే. కానీ, గౌరవించ దగ్గ ప్రతిభావంతుడు. రాజమౌళి కీర్తి పతిష్ఠలను ఆయన చూసుంటే గర్వపడేవారు. ఆర్కా మీడియా లేకపోతే భారత దేశంలో ఇంత పెద్ద సినిమా సాధ్యమయ్యేది కాదు. రామ్‌గోపాల్‌వర్మకు చురకలు! ట్విట్టర్లో హీరోలు, దర్శక–నిర్మాతలు, రాజకీయ నాయకులు... వాళ్లూ–వీళ్లూ అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరిపై చురకలు వేయడం దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అలవాటు. అటువంటి వర్మపై కీరవాణి చురకలు వేశారు. ‘‘రాముగారు ‘క్షణక్షణం’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు మాత్రమే చేయమని నాకు సలహా ఇచ్చారు. నేనెప్పుడూ ఆయన మాట వినలేదు. మాది పెద్ద కుటుంబం కావడంతో, నాకున్న కుటుంబ బాధ్యతల వల్ల నా తలుపు తట్టిన ప్రతి అవకాశాన్నీ అంగీకరించా. ‘చీప్ ప్రొడక్షన్స్‌తో పని చెయ్యొద్దు’ అని నాకిచ్చిన సలహాను వర్మ తర్వాత పాటించలేదు. నంబర్ ఆఫ్ ఫ్లాప్స్ తీసిన తర్వాత కూడా వర్మ అత్యంత మేథావి దర్శకుడిగానే మిగులుతాడు. ‘జాము రాతిరి..’ పాట ఎప్పటికీ ఎవర్‌గ్రీనే’’ అన్నారు కీరవాణి. రాఘవేంద్రరావు నా గాడ్ ఫాదర్ కేఆర్ (కె. రాఘవేంద్రరావు) నా గాడ్‌ఫాదర్. ఆయన ‘పెళ్లి సందడి’ వంటి సోషల్ సినిమాల మీద దృష్టి పెట్టాలని నా ఆశ. ‘తెలుసా మనసా..’ పాట మధ్యలో చెప్పినట్టు... నా సుఖ దుఃఖాల్లో నాగార్జున నా చేయి విడిచి పెట్టలేదు. ఆయనకు కృతజ్ఞతగా ఉంటా. రామోజీరావు, కృష్ణంరాజు. రాఘవేంద్రరావు, బాలచందర్, మహేశ్‌భట్, నా కుటుంబ సభ్యులు, అభిమానులకు కృతజ్ఞుడిగా ఉంటాను. తిరుమలేశుని భక్తులు మొదలుకుని జీసస్ అనుచరుల వరకూ నా అభిమానులున్నారు. వాళ్లందర్నీ నేను ప్రేమిస్తాను. ►వేటూరిగారి మరణం, ‘సిరివెన్నెల’ అనారోగ్యం కారణంగా తెలుగు సాహిత్యం (తెలుగు పాట) అంపశయ్యపై ఉంది! -
వెండితెరకు మాటలొస్తే అద్భుతం అంటుంది!
-
వెండితెరకు మాటలొస్తే అద్భుతం అంటుంది!
– దర్శకుడు కె. రాఘవేంద్రరావు ‘‘వెండితెరకు మాటలొస్తే.. మాట్లాడాల్సి వస్తే.. ‘బాహుబలి 2’ వంటి గొప్ప అద్భుతాన్ని నాపై ఆవిష్కరిస్తారని జన్మలో అనుకోలేదు. ట్రైలరే ఇలా ఉంటే ఏప్రిల్ 28న థియేటర్స్‌లో ఈ అద్భుతం ఎంత బాగుంటుందో అని చెబుతుంది’’ అన్నారు దర్శకులు కె.రాఘవేంద్రరావు. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ, నాజర్ ముఖ్య తారలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో కె.రాఘవేంద్రరావు సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘బాహుబలి–2’ ట్రైలర్ విడుదల గురువారం హైదరాబాద్‌లో జరిగింది. రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘ఇటువంటి గొప్ప చిత్రాన్ని అందిస్తున్నందుకు హాట్సాఫ్ టు రాజమౌళి అండ్ టీమ్. ‘బాహుబలి–2’ వంటి అద్భుతాన్ని తెరపై చూడటానికి ప్రేక్షకులు ఏప్రిల్ 28 వరకు ఆగాల్సిందే. అప్పటివరకూ నేనైతే ప్రతిరోజూ పదిసార్లు ఈ ట్రైలర్ చూస్తా’’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘బాహుబలి’ సినిమా చాలా పెద్ద కథ కావడంతో రెండు భాగాలుగా తీశాం. ప్రతి క్యారెక్టర్‌ను అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశాం. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే విషయాన్ని సింగిల్ లైన్లో చెప్పలేను. సినిమా చూసి తెలుసుకోవాలి’’ అన్నారు. ‘‘ట్రైలర్ చూసి నా ఐదేళ్ల కష్టం మరచిపోయా. ఇంత గొప్ప సినిమాలో అవకాశం కల్పించిన రాజమౌళి అండ్ టీమ్‌కు కృతజ్ఞతలు’’ అన్నారు ప్రభాస్. ‘‘నటుడిగా నేను తెరంగేట్రం చేసి ఏడేళ్లయింది. అందులో ‘బాహుబలి’ సినిమా కోసమే ఐదేళ్లు కష్టపడ్డా. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆత్రుతతో ఉన్నా’’ అన్నారు రానా. ఎం.ఎం.కీరవాణి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, కెమెరామేన్ కె.కె. సెంథిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బరువు తగ్గకపోవడానికి కారణం ఇదా?
ఒక్కోసారి లేనిపోని వందంతులతో అసలు విషయాలు మరుగున పడిపోతుంటాయి. సంబంధిత వ్యక్తులు చెబితే గానీ నిజాలు నిగ్గుతేలవు. నటి అనుష్కది ఇదే పరిస్థితి. ఈ తరం నటీమణుల్లో కథానాయకి ప్రాధాన్యత ఉన్న కథా చిత్రాల్లో నటించి మెప్పించిన నటి అనుష్క అని చెప్పవచ్చు. అరుంధతి చిత్రం ఆ తరహా చిత్రాలకు దారి చూపింది. కాగా అనుష్క అలా నటించిన మరో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం ఇంజిఇడుప్పళగి తెలుగులో జీరోసైజ్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం అనుష్క తన బరువును 80 కిలోలకు పైగా పెంచుకుని నటించి త్యాగం చేసిందనే చెప్పాలి. అంత కష్టపడి నటించినా ఫలితం దక్కలేదు. ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది. అంతే కాదు తదుపరి నటించాల్సిన బాహుబలి చిత్రంపై అనుష్క బరువు ఎఫెక్ట్ పడింది. అయినా ఈ యోగా సుందరి బరువు తగ్గడానికి శాయశక్తులా ప్రయత్నించి కాస్త తగ్గారట. అయితే పూర్తి నాజూగ్గా మారలేకపోయారు. దీనికి కారణం ఇంజిఇడుప్పళగి చిత్రం అనే ప్రచారం జరిగింది. అంతే కాదు బాహుబలి–2లో అనుష్కను అందంగా చూపడానికి ఆ చిత్ర దర్శకుడు అధికంగా వీఎఫ్ఎక్స్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవలసి వచ్చిందనే ప్రచారం జరిగింది. ఆ విషయం అలా ఉంచితే అనుష్క బరువు తగ్గలేకపోవడానికి అసలు నిజం వేరే ఉందట. దీని గురించి అనుష్క పెదవి విప్పారు. ఆమె తెలుపుతూ తనకు బరువు పెరగడం, తగ్గడం పెద్ద సమస్య కాదన్నారు. ఇంతకు ముందు కూడా ఇలా చాలా సార్లు జరిగిందని చెప్పారు. అదే విధంగా బాహుబలి–2 చిత్రం కోసం చాలా వరకు బరువు తగ్గానని, అయితే సింగం–3 చిత్ర షూటింగ్ సమయంలో అనుకోకుండా విపత్తుకు గురవడంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడి బరువు తగ్గడానికి యోగా, కసరత్తులు చేయలేకపోయానన్నారు. ప్రస్తుతం మళ్లీ శారీరక వ్యాయామం లాంటి కసరత్తులు చేస్తున్నానని, త్వరలోనే తనను స్లిమ్‌గా చూస్తారని అనుష్క పేర్కొన్నారు. -
అందుకు అనుష్కే కారణమా?
ప్రయోగాలు ఒక్కోసారి వికటిస్తాయి. నటి అనుష్క విషయంలో అదే జరిగింది. ఈ యోగా సుందరి మంచి నటే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆమె నటించిన అరుంధతి, రుద్రమదేవి లాంటి కథానాయకి ప్రాధాన్యత ఉన్న చిత్రాలే నిదర్శనం. ఆ చిత్రాల విజయాలిస్తున్న ఉత్సాహంతో అనుష్క ఇంజి ఇడుప్పళగి(తెలుగులో జీరోసైజ్) అనే ద్విభాషా చిత్రం చేశారు. అది ఒక ప్రయోగాత్మక చిత్రమే అని చెప్పవచ్చు. అందుకోసం తన అందమైన బాడీని బొద్దుగా మార్చుకోవడానికి అనుష్క వెనుకాడలేదు. దాదాపు 80 కిలోల బరువుకు తనను పెంచుకుని ఆ చిత్రంలో నటించారు. అయితే ఆ చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. సరే జయాపజయా లు సర్వసాధారణం అని సరిపెట్టుకుంటే, పెంచుకున్న బరువును తగ్గించుకోవడానికి అనుష్క నానా తంటాలు పడాల్సి వచ్చింది. అయినా ఇంజి ఇడుప్పళగి చిత్రానికి ముందు అనుష్కలా నాజూగ్గా మారలేకపోయింది. ఇది తన తదుపరి చిత్రానికి పెద్ద సమస్యగా మారింది. ఈ ముద్దు గుమ్మ రాజమౌళి వెండితెరపై చెక్కిన బాహుబలి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. దానికి సీక్వెల్ కూడా ఏప్రిల్ 28న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్ర టీజర్, మోషన్ టీజర్లు ఇప్పటికే విడుదలై విశేష స్పందన పొందుతున్నాయి. అయినప్పటికీ చిత్ర మెయిన్ ట్రైలర్ విడుదల కాలేదు. ఇందుకు కారణం అనుషే్కనట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు రాజమౌళి అంగీకరించినట్లు మీడియా ప్రచారం. అనుష్క బాహుబలిలో కనిపించిన రూపానికి, రెండో భాగంలో కనిపించిన రూపానికి చాలా తేడా ఉండడంతో ఆమె నటించిన సన్నివేశాలకు అధికంగా వీఎఫ్ఎక్స్ అవసరమైదట. ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం పెరిగిన బరువును అనుష్క పూర్తిగా తగ్గంచుకోలేకపోవడంతో వీఎఫ్ఎక్స్ పరిజ్ఞానాన్ని ఎక్కువగా వాడాల్సి వచ్చిందట. అయితే బాహుబలి–2 చిత్ర ట్రైలర్ విడుదలలో ఆలస్యానికి అను ష్క మాత్రమే కారణం కాదని దర్శకుడు రాజమౌళి పేర్కొనడం కొసమెరుపు. -
ఈ బాహుబలిని చూస్తే రాజమౌళి కూడా షాకే!
డెహ్రాడూన్: త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు ప్రజల ఓట్లను తమ బుట్టలో వేసుకునేందుకు వీలైన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయోగాలకు కూడా దిగుతున్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కుతుందన్న ఎగ్జిట్ పోల్స్ మహత్యమో లేక ప్రధాని మోదీకి ధీటుగా తామెం ప్రచారంలో తక్కువకాదని నిరూపించుకునో ప్రయత్నమో మొత్తానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నేత హరీశ్ రావత్ బాహుబలి అవతారం ఎత్తారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాహుబలి ఎంతటి క్రేజ్ సంపాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ‘ఎవ్వరంట.. ఎవ్వరంట నిన్ను ఎత్తుకుంది’ అనే పాట మేకింగ్ ఎప్పటికీ వండర్. సినిమాలోని హీరోయిజం మొత్తం ఈ ఒక్కపాటతోనే అర్థమవుతుంది. ఈ గీతం బ్యాక్ గ్రౌండ్‌తోనే ఇప్పుడు బాహుబలి 2 పేరిట ఉత్తరాఖండ్‌లో ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో బాహుబలి హరీశ్ రావత్ కావడం విశేషం. దీన్ని స్వయంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ సిద్ధం చేసి విడుదల చేయగా హరీశ్ రావత్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియో జనాలను కనురెప్పవేయనివ్వడం లేదంటే నమ్మండి. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే.. ఉత్తరాఖండ్ పోరాట యోధుడు హరీశ్ రావత్ అని టైటిల్ పడుతుండగా పాట మొదలవుతుంది. అక్కడి ప్రసిద్ధమైన ప్రాంతాల చిత్రాలు వేగంగా వచ్చి వెళతాయి. అనంతరం బాహుబలిగా హరీశ్ రావత్ కనిపిస్తారు. ఆయనకు ఎదురుగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంటుంది. బాహుబలిలో ప్రభాస్ శివలింగాన్ని ఎలా ఎత్తుకుంటాడో అతడిని మించిన స్థాయిలో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ హరీశ్ కూడా ఉత్తరాఖండ్ భాగాన్ని తన భుజాలకు ఎత్తుకుంటాడు. అది చూసి అమిత్ షా అవాక్కవుతాడు. కొసమెరుపేంటంటే ఒరిజినల్ బాహుబలిలో సాధువుగా కనిపించిన తనికెళ్ల భరణి ప్రభాస్ శివలింగం అమాంతం ఎత్తుకొని భుజాన పెట్టుకున్నప్పుడు ఎంతగా సమ్మోహితుడై అవాక్కవుతాడో ఆయన స్థానంలో ప్రధాని మోదీ కనిపిస్తూ అంతే ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. ఒక్క ముఖాలను ఎడిట్ చేసి రూపొందించిన ఈ వీడియో చూపరులను కట్టిపడేస్తోంది. -
ఈ బాహుబలిని చూస్తే రాజమౌళి కూడా షాకే!
-
గురి తప్పకూడదు!
‘‘తప్పకూడదు... మన గురి తప్పకూడదు. ఎదుట ఉన్నది ఎవరైనా గురి తప్పకూడదు’’... అని అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) దేవసేన (అనుష్క)కు చెబుతున్నట్టుంది కదూ. ‘బాహుబలి 2’ లోని ఈ స్టిల్‌ను గురువారం విడుదల చేశారు. మొదటి భాగంలో డీ–గ్లామరైజ్డ్ రోల్లో దర్శనమిచ్చిన అనుష్క ఈ పోస్టర్లో గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. సెకండ్ పార్ట్‌లో అమరేంద్ర, దేవసేన ఎలా కనిపిస్తారో ఈ స్టిల్ ద్వారా చిత్రబృందం చూపించింది. కచ్చితంగా ప్రభాస్ అభిమానులను ఆనందపరిచే స్టిల్ అని చెప్పొచ్చు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ముఖ్య పాత్రల్లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. -
24 కెమెరాలతో...
ఒకటి.. రెండు.. మూడు.. ఇక్కడెన్ని కెమెరాలున్నాయో లెక్కపెడుతున్నారా? ఫొటోలో కనిపించేవి డజను పైగా అయినా, కనిపించనివి ఇంకా ఉన్నాయి. మొత్తం 24 కెమెరాలు. కానీ, అన్నీ ఒక్క కెమేరాగానే పని చేస్తాయట! ఆ కెమేరాలన్నిటినీ ఒక్కదానిలో బిగించారు కదా... ఆ వీఆర్ (వీఆర్ అంటే వర్చ్యు వల్ రియాలిటీ) రిగ్ కెమేరా పేరు బీబీ360సీసీ. ఈ 360 డిగ్రీల కెమేరా రిగ్‌ను ఏయండీ రాడియన్ గ్రాఫిక్స్ సంస్థ ‘బాహుబలి-2’ వీఆర్ వీడియో కోసం ప్రత్యేకంగా తయారు చేసింది. పేరుకి తగ్గట్టు 360 డిగ్రీల కోణంలో సన్నివేశాన్ని చిత్రీకరించగల సామర్థ్యం ఈ కెమేరా సొంతం. ఇంతకీ, ఈ కెమేరా ఎందుకంటారా? ప్రేక్షకులం దర్నీ మాహిష్మతి సామ్రాజ్యంలోకి తీసుకు వెళ్లడానికి, ఊహాలోకంలో విహరించే అవకాశం కల్పించడానికి. సాధారణంగా ప్రేక్షకులు తెరపై చిత్రాన్ని మాత్రమే చూస్తారు. అయితే.. ఆ సన్నివేశం జరుగుతున్న ప్రాంతంలోనే తామూ భాగమై, పాత్ర ధారుల తరహాలో ప్రేక్షకులూ సంచరించగలి గితే... దాన్ని ‘వర్చ్యువల్ రియాలిటీ’ అంటారు. ‘ఆన్ ది సెట్స్ ఆఫ్ బాహుబలి’ పేరుతో దర్శకుడు రాజమౌళి ఇప్పటికే ‘వీఆర్’ వీడియో టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ‘ది స్వోర్డ్ ఆఫ్ బాహుబలి’ పేరిట వీఆర్ వీడియోను స్వయంగా ఈ బీబీ360తో తీస్తున్నారు. ‘‘ఈ కెమెరాతో చిత్రీ కరణ గొప్ప అనుభవం’’ అని కెమేరామన్ సెంథిల్‌కుమార్ చెప్పారు. ‘‘చిత్రసీమలో ప్రవేశించిన పాతికేళ్ల తర్వాత ‘వీఆర్’ పరిజ్ఞానం తొలిసారి వాడుతున్నా. ఇది ‘ది స్వోర్డ్ ఆఫ్ బాహుబలి’ ఫస్ట్ డే షూటింగ్’’ అంటూ రాజమౌళి పైనున్న నటీనటులతో ఫొటోను ట్వీట్ చేశారు. వీఆర్ చిత్రీకరణలో నటీనటులతో రాజమౌళి -
నా పేరు మర్చిపోయారు!
సత్యరాజ్... అంటే ఎవరు? అని అడిగితే చాలామంది ‘ఎవరాయన?’ అన్నట్లు చూస్తారు. అదే ‘కట్టప్ప’ అని అడగండి... తడుముకోకుండా సమాధానం చెప్పేస్తారు. ‘బాహుబలి’లో చేసిన కట్టప్ప పాత్రతో దేశవ్యాప్తంగా సత్యరాజ్ అభిమానులను సంపాదించుకున్నారు. త్వరలో ఆయన దెయ్యంగా భయపెట్టనున్నారు. సత్యరాజ్, ఆయన తనయుడు శిబిరాజ్ కలసి నటించిన తమిళ హారర్ సినిమా ‘జాక్సన్ దొరై’. దరణీధరన్ దర్శకుడు. నిర్మాత జక్కం జవహర్‌బాబు తెలుగులో ‘దొర’గా అనువదించారు. జులై 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా సత్యరాజ్ చెప్పిన విశేషాలు... ► కామెడీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన పీరియాడికల్ హారర్ మూవీ ‘దొర’. జాక్సన్ అనే బ్రిటీష్ దెయ్యానికీ, దొర అనే ఇండియన్ దెయ్యానికీ మధ్య కథ జరుగుతుంది. నేను ఇండియన్ దెయ్యంగా నటించా. తెలుగు, తమిళంతో సహా ప్రస్తుతం అన్ని భాషల్లోనూ హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ధరణీదరన్ చెప్పిన కథ బాగా నచ్చి, ఈ సినిమా ఒప్పుకున్నాను. తొలిసారి దెయ్యం పాత్ర చేశా. ► ఆత్మలు ఇలా ప్రవర్తించాలి, ఇలాగే ఉండాలని రూల్ లేదు కదా! వాటికి ప్రత్యేకమైన మేనరి జమ్స్ ఉంటాయో.. ఉండవో? అందుకే నా స్టయిల్లో దర్శకుడు చెప్పినట్లు నటించాను. ► రాజమౌళి దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ‘స్టూడెంట్ నెం.1’ తమిళ రీమేక్‌తో మా అబ్బాయి శిబిరాజ్ హీరోగా పరిచయమయ్యాడు. గతంలో శిబీతో కలసి నటించాను. మళ్లీ ‘దొర’లో నటించడం హ్యాపీగా ఉంది. ► ఈతరం దర్శకులు నన్ను, నా నటనను దృష్టిలో పెట్టుకుని పాత్రలు రాస్తున్నా రు. రాజమౌళి, కొరటాల శివ, శ్రీకాంత్ అడ్డాల.. ఇలా ప్రతి ఒక్కరూ విభిన్నమైన పాత్రలు రాయడం వలనే నటుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్క రించుకునే అవకాశం లభించింది. ఓ నటుణ్ణి దృష్టిలో పెట్టుకుని దర్శకులు పాత్రలు రాస్తుంటే గర్వంగా ఉంటుంది. ఇంతకంటే కావల్సింది ఏముంటుంది? ► సుమారు 220 చిత్రాల్లో నటించా. 38 ఏళ్లుగా చిత్రపరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నాను. కానీ, ప్రస్తుతం అందరూ నా పేరు మర్చిపోయి ‘కట్టప్ప’ అని పిలుస్తున్నారు. చిన్నారులు సైతం ‘కట్టప్ప’ అని గుర్తుపడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ ఘనత దర్శకుడు రాజమౌళిదే. జీవితంలో ఒక్కసారే ఇటువంటి పాత్రలు లభిస్తాయి. ‘బాహుబలి: ది కంక్లూజన్’లో కట్టప్ప పాత్ర ఇంకా బలంగా ఉంటుంది. ► ‘బాహుబలి 2’తో పాటు సంతోష్ శ్రీనివాస్ సినిమాలో రామ్ తండ్రిగా.. తెలుగు ‘పటాస్’లో సాయికుమార్ చేసిన పాత్రను తమిళ రీమేక్‌లో చేస్తున్నాను. -
బాహుబ్రేక్!
బాహుబలి, భల్లాలదేవ, కట్టప్ప, బిజ్జలదేవ, దేవసేన, అవంతిక... వీళ్లందరూ ఎండలకు భయపడిపోయారా? అందుకే ఇంటి గుమ్మం దాటనన్నారా? చేసేదేం లేక షూటింగ్‌కి సెలవులిచ్చేశారా?... ప్రస్తుతం ‘బాహుబలి- 2’ గురించి ఫిలిమ్నగర్లో జరుగుతున్న చర్చ ఇది. పైన చెప్పిన పాత్రలన్నీ ఆ సినిమాలోవే అని పిల్లలకు కూడా తెలుసు. ఎండల్లో ఈ పాత్రధారులు పడుతున్న కష్టం చూడలేక దర్శకుడు రాజమౌళి వేసవి సెలవులిచ్చి పంపించేశారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ ప్రచారానికి కారణం ‘బాహుబలి-2’ షూటింగ్‌కి కొన్ని రోజులు విరామం ఇవ్వడమే. మామూలుగా ఏదైనా షూటింగ్‌కి గ్యాప్ ఇస్తే, రకారకాల కథనాలు వస్తుంటాయ్ కదా. ఆ విధంగా ‘బాహుబలి-2’ బ్రేక్‌కి ఎండలు కారణమని చాలామంది ఫిక్స్ అయ్యారు. అసలు విషయం ఏంటంటే... ఎండల కారణంగా ఈ షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వలేదట. ‘‘ఇది ముందే నిర్ణయించిన బ్రేక్. ఇప్పటికిప్పుడు అనుకున్నది కాదు. ఎప్పుడో అనుకున్నది’’ అని చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ పేర్కొన్నారు. ఈ గ్యాప్‌లో ఈ యూనిట్ అంతా ఏ విహార యాత్రలకు వెళతారేమో అనుకుంటే పొరపాటే. అదేం కుదరదు. బ్రేక్ తర్వాత జూన్‌లో ఆరంభించే షెడ్యూల్ కోసం దాదాపు యూనిట్ అంతా ట్రైనింగ్‌లో పాల్గొంటారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతాయనీ, అలాగే సెట్ వర్క్ కూడా జరుగుతోందనీ శోభు తెలిపారు. ఇక, ఇటీవల జరిపిన షెడ్యూల్ వివరాల్లోకి వస్తే.. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లా విట్టేకర్ ఆధ్వర్యంలో భారీ పోరాట దృశ్యాలు చిత్రీకరించారు. అక్టోబర్‌కల్లా సెకండ్‌పార్ట్ షూటింగ్ పూర్తవుతుందట. విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ సమయం పడుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
పవన్‌కి విలన్.. ప్రభాస్‌కు ప్రాణం
మొన్నటివరకు అతనో సాధారణ టీవీ సీరియల్ నటుడు. 'శరద్ కేల్కర్.. బాగా నటిస్తాడు' అనే కితాబులే తప్ప పెద్దగా అవకాశాలు చిక్కని పరిస్థితి. అయితే బాహుబలి- ది బిగినింగ్ విడుదలయ్యాక మాత్రం అతని దశ,దిశలు మారిపోయాయి. హిందీ బాహుబలిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు డబ్బింగ్ చెప్పి తన గొంతుతో బాహుబలి పాత్రకు ప్రాణంపోసిన శరద్ కేల్కర్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'లో మెయిన్ విలన్(భైరవ్ సింగ్)గా నటించాడు. తెలుగు హీరోకు గాత్రదానం చేసి మన్ననలు పొందిన శరద్.. తెలుగు సినిమా ద్వారానే వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషం. ఇటీవలే విలేకరులతో మాట్లాడిన శరద్ కేల్కర్ ఏమన్నాడంటే.. 'ఎంతో పెట్టిపుట్టుంటే తప్ప బాహుబలి లాంటి సినిమాలకు పనిచేసే అదృష్టం దొరకదు. చాలా హిందీ సీరియల్స్ లో నా వాయిస్ విన్న కరణ్ జోహార్, బాహుబలి హిందీ వెర్షన్ కు హీరోకు డబ్బింగ్ నువ్వేచెప్పాలన్నప్పుడు సంతోషంగా ఒప్పుకున్నా. సినిమా రిలీజయ్యాక ఎన్ని సంచలనాలు నమోదయ్యాయో తెలిసిందే. ఇక బాహుబలి 2 హిందీ డబ్బింగ్ ఎప్పుడెప్పుడా అని ఆలోచిస్తున్నా. దాంతోపాటు నేను తొలిసారిగా వెండితెరపై నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' విడుదల కోసం ఎప్పుడెప్పుడా అన్నట్లు ఎదురుచూస్తున్నా. స్క్రీన్ టెస్ట్ కాకముందే పవన్ సార్ నన్ను విలన్ గా ఓకే చేయడం ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది' అంటూ భావోద్వేగంగా స్పందించాడు శరద్ కేల్కర్. -
సీనియర్ హీరోయిన్‌కి గోల్డెన్ ఛాన్స్
టాలీవుడ్ హీరోలందరి సరసన హీరోయిన్గా నటించిన సీనియర్ హీరోయిన్ శ్రియ గోల్డెన్స్ ఛాన్స్ కొట్టేసిందన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ భామ, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం బాహుబలి 2లో నటించనుందట. తొలి భాగంతో ఘనవిజయం సాధించిన బాహుబలి యూనిట్ సీక్వెల్‌ను మరింత భారీగా తెరకెక్కించటానికి ప్లాన్ చేస్తోంది. బాహుబలి చిత్రంలో నెగెటివ్ రోల్లో భల్లాలదేవుడిగా నటించిన రానాకు జోడీగా రెండో భాగంలో శ్రియ నటించనుందట. తొలి భాగంలో రానా కొడుకు పాత్రను మాత్రమే చూపించిన రాజమౌళి.. రెండో భాగంలో భల్లాలదేవుడి భార్యను కూడా చూపించనున్నాడు. కథలో కీలక సన్నివేశాల్లో కనిపించే ఈ పాత్రకు స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన యూనిట్ సభ్యులు ఈ పాత్రకు శ్రియను ఎంపిక చేశారు. అయితే ఇప్పటివరకు బాహుబలి సినిమాలో శ్రియ పాత్రపై యూనిట్ సభ్యుల అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేయకపోయినా, బాహుబలి 2లో శ్రియ అంటూ టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్, రానా లీడ్ రోల్స్‌లో నటించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం బాహుబలి 2 నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న యూనిట్ ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి రీలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. -
'బాహుబలి 2' మొదలైంది
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం బాహుబలికి సీక్వల్ మొదలైంది. బాహుబలి చిత్రం వెండితెర మీద సృష్టించిన సంచలనాలు మర్చిపోకముందే ఆ సినిమాకు సీక్వల్‌ను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని భావించాడు రాజమౌళి. అయితే అంచనాలు భారీగా పెరిగిపోవటంతో అందుకు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. అందుకే ముందు అనుకున్నట్టుగా 2016 చివర్లో కాకుండా 2017 మొదట్లో బాహుబలి 2ను ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ప్రధాన పాత్రధారులైన ప్రభాస్, రానా సినిమాకు తగ్గట్టుగా బాడీ పెంచే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవల సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనుంది. అందుకే తిరిగి సన్నబడటానికి కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసిన రాజమౌళి, గురువారం షూటింగ్ ప్రారంభించాడు. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ బాహుబలి అధికారిక ఫేస్బుక్ పేజ్‌లో ఓ ఫోటోను పోస్ట్ చేశారు చిత్రయూనిట్. -
'బాహుబలి 2'లో హాలీవుడ్ విలన్
బాహుబలి ఘనవిజయం సాధించటంతో ఆ సినిమా సీక్వల్పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే రోజుకో వార్త మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే తమిళ స్టార్ హీరో సూర్య, బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్‌లు ఈ సినిమాలో నటిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను చిత్రయూనిట్ ఖండిస్తున్నా, గాసిప్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఆసక్తి కరమైన వార్త మీడియాలో వినిపిస్తోంది. బాహుబలి 2 సినిమా కోసం హాలీవుడ్ నటుణ్ణి విలన్‌గా ఎంపిక చేశారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హవా చూపిస్తోంది. ట్రాయ్, మ్యాడ్ మాక్స్ ఫ్యూరి లాంటి సినిమాల్లో విలన్‌గా నటించిన నతన్ జాన్స్ను ఈ సినిమాలో విలన్‌గా ఎంపిక చేశారట. ఇప్పటికే జయం రవి హీరోగా నటించిన 'భూలోగం' సినిమాలో నటించిన జోన్స్ ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న 'ఫ్లైయింగ్ జాట్' సినిమాలోనూ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోవటంతో అభిమానులతో సినీ వర్గాలు కూడా బాహుబలి యూనిట్ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్న బాహుబలి 2 డిసెంబర్ తొలి వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. 2016 చివరకల్లా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
'మరో ఏడాదికి బుక్కయ్యాడు'
బాహుబలి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అన్న విషయాన్నిపక్కనపెడితే ఈ సినిమా ప్రభాస్‌ను పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా కూడా చాలా ఇబ్బంది పెడుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి తొలి భాగం కోసం దాదాపు మూడేళ్ల పాటు మరే సినిమా చేయకుండా పనిచేసిన ప్రభాస్, సినిమా విడుదల తరువాత కూడా ప్రమోషన్, సక్సెస్ టూర్ అంటూ బిజీ బిజీగా గడిపేశాడు. ఈ గ్యాప్‌లో మరో సినిమాతో పాటు, పెళ్లి తంతు కూడా కానిచ్చేస్తాడని భావించిన అభిమానులకు నిరాశే మిగిల్చాడు. త్వరలోనే బాహుబలి టీం సీక్వల్ షూటింగ్‌ను మొదలు పెట్టనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న బాహుబలి 2 షూటింగ్‌ను డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు రాజమౌళి, తొలి భాగం సక్సెస్ ఇచ్చిన జోష్‌తో మరింత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్లాన్ చేసిన చిత్రయూనిట్ 190 వర్కింగ్ డేస్‌లో ఈ సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే షూటింగ్ మధ్యలో తీసుకునే గ్యాప్‌లను కూడా కలుపుకుంటే దాదాపు మరో పదినెలల పాటు బాహుబలి 2 షూటింగ్ జరగనుందన్న టాక్ వినిపిస్తోంది. ఆ తరువాత సినిమా ప్రమోషన్, రిలీజ్, సక్సెస్మీట్లంటూ మరో రెండు, మూడు నెలల సమయం ఖర్చయిపోతుంది. అంటే ఈ ఏడాది కూడా ప్రభాస్ అభిమానులకు నిరాశే అన్న వాదన ప్రస్తుతం టాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కే నెక్ట్స్ సినిమాను జూలై 2016లో ప్రారంభిస్తారని చెబుతున్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యపడేలా లేదు. -
బాహుబలిలో మాధురి..?
భారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాసిన బాహుబలి. అంతటి ఘనవిజయం సాధించిన తరువాత ఆ సినిమా సీక్వెల్‌పై ఇప్పుడు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాకు సంబంధించి రోజుకో వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. తొలి భాగం ఘనవిజయం సాధించటంతో సీక్వెల్‌ను మరింత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌కు మరిన్ని హంగులను సమకూర్చే పనిలో బిజీగా ఉన్నాడు. బాహుబలి రిలీజ్ ప్రమోషన్ తరువాత ఈ మధ్యే బాహుబలి 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాడు. అయితే ఈ సినిమాలో నటించడానికి చాలామంది స్టార్లు ఇంట్రస్ట్ చూపిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే తమిళ స్టార్ హీరో సూర్య, అతిలోక సుందరి శ్రీదేవి, స్టార్ హీరోయిన్ శ్రియ ఈ సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. చిత్రయూనిట్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు. తాజాగా బాహుబలి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ బాహుబలి సీక్వెల్లో కీలకపాత్రలో నటించనుందట. తొలి భాగంలో కొన్ని సీన్లకు మాత్రమే పరిమితమైన అనుష్క రెండో భాగంలో మెయిన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సీన్లలో అనుష్క అక్కగా మాధురి కనిపించనుందన్న వార్త ఇప్పుడు ఫిలింనగర్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ విషయాన్నైనా చిత్రయూనిట్ నిర్ధారిస్తారో లేక గాసిప్ గానే కొట్టి పారేస్తారో చూడాలి. -
భల్లాలదేవ భార్యగా..!
టాలీవుడ్ హీరోలందరి సరసన హీరోయిన్గా నటించిన సీనియర్ హీరోయిన్ శ్రియ గోల్డెన్స్ ఛాన్స్ కొట్టేసిందన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ భామ, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి-2లో నటించనుందట. తొలి భాగంతో ఘనవిజయం సాధించిన బాహుబలి యూనిట్ సీక్వెల్‌ను మరింత భారీగా తెరకెక్కించటానికి ప్లాన్ చేస్తోంది. బాహుబలి చిత్రంలో నెగెటివ్ రోల్లో భల్లాలదేవగా నటించిన రానాకు జోడిగా రెండో భాగంలో శ్రియ నటించనుందట. తొలి భాగంలో రానాకు కొడుకు పాత్రను మాత్రమే చూపించిన రాజమౌళి రెండో భాగంలో భల్లాలదేవ భార్యను కూడా చూపించనున్నాడు. కథలో కీలక సన్నివేశాల్లో కనిపించే ఈ పాత్రకు స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన యూనిట్ సభ్యులు ఈ పాత్రకు శ్రియను ఎంపిక చేశారట. అయితే ఇప్పటి వరకు బాహుబలి సినిమాలో శ్రియ పాత్రపై యూనిట్ సభ్యుల అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేయకపోయినా, బాహుబలి 2లో శ్రియ అంటూ టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్, రానాలు లీడ్ రోల్లో నటించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాహుబలి 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ 2016 జూలై నాటికి బాహుబలి 2ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. -
వెండితెర బాహుబలి
అమీర్‌పేట్‌కి.. ధూల్పేటకి అంటూ తొలి చిత్రం ‘ఈశ్వర్’లో ప్రభాస్ చేసిన సందడి అతన్ని ‘మాస్’కి దగ్గర చేసేసింది... ‘మెల్లగా కరగని రెండు మనసుల దూరం..’ అంటూ ‘వర్షం’లో చిన్న చిన్నగా చిందేసి ‘రొమాంటిక్’ యాక్షన్ హీరో అనిపించేసుకున్నారు. ‘జగమంత కుటుంబం నాది..’ అంటూ సెంటిమెంట్ పండించేసి తనలో మంచి ‘ఎమోషనల్ హీరో’ ఉన్నాడని ప్రూవ్ చేసేసుకున్నారు. ‘ఒక్క అడుగు...ఒకే ఒక్క అడుగు’ అంటూ విలన్లను రఫ్ఫాడించేసి, మన యంగ్ రెబల్‌స్టార్ ‘ఛత్రపతి’ అని అభిమానులతో అనిపించుకున్నారు. అందరికీ ‘డార్లింగ్’ అయ్యి, ఓవరాల్‌గా ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనిపించేసుకున్నారు. ఈ ఆరడుగుల ఆజానుబాహుడు ఈసారి ‘బాహుబలి’గా విజృంభిస్తే, ‘ఇలాంటి పాత్రలకు యాప్ట్ అయిన హీరో ఇతనే’ అని అందరూ ఆమోదించేలా చేయగలిగారు. అందుకే.. ఇప్పుడు ప్రభాస్ ‘ఆల్ రౌండర్’. రేపు ప్రభాస్ అభిమానులకు పండగ రోజు. ఎందుకంటే రేపు శుక్రవారం ఈ యంగ్ రెబల్‌స్టార్ పుట్టినరోజు. వచ్చే ఏడాది ‘బాహుబలి 2’ ద్వారా మళ్లీ ప్రేక్షకులను అలరించే పని మీద ఉన్నారు ప్రభాస్. -
'బహుబలి-2'లో సూర్య!
-
'బహుబలి-2'లో సూర్య!
హీరో సూర్య కల నిజమైనట్టే కనిపిస్తున్నది. దర్శకుడు రాజమౌళి సినిమాలో కనిపించాలన్నది సూర్య కల. రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తీసిన 'బహుబలి' సినిమాను ప్రశంసల్లో ముంచెత్తిన సూర్య.. ఆ సినిమా సెంకండ్ వెర్షన్లో చిన్న అతిథి పాత్ర ఇచ్చినా చాలు అంటూ బహిరంగంగా ప్రకటించాడు. రాజమౌళికి కూడా సూర్య నటన అంటే ఇష్టమే. దీంతో 'బహుబలి-2' తర్వాత వీరిద్దరు కలిసి సినిమా తీసే అవకాశముందని వార్తలు వచ్చాయి. ఆ వార్తల సంగతి ఎలా ఉన్నా.. భారీ అంచనాలతో సెట్స్ పైకి వెళుతున్న 'బహుబలి-2'లోనే సూర్యకు ఓ పాత్ర పోషించే ఆఫర్ వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ పాత్ర చిన్నదైనా.. సినిమాలో కీలకమైనదని, ఈ పాత్రకు సూర్య అయితే బాగుంటుందని ఆయనను సంప్రదించారని సినీ వర్గాల టాక్. అయితే దీనిని చిత్రవర్గాలు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ ఆఫర్‌తో సూర్య తన కల నిజమైందని భావిస్తున్నాడట. 'బహుబలి-2' సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. -
బాహుబలి-2లో సూర్య?
ప్రభాస్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో భారీ వ్యయప్రయాసలతో రూపొందిన చారిత్రక కథా చిత్రం బాహుబలి. రానా, అనుష్క, తమన్న,రమ్యకృష్ణ, సత్యరాజ్, సుదీప్ వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ అంచనాలతో సంచలనం సృష్టిస్తున్న ఈ చిత్రం తొలి భాగం జులై 10న తెలుగు, తమిళం, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. దీనికి రెండో భాగం ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తి చేసినట్లు రాజమౌళి వెల్లడించారు. ఇలాంటి పరిస్థితిలో బాహుబలి చిత్రంలో చిన్న వేషమైనా ఇవ్వమని రాజమౌళిని అడిగానని అయినా అవకాశం ఇవ్వలేదని చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో సూర్య అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా బాహుబలి 2లో సూర్య ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో హల్చల్ చేయడం విశేషం. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం.