'బహుబలి-2'లో సూర్య! | surya in bahubali | Sakshi
Sakshi News home page

'బహుబలి-2'లో సూర్య!

Published Mon, Oct 19 2015 9:34 PM | Last Updated on Sun, Sep 3 2017 11:12 AM

'బహుబలి-2'లో సూర్య!

'బహుబలి-2'లో సూర్య!

హీరో సూర్య కల నిజమైనట్టే కనిపిస్తున్నది. దర్శకుడు రాజమౌళి సినిమాలో కనిపించాలన్నది సూర్య కల.  రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తీసిన 'బహుబలి' సినిమాను ప్రశంసల్లో ముంచెత్తిన సూర్య.. ఆ సినిమా సెంకండ్ వెర్షన్లో చిన్న అతిథి పాత్ర ఇచ్చినా చాలు అంటూ బహిరంగంగా ప్రకటించాడు. రాజమౌళికి కూడా సూర్య నటన అంటే ఇష్టమే. దీంతో 'బహుబలి-2' తర్వాత వీరిద్దరు కలిసి సినిమా తీసే అవకాశముందని వార్తలు వచ్చాయి.

 

ఆ వార్తల సంగతి ఎలా ఉన్నా.. భారీ అంచనాలతో సెట్స్ పైకి వెళుతున్న 'బహుబలి-2'లోనే సూర్యకు ఓ పాత్ర పోషించే ఆఫర్ వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ పాత్ర చిన్నదైనా.. సినిమాలో కీలకమైనదని, ఈ పాత్రకు సూర్య అయితే బాగుంటుందని ఆయనను సంప్రదించారని సినీ వర్గాల టాక్.

 

అయితే దీనిని చిత్రవర్గాలు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ ఆఫర్తో సూర్య తన కల నిజమైందని భావిస్తున్నాడట. 'బహుబలి-2' సినిమా ప్రీ-ప్రొడక్షన్  పనులు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. నవంబర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement