‘బాహుబలి 2’కి ఎ సర్టిఫికెట్‌! | ubali 2 movie gets Adult certification in Singapore! Censor | Sakshi
Sakshi News home page

‘బాహుబలి 2’కి ఎ సర్టిఫికెట్‌!

Published Fri, May 19 2017 12:02 AM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM

‘బాహుబలి 2’కి ఎ సర్టిఫికెట్‌!

‘బాహుబలి 2’కి ఎ సర్టిఫికెట్‌!

అవును.. ఇది జోక్‌ కాదు.. నిజం... ‘బాహుబలి 2’కి సెన్సార్‌ బోర్డ్‌ ‘ఎ’ సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఆల్రెడీ సెన్సార్‌ బోర్డ్‌ యు/ఎ సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఏప్రిల్‌ 28న సినిమా కూడా విడుదలైంది. ఇప్పుడు సర్టిఫికెట్‌ జారీ చేయడ మేంటి అనుకుంటున్నారా? మరదే ట్విస్ట్‌. ఈ సర్టిఫికెట్‌ ఇక్కడిది కాదు. సింగపూర్‌ సెన్సార్‌ బోర్డు ఇచ్చినది.

ఈ చిత్రంలో మితిమీరిన హింస, రక్తపాతం ఉందని భావించి, సింగపూర్‌ సెన్సార్‌ బోర్డ్‌వారు ‘ఎ’ సర్టిఫికెట్‌ జారీ చేశారు. భారత్‌లో ‘బాహుబలి 2’ చిత్రాన్ని పిల్లలు చూసి భలే ఎంజాయ్‌ చేస్తున్నారు. కానీ, సింగపూర్‌ పిల్లలకు మాత్రం ఈ సినిమా చూసే ఛాన్స్‌ లేకుండా పోయింది. త్వరలో అక్కడ ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement