ఓటీటీలో 'మార్కో'.. అసలు ముద్దాయి సెన్సార్ బోర్డ్! | Censor Board Wants To Ban Marco Movie On TV And OTT | Sakshi
Sakshi News home page

Marco OTT: కేంద్ర ప్రభుత్వ సాయం కోరిన సెన్సార్ బోర్డ్

Published Wed, Mar 5 2025 12:07 PM | Last Updated on Wed, Mar 5 2025 12:34 PM

Censor Board Wants To Ban Marco Movie On TV And OTT

'చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం' అని తెలుగులో ఓ సామెత ఉంది. కేరళ సెన్సార్ బోర్డ్ ఆలోచనా విధానం చూస్తుంటే ఇప్పుడు అదే గుర్తొస్తుంది. ఎందుకంటే 'మార్కో' చిత్రం విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సహాయం కావాలని కోరడమే కారణం.

(ఇదీ చదవండి: దర్శకుడి అసత్య ఆరోపణలు.. ఇచ్చిపడేసిన హీరోయిన్)

అసలేం జరిగింది?
గతేడాది డిసెంబరులో మలయాళంలో 'మార్కో' అనే సినిమా రిలీజైంది. ఉన్ని ముకుందన్ నటించిన ఈ చిత్రం మరీ వైల్డ్ గా తీశారు. చిన్న పిల్లాడ్ని, గర్భిణిని, కళ్లు లేని యువకుడిని వర్ణించలేని విధంగా ఎలా చంపారో ఈ సినిమాలో చూపించారు.

తొలుత మలయాళంలో రిలీజ్ చేస్తే హిట్ అయిన ఈ చిత్రాన్ని ఆ తర్వాత తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఇక్కడ కొందరికి నచ్చేసింది. ఫిబ్రవరి 14న సోనీ లివ్ ఓటీటీలో మలయాళ వెర్షన్, తర్వాత కొన్నిరోజులకు ఆహాలో తెలుగు వెర్షన్, అమెజాన్ ప్రైమ్ లో హిందీ వెర్షన్ రిలీజయ్యాయి.

(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్‌ అబ్బాయితో తమన్నా కటిఫ్‌)

ఆల్రెడీ ఈ సినిమాలో సీన్లపై దారుణమైన విమర్శలు వచ్చాయి. నరుక్కోవడం, చంపడమే అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమాకు అసలు సెన్సార్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారా అని తిట్టినవాళ్లు కూడా ఉన్నారు. తీరిగ్గా జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిన తర్వాత సెన్సార్ బోర్డ్ మేల్కొన్నట్లుంది.

టీవీలో స్క్రీనింగ్ జరగకుండా 'మార్కో' మూవీపై నిషేధం విధించింది. ఇప్పుడు ఓటీటీలో నుంచి కూడా ఈ మూవీని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. ఇప్పటికే 'మార్కో'ని చాలామంది చూసేశారు. సెన్సార్ బోర్డ్ తీరిగ్గా కేంద్రానికి ఇప్పుడు లెటర్ రాస్తే ఏం ప్రయోజనమో వాళ్లకే తెలియాలి?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement