బాహుబలి-2లో సూర్య? | Hero Surya in Bahubali? | Sakshi
Sakshi News home page

బాహుబలి-2లో సూర్య?

Published Tue, Jun 30 2015 1:45 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

బాహుబలి-2లో సూర్య? - Sakshi

బాహుబలి-2లో సూర్య?

 ప్రభాస్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో భారీ వ్యయప్రయాసలతో రూపొందిన చారిత్రక కథా చిత్రం బాహుబలి. రానా, అనుష్క, తమన్న,రమ్యకృష్ణ, సత్యరాజ్, సుదీప్ వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ అంచనాలతో సంచలనం సృష్టిస్తున్న ఈ చిత్రం తొలి భాగం జులై 10న తెలుగు, తమిళం, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. దీనికి రెండో భాగం ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తి చేసినట్లు రాజమౌళి వెల్లడించారు. ఇలాంటి పరిస్థితిలో బాహుబలి చిత్రంలో చిన్న వేషమైనా ఇవ్వమని రాజమౌళిని అడిగానని అయినా అవకాశం ఇవ్వలేదని చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో సూర్య అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా బాహుబలి 2లో సూర్య ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో హల్‌చల్ చేయడం విశేషం. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement