అందుకు అనుష్కే కారణమా?
ప్రయోగాలు ఒక్కోసారి వికటిస్తాయి. నటి అనుష్క విషయంలో అదే జరిగింది. ఈ యోగా సుందరి మంచి నటే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆమె నటించిన అరుంధతి, రుద్రమదేవి లాంటి కథానాయకి ప్రాధాన్యత ఉన్న చిత్రాలే నిదర్శనం. ఆ చిత్రాల విజయాలిస్తున్న ఉత్సాహంతో అనుష్క ఇంజి ఇడుప్పళగి(తెలుగులో జీరోసైజ్) అనే ద్విభాషా చిత్రం చేశారు. అది ఒక ప్రయోగాత్మక చిత్రమే అని చెప్పవచ్చు. అందుకోసం తన అందమైన బాడీని బొద్దుగా మార్చుకోవడానికి అనుష్క వెనుకాడలేదు. దాదాపు 80 కిలోల బరువుకు తనను పెంచుకుని ఆ చిత్రంలో నటించారు.
అయితే ఆ చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. సరే జయాపజయా లు సర్వసాధారణం అని సరిపెట్టుకుంటే, పెంచుకున్న బరువును తగ్గించుకోవడానికి అనుష్క నానా తంటాలు పడాల్సి వచ్చింది. అయినా ఇంజి ఇడుప్పళగి చిత్రానికి ముందు అనుష్కలా నాజూగ్గా మారలేకపోయింది. ఇది తన తదుపరి చిత్రానికి పెద్ద సమస్యగా మారింది. ఈ ముద్దు గుమ్మ రాజమౌళి వెండితెరపై చెక్కిన బాహుబలి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. దానికి సీక్వెల్ కూడా ఏప్రిల్ 28న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్ర టీజర్, మోషన్ టీజర్‌లు ఇప్పటికే విడుదలై విశేష స్పందన పొందుతున్నాయి.
అయినప్పటికీ చిత్ర మెయిన్ ట్రైలర్ విడుదల కాలేదు. ఇందుకు కారణం అనుషే్కనట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు రాజమౌళి అంగీకరించినట్లు మీడియా ప్రచారం. అనుష్క బాహుబలిలో కనిపించిన రూపానికి, రెండో భాగంలో కనిపించిన రూపానికి చాలా తేడా ఉండడంతో ఆమె నటించిన సన్నివేశాలకు అధికంగా వీఎఫ్‌ఎక్స్ అవసరమైదట. ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం పెరిగిన బరువును అనుష్క పూర్తిగా తగ్గంచుకోలేకపోవడంతో వీఎఫ్‌ఎక్స్ పరిజ్ఞానాన్ని ఎక్కువగా వాడాల్సి వచ్చిందట. అయితే బాహుబలి–2 చిత్ర ట్రైలర్ విడుదలలో ఆలస్యానికి అను ష్క మాత్రమే కారణం కాదని దర్శకుడు రాజమౌళి పేర్కొనడం కొసమెరుపు.