స్వీటీ బ్యాక్‌ టు యోగా | Anushka yoga is a short distance from acting | Sakshi
Sakshi News home page

స్వీటీ బ్యాక్‌ టు యోగా

Published Wed, Jun 21 2017 3:00 AM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM

స్వీటీ బ్యాక్‌ టు యోగా

స్వీటీ బ్యాక్‌ టు యోగా

తమిళసినిమా:  మనిషి మానసిక రుగ్మతలను దూరం చేసి అందాన్ని, ఆనందాన్ని పెంచేది యోగా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందాన్ని పెంచడమే కాదు మందాన్ని తగ్గించే శక్తి యోగాకు ఉంది. ఈ విషయం నటి అనుష్కకు బాగా తెలుసు. మొదట్లో యోగా టీచర్‌ అయిన ఈ స్వీటీ ఆనక యాక్టర్‌ అయిన విషయం తెలిసిందే.

కాగా ఇంజి ఇడుప్పళగి (తెలుగులో జీరో సైజ్‌) చిత్రం కోసం బరువు పెరిగిన అనుష్క ఆ తరువాత బహుబలి–2 చిత్రం కోసం తగ్గడానికి చేయని కసరత్తులు లేవట. అయినా ఫలితం లేకపోవడంతో చివరికి ఈ భామను నాజూగ్గా ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి గ్రాఫిక్స్‌ను ఆశ్రయించక తప్పలేదు. అందుకు భారీ మొత్తాన్నే ఖర్చు చేశారట. కాగా ప్రస్తుతం అనుష్క చేతిలో భాగమతి అనే ఒకే ఒక్క చిత్రం ఉంది. అదీ చిత్రీకరణను పూర్తి చేసుకుందని సమాచారం.

కొత్త చిత్రాలను అంగీకరించకపోవడంతో అనుష్క పెళ్లికి సిద్ధం అవుతున్నారని, అందుకే నూతన చిత్రాలను ఒప్పుకోవడం లేదని ప్రచార మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. అసలు విషయం ఏమిటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో అనుష్క యోగానే శరణ్యంగా భావించి నటనను కొంతకాలం దూరంగా పెట్టి యోగాలో మునిగితేలనున్నారట. ఒక పక్క నటిస్తూ యోగాకు పూర్తిసమయాన్ని కేటాయించడం సాధ్యం కాకపోవడంతో అనుష్క ఈ నిర్ణయానికి వచ్చారట. ప్రభాస్‌ తాజా చిత్రంలోనూ ఈ ముద్దుగుమ్మనే నాయకి అని ప్రచారం జరుగుతున్నా, అధికారికపూర్వక ప్రకటన ఇంతవరకూ రాలేదు. ఇకపోతే యోగాకు కేటాయించిన కాలాన్ని పూర్తి చేసుకుని కొత్త అందాలతో గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement