న్యూఢిల్లీ: ఈఏడాది ఇంటర్నెట్‌లో అత్యధికులు శోధించిన అంశాల్లో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి–2’ చిత్రం తొలిస్థానంలో నిలిచినట్లు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తెలిపింది. క్రికెట్‌కు సంబంధించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) రెండోస్థానంలో, ‘లైవ్ క్రికెట్ స్కోర్’ అనే పదం మూడోస్థానంలో నిలిచాయి.
వెతికిన అంశాలను బట్టి వీటిని 9 కేటగిరీలుగా చేశారు. వీటితో పాటు బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ దంగల్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, బద్రీనాథ్ కీ దుల్హానియా చిత్రాలు, చాంపియన్స్ ట్రోఫీ తదితర అంశాలు టాప్–10లో ఉన్నాయి. జీఎస్టీ, బిట్‌కాయిన్, జల్లికట్టు, బీఎస్3 ప్రమాణాల గురించీ వెతికారు. ఆధార్– పాన్‌కార్డు అనుసంధానం, జియో ఫోన్ కొనడం ఎలా? హోలీ రంగుల్ని పోగొట్టుకోవడం ఎలా? అంశాలనూ శోధించారు. ఈఏడాదికి ‘సెక్సియెస్ట్ ఏషియన్ మ్యాన్’గా బాలీవుడ్ నటుడు షాహీద్ కపూర్ ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment