తెలుగు సినిమా ప్రేక్షకులు సత్యరాజ్‌ను చూడగానే 'కట్టప్ప' అంటూ ఉంటారు. అంతలా 'బాహుబలి' సినిమాతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకు తగ్గట్టుగా తన పాత్రలో కట్టప్పగా ఒదిగిపోయారు సత్యరాజ్. కెరీర్ ప్రారంభంలోనే కొన్ని తెలుగు చిత్రాలలో విలన్‌గా కనిపించిన ఆయన తర్వాత పలు ప్రత్యేకమైన పాత్రలతో మెప్పించారు. తమిళనాటలో కూడా కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలే చేశారు. తర్వాత స్టార్ హీరోగా కొనసాగారు. అనంతరం కేరెక్టర్ రోల్స్ లోకి మారిపోయారు. అప్పటి నుంచీ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ సత్యరాజ్ కేరెక్టర్ యాక్టర్‌గా అలరిస్తూనే ఉన్నారు.
(ఇదీ చదవండి: ఎయిర్‌పోర్టులో ప్రభాస్ చెంపపై కొట్టిన యువతి.. వీడియో వైరల్)
సత్యరాజ్ అసలు పేరు రంగరాజ్. నేడు ఆయన 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అక్టోబర్ 3, 1954 కొయంబత్తూర్‌లో సత్యరాజ్ జన్మించారు. తండ్రి సుబ్బయ్య డాక్టర్. కొయంబత్తూరులోనే సత్యరాజ్ బి.ఎస్సీ వరకు చదువుకున్నారు. ఆయనకు నటులు ఎమ్.జి.రామచంద్రన్, రాజేశ్ ఖన్నా అంటే ఎనలేని అభిమానం. వారి స్ఫూర్తితో ఎలాగైన వెండితెరపై మెరవాలని ఆయనలో ఆశ చిగురించింది. కానీ ఆయన తల్లికి మాత్రం ఇష్టం లేదు. అయినా అది లెక్క చేయకుండా చెన్నైకి పయనమయ్యాడు సత్యరాజ్. మొదట తమిళ హీరో సూర్య తండ్రి శివకుమారు అప్పట్లో టాప్ హీరో. ఆయనను కలిసి ఎలాగైనా సినిమా అవకాశం ఇప్పించాలని ప్రాధేయపడ్డారు.
(ఇదీ చదవండి: 100 సినిమాల్లో నటించిన దేవయాని.. టీచర్‌గా చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది)
తల్లిదండ్రులకు ఇష్టంలేని పని చేయడం ఎందుకని, వారు చెప్పినట్లు చదువు పూర్తి చేయమని చెప్పి వెనక్కు పంపించేశాడు. కానీ, సత్యరాజ్ చెన్నైలోనే ఉంటూ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలా కమల్ హాసన్ హీరోగా నటించిన 'సట్టం ఎన్ కైయిల్' చిత్రంలో తొలిసారిగా ఒక కీలకమైన పాత్రలో కనిపించారు సత్యరాజ్. అందులో ప్రధాన విలన్‌కు అనుచరునిగా సత్యరాజ్ నటించారు. తర్వాత 1985లో కార్తిక్ రఘునాథ్ రూపొందించిన 'సావి' చిత్రంలో తొలిసారి హీరోగా కనిపించారు సత్యరాజ్.
అనేక అవార్డులు
నటుడు సత్యరాజ్‌కు తమిళనాడు ప్రభుత్వ కలైమామణి అవార్డు, MGR అవార్డు, పెరియార్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు, విజయ్ అవార్డు వంటి లెక్కలేనన్ని అవార్డులు వరించాయి. బాహుబలిలో కట్టప్పగా ఆయన పాత్రను యావత్ ప్రపంచానికి తీసుకెళ్లింది.
ఆస్తి విలువ
సత్యరాజ్‌కు మిర్చి సినిమాతో మంచి పాపులారిటి దక్కింది. అప్పట్లో ఒక సినిమాకు సుమారు రూ. 2 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. సత్యరాజ్‌కు చెన్నైలో స్వంత ఇల్లు ఉంది. అతను తన కుటుంబంతో కలిసి ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ ఇంటి విలువ దాదాపు రూ.5 కోట్లు అని టాక్. అలాగే, అతని వద్ద ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్, ఇన్నోవా అనే మూడు కార్లు ఉన్నాయి. అతనికి నాగమ్మాళ్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఉంది. ప్రస్తుతం దీని ద్వారా ఆయన భారీగానే ఆదాయాన్ని పొందుతున్నట్లు చెబుతున్నారు. అతని మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment