Satyaraj
-
ఎవరు తాతా ఇతను!
సత్యరాజ్, వశిష్ట ఎన్. సింహా, సాంచి రాయ్, ‘సత్యం’ రాజేష్ లీడ్ రోల్స్‌లో నటించిన సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్’. మారుతీ టీమ్ ప్రోడక్ట్ సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో విజయపాల్ రెడ్డి ఆదిదల నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ‘తాతా.. ఎవరు తాతా ఇతను’, ‘ప్రపంచం గుర్తించని గొప్ప యోధుడమ్మా..’, ‘భీష్ముడా తాతా.. కాదమ్మ...’, ‘మాధవ.. వెయ్యి ఏనుగుల బలశాలి భీముడికి మనవణ్ణి, ఘటోత్కచుడికి కొడుకుని’ వంటి డైలాగ్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: కుశేందర్ రమేశ్ రెడ్డి, సంగీతం: ఇన్ఫ్యూషన్ బాండ్. -
తెలుగులో ఆ సినిమాతోనే ఫేమ్.. ఇకపై ఆ పాత్రలు చేయను: సత్యరాజ్
కట్టప్పగా తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు సత్యరాజ్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంతో కట్టప్పగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. తాజాగా ఆయన జీబ్రా మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన సత్యరాజ్ తెలుగు ఇండస్ట్రీలో తన ప్రస్థానంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.సత్యరాజ్ మాట్లాడుతూ..'విలన్‌గానే నా కెరీర్ ప్రారంభించా. మిర్చి సినిమాతో తెలుగులో ఓ మంచి తండ్రిగా ఫేమస్ అయ్యాను. ఆ తర్వాత బాహుబలిలో కట్టప్పగా నటించా. ఇలాంటి పాత్రలు మళ్లీ చేసే అవకాశం రావడం చాలా అరుదు. మిర్చి మూవీతోనే తెలుగులో నాకు ఇమేజ్ వచ్చింది. ఇక నుంచి రెగ్యులర్ విలన్ పాత్రలు చెయ్యను. హీరో ముందు మోకరిల్లే పాత్రల్లో ఇకపై కనిపించను.' అని అన్నారు. (ఇది చదవండి: సత్యదేవ్ 'జీబ్రా' టీజర్ విడుదల)సత్యదేవ్, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా జీబ్రా. ఈ ఏడాదిలో కృష్ణమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.. ఇప్పుడు జీబ్రా అనే చిత్రంతో రానున్నాడు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబరు 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ అందించారు. -
ఓటీటీకి క్రేజీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
కోలీవుడ్ నటుడు సత్యరాజ్, రేఖ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా వెబ్ సిరీస్ 'మై హస్బెండ్ ఫర్ఫెక్ట్'. ఈ సిరీస్‌లో టాలీవుడ్ హీరోయిన్ వర్షబొల్లమ్మ కూడా నటించారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌కు తమిర దర్శకత్వం వహించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. స్ట్రీమింగ్ డేట్‌ను కూడా ఖరారు చేశారు.ట్రైలర్ చూస్తుంటే ఓ ఉమెన్స్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేసే పాత్రలో సత్యరాజ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు భార్యగా రేఖ కనిపించనున్నారు. టైటిల్ చూస్తుంటేనే భార్య, భర్తల కోణంలోనే కథను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్లో వచ్చే సన్నివేశాలు చూస్తుంటే ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్స్‌తోనే ప్రధానంగా తెరకెక్కించారని కనిపిస్తోంది.కాగా.. మై పర్ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్‌ను మహమ్మద్ రషిత్ నిర్మించగా.. విద్యాసాగర్ సంగీతం అందించారు. ఈ ఫ్యామిలీ డ్రామా సిరీస్‌ను ఆగస్టు 16 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ కానుంది. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని హాట్‌స్టార్ అధికారికంగా వెల్లడించింది. -
బాహుబలిలా వెపన్
‘‘ప్రస్తుతం భాష అనేది హద్దుగా లేదు. ‘బాహుబలి’ సినిమా ఎన్నో భాషల్లో విడుదలైంది. మా ‘వెపన్’ మూవీ కూడా అలాంటి చిత్రమే. సూపర్ హ్యూమన్ సాగా కాన్సెప్ట్‌తో రానున్న ఈ మూవీ కొత్త ట్రెండ్ కావడంతో పాటు పెద్ద హిట్టవుతుంది’’ అని నటుడు సత్యరాజ్ అన్నారు. గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘వెపన్’.ఎంఎస్ మన్జూర్ సమర్పణలో మిలియన్ స్టూడియో బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గుహన్ సెన్నియప్పన్ మాట్లాడుతూ– ‘‘ఇదొక స్కైఫై థ్రిల్లర్, యాక్షన్ మూవీ’’ అన్నారు. ‘‘వెపన్’ లాంటి మంచి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు వసంత్ రవి, తాన్యా హోప్, రాజీవ్ పిళ్లై. -
మహేశ్- రాజమౌళి సినిమాలో కట్టప్ప.. స్పందించిన నటుడు!
తమిళ నటుడు తెలుగువారికి సైతం సత్యరాజ్ పరిచయం అక్కర్లేని పేరు. బాహుబలిలో కట్టప్పగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తాజాగా వెపన్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటిస్తారన్న వార్తలపై ఆయన మరోసారి స్పందించారు. నాపై వస్తున్నవన్నీ రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేశారు. ప్రధాని మోదీ బయోపిక్‌లో తాను నటించడం లేదని మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. భవిష్యత్‌లో మోదీ బయోపిక్ కోసం ఎవరైనా నన్ను సంప్రదించినా చేయనని తేల్చిచెప్పారు.డైరెక్టర్ రాజమౌళికి తాను ఎప్పుడు రుణపడి ఉంటానని సత్యరాజ్ అన్నారు. ఆయన వల్లే ఇండియా వైడ్‌గా కట్టప్పగా ఫేమస్ అయ్యానని తెలిపారు. నా డార్లింగ్ ప్రభాస్ సినిమా కల్కి రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. మహేశ్, రాజమౌళి సినిమాలో తాను నటించడం లేదని వెల్లడించారు. ఒకవేళ నటించే అవకాశం వస్తే.. ఛాన్స్ వదులుకోనని సత్యరాజ్ అన్నారు. కాగా.. గతంలో మోదీ జీవితంపై ఓ సినిమాను తెరకెక్కించారు. 'పీఎం నరేంద్ర మోదీ'పేరుతో 2019లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. బాలీవుడ్లో ఈ సినిమాను ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. -
ఛాన్స్ వచ్చినా మోదీ బయోపిక్‌లో నటించను: సత్యరాజ్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది ప్రముఖులపై బయోపిక్స్ ఇప్పటికే వచ్చాయి. వాటిలో ఎక్కువగానే భారీ విజయాన్ని అందుకున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై బయోపిక్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటించనున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై ఆయనే క్లారిటీ ఇచ్చారు.ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయోపిక్ గురించి ఆయన ఇలా మాట్లాడారు. 'నేను నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటించనున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఆ ప్రాజక్ట్ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. నేను మోదీ పాత్రలో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలు చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి. భవిష్యత్‌లో మోదీ బయోపిక్ కోసం ఎవరైనా నన్ను సంప్రదించినా నేను చేయననే చెప్తాను. ఎందుకంటే ఇది నా సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండే అవాకాశం ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి రూమర్స్ వచ్చాయి. ఇంతటితో ఆపేయండి' అని క్లారిటీ ఇచ్చారుమోదీ జీవితంపై గతంలో ఓ సినిమా తెరకెక్కింది. 'పీఎం నరేంద్ర మోదీ'పేరుతో 2019లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. బాలీవుడ్లో ఈ సినిమాను ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. -
'నరేంద్ర మోదీ' బయోపిక్‌లో స్టార్ యాక్టర్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది ప్రముఖులపై బయోపిక్స్ ఇప్పటికే వచ్చాయి. వాటిలో ఎక్కువగానే భారీ విజయాన్ని అందుకున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై బయోపిక్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటించనున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది.బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో పాన్ ఇండియా రేంజ్లో సత్యరాజ్‌కు భారీ పాపులారిటీ తీసుకొచ్చింది. నరేంద్ర మోదీగా ఈ సినిమాలో సత్యరాజ్ నటించనున్నారని వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంతోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.మోదీ జీవితంపై గతంలో ఓ సినిమా తెరకెక్కింది. 'పీఎం నరేంద్ర మోదీ'పేరుతో 2019లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. బాలీవుడ్లో ఈ సినిమాను ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. -
సత్యరాజ్ ప్రధాన పాత్రలో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్!
సత్యరాజ్, వసంతరవి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం వెపన్. మిలియన్స్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎంఎస్ మన్సూర్ నిర్మించిన ఈ చిత్రానికి గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వం వహించారు. దర్శకుడు రాజీవ్ మీనన్ ప్రతినాయకుడిగా ఫవర్‌ఫుల్ పాత్రలో నటించిన ఇందులో నటి తాన్య హోప్ నాయకిగా నటించారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెలలోనే తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్రబందం ప్రెస్ మీట్ నిర్వహించింది.దర్శకుడు గుహన్ సెన్నియప్పన్ మాట్లాడుతూ..' సూపర్ హ్యూమన్ ఎలిమెంట్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం కోసం యూనిట్ సభ్యులందరు శ్రమించారన్నారు. వెపన్ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నిర్మాతలు ఎస్ మన్సూర్, ఎంఎస్ అబ్దుల్ ఖాదర్, ఎంఎస్ ఐజీష్ సహకారం లేకపోతే ఈ చిత్రం సాధ్యం కాదన్నారు. వారు తనకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారని.. సత్యరాజ్ తొలిసారిగా సూపర్ హ్యూమన్ పాత్రను అద్భుతంగా పోషించారన్నారు. ఆయన అంకిత భావం, సహకారం తనను ఎంతగానో ఉత్సాహ పరిచాయన్నారు.ఇక నటుడు వసంతరవి స్క్రీన్ ప్రజెంటేషన్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు. కాగా.. ఈ సినిమాలో యషికా ఆనంద్, రాజీవ్ పిళ్లై, మైమ్ గోపి, కనిక, గజరాజ్, సయ్యద్ సుభన్, భరద్వాజ్, రంగన్, వేలు ప్రభాకరన్, మాయా కృష్ణన్, శ్యామ్ కరీమ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా.. ప్రభు రాఘవ్ సినిమాటోగ్రఫీ అందించారు. కాగా.. ఈ సినిమా ఈనెల 23న రిలీజ్ కానుంది. -
కట్టప్పతో స్టార్ హీరో.. ఈ మధ్యే రూ.150 కోట్ల హిట్ మూవీతో..!
నటుడు సత్యరాజ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో బోలెడన్ని సినిమాలు చేశాడు. మొదట్లో విలన్‌గా, తర్వాత హీరోగా.. అనంతరం సహాయక నటుడిగా మెప్పించాడు. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో క్లిక్కయ్యాడు. ఈ మధ్య ఇతడు సింగపూర్ సెలూన్ మూవీలో మెరిశాడు. ఫోటో వైరల్తాజాగా ఈ నటుడు యుక్తవయసులో ఉన్నప్పటి ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. ఇందులో సత్యరాజ్ ఓ బుడ్డోడితోపాటు కెమెరావైపు నవ్వులు చిందిస్తున్నాడు. ఈ బుడ్డోడు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ యాక్టర్. ఇతడి తండ్రి కూడా నటుడే! ఆయనతో కలిసి సత్యరాజ్ రెండు సినిమాలు కూడా చేశాడు. ఇంతకీ ఈ చిన్నోడెవరో గుర్తుపట్టారా? తెలుగులో విపరీతమైన పాపులారిటీఅతడే మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్. పుష్ప సినిమాతో తెలుగులో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న ఇతడు ఈ మధ్యే ఆవేశం అనే సినిమాతో మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా రాబట్టింది. 1980లో అతడు సత్యరాజ్‌తో దిగిన ఫోటోను ఓటీటీ ప్లాట్‌ఫామ్ ముబి ఇండియా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. Sathyaraj and Fahadh Faasil in the 1980s. pic.twitter.com/H9DidxzScV— MUBI India (@mubiindia) May 7, 2024చదవండి: నాన్నతో కోపంలో అన్నా.. అదే నిజమైంది: బన్నీ -
బాహుబలి 'కట్టప్ప' రెమ్యునరేషన్, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
తెలుగు సినిమా ప్రేక్షకులు సత్యరాజ్‌ను చూడగానే 'కట్టప్ప' అంటూ ఉంటారు. అంతలా 'బాహుబలి' సినిమాతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకు తగ్గట్టుగా తన పాత్రలో కట్టప్పగా ఒదిగిపోయారు సత్యరాజ్. కెరీర్ ప్రారంభంలోనే కొన్ని తెలుగు చిత్రాలలో విలన్‌గా కనిపించిన ఆయన తర్వాత పలు ప్రత్యేకమైన పాత్రలతో మెప్పించారు. తమిళనాటలో కూడా కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలే చేశారు. తర్వాత స్టార్ హీరోగా కొనసాగారు. అనంతరం కేరెక్టర్ రోల్స్ లోకి మారిపోయారు. అప్పటి నుంచీ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ సత్యరాజ్ కేరెక్టర్ యాక్టర్‌గా అలరిస్తూనే ఉన్నారు. (ఇదీ చదవండి: ఎయిర్‌పోర్టులో ప్రభాస్ చెంపపై కొట్టిన యువతి.. వీడియో వైరల్) సత్యరాజ్ అసలు పేరు రంగరాజ్. నేడు ఆయన 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అక్టోబర్ 3, 1954 కొయంబత్తూర్‌లో సత్యరాజ్ జన్మించారు. తండ్రి సుబ్బయ్య డాక్టర్. కొయంబత్తూరులోనే సత్యరాజ్ బి.ఎస్సీ వరకు చదువుకున్నారు. ఆయనకు నటులు ఎమ్.జి.రామచంద్రన్, రాజేశ్ ఖన్నా అంటే ఎనలేని అభిమానం. వారి స్ఫూర్తితో ఎలాగైన వెండితెరపై మెరవాలని ఆయనలో ఆశ చిగురించింది. కానీ ఆయన తల్లికి మాత్రం ఇష్టం లేదు. అయినా అది లెక్క చేయకుండా చెన్నైకి పయనమయ్యాడు సత్యరాజ్. మొదట తమిళ హీరో సూర్య తండ్రి శివకుమారు అప్పట్లో టాప్ హీరో. ఆయనను కలిసి ఎలాగైనా సినిమా అవకాశం ఇప్పించాలని ప్రాధేయపడ్డారు. (ఇదీ చదవండి: 100 సినిమాల్లో నటించిన దేవయాని.. టీచర్‌గా చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది) తల్లిదండ్రులకు ఇష్టంలేని పని చేయడం ఎందుకని, వారు చెప్పినట్లు చదువు పూర్తి చేయమని చెప్పి వెనక్కు పంపించేశాడు. కానీ, సత్యరాజ్ చెన్నైలోనే ఉంటూ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలా కమల్ హాసన్ హీరోగా నటించిన 'సట్టం ఎన్ కైయిల్' చిత్రంలో తొలిసారిగా ఒక కీలకమైన పాత్రలో కనిపించారు సత్యరాజ్. అందులో ప్రధాన విలన్‌కు అనుచరునిగా సత్యరాజ్ నటించారు. తర్వాత 1985లో కార్తిక్ రఘునాథ్ రూపొందించిన 'సావి' చిత్రంలో తొలిసారి హీరోగా కనిపించారు సత్యరాజ్. అనేక అవార్డులు నటుడు సత్యరాజ్‌కు తమిళనాడు ప్రభుత్వ కలైమామణి అవార్డు, MGR అవార్డు, పెరియార్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు, విజయ్ అవార్డు వంటి లెక్కలేనన్ని అవార్డులు వరించాయి. బాహుబలిలో కట్టప్పగా ఆయన పాత్రను యావత్ ప్రపంచానికి తీసుకెళ్లింది. ఆస్తి విలువ సత్యరాజ్‌కు మిర్చి సినిమాతో మంచి పాపులారిటి దక్కింది. అప్పట్లో ఒక సినిమాకు సుమారు రూ. 2 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. సత్యరాజ్‌కు చెన్నైలో స్వంత ఇల్లు ఉంది. అతను తన కుటుంబంతో కలిసి ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ ఇంటి విలువ దాదాపు రూ.5 కోట్లు అని టాక్. అలాగే, అతని వద్ద ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్, ఇన్నోవా అనే మూడు కార్లు ఉన్నాయి. అతనికి నాగమ్మాళ్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఉంది. ప్రస్తుతం దీని ద్వారా ఆయన భారీగానే ఆదాయాన్ని పొందుతున్నట్లు చెబుతున్నారు. అతని మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. -
బాహుబలి కంటే ఎక్కువ యాక్షన్ సీన్స్ చేశాను – సత్యరాజ్
‘‘వెపన్’లాంటి సినిమా తీయాలంటే డైరెక్టర్,ప్రొడ్యూసర్స్, సినిమాటోగ్రాఫర్, వీఎఫ్ఎక్స్.. ఇలా సాంకేతిక నిపుణులే కీలకం. వాళ్ల తర్వాత యాక్టర్స్‌కు ప్రాధాన్యత అని నా అబిప్రాయయం. ‘బాహుబలి’ కంటే ‘వెపన్’లో ఎక్కువ యాక్షన్ సీన్స్ చేశా. గుహన్ సరికొత్త విజన్‌తో తీశారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది’’ అన్నారు సత్యరాజ్. గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వెపన్’. మన్సూర్ నిర్మించిన ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ‘‘సరికొత్త సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది’’ అన్నారు వసంత్ రవి. ‘‘మా బ్యానర్లో వస్తోన్న తొలి చిత్రమిది’’ అన్నారు మన్సూర్. ‘‘ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులున్నాయి’’ అన్నారు గుహన్ సెన్నియప్పన్. -
అప్పుడు రాజమౌళి ఎలా అడిగాడో ఈయన కూడా అలాగే..: సత్యరాజ్
ప్రముఖ నటుడు సత్యరాజ్ మళ్లీ విలన్ అవతారమెత్తారు. జూలియన్ అండ్ జీరో మా ఇంటర్నేషనల్ పతాకంపై జోమోన్ ఫిలిప్, జీనా రోమోన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం అంగారకన్. శ్రీపతి కథానాయకుడిగా నటించి, కథనం, క్రియేటివ్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ సినిమాలో సత్యరాజ్ డేరింగ్ పోలీస్ అధికారిగా ప్రతినాయకుడి పాత్రలో నటించారు. మలయాళ బ్యూటీ నియా కథానాయకిగా నటించింది. ఈ చిత్రంలో అంగాడి తెరు ఫేమ్ మహేష్, రెయినా కారత్, రోషన్, అప్పుకుట్టి, దియా, నేహా రోస్, గురు చంద్రన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రభాస్ కాలును మీ తలపై పెట్టుకోవాలి.. ఓకేనా? దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ డచ్చు ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అంగారకన్ సెప్టెంబర్ 8వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చైన్నెలో చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ.. చిత్ర దర్శకుడు శ్రీపతి తనకు కథ చెప్పే ముందే ఇందులో తాను హీరో, మీరు విలన్ ఓకేనా అని అడిగారన్నారు. బాహుబలి చిత్రంలో నటించినప్పుడు దర్శకుడు రాజమౌళి కూడా ఇలానే అడిగారన్నారు. ప్రభాస్ కాలును మీ తలపై పెట్టుకోవాలి అందుకు ఓకేనా..? అని ఆయన అడిగారన్నారు. అలా బోర్ కొట్టేసింది.. ఈ చిత్ర దర్శకుడు శ్రీపతి కథ పూర్తిగా చెప్పగా తనకు నచ్చిందన్నారు ఇందులో నటించడానికి మంచి అవకాశం ఉందన్నారు. వరుసగా తండ్రి పాత్రల్లో నటించడం బోర్ కొట్టడంతో మంచి విలన్ పాత్ర వస్తే నటించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ.. పార్టీ ప్రారంభించడం అనేది ప్రస్తుతం ఓటు బ్యాంకు రాజకీయం అన్నారు. అయితే ప్రజలకు మంచి సందేశం ఇవ్వడం కూడా రాజకీయమేనని, అలాంటి వారి వెనుక తాను ఉంటానని చెప్పారు. సూపర్ స్టార్ చర్చ గురించి మాట్లాడుతూ.. ఎళిసై మన్నర్, మక్కల్ తిలకం, నడిగర్ తిలకం అంటూ కాలానికి తగ్గట్టుగా పట్టం మారుతూ ఉంటుందని తనకు తెలిసినంతవరకు నటుడు రజనీకాంత్ మాత్రమే నిజమైన సూపర్ స్టార్ అని సత్యరాజ్ పేర్కొన్నారు. చదవండి: అడ్డగోలు పారితోషికాలు, అవసరం లేని రికార్డులు.. సినీ పరిశ్రమకే ‘మెగా ’కష్టం! -
బాహుబలి కట్టప్ప కుటుంబంలో తీవ్ర విషాదం
సీనియర్ నటుడు సత్యరాజ్ తల్లి నాదాంబాళ్ కాళింగరాయర్ వృద్ధాప్యం కారణంగా కోవైలో కన్ను మూశారు. ఆమె వయసు 94 ఏళ్లు. నాదాంబాళ్ కాళింగరాయర్‌కు కొడుకు సత్యరాజ్‌తో పాటు కల్పనా మండ్రాడియార్, రూపా సేనాధిపతి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కోవైలో నివశిస్తున్న నాదాంబాళ్ కాళింగరాయర్ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో షూటింగ్లో ఉన్న నటుడు సత్యరాజ్‌కు ఈ వార్త తెలియగానే వెంటనే కోయంబత్తూరుకు చేరుకున్నారు. ఇక సత్యరాజ్‌కు తల్లి అంటే ఎంతో ఇష్టం. ఆమెకు తాను నటించిన సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టమని సత్యరాజ్ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఇక సత్యరాజ్ తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా కోలీవుడ్ నటుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపాడు. -
మరోసారి విలన్‌గా బాహుబలి కట్టప్ప సత్యరాజ్
తమిళ సినిమా: తొలి రోజుల్లో ప్రతి నాయకుడిగా దుమ్ము రేపిన నటుడు సత్యరాజ్ తరువాత కథానాయకుడిగా అవతారం ఎత్తి స్టార్ హీరోగా రాణించారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తమిళం, తెలుగు తదితర భాషల్లో నటిస్తూ బిజీ అయ్యారు. విలన్ పాత్రలు చేయనని చెప్పిన సత్యరాజ్ తాజాగా అలాంటి పాత్రలో నటిస్తుండడం విశేషం. ఈయన డేర్ పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం అంగారకన్. నటుడు శ్రీపతి కథానాయకుడిగా పరిచయం అవుతూ, స్క్రీన్ ప్లే, క్రియేటివ్ డైరెక్టర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సాఫ్ట్వేర్ సంస్థ అధికారి అయిన ఈయన సినిమాపై ముఖ్యంగా నటనపై ఆసక్తితో ఈ రంగంలోకి ప్రవేశించారు. మోహన్ డచ్చు ఛాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మలయాళ నటి నియా కథానాయకిగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో నటుడు అంగాడితెరు మహే‹Ù, రైనాకారత్, రోషన్, అప్పు కుట్టి, దియా, నేహా రోస్, గురుచంద్రన్, కేసీపీ ప్రభాత్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలియన్, జెరోమా ఇంటర్నేషనల్ పతాకంపై జోమోన్ పిలిప్, జీవా జోమోన్ నిర్మిస్తున్నారు. కె కార్తీక్ సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఆర్.కలైవానన్ జాగ్రహం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమం ముమ్మరంగా జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని 2023 సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ప్రతి క్షణం ప్రమాదం
నయనతార లీడ్ రోల్లో అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కనెక్ట్’. సత్యరాజ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రధారులు. ఈ నెల 22న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ‘కనెక్ట్’ తెలుగు వెర్షన్‌ను యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తోంది. తెలుగు ట్రైలర్‌ను సోషల్ మీడియాలో ప్రభాస్ షేర్ చేశారు. దేశంలో లాక్డౌన్ విధించడానికి 24 గంటల ముందు అంటూ ట్రైలర్ సాగుతుంది.‘నాన్నా నేను చెప్పేది విను.’, ‘నీతో ఉన్నది మన అమ్ము కాదు.. అక్కడ ఉన్న ప్రతిక్షణం నీ ప్రాణానికి ప్రమాదం’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. -
సత్యరాజ్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నయన్ ‘కనెక్ట్’, ఫస్ట్‌లుక్ అవుట్
లేడీ సూపర్ స్టార్ నయనతార చిత్రాలకు అందరూ కనెక్ట్ అవుతారు. అలాంటిది ఇప్పుడు ఆమె కనెక్ట్‌గా మారింది. ఒక పక్క స్టార్ హీరోలతో నటిస్తున్న ఈమె, మరో పక్క హీరోయిన్ ఓరియంటెడ్ కథల్లో నటిస్తూ విజయాలను అందుకుంటోంది. ఇలాంటి కథా చిత్రం విడుదలయ్యేలా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య ఈమె నటించిన ఓ2 చిత్రం ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా నయనతార కథానాయకిగా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రానికి కనెక్ట్ అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తమ రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. కాగా కనెక్ట్ చిత్రంలో నయనతారకు జంటగా నటుడు వినయ్ నటించగా సత్యరాజ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీనిని అశ్విన్ శరవణన్ తన గత చిత్రాల తరహాలోనే తెరకెక్కించినట్లు తెలిసింది. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్ర ప్రత్యేక పోస్టర్‌ను చిత్ర వర్గాలు విడుదల చేశాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరపుకుంటున్న ఈ మూవీ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం పేర్కొంది. అయితే నయనతార గత చిత్రాల మాదిరిగా ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా? లేక థియేటర్లలో విడుదలవుతుందా ? అన్నది తెలియాల్సి ఉంది. కనెక్ట్ చిత్ర విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
నా కొడుకును ఆదరించండి.. ‘కట్టప్ప’ సత్యరాజ్ విజ్ఙప్తి
చాలా కాలంగా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఏం ఇచ్చినా నేను మీ రుణం తీర్చుకోలేను. ఇప్పటి వరకు నన్ను ఆదరించినట్లే.. మంచి కంటెంట్ ఉన్న ‘మయోన్’చిత్రం ద్వారా పరిచయమవుతున్న నా కొడుకు శిభి సత్యరాజ్‌ను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా’అని ప్రముఖ నటుడు ‘కట్టప్ప’ సత్యరాజ్ అన్నారు. ఆయన కొడుకు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం “మాయోన్” ఈ చిత్ర హక్కులను మూవీమ్యాక్స్ అధినేత ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. ‘మాయోన్’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..ఈ చిత్ర ట్రైలర్, టీజర్ చాలా బాగున్నాయి. ‘మయోన్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయ మవుతున్న సిబి చాలా చక్కగా నటించాడు. దర్శక, నిర్మాతలు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినా ఇష్టపడి చేశారు.అందుకే సినిమా బాగా వచ్చింది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి’ అన్నారు. ‘మయోన్ వంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు’అని హీరో శిబి సత్యరాజ్ అన్నారు . ‘మా చిత్రం గురించి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ట్వీట్ చేయడం సంతోషంగా ఉంది. పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ ‘మాయోన్’చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా ఆదరిస్తారు అన్నారు నిర్మాత శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, తిరుపతి రెడ్డి, హ్యుమన్ రైట్స్ సభ్యురాలు రేణుక తదితరులు పాల్గొన్నారు. -
సత్యరాజ్ లీడ్‌లో 'బదాయి హో' రీమేక్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
Badhaai Ho Movie Remake Veetla Vishesham Release Date Announced: ఆర్జే బాలాజీ కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం 'వీట్ల విశేషం'. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సమర్పణలో జీ.స్టూడియోస్, బేవ్యూ ప్రాజెక్ట్ ఎల్ఎల్పీ, రోమియో పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రం 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్జే బాలాజీ గురువారం (జూన్ 3) మీడియాతో మాట్లాడుతూ ఇది రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చిత్రమన్నారు. 2018లో విడుదలై మంచి విజయాన్ని సాధించిన హిందీ చిత్రం బదాయ్ హోకు ఇది రీమేక్ అని, అయితే ఇప్పటి తమిళ నేటివిటీకి తగ్గట్టుగా పలు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించినట్లు చెప్పారు. నటుడు సత్యరాజ్, ఊర్వశి ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో నటి అపర్ణ బాలమురళి తనకు జంటగా నటించారని తెలిపారు. చదవండి: 'మేజర్'పై సందీప్ తండ్రి రియాక్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లి కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ ట్విటర్ రివ్యూ.. -
యూఎస్ షోలలో కనిపించని కృష్ణంరాజు.. ఎందుకంటే?
Krishnam Raju Character Missing In Radhe Shyam USA Theaters: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రేక్షకలోకం ఎంతగానో ఎదురు చూసిన చిత్రం 'రాధేశ్యామ్' ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. సుమారు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత రిలీజై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ప్రముఖ హస్త సాముద్రికుడు విక్రమాదిత్య పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. అలాగే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ మూవీలో ప్రభాస్ పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ఒక కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 'రాధేశ్యామ్' మూవీలో కృష్ణంరాజు 'పరమహంస' రోల్లో నటించారు. ఇదివరకూ బిల్లా, రెబల్ చిత్రాల్లో వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోగా 'రాధేశ్యామ్' మూడో చిత్రం. ఇదిలా ఉంటే తాజాగా ఆశ్చర్యపరుస్తున్న వార్త ఏంటంటే పరమహంస పాత్ర పోషించిన కృష్ణంరాజు కేవలం ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు మాత్రమే పరిమితయ్యారట. విదేశీ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలో కృష్ణంరాజు కనిపించట్లేదని సమాచారం. దీంతో కృష్ణంరాజదు ఎందుకు కనిపించడంలేదంటూ ఫ్యాన్స్ మేకర్స్‌ను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారట. అయితే ఈ పాత్రను తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కోలీవుడ్ యాక్టర్ సత్యరాజ్ పోషించారు. ట్రైలర్ విడుదలైనప్పటినుంచి ఈ విషయం స్పష్టమైంది. కానీ ఈ సినిమా తెలుగు వెర్షన్లో సైతం కృష్ణంరాజుకు బదులు సత్యరాజ్ కనిపించినట్లు యూఎస్ఏ ఆడియెన్స్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పాత్రకు కృష్ణంరాజు నటించడమే కాకుండా స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు. అలా అయితే యూఎస్ తెలుగు ప్రింట్లో కృష్ణంరాజుకు బదులు సత్యరాజ్‌ను ఎందుకు చూపించారనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదట. ఇంతేకాకుండా యూకేకి పంపిన కొన్ని ప్రింట్లలో కృష్ణంరాజు పాత్రను మొత్తానికే తీసేసినట్లు టాక్ వినిపిస్తోంది. -
ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన ‘కట్టప్ప’, కొద్ది రోజుల పాటు విశ్రాంతి..
ప్రముఖ నటుడు, బాహుబలి ‘కట్టప్ప’ సత్యరాజ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు కోవిడ్ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యరాజ్ తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఆయన ఆసుపత్రిలో చేరడంతో సత్యరాజ్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు రావడంతో ఆయన ఫ్యాన్స్ అంతా ఆందోళనకు గురయ్యారు. (చదవండి: బాహుబలి ‘కట్టప్ప’కు కరోనా, అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరిక) చదవండి: సల్మాన్ ఖాన్‌తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. ఈ నేపథ్యంలో అభిమానులకు ఆయన కుమారుడు శిబి సత్యరాజ్ గుడ్ న్యూస్ చెప్పారు. తన తండ్రి కరోనా నుంచి కోలుకున్నారని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ప్రస్తున్నా నాన్న(సత్యరాజ్) క్షేమంగా ఉన్నారని, నిన్న రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని స్పష్టం చేశాడు. కొన్ని రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారని... ఆ తర్వాత షూటింగుల్లో పాల్గొంటారని ఆయన కుమారుడు పేర్కొన్నాడు. తన తండ్రి కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు. కాగా సత్య రాజ్ తనయుడైన శిబి సత్యరాజ్ మాయోన్ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: డబ్బు కోసం ఇంతలా దిగజారతావా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్‌పై ట్రోల్స్ Hey guys..Appa got discharged from the hospital last night and back home..He’s totally fine and will resume work after few days of rest..Thank you all for your love and support! 😊🙏🏻 #Sathyaraj — Sibi Sathyaraj (@Sibi_Sathyaraj) January 11, 2022 -
వివేక్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం
-
పారితోషికంకాదు.. పార్టనర్షిప్!
‘నరసింహా, ముత్తు, దశావతారం, జై సింహా’ వంటి భారీ సినిమాలను డైరెక్ట్ చేసిన తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ ఓ చిన్న బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. సత్యరాజ్ ముఖ్య పాత్రలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆర్బీ చౌదరి నిర్మించనున్న ఈ సినిమా బడ్జెట్ 2 కోట్ల వరకూ ఉంటుంది. విశేషమేంటంటే... ఈ సినిమాకు పని చేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరూ పారితోషికం తీసుకోవడంలేదట. ఈ సినిమా బిజినెస్ పూర్తయిన తర్వాత వాటా తీసుకుంటారట. ఈ సినిమా చిత్రీకరణను 30 రోజుల్లో పూర్తి చేయాలన్నది ప్లాన్ అని తెలిసింది. ఇందులో తమిళ నటులు విజయ్ సేతుపతి, పార్థిబన్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. షూటింగ్‌లకు అనుమతి ఇవ్వగానే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. పెద్ద స్టార్స్, డైరెక్టర్స్ ఇప్పటికే పార్టనర్షిప్ మీదే సినిమాలు చేస్తున్నారు. కరోనా తర్వాత చిన్న సినిమాలు కూడా పారితోషికాలు కాకుండా పార్టనర్షిప్ ప్లాన్‌తో రూపొందుతాయా? యాక్టర్స్, డైరెక్టర్స్ పారితోషికం బదులు భాగస్వామ్యం తీసుకుంటారా? వేచి చూడాలి. -
ప్రతిరోజూ పండుగే : మూవీ రివ్యూ
టైటిల్: ప్రతిరోజూ పండుగే జానర్: ఫ్యామిలీ ఎంటర్టైనర్ నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేశ్, విజయ్‌కుమార్, నరేశ్, ప్రభ తదితరులు సంగీతం: థమన్ ఎస్ సినిమాటోగ్రఫీ: జయకుమార్ నిర్మాత: బన్నీ వాస్ దర్శకత్వం: మారుతి బ్యానర్లు: యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ‘ప్రతిరోజూ పండుగే’. వినూత్న కాన్సెప్ట్‌లతో కమర్షియల్ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు మారుతీ ఒక ఫీల్‌గుడ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అడపాదడపా హిట్లతో నెట్టుకొస్తున్న సాయి ‘చిత్రలహరి’ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్నారు. అటు మారుతీ కూడా భలేభలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల తర్వాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇంతకూ ‘ప్రతిరోజూ పండుగే’ అంటూ తాత-మనవళ్లు ప్రేక్షకులకు ఏం చెప్పారు? సంక్రాంతికి ముందే తెర నిండుగా పండుగ తీసుకొచ్చారా? కథ: రాజమండ్రికి చెందిన పసుపులేటి రఘురామయ్య వయస్సు మీదపడిన పెద్దాయన. ఆయన పిల్లలు దూరంగా సెటిలయ్యారు. ఈ దశలో ఆయనకు లంగ్ క్యాన్సర్ తీవ్రమవుతుంది. ఇంకా కొన్ని వారాలే బతుకుతారని డాక్టర్ చెప్తారు. కానీ ఎక్కడో దూరంగా సెటిలైన పిల్లలు తండ్రికి వచ్చిన కష్టం కన్నా.. ఎన్ని రోజులు ఆయనతో ఉండి.. ఎంత తర్వగా ఆయన చావు తతంగం పూర్తి చేసి.. చేతులు దులుపుకొని వెళ్లిపోవాలా? అని చూస్తారు. కానీ, ఆయన మానవడు మాత్రం తాత చివరి రోజులు సంతోషంగా చూడాలనుకుంటాడు. ఆయన నెరవేరని కోరికలు తీర్చాలనుకుంటాడు. కానీ, అతని తల్లిదండ్రులు, బాబాయి-పిన్నిలు, అత్త-మామల ధోరణి అందుకు భిన్నంగా ఉంటుంది. చివరి రోజుల్లో తండ్రిని సుఖంగా చూసుకోవడం కంటే తమ జాబ్‌లు, జీవితాలు ఇవే ముఖ్యమనుకుంటారు. పెద్దాయన మనస్సు నొప్పించేలా ప్రవర్తిస్తుంటారు. ఈ నేపథ్యంలో తాత కోసం తపించే సాయి ఏం చేస్తాడు? తమ పిల్లల కోసం సర్వస్వాన్ని త్యాగం చేసే వాళ్లు కూడా యాంత్రిక జీవితంలో పడి.. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను చూసుకోవడంలో నిర్లిప్తంగా ఉంటారు. ఏదోలే పోతేపోయారు అనుకుంటారు. అలాంటి వారిని ఈ మనవడు ఎలా మారుస్తాడు? అన్నది మిగతా కథ. విశ్లేషణ: ‘ప్రతిరోజూ పండుగే’ అనే ఫీల్ గుడ్ టైటిల్‌తో బీటలు వారుతున్న కుటుంబ సంబధాల నేపథ్యంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాప్ కథ ఒకింత ఫ్లాటుగా ప్రారంభమవుతుంది. తాతకు లంగ్‌క్యాన్సర్ అని తెలియడం, మనవడు సాయి పరిగెత్తుకురావడం, తాత కోరికలు తీర్చడం, తాత కోసం ఏంజిల్ అరుణను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడటం, సత్యరాజ్ పిల్లలంతా ఇంటికి చేరడం ఇలా కథ.. ఒకింత సాగదీసినట్టు అనిపిస్తుంది. కానీ, ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. పలుచోట్ల గిలిగింతలు పెడుతాయి. కామెడీ సీన్లతో సాగుతూ ఇంటర్వెల్ వరకు వచ్చేసరికి కథ ప్రధాన మలుపు తిరుగుతుంది. సెకండాప్లోనూ కథ పెద్దగా కనిపించదు. తండ్రి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కోసం ఆరాటపడుతూ.. బతికుండే తండ్రి చావు కోసం పిల్లలు చేసే ఆరాట ఆర్భాటాలు... సమాజంలోని అసంబద్ధతను చూపిస్తూనే కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు భావోద్వేగంగా సాగుతూ ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి. క్లైమాక్స్ ఒకింత లెంగ్తీగా అనిపించినా సినిమాకు ఇదే ప్రధాన బలమని చెప్పవచ్చు. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిని వారిని కడిగిపారేసేలా క్లైమాక్స్ సీన్లు సాగుతాయి. ఇక, తాతమనవళ్లుగా సత్యరాజ్-సాయి సెంటిమెంట్‌ను పండించారు. సినిమాలో ప్రధానపాత్ర సత్యరాజ్దే. చావుకు చేరువగా ఉన్న తన పట్ల కుటుంబసభ్యుల అనుచిత ప్రవర్తన, ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అనుకునే వారి తీరుతో ఆయన పడే మానసిక క్షోభ.. సత్యరాజ్ అద్భుతంగా పండిచారు. మనవడిగా, పెద్దలకు బుద్ధిచెప్పే కొడుకుగా సాయి కూడా తన నటనతో మెప్పించాడు. ఒక ఫైట్ సీన్లో తొలిసారి తెరమీద సాయి సిక్స్‌ప్యాక్ బాడీని ఎక్స్పోజ్ చేశాడు. సాయి తండ్రిగా రావు రమేశ్ పాత్ర సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆద్యంతం నవ్వులు కురిపిస్తుంది. అందంగా కనిపించడమే కాదు.. టిక్‌టాక్ పిచ్చిలో మునిగిపోయిన ఏంజిల్ అరుణగా రాశీ ఖన్నా తన పరిధి మేరకు పాత్రను పండించారు. పాటలు, కొన్ని కామెడీ సీన్లు మినహాగా హీరోయిన్ పాత్రకు అంతగా స్కోప్ లేదు. మిగతా నటులూ తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు. థమన్ పాటలు బావున్నాయి. క్యాచీ వర్డ్స్‌తో సాగే ‘ఓ బావా’ పాటను తెరకెక్కించిన విధానమూ బాగుంది. నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌గా నిలిచింది. సినిమా స్థాయి తగ్గట్టుగా నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్‌లో సినిమాకు మరింత పదును పెట్టాల్సింది. కథ ఒకింత రొటీన్‌గా అనిపించడం, కామెడీ సీన్లు, క్లైమాక్స్ బాగున్నా.. స్క్రీన్‌ప్లే అంతగా నవ్యత లేకపోవడం, సాగదీసినట్టు అనిపించడం, ఇలాంటి కథతో ఇప్పటికే శతమానం భవతి లాంటి సినిమాలు రావడం.. ఈ సినిమాను ప్రేక్షకులు మేరకు ఆదరిస్తాన్నది చూడాలి బలాలు తాత-మనవళ్ల సెంటిమెంట్ కామెడీ సీన్లు క్లైమాక్స్ సీన్లు బలహీనతలు రొటీన్ కథ, కథనాలు సాగదీసినట్టు అనిపించడం - శ్రీకాంత్ కాంటేకర్ -
‘లంగ్ క్యాన్సర్.. ఐదు వారాలకు మించి’
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ప్రతిరోజూ పండగే. చాలా రోజుల తరువాత చిత్రలహరి సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన సాయి, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిరోజూ పండగేతో మరో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్లు ఫ్యామిలీ ఆడియన్స్న్స్ను కనెక్ట్ చేసేలా ఉన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా మూవీ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘లంగ్ క్యాన్సర్.. ఐదు వారాలకు మించి బతకడు’అనే హార్ట్ టచ్ డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్.. అద్యంతం వినోదం, ఉద్వేగభరితంగా సాగింది. ‘పెద్ద కొడుకుగా మీరు కదా కర్మకాండ చేయాల్సింది.. అది రూలే కంపల్సరీ కాదు’, ‘మారే కాలంతో పాటూ మనమూ మారాలి, వయసుతో పాటు ఆశలు కూడా చచ్చిపోవాలి’, ‘నీ లవ్ స్టోరీని గౌతమ్ మీనన్‌లా చిన్న త్రెడ్ పట్టుకొని సాగదీయలేము’, ‘లాస్ట్ డేస్‌లో కూడా లాజిక్‌లకు తక్కువేం లేదు’వంటి డైలాగ్‌లు అన్ని వర్గాల ప్రజలను కనెక్ట్ చేసేలా ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 20న విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. -
ప్రతిరోజు పండగే ఫస్ట్ గ్లిమ్స్