
సాక్షి, చెన్నై: నటుడు ప్రభాస్ తనకు నమ్మకం కలిగించారని సీనియర్ నటుడు, నిర్మాత సత్యరాజ్ వ్యాఖ్యానించారు. ఈయన తన కొడుకు హీరోగా నాదాంబాళ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన చిత్రం సత్య. నటి రమ్యానంబీశన్ హీరోయిన్‌గా నటించిన ఇందులో నటి వరలక్ష్మీశరత్‌కుమార్ ప్రధాన పాత్రను పోషించారు.ఆనందరాజ్, సతీష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సైతా న్ చిత్రం ఫేమ్ ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం బాధ్యతను నిర్వహించారు.
ఇది తెలుగులో మంచి విజయాన్ని సాధించిన క్షణం చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. సమన్ కే.కింగ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈ నెల 8వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు, నిర్మాత సత్యరాజ్ మాట్లాడుతూ.. తాను బాహుబలి చిత్ర షూటింగ్‌లో ఉన్నప్పుడు తన కొడుకు సిబిరాజ్ ఫోన్ చేసి తెలుగు చిత్రం క్షణం గురించి వివరాలను తెలుసుకోమని చెప్పాడన్నారు.
ఆ సమయంలో తన పక్కనే ఉన్న నటుడు ప్రభాస్‌ను క్షణం గురించి అడగ్గా చాలా మంచి చిత్రం ఎందుకడుగుతున్నారు అని అడిగారన్నారు. తన కొడుకు సిబిరాజ్ ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకుంటున్నాడని తాను చెప్పగా మంచి సినిమా రీమేక్ చేయండని ప్రభాస్ నమ్మకం కలి గించారని తెలిపారు. దీంతో ఆ చిత్ర రీమేక్ హక్కులను కొనుగోలు చేసి సిబిరాజ్ మంచి టీమ్‌తో తమిళంలో సత్య పేరుతో రూపొందించారని తెలిపారు. చిత్రం అనుకున్నదానికంటే చాలా బాగా వచ్చిందని, ఈ చిత్ర టైటిల్‌ని నటుడు కమలహాసన్ ఇచ్చారని, అదే విధంగా నటుడు సూర్య చిత్ర ట్రైలర్‌ను శనివారం ఆవిష్కరించారని తెలిపారు.
క్షణం చిత్రం రీమేక్ హక్కులు కొనుగోలు చేసిన తరువాత విజయ్‌ఆంటోని ఫోన్ చేసి దర్శకుడు ఎవరనుకుంటున్నారు? ఎవరిని ఫిక్స్ చేయకపోతో ప్రదీప్ కృష్ణమూర్తిని పెట్టుకోండి. తన సైతాన్ చిత్రాన్ని బాగా తెరెక్కిం చారాయన అని చెప్పారన్నారు. దీంతో తాను ప్రదీప్ కృష్ణమూర్తిని కలిసి కథ గురించి చెప్పి ఆయన్నే దర్శకత్వం చేయమని సిబిరాజ్ తెలి పారు. మంచి చిత్ర యూనిట్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని నటి రమ్యానంబీశన్ అంది.
Comments
Please login to add a commentAdd a comment