ఓటీటీకి క్రేజీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్‌ ఫిక్స్! | My Perfectt Husband Web Series Streaming From This Date | Sakshi
Sakshi News home page

My Perfectt Husband: 'మై ఫర్‌ఫెక్ట్‌ హస్బెండ్‌'.. స్ట్రీమింగ్ డేట్‌ ఫిక్స్!

Published Sun, Aug 11 2024 5:02 PM | Last Updated on Sun, Aug 11 2024 5:15 PM

My Perfectt Husband Web Series Streaming From This Date

కోలీవుడ్ నటుడు సత్యరాజ్, రేఖ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా వెబ్ సిరీస్‌ 'మై హస్బెండ్‌ ఫర్‌ఫెక్ట్‌'. ఈ సిరీస్‌లో టాలీవుడ్ హీరోయిన్ వర్షబొల్లమ్మ కూడా నటించారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌కు తమిర దర్శకత్వం వహించారు. తాజాగా ట్రైలర్‌ రిలీజ్ చేసిన మేకర్స్‌.. స్ట్రీమింగ్‌ డేట్‌ను కూడా ఖరారు చేశారు.

ట్రైలర్ చూస్తుంటే ఓ ఉమెన్స్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేసే పాత్రలో సత్యరాజ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు భార్యగా  రేఖ కనిపించనున్నారు. టైటిల్ చూస్తుంటేనే భార్య, భర్తల కోణంలోనే కథను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.  ట్రైలర్‌లో వచ్చే సన్నివేశాలు చూస్తుంటే ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్‌ ఎమోషన్స్‌తోనే ప్రధానంగా తెరకెక్కించారని కనిపిస్తోంది.

కాగా.. మై పర్‌ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్‍ను మహమ్మద్ రషిత్ నిర్మించగా.. విద్యాసాగర్ సంగీతం అందించారు. ఈ ఫ్యామిలీ డ్రామా సిరీస్‍ను ఆగస్టు 16 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‍స్టార్ స్ట్రీమింగ్ కానుంది. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని హాట్‍స్టార్ అధికారికంగా వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement