Actor Sathyaraj's mother passes away at 94 - Sakshi
Sakshi News home page

Sathyaraj: సత్యరాజ్‌ ఇంట తీవ్ర విషాదం

Aug 12 2023 7:37 AM | Updated on Aug 12 2023 9:43 AM

Sathyaraj Mother Passed Away - Sakshi

సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ తల్లి నాదాంబాళ్‌ కాళింగరాయర్‌ వృద్ధాప్యం కారణంగా కోవైలో కన్ను మూశారు. ఆమె వయసు 94 ఏళ్లు. నాదాంబాళ్‌ కాళింగరాయర్‌కు కొడుకు సత్యరాజ్‌తో పాటు కల్పనా మండ్రాడియార్‌, రూపా సేనాధిపతి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

కోవైలో నివశిస్తున్న నాదాంబాళ్‌ కాళింగరాయర్‌ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో షూటింగ్లో ఉన్న నటుడు సత్యరాజ్‌కు ఈ వార్త తెలియగానే వెంటనే కోయంబత్తూరుకు చేరుకున్నారు. ఇక సత్యరాజ్‌కు తల్లి అంటే ఎంతో ఇష్టం. ఆమెకు తాను నటించిన సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టమని సత్యరాజ్‌ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఇక సత్యరాజ్ తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా కోలీవుడ్ నటుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement