ప్రముఖ హాస్య నటుడు బొండా మణి (60) అకస్మాత్తుగా మృతి చెందారు. కొన్నిరోజుల క్రితం పలు అనారోగ్య సమస్యలతో ఈయన ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. పలువురు సాయం చేయగా కోలుకున్నట్లు కనిపించారు. ఇప్పుడేమో సడన్‌గా శనివారం రాత్రి 11:30 గంటల టైంలో ఇంట్లోనే కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు.. ఈయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.
(ఇదీ చదవండి: ఊరమాస్‌కి కేరాఫ్.. ఆ విషయంలో ఎక్స్‌పర్ట్.. ప్రశాంత్ నీల్ సక్సెస్ సీక్రెట్ ఇదే!)
శ్రీలంకలో పుట్టిన బొండా మణి.. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేశారు. 1991లో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 175కి పైగా సినిమాల్లో హాస్య పాత్రలు చేశారు. సుందర్ ట్రావెల్స్, మరుదమలై, విన్నర్, వేలాయుతం, జిల్లా తదితర చిత్రాలు.. ఈయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఇకపోతే స్టార్ కమెడియన్ వడివేలుతో ఈయన కాంబోకి చాలా క్రేజ్ ఉంది. చాలా సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తుంటాయి.
అయితే కొన్నాళ్ల ముందు మణి ఆరోగ్యం బాలేదని వార్తలొచ్చాయి. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని, డయాలసిస్ చేయించుకోవడానికి కూడా డబ్బుల్లేవని తెలియడంతో పలువురు తమిళ యాక్టర్స్.. ఆర్థిక సాయం చేశారు. దీంతో మణి కోలుకున్నారు. కానీ ఇప్పుడు ఇలా అనుకోని విధంగా కుప్పకూలిపోయి తుదిశ్వాస విడిచారు.
(ఇదీ చదవండి: 'సలార్' కలెక్షన్స్ రచ్చ.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment