'డబ్బు కోసమే 46 ఏళ్ల కమెడియన్‌తో పెళ్లి'.. నటి ఏమందంటే? | Sangeetha Response On Trolls Marriage With Redin Kingsley | Sakshi
Sakshi News home page

కమెడియన్‌తో రెండో పెళ్లి.. ఈ వయసులో అవసరమా? అని విమర్శలు.. స్పందించిన నటి

Published Mon, May 20 2024 12:50 PM | Last Updated on Mon, May 20 2024 1:03 PM

Sangeetha Response On Trolls Marriage With Redin Kingsley

జైలర్‌ నటుడు, కమెడియన్‌ రెడిన్‌ కింగ్‌స్లీ గతేడాది పెళ్లి చేసుకున్నాడు. 46 ఏళ్ల వయసులో ప్రియురాలు, నటి సంగీత మెడలో మూడుముళ్లు వేశాడు. వివాహం తర్వాత తన ఫస్ట్‌ బర్త్‌డేను భార్యతో కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నాడు. అంత పెద్ద వయసులో ఉన్నవాడిని సంగీత పెళ్లి చేసుకోవడానికి కారణం డబ్బేనని చాలామంది విమర్శించారు. ఇకపోతే సంగీతకు ఇదేమీ ఫస్ట్‌ మ్యారేజ్‌ కాదు. 

రెండో పెళ్లి
గతంలో ఆమె క్రిష్‌ను పెళ్లాడగా వీరికి ఒక పాప కూడా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం సంగీత రెడిన్‌తో ప్రేమలో పడగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తన పెళ్లిపై వస్తున్న ట్రోల్స్‌పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది. సంగీత మాట్లాడుతూ.. ఈ వయసులో పెళ్లి అవసరమా? అంటున్నారు. 

మా వయసు పెరగలేదు
మానసికంగా నా వయసు 18, తన వయసు 22! మేము ఆ ఏజ్‌లోనే ఉన్నట్లు ఫీలవుతున్నాం. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఇంకేమన్నారు.. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానా? అదెలాగో కాస్త వివరించి చెప్తారా? మీ వల్ల కాదు! అతడిలో నాకు నచ్చింది సింప్లిసిటీ! చాలా నిరాడంబరంగా ఉంటాడు. అది చూసే తనను పెళ్లి చేసుకున్నాను అని పేర్కొంది.

కమెడియన్‌గా గుర్తింపు
కాగా రెడిన్‌ కింగ్‌స్లీ.. కోలమావు కోకిల అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించాడు. నెల్సన్‌ డైరెక్ట్‌ చేసిన అన్ని సినిమాల్లోనూ రెడిన్‌ యాక్ట్‌ చేశాడు. డాక్టర్‌ మూవీలో ఈయన పోషించిన భగత్‌ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

సీరియల్స్‌- సినిమాలు
ఎల్‌కేజీ, అన్నాత్తె, బీస్ట్‌, కాతువాకుల రెండు కాదల్‌, మార్క్‌ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్‌ వంటి పలు సినిమాల్లో నవ్వులు పూయించాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్‌ వంటి సినిమాలు చేయగా సీరియల్స్‌లోనే ఎక్కువగా నటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement