Redin Kingsley
-
జైలర్ మూవీ కమెడియన్‌తో నటి పెళ్లి.. అదే నాన్న చివరి కోరిక (ఫోటోలు)
-
'డబ్బు కోసమే 46 ఏళ్ల కమెడియన్‌తో పెళ్లి'.. నటి ఏమందంటే?
జైలర్ నటుడు, కమెడియన్ రెడిన్ కింగ్స్లీ గతేడాది పెళ్లి చేసుకున్నాడు. 46 ఏళ్ల వయసులో ప్రియురాలు, నటి సంగీత మెడలో మూడుముళ్లు వేశాడు. వివాహం తర్వాత తన ఫస్ట్ బర్త్‌డేను భార్యతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. అంత పెద్ద వయసులో ఉన్నవాడిని సంగీత పెళ్లి చేసుకోవడానికి కారణం డబ్బేనని చాలామంది విమర్శించారు. ఇకపోతే సంగీతకు ఇదేమీ ఫస్ట్ మ్యారేజ్ కాదు. రెండో పెళ్లిగతంలో ఆమె క్రిష్‌ను పెళ్లాడగా వీరికి ఒక పాప కూడా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం సంగీత రెడిన్తో ప్రేమలో పడగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తన పెళ్లిపై వస్తున్న ట్రోల్స్‌పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది. సంగీత మాట్లాడుతూ.. ఈ వయసులో పెళ్లి అవసరమా? అంటున్నారు. మా వయసు పెరగలేదుమానసికంగా నా వయసు 18, తన వయసు 22! మేము ఆ ఏజ్‌లోనే ఉన్నట్లు ఫీలవుతున్నాం. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఇంకేమన్నారు.. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానా? అదెలాగో కాస్త వివరించి చెప్తారా? మీ వల్ల కాదు! అతడిలో నాకు నచ్చింది సింప్లిసిటీ! చాలా నిరాడంబరంగా ఉంటాడు. అది చూసే తనను పెళ్లి చేసుకున్నాను అని పేర్కొంది.కమెడియన్‌గా గుర్తింపుకాగా రెడిన్ కింగ్స్లీ.. కోలమావు కోకిల అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. నెల్సన్ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ రెడిన్ యాక్ట్ చేశాడు. డాక్టర్ మూవీలో ఈయన పోషించిన భగత్ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.సీరియల్స్- సినిమాలుఎల్కేజీ, అన్నాత్తె, బీస్ట్, కాతువాకుల రెండు కాదల్, మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్ వంటి పలు సినిమాల్లో నవ్వులు పూయించాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాలు చేయగా సీరియల్స్‌లోనే ఎక్కువగా నటించింది. -
Redin Kingsley-Sangeeta Birthday Photos: పెళ్లయ్యాక నటుడి తొలి బర్త్‌డే.. భార్య సర్ప్రైజ్ పార్టీ (ఫోటోలు)
-
Redin Kingsley- Sangeetha: జైలర్ నటుడితో ఏడడుగులు.. పెళ్లి ఫోటోలు షేర్ చేసిన బుల్లితెర నటి (ఫోటోలు)
-
హనీమూన్ చెక్కేసిన నవదంపతులు.. పెళ్లి వీడియో చూశారా?
జైలర్ నటుడు, కమెడియన్ రెడిన్ కింగ్స్లీ లేటు వయసులో పెళ్లి చేసుకున్నాడు. 46 ఏళ్ల వయసులో సీరియల్ నటి సంగీతను పెళ్లాడాడు. ఎటువంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా వివాహ శుభాకార్యాన్ని సింపుల్‌గా ముగించేశాడు. ఆదివారం నాడు (డిసెంబర్ 10న) బెంగళూరులో ఇరు కుటుంబాలు, అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. సడన్‌గా పెళ్లి చేసుకుని సర్ప్రైజ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరు సడన్‌గా పెళ్లి చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. దీంతో సెలబ్రిటీలు, అభిమానులు.. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించిన రెడిన్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ కొత్త జంట హనీమూన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత తొలిసారి రెడిన్ కింగ్స్లీ తన భార్యతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. మరోవైపు సంగీత తన పెళ్లి వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇద్దరి బ్యాగ్రౌండ్ ఇదే.. రెడిన్ కింగ్స్లీ.. కోలమావు కోకిల సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్ర డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లోనూ రెడిన్ యాక్ట్ చేశాడు. అలాగే ఎల్కేజీ, సంతనాతిన్ ఏ1, జాక్‌పాట్, నెట్టికన్ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. డాక్టర్, జైలర్ చిత్రాలతో మరింత గుర్తింపు సంపాదించుకున్నాడు. సంగీత విషయానికి వస్తే.. ఈ నటి అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాల్లో నటించింది. కానీ ఎక్కువగా బుల్లితెరపైనే సందడి చేసింది. పలు సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించింది. View this post on Instagram A post shared by Redin Kingsly (@redin_kingsley) View this post on Instagram A post shared by ©️ Silvan Photography (@silvan__photography) చదవండి: కీరవాణితో వియ్యం.. నిజమేనన్న మురళీ మోహన్.. అప్పుడే పెళ్లి! -
46 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్ (ఫొటోలు)
-
లేటు వయసులో పెళ్లి చేసుకున్న జైలర్ నటుడు, ఫోటోలు వైరల్
ప్రముఖ కమెడియన్ రెడిన్ కింగ్స్లీ లేటు వయసులో పెళ్లిపీటలెక్కాడు. 46 ఏళ్ల వయసున్న ఇతడు బుల్లితెర నటి సంగీత మెడలో మూడుముళ్లు వేశాడు. ఇరుకుటుంబ సభ్యులు, అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఆదివారం జరిగిన ఈ శుభకార్యానికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. నటుడు, డ్యాన్సర్ సతీష్ కృష్ణన్ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త జంట పెళ్లి ఫోటోలను షేర్ చేశాడు. అలాగే ఇదేమీ సినిమా షూటింగ్ కాదని, వీళ్లు నిజంగానే పెళ్లి చేసుకున్నారని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా రెడిన్ కింగ్స్లీ.. కోలమావు కోకిల అనే తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈయన డైరెక్ట్ చేసిన దాదాపు అన్ని సినిమాల్లోనూ రెడిన్ యాక్ట్ చేశాడు. డాక్టర్ మూవీలో ఈయన పోషించిన భగత్ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఎల్కేజీ, అన్నాత్తె, బీస్ట్, కాతువాకుల రెండు కాదల్, మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్ వంటి పలు సినిమాలు చేశాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాలు చేసింది. ఎక్కువగా సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందింది. #RedinKingsley and #Sangeetha were in a relationship for more than an year or so ❤ They got married at chamundeshwari temple at Mysore pic.twitter.com/iDEQ9wtqaZ — Kollywood Pictures (@KollywoodPics) December 10, 2023 Actor #RedinKingsley sir married to a Serial Actress #Sangeetha mam.Congrats & Happy Marriage Life 💐❤️💫pic.twitter.com/ppMjGy0zmH — 𝘚𝘸𝘦𝘵𝘩𝘢™ (@Swetha_little_) December 10, 2023 చదవండి: క్యాసినో వల్ల డబ్బులు పోగొట్టుకున్నాం.. ఆ రోజు పోలీసులు..