![Actress Sangeetha And Redin Kingsley Expecting Her First Child](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/redin-kingsley.jpg.webp?itok=KXUvj_bB)
జైలర్ నటుడు, కమెడియన్ రెడిన్ కింగ్‌స్లీ లేటు వయసులో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 46 ఏళ్ల వయసులో సీరియల్ నటి సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2023 డిసెంబర్ 10న బెంగళూరులో ఇరు కుటుంబాలు, అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. అయితే, ఈ జంట ఇప్పుడు గుడ్‌న్యూస్ చెప్పింది. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించింది. వారి వివాహం తర్వాత అంత పెద్ద వయసులో ఉన్నవాడిని సంగీత పెళ్లి చేసుకోవడానికి కారణం డబ్బేనని చాలామంది విమర్శించారు. కానీ, సంగీతకు కూడా ఇదేమీ ఫస్ట్ మ్యారేజ్ కాదంటూ మరికొందరు కామెంట్లు చేశారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_447.jpg)
కొంతకాలంగా ప్రేమలో ఉన్న వారిద్దరూ.. ఒకరోజు సడన్‌గా పెళ్లి చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. అయితే, ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ గుడ్‌న్యూస్ చెప్పారు. సంగీత సీమంతం వేడుక జరిగే వరకు ఎక్కడా కూడా ఈ విషయాన్ని వారు తెలుపలేదు. ఇలా సడెన్‌గా తాము తల్లిదండ్రులం కాబోతున్నామని చెప్పడంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. Toకాగా రెడిన్ కింగ్‌స్లీ.. కోలమావు కోకిల అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. నెల్సన్ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ రెడిన్ యాక్ట్ చేశాడు. డాక్టర్ మూవీలో ఈయన పోషించిన భగత్ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. బీస్ట్, మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్ వంటి పలు సినిమాలు చేశాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాలు చేసింది. ఎక్కువగా సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/2_167.jpg)
సంగీతకు రెండో పెళ్లి
గతంలో ఆమె క్రిష్‌ను పెళ్లాడగా వీరికి ఒక పాప కూడా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం సంగీత రెడిన్‌తో ప్రేమలో పడగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లిపై ఆ సమయంలో భారీగానే ట్రోల్స్ వచ్చాయి. ఈ వయసులో పెళ్లి అవసరమా..? అంటూ చాలామంది విమర్శించారు. వాటికి సమాధానంగా సంగీత ఇలా చెప్పింది. 'మానసికంగా నా వయసు 18, తన వయసు 22! మేము ఆ ఏజ్‌లోనే ఉన్నట్లు ఫీలవుతున్నాం. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఇంకేమన్నారు.. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానా? అదెలాగో కాస్త వివరించి చెప్తారా? మీ వల్ల కాదు! అతడిలో నాకు నచ్చింది సింప్లిసిటీ! చాలా నిరాడంబరంగా ఉంటాడు. అది చూసే తనను పెళ్లి చేసుకున్నాను' అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment