
జైలర్, డాక్టర్ తదితర డబ్బింగ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ రెడిన్ కింగ్ స్లీ. హాస్యంతో పాటు మంచి డ్యాన్సర్ కూడా. లేటు వయసులో నటి సంగీతని ప్రేమించి పెళ్లిచేసుకోగా.. కొన్నాళ్ల క్రితం ప్రెగ్నెన్సీని కూడా ప్రకటించారు. తాజాగా ఫొటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
నటుడిగా రాణిస్తున్న రెడిన్.. 40 ఏళ్లు దాటిపోయినా సరే మొన్నమొన్నటివకు సింగిల్ గానే ఉన్నాడు. ఈ క్రమంలోనే తమిళ సీరియల్ నటి సంగీతని ప్రేమించాడు. అలా 2023 డిసెంబరులో వీళ్లిద్దరూ గుడిలో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు కూడా. సరిగ్గా ఏడాది పూర్తయిన తర్వాత అంటే గతేడాది డిసెంబరులో ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించారు.
(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)
తాజాగా సంగీత ప్రెగ్నెన్సీతొ ఫొటో షూట్ చేయించుకుంది. ఈ క్రమంలోనే రెండు ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇందులో ఓ ఫొటోలో అబ్బాయి, అమ్మాయి అని రెండు ట్యాగ్స్ పట్టుకోవడంతో ఈమెకు కవలలు పుట్టబోతున్నారా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
దళపతి విజయ్ 'మాస్టర్' సహా పలు సినిమాల్లో సంగీత నటించినప్పటికీ, సీరియల్స్ తో పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం గర్భవతి కావడంతో కొన్ని నెలల పాటు సీరియల్స్ లో నటించడం మానేసింది సంగీత.
(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా)


Comments
Please login to add a commentAdd a comment