బిగ్‌బాస్‌ షోలో ప్రముఖ కమెడియన్‌? | Bigg Boss: Is Comedian Senthil Participating BB Tamil 8? | Sakshi

500కు పైగా సినిమాలు చేసిన కమెడియన్‌.. బిగ్‌బాస్‌ షోలో కంటెస్టెంట్‌గా..!

Sep 21 2024 5:52 PM | Updated on Sep 21 2024 6:42 PM

Bigg Boss: Is Comedian Senthil Participating BB Tamil 8?

తమిళ బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌ లాంచ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలతో బిగ్‌బాస్‌ టీమ్‌ సంప్రదింపులు జరుపుతోంది. కొందరిని ఆల్‌రెడీ ఫైనలైజ్‌ చేయగా మరికొందరికి ఇంకా ఏ కన్ఫర్మేషన్‌ ఇవ్వలేదు. మరోవైపు షోలోకి వచ్చే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పలువురి సెలబ్రిటీల పేర్లు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి..

తాజాగా ఆ జాబితాలో సీనియర్‌ నటుడు, కమెడియన్‌ సెంథిల్‌ పేరు వినిపిస్తోంది. కేవలం తమిళంలోనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలోనూ ఈయనకు గుర్తింపు ఉంది. ఎక్కువగా పాపులర్‌ కమెడియన్‌ గౌండమణితో కలిసి వెండితెరపై నవ్వులు పూయించేవాడు.

సెంథిల్‌ జర్నీ..
సెంథిల్‌ 1970వ దశకంలో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో చిన్నాచితకా పాత్రలే చేసేవాడు. ఎప్పుడైతే కమెడియన్‌ గౌండమణితో కలిసి నటించడం మొదలుపెట్టాడో అప్పుడు తన దశ తిరిగిపోయింది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన కరగట్టకరన్‌, మన్నన్‌, చిన్నతంబి, ఇండియన్‌.. వంటి ఎన్నో చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. తెలుగులో తొలి ముద్దు, మనీ మనీ మోర్‌ మనీ వంటి పలు చిత్రాల్లో యాక్ట్‌ చేశాడు. 

దాదాపు 500 సినిమాల్లో యాక్ట్‌ చేసిన ఈయనను సినీప్రియులు ఎంతగానో ఇష్టపడతారు, గౌరవిస్తారు. అలాంటి ఈయన ఇప్పుడు బిగ్‌బాస్‌కు రాబోతున్నాడని వార్తలు వస్తుండటంతో అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరి అతడి ఎంట్రీ నిజమేనా? కాదా? అనేది తెలియాలంటే అక్టోబర్‌లో తమిళ బిగ్‌బాస్‌ 8 ప్రారంభమయ్యేవరకు వేచి చూడాల్సిందే!

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement