Senthil
-
బిగ్‌బాస్ షోలో ప్రముఖ కమెడియన్?
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ లాంచ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలతో బిగ్‌బాస్ టీమ్ సంప్రదింపులు జరుపుతోంది. కొందరిని ఆల్రెడీ ఫైనలైజ్ చేయగా మరికొందరికి ఇంకా ఏ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరోవైపు షోలోకి వచ్చే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పలువురి సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..తాజాగా ఆ జాబితాలో సీనియర్ నటుడు, కమెడియన్ సెంథిల్ పేరు వినిపిస్తోంది. కేవలం తమిళంలోనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలోనూ ఈయనకు గుర్తింపు ఉంది. ఎక్కువగా పాపులర్ కమెడియన్ గౌండమణితో కలిసి వెండితెరపై నవ్వులు పూయించేవాడు.సెంథిల్ జర్నీ..సెంథిల్ 1970వ దశకంలో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో చిన్నాచితకా పాత్రలే చేసేవాడు. ఎప్పుడైతే కమెడియన్ గౌండమణితో కలిసి నటించడం మొదలుపెట్టాడో అప్పుడు తన దశ తిరిగిపోయింది. వీరి కాంబినేషన్లో వచ్చిన కరగట్టకరన్, మన్నన్, చిన్నతంబి, ఇండియన్.. వంటి ఎన్నో చిత్రాలు బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. తెలుగులో తొలి ముద్దు, మనీ మనీ మోర్ మనీ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. దాదాపు 500 సినిమాల్లో యాక్ట్ చేసిన ఈయనను సినీప్రియులు ఎంతగానో ఇష్టపడతారు, గౌరవిస్తారు. అలాంటి ఈయన ఇప్పుడు బిగ్‌బాస్‌కు రాబోతున్నాడని వార్తలు వస్తుండటంతో అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరి అతడి ఎంట్రీ నిజమేనా? కాదా? అనేది తెలియాలంటే అక్టోబర్‌లో తమిళ బిగ్‌బాస్ 8 ప్రారంభమయ్యేవరకు వేచి చూడాల్సిందే!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
లవ్ మ్యారేజ్.. పిల్లలెప్పుడని ఒత్తిడి తెచ్చారు.. ఎనిమిదేళ్లకు..
పెళ్లయిన ప్రతి జంటకు ఎదురయ్యే ప్రశ్న.. ఏదైనా విశేషముందా? ఈ మాట వినీవినీ విసుగెత్తిపోయే జంటలెన్నో! కొందరు దంపతులు తమ ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకుంటారు. మరికొందరికేమో ప్రెగ్నెన్సీ వచ్చినా అది నిలవదు.. మిస్క్యారేజీ(గర్భస్రావం) అవుతుంటుంది. మలయాళ బుల్లితెర నటి సెంథిల్ శ్రీజకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి.ప్రెగ్నెన్సీ నిలవలేదుపదవ పెళ్లి రోజు సందర్భంగా శ్రీజ భర్త సెంథిల్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అందులో ఆయన మాట్లాడుతూ.. తనకు రెండు మూడుసార్లు గర్భస్రావమైంది. మేము ఏ విషయమైనా ఇంట్లోవాళ్లతో షేర్ చేసుకుంటాం. అలా ప్రెగ్నెన్సీ గురించి చెప్పి వాళ్లు సంతోషించేలోపే మిస్క్యారేజ్ అయిందని చెప్పేవాళ్లం. పిల్లల కోసం ఎంత ఎదురుచూశామో! మా కలలు నీరుగారిపోయిన సమయంలో తను మరోసారి ప్రెగ్నెంట్ అయింది. అంతకుముందు కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ నిలవలేదు కాబట్టి అప్పుడు దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు.ఈసారి కూడా..ఒకవేళ ఈసారి కూడా గర్భం నిలవకపోతే పిల్లలు లేరని బాధపడకూడదని శ్రీజ నాతో అంది. కానీ మా కన్నా ముందు చుట్టుపక్కల వారి బాధ భరించలేకపోయాం. ఎప్పుడూ దాని గురించే అడుగుతూ ఒత్తిడికి గురి చేసేవారు. మా అదృష్టం కొద్దీ ఆ ప్రెగ్నెన్సీ నిలబడి దేవ్ జన్మించాడు. పెళ్లైన కొత్తలో మా ఇద్దరికీ కొంత కన్ఫ్యూజన్ ఉండేది. పెళ్లికి ముందు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. కానీ వివాహం తర్వాత మాత్రం ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం కొంత తగ్గిపోయింది. కొంతకాలం తర్వాత మళ్లీ మంచి స్నేహితులుగా మారిపోయాం. ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటున్నాం. మొదటి మూడేళ్లు..లవ్ మ్యారేజ్ అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లయినా సరే.. మొదటి మూడేళ్లు ఎలాగోలా మ్యానేజ్ చేసుకుంటే తర్వాత జీవితమంతా సాఫీగా ఉంటుంది. మేము ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉండేవాళ్లం. బాబు పుట్టాక పోట్లాడుకునేంత తీరిక దొరకడం లేదు అని చెప్పుకొచ్చాడు. సెంథిల్, శ్రీజ.. సూపర్ హిట్ తమిళ సీరియల్ 'శరవణన్ మీనాక్షి'లో కలిసి నటించారు. ఈ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2023లో దేవ్ అనే కుమారుడు జన్మించాడు.చదవండి: 12 ఏళ్ల క్రితం.. చెప్పులేసుకుని ఇక్కడ నిలబడ్డా.. వెయ్యి రూపాయలతో.. -
పురస్కారం... ఎర్రని రెక్కల పచ్చని పక్షి
రచన చేయడంలో రెండు వర్గీకరణలు ఉన్నాయి అనుకుంటే– ఒకటి: ఇలా మాత్రమే రాయాలి. రెండు: ఇలా కూడా రాయవచ్చు. మొదటి విభాగానికి చెందిన వారికి రాయడానికి ‘సమస్య’ అనేది ప్రధానం కాదు. అందుకే వారికి ఎలాంటి సమస్యలు ఎదురుకావు. ఇక రెండో కోవకు చెందిన వారు సమస్యల మీదే రాస్తారు. వారికి అనేకానేక సమస్యలు ఎదురుకావచ్చు కూడా. అంతమాత్రాన ఆగిపోరు. రాజీ పడరు. ఈ కోవకు చెందిన తమిళ రచయిత్రి అంబై. ఆమె కథా సంకలనం‘శివప్పు కళత్తుడన్ ఒరు పట్చయ్ పరవై’ (ఎర్రటిమెడ ఉన్న పచ్చటిపక్షి) కేంద్రసాహిత్య అకాడమీ అవార్డ్‌కు ఎంపికైంది. అంబై కథలు తీరిగ్గా చదివి, పక్కన పెట్టేవి కావు. అలజడి పెంచి ఆలోచనలకు పదును పెట్టేవి. ఈ కథలలో ఒక పాత్ర ఇలా అంటుంది... ‘నా జీవితంతో పాటే ఎన్నో కిటికీలు ఉన్నాయి. ఎప్పుడైనా ఆ కిటికీల నుంచి బయటకు చూస్తే తెలియని ప్రపంచం, తెలుసుకోవాలనిపించే ప్రపంచం ఆవిష్కారం అవుతుంది. ఎన్ని కిటికీలు ఉన్నా...ప్రతి కిటికీ తనదైన ప్రపంచాన్ని చూపుతుంది’ పందొమ్మిది సంవత్సరాల వయసులోనే కథలు రాయడం మొదలుపెట్టింది అంబై. ప్రసిద్ధ పత్రిక ‘ ఆనంద్ వికటన్’ లో అంబై రాసిన ఎన్నో కథలు ప్రచురితమయ్యాయి. అయితే ‘సిరకుకల్ మురియమ్’ (1967)తో సీరియస్ రైటింగ్ మొదలుపెట్టారు. సంప్రదాయ పాఠకవర్గాలకు ఈ కథలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ‘ఇలా కూడా రాయవచ్చా!’ ‘ఆమె రాసింది నిజమే కదా. మరి మనం ఇలా ఎప్పుడూ ఆలోచించలేదేమిటీ’....అనుకునేవారు. ‘దశాబ్దాల క్రితం రాసిన ఆమె కథలు ఇప్పటికీ కొత్తగానే ఉంటాయి. వాటికి ప్రాసంగికత ఉంటుంది’ అంటున్నారు అంబై కథాసాహిత్యంపై వివరమైన రచనలు చేసిన సెంథిల్. తమిళనాడులోని కొయంబత్తూర్‌లో జన్మించిన అంబై అసలు పేరు సీఎస్.లక్షీ. ముంబై, బెంగళూరులో పెరిగారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజిలో పోస్ట్–గ్రాడ్యుయేషన్ (చరిత్ర) చేసిన అంబై దిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో పీహెచ్‌డి చేశారు. తమిళనాడులో స్కూల్ టీచర్, లెక్చరర్‌గా పనిచేశారు. అనేక ప్రాంతాలు,రకరకాల మనుషులు, వారి మనస్తత్వాలు ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ప్రత్యక్ష,పరోక్ష సమస్యలు ఆమె రాసిన కథలకు వస్తువు అయ్యాయి. అంబై కథల్లోని పాత్రలు మూస ధోరణుల్లో ఆలోచించవు. సమాజంలో కనిపించే అపసవ్యధోరణులను ప్రశ్నిస్తాయి. స్పారో(సౌండ్ అండ్ పిక్చర్ అర్కైవ్స్ ఫర్ రిసెర్చ్ ఆన్ వుమెన్) వ్యవస్థాపకురాలైన అంబై ఈ ఫోరమ్ తరపున మహిళా రచయితలు, కళాకారులకు సంబంధించిన ఎన్నో పుస్తకాలను ప్రచురించారు. -
ఆ ట్విటర్ అకౌంట్‌ని తొలగించండి.. కమెడియన్ సెంథిల్ ఫిర్యాదు
తమిళసినిమా: సీనియర్ హాస్య నటుడు సెంథిల్ తన న్యాయవాదితో కలిసి చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఓ ఫిర్యాదు చేశారు. ఎవరో తన పేరుతో నకిలీ ట్విటర్‌ను ప్రారంభించి వదంతులను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేసినట్లు ఆ నకిలీ ట్విటర్లో పేర్కొన్నారని తెలిపారు. తన పేరుతో నకిలీ ట్విటర్‌ను ప్రారంభించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా తన పేరుతో ప్రారంభించిన నకిలీ ట్విటర్ అకౌంట్‌ను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: Akshay Kumar: పక్కా ప్లాన్.. రూ.1000 కోట్లు టార్గెట్! సమంత కలర్‌పై విమర్శిస్తారని తెలుసు -
హాస్య నటుడిని మోసం చేసిన మేనేజర్
చెన్నై ,పెరంబూరు: ప్రముఖ హాస్యనటుడు సెంథిల్ ఇంటిని తన ఇంటిగా పేర్కొంటూ ఇతరులకు అద్దెకు ఇచ్చి మోసానికి పాల్పడ్డ సినిమా ప్రొడక్షన్ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక సాలిగ్రామంలోని భాస్కర్ కాలనీ 3వ వీధిలో ఉన్న ఫ్లాట్‌లో రెండవ అంతస్తు సీనియర్ హాస్య నటుడు సెంథిల్‌కు చెందినది. పది పోర్షన్లు కలిగిన ఈ ఫ్లాట్ రెండవ అంతస్తును సహాయరాజ్ అనే అదే ప్రాంతానికి చెందిన సినిమా ప్రొడక్షన్ మేనేజర్ నెలకు రూ.2.60 కోట్లు అద్దె చొప్పున గత 2013లో తీసుకున్నాడు.ఆ విధంగా గత 6 ఏళ్లుగా క్రమం తప్పకుండా అద్దె చెల్లించిన సహాయరాజ్ గత 6 నెలలుగా అద్దె చెల్లించడం లేదు. దీంతో సెంధిల్ పలు మార్లు అతనికి ఫోన్ చేసినా సహాయరాజ్ ఫోన్ లిప్ట్ చేయలేదు. దీంతో అనుమానం కలిగిన సెంధిల్ తన అపార్డుమెంట్కు వెళ్లి పరిశీలించారు. అక్కడ అద్దెకు ఉన్న వ్యక్తులను ప్రశ్నించగా సహాయరాజ్ ఈ అపార్టుమెంట్ తనదేనని చెప్పి కొందరికి లీజ్‌కు, మరి కొందరికి అద్దెకు ఇచ్చి లక్షల్లో డబ్బు తీసుకున్న విషయాన్ని చెప్పారు. దీంతో సెంథిల్ సహాయరాజ్ మోసాన్ని గ్రహించి వెంటనే స్థానిక విరుగంబాక్కమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సహాయరాజ్ను అరెస్ట్ చేశారు. -
నటుడు సెంథిల్‌పై కేసు నమోదు
పెరంబూరు: సీనియర్ హాస్యనటుడు సెంథిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నటుడు సెంథిల్ తేని పార్లమెంట్ స్థానానికి అన్నా మక్కళ్ మున్నేట్ర కళగం పార్టీ తరఫున పోటీ చేస్తున్న తంగ తమిళ్సెల్వన్కు మద్దతుగా ఆ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు. కాగా మంగళవారం సెంథిల్‌కు పోడి టీవీకేకే ప్రధాన రోడ్డులో ప్రచారం చేయడానికి పోలీసులు అనుమతినివ్వలేదు. అయినా ఆయన ప్రచార వ్యానును ఆ ప్రాంతంలో నిలిపి ప్రచారం చేశారు. దీంతో ఆ ప్రాతంలోని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఉదయకుమార్ పోడి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సెంథిల్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో సెంథిల్ ఇతర కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా పోడిలోని వార సంత సమీపంలోని కల్యాణమంటపంలో అన్నాడీఎంకేకు చెందిన వారు ప్రజలకు చీర, పంచెలు పంచుతున్నారన్న సమాచారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ శివప్రభుకు అందడంతో ఆయన ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు అన్నాడీఎంకే అభ్యర్థి రవీంద్రనా«థ్‌కుమార్, కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. -
హాస్య నటుడు కన్నుమూత
తమిళనాడు, పెరంబూరు: హాస్య నటుడు కోవై సెంథిల్(74) ఆదివారం ఉదయం కోవైలో కన్నుమూశారు. పలు చిత్రాల్లో హాస్య పాత్రలతో పాటు, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మెప్పించిన నటుడు కోవై సెంథిల్. ముఖ్యంగా ఈయన దర్శకుడు విక్రమన్ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. రజనీకాంత్ నటించిన పడయప్పా, కే.భాగ్యరాజ్ నటించి, దర్శకత్వం వహించిన ఇదునమ్మ ఆళు, వెంకట్‌ప్రభు తెరకెక్కించిన గోవా చిత్రాల్లో మంచి గుర్తింపు పొందాడు. కోవైలో నివశిస్తున్న కోవై సెంథిల్ ఇటీవల అనారోగ్యానికి గురై కోవైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆదివారం సాయంత్రమే ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిపారు. కోవై సెంథిల్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత నటీనటుల సంఘం కోవై సెంథిల్‌కు సంతాపం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. గత 4వ తేదీన హాస్య నటుడు రాకెట్ రామనాథన్, 5వ తేదీన నటుడు వెళ్లై సుబ్బయ్య, ఇప్పుడు నటుడు కోవై సెంథిల్ ఇలా ఒకే వారంలో ముగ్గురు సీనియర్ నటులు మృతి చెందారన్నది గమనార్హం. -
చాటింగ్‌తో చీటింగ్
సీనియర్ నటుడు రహమాన్ నటించిన తమిళ చిత్రం ‘ఒరు ముగత్తిరై’. సెంథిల్ నాథన్ దర్శకుడు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘డాక్టర్ సత్యమూర్తి’ పేరుతో యశ్వంత్ మూవీస్ బ్యానర్‌పై డి. వెంకటేశ్ జూన్ 1న తెలుగులో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో పాటలు రిలీజ్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ట్రైలర్ ఆవిష్కరించారు. డి.వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వాట్సప్, ఫేస్బుక్ ఐడీస్లో వేరే ఫొటోలు పెట్టి చాటింగ్‌లు చేసి చీట్ చెయ్యడం వంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం. దీన్ని ఆధారంగా తీసుకుని కథ నడుస్తుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ. మంచి మెసేజ్ ఉంది’’ అన్నారు. ‘‘సోషల్ మీడియా ద్వారా చాటింగ్, మెంటల్ హెరాస్మెంట్, అన్‌మెచ్యూర్డ్ మైండ్స్‌తో ఏ విధంగా మోసపోతున్నారు? అమ్మాయిలను ఏ విధంగా మోసం చేస్తున్నారు? అనే నేపథ్యంలో కథ ఉంటుంది’’ అన్నారు రహమాన్. ఈ చిత్రానికి కెమెరా: శరవణ పాండియన్, సంగీతం: ప్రేమ్ కుమార్. -
చెర మార్చేనా?
► కసరత్తుల్లో చిన్నమ్మ న్యాయవాదులు ► ఆ కేసు ఖర్చు రూ.12 కోట్లు ► టీఎన్ కు త్వరలో కర్ణాటక లేఖ ► మనో వేదన, అనారోగ్య సమస్య ► శిక్ష అనుభవించాల్సిందే :మార్కండేయ కట్జు సాక్షి, చెన్నై: పరప్పన అగ్రహార చెర నుంచి తమిళనాడులోని ఏదో ఒక జైలుకు చిన్నమ్మ శశికళను మార్చేనా? అన్న చర్చ బయలు దేరింది. ఇందుకు తగ్గ కసరత్తుల్లో న్యాయవాదులు సెంథిల్, అశోకన్ ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక, అక్రమాస్తుల కేసు ఖర్చు రూ. 12 కోట్లుగా కర్ణాటక సర్కారు తేల్చింది. ఈమొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు తగ్గ చర్యల్లో అక్కడి అధికారులు ఉన్నట్టు సమాచారం. అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధానకార్యదర్శి చిన్నమ్మ శశికళ, బంధువులు ఇలవరసి,సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. చిన్నమ్మ, ఇలవరసి ఒకే గదిలో ఉన్నారు. శుక్రవారం వేకువజామున శశికళ ధ్యానం చేసినట్టు, అల్పాహారంగా పులిహోర, మధ్యాహ్నం రాగి సంగటి స్వీకరించినట్టు జైలు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, రాత్రికి చపాతీతో పాటు పండ్లు సిద్ధం చేశారు. చిన్నమ్మకు మధుమేహం ఉండడంతో అందుకు తగ్గ మాత్రలు తీసుకున్నట్టు, మోకాలి నొప్పి తీవ్రత మరీ ఎక్కువగా ఉండడంతో ఆయుర్వేద మందుల్ని తీసుకున్నట్టు సమాచారం. ఆమెకు ఎలాంటి వసతులు లేని దృష్ట్యా, నేల మీద నిద్రకు ఉపక్రమించక తప్పడం లేదని తెలుస్తోంది. బెంగళూరు చెరలో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుండడంతో, శిక్షను తమిళనాడులోని ఏదేని ఒక జైల్లో అనుభవించే విధంగా ప్రత్యేక వ్యూహాన్ని రచించే పనిలో ఆమె తరఫు న్యాయవాదులు నిమగ్నమైనట్టు మద్దతుదారులు పేర్కొంటున్నారు. చెన్నై లేదా వేలూరు, లేదా కోయంబత్తూరు కేంద్ర కారాగారాల్లో ఒక దానిని ఎంపిక చేసి, ఆమెను జైలు మార్చేందుకు తగ్గ ప్రయత్నాల్ని న్యాయవాదులు సెంథిల్, అశోకన్ వేగవంతం చేసినట్టు సమాచారం. ఈ ఇద్దరు చిన్నమ్మ శశికళతో సంప్రదింపులు జరిపినట్టు సంకేతాలు వెలువడ్డాయి. బల పరీక్షలో పళనిస్వామి ప్రభుత్వం నెగ్గిన క్షణాల్లో ఇందుకు తగ్గ ప్రయత్నాల్ని వేగవంతం చేస్తూ కోర్టును ఆశ్రయించేందుకు కార్యాచరణ సిద్ధం చేసి ఉన్నట్టు తెలిసింది. దీంతో చిన్నమ్మను తమిళనాడులోని జైలుకు మార్చేనా అన్న చర్చ ఊపందుకుంది. పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గిన పక్షంలో, ఇక అన్నాడీఎంకే వర్గాలతో పరప్పన అగ్రహార చెర పరిసరాలు కిక్కిరిసే అవకాశాలు ఎక్కువే. ఇది కాస్త అక్కడి అధికార యంత్రాంగానికి ఇబ్బంది కరమే. రూ.12 కోట్లు : అక్రమాస్తుల కేసు విచారణకు కర్ణాటక ప్రభుత్వం రూ.12 కోట్లు ఖర్చు పెట్టింది. 2004 నుంచి 2016 వరకు ఈ కేసు విచారణ బెంగళూరు కోర్టులో సాగిన విషయం తెలిసిందే. తొలుత సిటీ సివిల్ కోర్టులో, తదుపరి అక్కడి హైకోర్టులో, చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. 2004 నుంచి సిటీ సివిల్ కోర్టులో జరిగిన విచారణకు రూ. 2.86 కోట్లు, హైకోర్టులో జరిగిన విచారణకు రూ. 6.68 కోట్లు, పలు శాఖలకు మరో రూ. 3.78 కోట్లు ఖర్చును కర్ణాటక ప్రభుత్వం వెచ్చించింది. ఇక, భద్రతా ఏర్పాట్ల కోసం రూ.70 లక్షలకు పైగా మొత్తం 12 లక్షలు ఖర్చు జరిగినట్టు అక్కడి గణాంకాల విభాగం తేల్చింది. ఈ మొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు తగ్గ చర్యల్లో ఉన్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలో తమిళనాడు ప్రభుత్వానికి కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. కేసుల విచారణకే లెక్కల్ని ప్రకటించిన కర్ణాటక సర్కారు, ఇక రాష్ట్రంలో చిన్నమ్మ రిమోట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరెంత ఖర్చు పెట్టాల్సి ఉంటుందేమో వేచి చూడాల్సిందే. ఈ పరిణామాలను పరిగణించి బల పరీక్షలో పళనిస్వామి నెగ్గగానే, చిన్నమ్మ చెర మార్చే విషయంగా కసరత్తుల వేగం పెరగడం ఖాయం అన్నది స్పష్టం అవుతోంది. ఇక, ఈ విషయంగా అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ను కదిలించగా, ఎక్కడ ఉన్నా, చిన్నమ్మ తమిళ ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తారని వ్యాఖ్యానించారు. జైలు మార్పు విషయంగా ప్రస్తుతానికి చర్యలు తీసుకోలేదని దాట వేశారు. శిక్ష అనుభవించాల్సిందే : నాలుగు సంవత్సరాల పాటుగా శశికళ జైలు శిక్షను అనుభవించాల్సిందేనని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కర్జు పేర్కొన్నారు. తిరుచ్చిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పీలుకు వెళ్లే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదన్నారు. పునస్సమీక్షకు మళ్లీ వెళ్లవచ్చన్నారు. పునస్సమీక్ష పిటిషన్లు అనేకం ఇప్పటి వరకు తిరస్కరణకు గురై ఉన్నాయని వివరించారు. నాలుగేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆరు నెలల తర్వాత పళని స్వామి ప్రభుత్వం గురించి స్పందించగలమని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పన్నీరుకు ప్రజా మద్దతు పుష్కలంగా ఉందని, అయితే, ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడాన్ని పరిగణించాల్సి ఉందన్నారు. -
మనోళ్లకే మూడు పతకాలు
షెఫీల్డ్ (లండన్): బ్రిటిష్ జూనియర్ ఓపెన్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత కుర్రాళ్లు పతకాలతో మెరిశారు. అండర్–19 కేటగిరీలో సెంథిల్ (స్వర్ణం), అభయ్ (రజతం), ఆదిత్య (కాంస్యం) క్లీన్‌స్వీప్ చేశారు. శనివారం జరిగిన ఫైనల్లో వెలవన్ సెంథిల్ కుమార్ 15–13, 11–2, 10–12, 11–7తో అభయ్ సింగ్‌పై చెమటోడ్చి నెగ్గాడు. తద్వారా ఈ టోర్నీలో టైటిల్ నెగ్గిన మూడో భారత ఆటగాడిగా సెంథిల్ ఘనత సాధించాడు. 1970లో అనిల్ నాయర్ మొదటిసారిగా విజేతగా నిలువగా... మరో పతకాన్ని సౌరవ్ ఘోషల్ సాధించిపెట్టాడు. ఆరేళ్ల క్రితం జాతీయ స్థాయి అండర్–15 టోర్నీలో అంతంత మాత్రం ఆడిన ముగ్గురు కుర్రాళ్లు ఇప్పుడు పతకాలు గెలవడంపై కోచ్ సైరస్ పోంచా సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటమితో గుణపాఠాలు నేర్చుకున్న ఈ ముగ్గురు పట్టుదలతో, అంకితభావంతో ఇప్పుడు పతకాలు సాధించారని ప్రశంసించారు. -
తమిళనాడులో మరో స్వాతి..
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ రైల్వేస్టేషన్ లో నెల క్రితం ప్రేమించలేందంటూ టెకీ స్వాతిని నరికిచంపిన ఘటన మరువకముందే విల్లుపురం జిల్లాలో శనివారం మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదంటూ ఓ ఉన్మాది ఆమెకు నిప్పంటించబోయాడు. సెంథిల్(32) ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గత ఏడాది కాలంగా నవీన అనే అమ్మాయి వెనుకతిరిగాడు. ఈ సమయంలో అతన్ని రైలు ఢీకొనడంతో యాక్సిడెంట్ లో కుడి చేయి, కుడి కాలు పోయాయి. కాలు, చేయి లేకపోవడంతో నవీన తనను రెజెక్ట్ చేస్తుందని భావించిన అతను.. ఆమెను అంతమొందించాలనుకున్నాడు. శనివారం సెంథిల్ నవీన ఇంటిబయట దాక్కున్నాడు. నవీన్ ఇంట్లో పెద్దలందరూ వెళ్లిపోయే వరకూ వెయిట్ చేశాడు. వాళ్లు ఇల్లు వదిలి బయటకు వెళ్లగానే లోపలికి ప్రవేశించాడు. ఇంట్లో నవీనతో పాటు ఉన్న ఆమె సోదరి, సోదరులను కత్తి చూపించి బెదిరించాడు. మొదట నవీనకు నిప్పంటిచే ప్రయత్నం చేసినా సఫలం కాకపోవడంతో, తన మీద తానే పెట్రోల్ పోసుకున్నాడు. నిప్పంటించుకుని నవీనకు కూడా అంటించాడు. ఈలోగా ఇంటి నుంచి పెద్దగా అరుపులు వినిపిస్తుండంతో స్థానికులు ఇంటి తలుపులు పగులగొట్టి ఆమెను కాపాడారు. అప్పటికే సెంథిల్ అక్కడికక్కడే కాలిబూడిదయ్యాడు. గాయాలపాలైన నవీనను పాండిచ్చేరిలోని జింపర్ ఆసుపత్రికి తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో నవీన ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉంది. -
నేను చనిపోలేదు.. బాగానే ఉన్నా: కమెడియన్
'ఏయ్ అల్లుడి చెప్పింది చేయ్' అంటూ 'అరుణాచలం' సినిమాలో రజనీకాంత్ వెంట ఉంటూ నవ్వులు పంచిన తమిళ సీనియర్ కామెడియన్ సెంథిల్ చనిపోయాడనే వార్త శుక్రవారం ఇంటర్నెట్ లో దావానలంలా పాకింది. ఈ వార్త వైరల్ కావడంతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. తమిళ చిత్ర పరిశ్రమ నటులు కూడా కలవరం చెందారు. తాను చనిపోయినట్టు వార్తలు గుప్పుమనడంతో తాజాగా సెంథిల్ వివరణ ఇచ్చారు. 'నేను చాలా బాగున్నా. నా అభిమానులు, శ్రేయోభిలాషులు నా గురించి వచ్చిన వదంతుల్ని పట్టించుకోకండి' అంటూ ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తమిళ చిత్రాల్లో కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సెంథిల్. ఆయన 500లకు పైగా చిత్రాల్లో నటించాడు. 'జెంటిల్మన్', 'నరసింహ', 'ముత్తు', 'అరుణాచలం' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆయన విశేషంగా నవ్వించారు. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే పార్టీకి ఆయన మద్దతు పలికారు. ఇక, ఈ మధ్యకాలంలో సీనియర్ నటులు చనిపోయారంటూ ఇంటర్నెట్ లో వదంతులు పుట్టడం తరచూ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటిమొన్న బాలీవుడ్ సీనియర్ నటుడు ఖాదర్ ఖాన్, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ తదితరులు చనిపోయినట్టు వదంతులు గుప్పుమన్నాయి. -
నిజమైన శ్రీమంతుడు!
ఆదర్శం ఈ మధ్యనే ‘శ్రీమంతుడు’ సినిమా విడుదలైంది. అందులో మహేశ్‌బాబు కోటీశ్వరుడు. కానీ తన సొంత ఊరిని బాగు చేయడం కోసం అన్ని సుఖాలూ వదులు కుంటాడు. ఆ ఊరి రూపురేఖల్ని మారుస్తాడు. ఊరి జనం జీవితాల్లో సంతోషాన్ని నింపుతాడు. ఇదంతా చూసి ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. మళ్లీ మళ్లీ చూసి సినిమాని సూపర్‌హిట్ చేశారు. అయితే సినిమాలోనే కాదు, నిజంగా కూడా అలా జరిగిందని, ఓ వ్యక్తి అచ్చం అలాగే తన సర్వస్వాన్నీ వదిలి, తన ఊరికే జీవితాన్ని అంకితమిచ్చాడని మీకు తెలుసా? ఇదిగో... ఇతనే ఆ రియల్ శ్రీమంతుడు! అమెరికాలో ఉద్యోగం. నెలకు రెండు లక్షల జీతం. సుఖాల్లో మునిగి తేలగల జీవితం. కాలు మీద కాలు వేసుకుని కూర్చుని బతికే అవకాశం... ఇదీ సెంథిల్ జీవితం. అతడవన్నీ వదులుకున్నాడు. తాను ఒక్కడూ సుఖంగా, సంతోషంగా ఉంటే చాలదని... త నలాగే తాను పుట్టి పెరిగిన గ్రామ ప్రజలు కూడా ఉండాలని తపించాడు. వారి జీవితాలను మార్చేందుకు మహా యజ్ఞమే చేశాడు. తమిళనాడులోని తిరుచ్చికి దగ్గరలో ఉన్న తెన్నూర్ గ్రామంలో పుట్టి పెరిగాడు సెంథిల్. ఆ పేద ఊరిలో, కడు పేద కుటుంబంలో పుట్టాడతను. కష్టపడి చదివాడు. బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. కొన్నాళ్లు పని చేశాక అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. అమెరికాలో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి సెంథిల్‌కి. కానీ ఏ రోజూ మన శ్శాంతిగా లేడు. ఎప్పుడూ ఊరే గుర్తొచ్చేది. పట్టు పరుపు మీద పడుకున్నప్పు డల్లా, తన ఊళ్లో చాపల మీద పడుకునే వాళ్లు గుర్తొచ్చేవారు. ఖరీదైన శాండ్విచ్లు తిన్నప్పుడల్లా, గంజి అన్నం దొరికినా చాలని పడిగాపులు పడే పసిపిల్లలు కళ్లముందు కదిలేవారు. చిన్నప్పట్నుంచీ అతని నైజం అంతే. తను ఎన్ని కష్టాలు పడినా, ఎదుటివాళ్ల కష్టాలు చూసి తట్టు కోలేకపోయేవాడు. తాను ఎదిగి అందరికీ సాయపడాలి అనుకునేవాడు. ఆ పట్టుదలే అతణ్ని ఇంతవాణ్ని చేసింది. అందుకే ఎప్పుడెప్పుడు తన ఊరికి వెళ్లిపోదామా, ఎప్పుడెప్పుడు తనవాళ్ల జీవితాలు మారు ద్దామా అని తపించేవాడు. కానీ అందుకు తగినంత డబ్బు కావాలి కాబట్టి, అది సంపాదించేవరకూ ఓపిక పట్టాడు. ఆ సొమ్ము సమకూరగానే ఫ్లయిట్ ఎక్కేశాడు. తన ఊళ్లో వాలిపోయాడు. మొత్తం మార్చేశాడు... ఊరిలో అడుగుపెట్టగానే చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది సెంథిల్‌కి. చిన్నప్పుడు అది ఎలా ఉందో, ఇన్ని సంవత్సరాల తర్వాతా అలానే ఉంది. అదే పేదరికం, అవే కష్టాలు, అవే కన్నీళ్లు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు సెంథిల్. పక్కా ప్రణా ళికలు వేసుకున్నాడు. అనుకున్నదే తడ వుగా అమలు చేయడం మొదలు పెట్టాడు. మొదట అందుబాటులో ఉన్న హెల్త్ వర్కర్స్‌ని, గ్రామస్తులనీ ఒక్కటి చేశాడు. ఊరంతా శుభ్రం చేయించాడు. బహిరంగ మల విసర్జనను నిషేధించాడు. మరుగు దొడ్లు కట్టించాడు. తర్వాత విద్యపై దృష్టి పెట్టాడు. చదువు అవసరాన్ని చాటి చెప్పి, పిల్లలందరూ స్కూళ్లకు వెళ్లేలా చేశాడు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు అంతంత మాత్రంగా ఉండటం గమనించి, అధికారు లతో మాట్లాడాడు. మంచి టీచర్లు, పుస్తకాలు వగైరా ఏర్పాటు చేయించాడు. సరైన ఆహారం లేక పిల్లలు సరిగ్గా ఎదగక పోవడం గమనించి... సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాడు. దాని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టే భోజనంతో పాటు అదనంగా లడ్డూలు, పాలు తన సొంత ఖర్చుతో అందించ సాగాడు. తర్వాత తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే పద్ధతులను స్టడీ చేసి, గ్రామ రైతులకు నేర్పాడు. యువకులకు పలు రకాల వ్యాపారాలు నేర్పించాడు. మహిళలతో స్వయం సహా యక సంఘాలను ఏర్పాటు చేసి, చేతి వృత్తుల ద్వారా సంపాదించడం నేర్పాడు. ఇలా తన సొంత ఊరికోసం ఎన్నో చేశాడు, చేస్తున్నాడు సెంథిల్. ఆ ఊరే అతని ప్రపంచం, ఆ మనుషులే అతని జీవితం. ఆ ఊరివాళ్లకు అతను దేవుడు. విదేశాల్లో చదువుకుని, స్వదేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన గాంధీని అతనిలో చూసుకుంటున్నారు వాళ్లు. అందుకే అతణ్ని ‘యంగ్ గాంధీ’ అని ప్రేమగా పిలుచుకుంటున్నారు. అతను లేకపోతే తమ పరిస్థితి ఇలా ఉండేది కాదని, తమ పిల్లల జీవితాలు నిరర్థకమై పోయేవని చెమ్మగిల్లిన కళ్లతో చెబుతు న్నారు. ఆ చెమ్మలో కృతజ్ఞత కదలాడు తుంది. వారి మాటల్లో సెంథిల్ గొప్ప దనం ప్రస్ఫుటమవుతుంది! -
సెంథిల్‌కు షారూఖ్ పిలుపు
రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. రాజమౌళి తెరకెక్కించిన సినిమాల విజయంలో సెంథిల్ది కూడా కీలక పాత్ర. ముఖ్యంగా ఈగ సినిమా తరువాత జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సెంథిల్, బాహుబలి సినిమాతో స్టార్ సినిమాటోగ్రాఫర్‌గా మారిపోయాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సెంథిల్ కెమరా పనితనానికి ఫిదా అయిపోతున్నారు. మామూలు స్టార్లే కాదు ఏకంగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కూడా సెంథిల్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నాడట. అందుకే ప్రస్తుతం షారూఖ్ చేస్తున్న 'దిల్వాలే' సినిమా కోసం షూట్ చేయాల్సి ఉన్న ఒక్క పాటకు సెంథిల్‌ను సినిమాటోగ్రఫీ అందించాలంటూ ఆహ్వానించాడు. ఇందుకు అంగీకరించిన సెంథిల్ త్వరలోనే దిల్వాలే టీంతో జాయిన్ అవుతున్నాడు. ప్రస్తుతానికి ఒక్క పాటకు మాత్రమే ఛాన్స్ ఇచ్చిన షారూఖ్, తన వర్క్ నచ్చితే తదుపరి సినిమాకు పూర్తి స్థాయి కెమెరామన్‌గా తీసుకునే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తుంది.