పెళ్లయిన ప్రతి జంటకు ఎదురయ్యే ప్రశ్న.. ఏదైనా విశేషముందా? ఈ మాట వినీవినీ విసుగెత్తిపోయే జంటలెన్నో! కొందరు దంపతులు తమ ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకుంటారు. మరికొందరికేమో ప్రెగ్నెన్సీ వచ్చినా అది నిలవదు.. మిస్‌క్యారేజీ(గర్భస్రావం) అవుతుంటుంది. మలయాళ బుల్లితెర నటి సెంథిల్ శ్రీజకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి.
ప్రెగ్నెన్సీ నిలవలేదు
పదవ పెళ్లి రోజు సందర్భంగా శ్రీజ భర్త సెంథిల్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అందులో ఆయన మాట్లాడుతూ.. తనకు రెండు మూడుసార్లు గర్భస్రావమైంది. మేము ఏ విషయమైనా ఇంట్లోవాళ్లతో షేర్ చేసుకుంటాం. అలా ప్రెగ్నెన్సీ గురించి చెప్పి వాళ్లు సంతోషించేలోపే మిస్‌క్యారేజ్ అయిందని చెప్పేవాళ్లం. పిల్లల కోసం ఎంత ఎదురుచూశామో! మా కలలు నీరుగారిపోయిన సమయంలో తను మరోసారి ప్రెగ్నెంట్ అయింది. అంతకుముందు కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ నిలవలేదు కాబట్టి అప్పుడు దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు.
ఈసారి కూడా..
ఒకవేళ ఈసారి కూడా గర్భం నిలవకపోతే పిల్లలు లేరని బాధపడకూడదని శ్రీజ నాతో అంది. కానీ మా కన్నా ముందు చుట్టుపక్కల వారి బాధ భరించలేకపోయాం. ఎప్పుడూ దాని గురించే అడుగుతూ ఒత్తిడికి గురి చేసేవారు. మా అదృష్టం కొద్దీ ఆ ప్రెగ్నెన్సీ నిలబడి దేవ్ జన్మించాడు. పెళ్లైన కొత్తలో మా ఇద్దరికీ కొంత కన్‌ఫ్యూజన్ ఉండేది. పెళ్లికి ముందు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. కానీ వివాహం తర్వాత మాత్రం ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం కొంత తగ్గిపోయింది. కొంతకాలం తర్వాత మళ్లీ మంచి స్నేహితులుగా మారిపోయాం. ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటున్నాం.
మొదటి మూడేళ్లు..
లవ్ మ్యారేజ్ అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లయినా సరే.. మొదటి మూడేళ్లు ఎలాగోలా మ్యానేజ్ చేసుకుంటే తర్వాత జీవితమంతా సాఫీగా ఉంటుంది. మేము ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉండేవాళ్లం. బాబు పుట్టాక పోట్లాడుకునేంత తీరిక దొరకడం లేదు అని చెప్పుకొచ్చాడు. సెంథిల్, శ్రీజ.. సూపర్ హిట్ తమిళ సీరియల్ 'శరవణన్ మీనాక్షి'లో కలిసి నటించారు. ఈ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2023లో దేవ్ అనే కుమారుడు జన్మించాడు.
చదవండి: 12 ఏళ్ల క్రితం.. చెప్పులేసుకుని ఇక్కడ నిలబడ్డా.. వెయ్యి రూపాయలతో..
Comments
Please login to add a commentAdd a comment