12 ఏళ్ల క్రితం.. చెప్పులేసుకుని ఇక్కడ నిలబడ్డా.. వెయ్యి రూపాయలతో.. | Vignesh visits Disneyland with Nayanthara And Their Twins; recalls 12 Year Back Incident | Sakshi
Sakshi News home page

12 ఏళ్ల క్రితం.. చేతిలో వెయ్యి రూపాయలు.. అనుమతి కోసం అర్థించా..

Published Sat, Jun 1 2024 5:15 PM | Last Updated on Sat, Jun 1 2024 6:12 PM

Vignesh visits Disneyland with Nayanthara And Their Twins; recalls 12 Year Back Incident

సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది కింది స్థాయి నుంచి పైకి వచ్చినవారే! అలాంటివారిలో తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ఒకరు. ఎన్నో కష్టాలను దాటుకుని గొప్ప స్థాయికి ఎదిగాడు. తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విఘ్నేశ్‌ శివన్‌ వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. భార్య నయనతార, కవల పిల్లలతో కలిసి హాంకాంగ్‌ ట్రిప్పుకు వెళ్లాడు. అక్కడున్న పర్యాటక ప్రదేశాలన్నింటినీ కుటుంబంతో చుట్టేస్తున్నాడు.

12 ఏళ్ల తర్వాత..
ఈ క్రమంలో తాజాగా డిస్నీల్యాండ్‌ రిసార్ట్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్‌ చేస్తూ ఎమోషనలయ్యాడు. 12 ఏళ్ల క్రితం కాళ్లకు చెప్పులు వేసుకుని కేవలం వెయ్యి రూపాయలతో ఇక్కడ నిల్చున్నాను. పోడా పొడి షూటింగ్‌ కోసం అనుమతివ్వమని అర్థించాను. పుష్కరకాలం తర్వాత మరోసారి నా లవ్లీ బేబీస్‌ నయనతార, ఉయిర్‌, ఉలగ్‌తో డిస్నీలాండ్‌ రిసార్ట్‌లో అడుగుపెట్టాను. 

లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌
ఎంతో భావోద్వేగంగా, ఆనందంగా, సంతృప్తిగా ఉంది. జీవితం ఎంత అందమైనదో కదా.. నిజంగా ఆ దేవుడు చాలా మంచివాడు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. కాగా విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం పొడా పోడి. ఈ సినిమాలోని అప్పన్‌ మవనే వాడ పాట సాంగ్‌ షూటింగ్‌ అంతా హాంకాంగ్‌లోని డిస్నీల్యాండ్‌ రిసార్ట్‌లోనే జరిగింది. ఇందులో శింబు హీరోగా వరలక్ష్మి శరత్‌కుమార్‌ హీరోయిన్‌గా నటించింది.

 

 

చదవండి: జాతరలో మాస్‌ స్టెప్పులేసిన టాలీవుడ్‌ హీరో.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement