
కిరణ్ అబ్బవరం.. మొన్నటి వరకు వరుస సినిమాలతో దూసుకెళ్తాడు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి హీరోగా మారడమే కాకుండా.. అతి తక్కువ సమయంలో మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బ్యానర్లలో కూడా సినిమాలు చేశాయి. అయితే ఇటీవల ఆయన చేసిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కిరణ్ కాస్త వెనకడుగు వేశాడు. సినిమాల ఎంపిక విషయంలో కాస్త ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నాడు. అందుకే ఈ మధ్య కాలంలో కిరణ్ నుంచి ఎలాంటి సినిమా అప్‌డేట్స్ రాలేదు. ఖాలీ సమయం దొరకడంతో నిశ్చితార్థం కూడా చేసేసుకున్నాడు.
తొలి సినిమా రాజావారు..రాణిగారు హీరోయిన్ రహస్యనే తాను పెళ్లాడబోతున్నాడు. గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఈ ఏడాది మార్చి 13న నిశ్చితార్థం చేసుకొని తమ ప్రేమ విషయాన్ని అందరికి తెలియజేశారు. ఇదిలా ఉండగా.. కిరణ్ ప్రస్తుతం తన సొంతూరు రాయచోట్‌లో ఉన్నాడు. అక్కడ జరుగుతున్న గంగమ్మ జాతరలో ఆయన పాల్గొన్నాడు. గుడికి వెళ్లడమే కాకుండా.. స్నేహితులతో కలిసి మాస్ డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. హీరో అయినప్పటికీ..తనకున్న ఇమేజ్‌ని పక్కకు పెట్టి గ్రామీణ యువకుడిలా వీధుల్లో చిందులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment