నటుడు సెంథిల్‌పై కేసు నమోదు | Police Case Files Against Comedian Senthil in Tamil Nadu | Sakshi
Sakshi News home page

నటుడు సెంథిల్‌పై కేసు నమోదు

Published Wed, Apr 10 2019 12:21 PM | Last Updated on Wed, Apr 10 2019 12:21 PM

Police Case Files Against Comedian Senthil in Tamil Nadu - Sakshi

నటుడు సెంథిల్‌

పెరంబూరు: సీనియర్‌ హాస్యనటుడు సెంథిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నటుడు సెంథిల్‌ తేని పార్లమెంట్‌ స్థానానికి అన్నా మక్కళ్‌ మున్నేట్ర కళగం పార్టీ తరఫున పోటీ చేస్తున్న తంగ తమిళ్‌సెల్వన్‌కు మద్దతుగా ఆ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు. కాగా మంగళవారం సెంథిల్‌కు పోడి టీవీకేకే ప్రధాన రోడ్డులో ప్రచారం చేయడానికి పోలీసులు అనుమతినివ్వలేదు. అయినా ఆయన ప్రచార వ్యానును ఆ ప్రాంతంలో నిలిపి ప్రచారం చేశారు. దీంతో ఆ ప్రాతంలోని ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఉదయకుమార్‌ పోడి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సెంథిల్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో సెంథిల్‌ ఇతర కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా పోడిలోని వార సంత సమీపంలోని కల్యాణమంటపంలో అన్నాడీఎంకేకు చెందిన వారు ప్రజలకు  చీర, పంచెలు పంచుతున్నారన్న సమాచారం ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ శివప్రభుకు అందడంతో ఆయన ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు అన్నాడీఎంకే అభ్యర్థి రవీంద్రనా«థ్‌కుమార్, కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement