న్యూఢిల్లీ: లోక్‌సభ తుది విడత ఎన్నికల ప్రచారానికి గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. పశ్చిమ బెంగాల్‌లో నిన్న సాయంత్రమే ముగిసింది. ఈ నెల 19న తుది దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 8 రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్ 13, పంజాబ్ 13, బెంగాల్ 9, బిహార్ 8, మధ్యప్రదేశ్ 8, హిమచల్‌ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, చండీగఢ్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, రవిశంకర్ ప్రసాద్, శత్రుఘ్న సిన్హా, కిరణ్‌ఖేర్ తదితర ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాలు ఇందులో ఉన్నాయి.
ఉప ఎన్నికలకు ముగిసిన ప్రచారం
తమిళనాడులో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. 19న నాలుగు స్థానాలలో పోలింగ్ జరగనుంది. 1300 మంది సీఆర్పీఎఫ్, 15,939 పోలీసులతో భద్రతకట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అరవంకుర్చిలో అత్యధికంగా 64 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్‌ను సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యబ్రతా సాహూ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment