చెన్నై : వేలూరు లోక్‌సభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ ప్రకటించింది. వేలూరులో ఆగస్టు 5వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు, 9వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నట్టు ఈసీ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగగా, వేలూరులో నియోజకవర్గంలో మాత్రం ఈసీ ఎన్నికను నిలిపివేసింది. ఎన్నికల సమయంలో వేలూరు లోక్‌సభ పరిధిలో భారీగా నగదు పట్టుబడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుంది. అయితే ఈ స్థానంలో డీఎంకే కూటమి తరఫున కదిర్ ఆనంద్, అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా ఏసీ షణ్ముగంగత బరిలో నిలిచారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment