ప్రముఖ తమిళ హాస్య నటుడు అప్పుకుట్టి మంచి మనసు చాటుకున్నాడు. తాను చదివిన పాఠశాలకు రూ.11 లక్షలు విరాళం ఇచ్చి, తన ఔదార్యం చాటుకున్నాడు. అప్పుకుట్టి స్వస్థలం తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా నాథన్ కినరు. ఆ ప్రాంతంలోని ముత్తారమ్మన్ ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలకు అప్పుకుట్టి వెళ్లాడు. వేడుకల సందర్భంగా నాథన్ కినేరులోని తాను చదువుకున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్)
గ్రామ ప్రజల కోరిక మేరకు అప్పుకుట్టి.. రూ.11 లక్షల ఖర్చుతో టేబుల్, కంప్యూటర్, టీవీ విద్యుత్ ఫ్యాన్‌లు, తదితర వస్తువులను కొని ఇచ్చాడు. దీని గురించి అప్పుకుట్టి మాట్లాడాడు. ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తాను ఒకటి, రెండు తరగతులు చదివానని, అయితే ఇక్కడ కనీస వసతులు లేకపోవడంతో చదివే విద్యార్థుల సంఖ్య కూడా తక్కువగానే ఉందన్నారు. ఈ క్రమంలోనే పాఠశాలకు అవసరమైన సామగ్రి అందించానని అన్నాడు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని అప్పుకుట్టి కోరాడు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మనం ఊరి బయట ఉన్నా, ఏడాదికి కొన్ని రోజులు ఊరిలోనే నివాసం ఉండాలని అప్పుకుట్టి తన అభిప్రాయం వెలిబుచ్చారు.
(ఇదీ చదవండి: AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!)
Comments
Please login to add a commentAdd a comment