Comedian Manobala Last Video Will Make You Teary-Eyed - Sakshi
Sakshi News home page

Manobala: కమెడియన్‌ మృతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న చివరి వీడియో

Published Tue, May 9 2023 8:27 PM | Last Updated on Tue, May 9 2023 9:19 PM

Comedian Manobala Last Video will Make You Teary Eyed - Sakshi

ప్రముఖ నటుడు, కమెడియన్‌ మనోబాల అనారోగ్యంతో మే 3న కన్నుమూసిన విషయం తెలిసిందే! తమిళంలో అనేక చిత్రాలు చేసిన ఆయన తెలుగులో పున్నమి నాగు, మహానటి, దేవదాసు, వాల్తేరు వీరయ్య సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. తాజాగా ఆయన చివరి రోజుల్లో ఎలా ఉన్నారో తెలియజేస్తూ ఓ వీడియోను మనోబాల యూట్యూబ్‌ ఛానల్‌లో రిలీజ్‌ చేశారు అతడి కుటుంబసభ్యులు.

ఇందులో మనోబాలకు కనీసం కదలడానికి కాళ్లు, చేతులు సహకరించడం లేదు. నోరు పెగల్చడానికి కూడా ఎంతో ఇబ్బందిపడ్డారు. ఆయనతో మాట్లాడించేందుకు అందరూ కలిసి ఎంత ప్రయత్నించినా మనోబాల మాట పెదవి దాటి బయటకు రాలేకపోయింది. మనోబాల తన కొడుకు హరీశ్‌ పాడిన పాట చివరిసారిగా విని సంతోషించారు. మనోబాల కదల్లేని స్థితిలో వీల్‌చైర్‌కే పరిమితం కావడంతో ఆయన అసిస్టెంట్‌ అతడికి తినిపిస్తూ నీళ్లు తాగించాడు. అలా ఓపక్క కొడుకు పాట పాడుతుంటే మరోపక్క ఆయనకు భోజనం తినిపించారు.

సినిమాల్లో ఎంతో యాక్టివ్‌గా కనిపించే మనోబాలను ఇలా వీల్‌చైర్‌కే పరిమితమవడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా మనోబాలాకు 'మనోబాలాస్‌ వేస్ట్‌ పేపర్‌' పేరిట ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ఉంది. తెర వెనుక జరిగే సరదా సంఘటనలను, సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలను, రివ్యూస్‌ను.. ఇలా రకరకాల వీడియో షేర్‌ చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్‌ చేసేవారు. ఆయన కామెడీకి కడుపుబ్బా నవ్వినవారు ఇప్పుడు ఈ చివరి వీడియో చూసి కంటతడి పెట్టుకుంటున్నారు.

చదవండి: ఆ హీరో ఇండస్ట్రీకి పనికి రాడు: డైరెక్టర్‌ సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement