Manobala
-
ఆఖరి రోజుల్లో దయనీయ స్థితిలో కమెడియన్.. వీడియో వైరల్
ప్రముఖ నటుడు, కమెడియన్ మనోబాల అనారోగ్యంతో మే 3న కన్నుమూసిన విషయం తెలిసిందే! తమిళంలో అనేక చిత్రాలు చేసిన ఆయన తెలుగులో పున్నమి నాగు, మహానటి, దేవదాసు, వాల్తేరు వీరయ్య సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. తాజాగా ఆయన చివరి రోజుల్లో ఎలా ఉన్నారో తెలియజేస్తూ ఓ వీడియోను మనోబాల యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారు అతడి కుటుంబసభ్యులు. ఇందులో మనోబాలకు కనీసం కదలడానికి కాళ్లు, చేతులు సహకరించడం లేదు. నోరు పెగల్చడానికి కూడా ఎంతో ఇబ్బందిపడ్డారు. ఆయనతో మాట్లాడించేందుకు అందరూ కలిసి ఎంత ప్రయత్నించినా మనోబాల మాట పెదవి దాటి బయటకు రాలేకపోయింది. మనోబాల తన కొడుకు హరీశ్ పాడిన పాట చివరిసారిగా విని సంతోషించారు. మనోబాల కదల్లేని స్థితిలో వీల్‌చైర్‌కే పరిమితం కావడంతో ఆయన అసిస్టెంట్ అతడికి తినిపిస్తూ నీళ్లు తాగించాడు. అలా ఓపక్క కొడుకు పాట పాడుతుంటే మరోపక్క ఆయనకు భోజనం తినిపించారు. సినిమాల్లో ఎంతో యాక్టివ్‌గా కనిపించే మనోబాలను ఇలా వీల్‌చైర్‌కే పరిమితమవడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా మనోబాలాకు 'మనోబాలాస్ వేస్ట్ పేపర్' పేరిట ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. తెర వెనుక జరిగే సరదా సంఘటనలను, సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలను, రివ్యూస్‌ను.. ఇలా రకరకాల వీడియో షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేసేవారు. ఆయన కామెడీకి కడుపుబ్బా నవ్వినవారు ఇప్పుడు ఈ చివరి వీడియో చూసి కంటతడి పెట్టుకుంటున్నారు. చదవండి: ఆ హీరో ఇండస్ట్రీకి పనికి రాడు: డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు -
Actor Manobala Funeral : కమెడియన్ మనోబాల అంత్యక్రియలు (ఫొటోలు)
-
కమెడియన్ మనోబాల మృతికి కారణం ఇదేనా?
బహుముఖ ప్రజ్ఞాశాలి మనోబాల (69) ఇకలేరు. కోలీవుడ్‌లో కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు, దర్శకుడు, నిర్మాతగా రాణించారు. తంజావూర్ జిల్లా మరుంసూర్కి చెందిన ఈయన 1953 డిసెంబర్ 8న జన్మించారు. మనోబాల అసలు పేరు బాలచందర్. చిత్రలేఖనానికి సంబంధించిన విద్యను అభ్యసించిన ఈయన ఆ తరువాత చైన్నెకి చేరి భారతీరాజా వద్ద సహాయదర్శకుడిగా చేరారు. చదవండి: నాన్న చితికి కూడా నా వద్ద డబ్బులు లేవు: రంగస్థలం మహేశ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ పలు చిత్రాలకు పని చేశారు. అదే విధంగా పుదియ వార్పుగళ్ చిత్రంలో చిన్నపాత్రలో కనిపించారు. అయితే కేఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన పట్పుక్కాగ చిత్రంతో పూర్తిస్థాయి నటుడిగా మారారు. ఆ తరువాత దర్శకుడిగా అవతారం ఎత్తి ఆకాయ గంగై చిత్రాన్ని రూపొందించారు. రజనీకాంత్ హీరోగా ఊర్క్కావలన్, విజయకాంత్‌తో ఎన్ పురుష న్ దాన్ ఎనక్కు మట్టుమ్దాన్ చిత్రం వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. కె.భాగ్యరాజ్, మణివన్నన్, కె.రంగరాజ్, మనోజ్‌కుమార్ వంటి దర్శకుల కోవలో చేరి మంచి చిత్రాల దర్శకుడి గా పేరు గడించారు. హాస్య నటుడిగా ప్రేక్షకులను అలరించిన మనోబాలా ధూమపానానికి బానిసగా మారి.. రోజుకు 100 సిగరెట్లు పీల్చేసేవారని చెబుతారు. ఈ కారణంగానే ఆయన కాలేయం దెబ్బతింది. చదవండి: సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ కొన్ని నెలల క్రితం ఈ సమస్య కారణంగానే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈనేపథ్యంలో బుధవారం కన్నుమూశారు. ఈయనకు భార్య, కొడుకు ఉన్నారు. మనోబాల మృతికి ముఖ్యమంత్రి స్టాలిన్ నుంచి రజనీకాంత్, కమలహాసన్ తదతర పలువురు సినీ రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కమెడియన్ మృతి.. మనోబాల అరుదైన ఫోటోలు
-
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
తమిళ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కమెడియన్, డైరెక్టర్ మనోబాల(69) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మనోబాల మరణంపై సెలబ్రిటీలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1979లో మనోబాల నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. పుట్టి వార్పుగల్ ఆయన నటించిన తొలి చిత్రం. సహాయ నటుడిగా వందల సినిమాలు చేసిన ఆయన భారతీ రాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. అనంతరం 1982లో అగయ గంగై సినిమాతో డైరెక్టర్‌గా మారారు. దాదాపు పాతిక చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్‌లో నటించారు. కొన్ని సీరియల్స్‌కు దర్శకత్వం కూడా వహించారు. తమిళ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో హాస్యనటుడిగా మెప్పించిన మనోబాల తెలుగులోనూ పలు చిత్రాలు చేశారు. కథానాయకుడు, పున్నమి నాగు, మహానటి, దేవదాసు, రాజ్‌దూత్, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ ఆయన సుపరిచితులే! ఇన్నేళ్ల కెరీర్లో 450కి పైగా చిత్రాలు చేశారు. ఆయన చివరగా కాజల్ అగర్వాల్ నటించిన ఘోస్టీ చిత్రంలో కనిపించారు. Just in : Shell shocked to hear that character actor, comedian and director #Manobala passed away at a Chennai hospital! #OmShanti pic.twitter.com/5mKWygoOju — Sreedhar Pillai (@sri50) May 3, 2023 చదవండి: స్టార్ హీరో విక్రమ్‌కు గాయాలు -
వదంతులు నమ్మొద్దు: ఎస్ జానకి
మైసూర్: తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని అభిమానులకు దిగ్గజ గాయని ఎస్ జానకి విజ్ఞప్తి చేశారు. దక్షిణ భారత సినీ గాయని ఎస్ జానకి ఇక లేరనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో సంగీత అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ వార్తలను జానకి కుటుంబ సభ్యులు ఖండించారు. తాజాగా తనపై వస్తున్న తప్పుడు వార్తలపై జానకి స్పందిస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం మైసూర్లో పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఆమె తెలిపారు. అయితే ఇటువంటి రూమర్స్ ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని ఈ దిగ్గజ గాయని ఆవేదన వ్యక్తం చేశారు. (ఆర్జీవీ అదిరిపోయే సమాధానం) ‘జానకి గారికి ఇటీవలే ఓ ఆస్పత్రిలో చిన్న శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. జానకి ఆరోగ్యంపై వదంతులను వ్యాప్తి చేయవద్దు. ఆమె క్షేమంగా ఉన్నారు’ అని జానకి కుటుంబ సభ్యులు, నటుడు మనోబాల వివరణ ఇచ్చారు. అంతేకాకుండా గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సైతం ఈ తప్పుడు వార్తలను ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఓ వీడియో విడుదల చేశారు. ‘జానకమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి నాకు 20 మంది వరకు ఫోన్ చేశారు. ఎందుకంటే సోషల్ మీడియాలో జానకమ్మ చనిపోయారంటూ అసత్య వార్తలను వ్యాప్తి చేశారు. ఏంటి ఈ అర్థంపర్థం లేని పనులు. నేను ఆమెతో మాట్లాడాను. ఆమె ఆరోగ్యంగా ఉన్నారు’ అంటూ ఎస్పీ బాలు పేర్కొన్నారు. (ఆ సినిమాలకు సిగ్గు పడుతున్నా..) No...its wrong news..she got a minor operation..she s ok now https://t.co/3NuyV07eBF — manobala (@manobalam) June 28, 2020 -
వడివేలు స్నేహాన్ని వదలుకోను
చెన్నై : నటుడు వడివేలు స్నేహాన్ని వదలుకోనని దర్శకుడు, నటుడు మనోబాలా పేర్కొన్నారు. ఈయన ఇంతకుముందు తన యూట్యూబ్ చానల్ ద్వారా నటుడు సింగ ముత్తును ఇంటర్వ్యూ చేసిన నేపథ్యంలో నటుడు వడివేలుపై పలు ఆరోపణలు చేసినట్టు సమాచారం. దీనిపై స్పందించిన వడివేలు సింగముత్తు, మనోబాలాపై నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదుపై స్పందించిన మనోబాలా నటుడు వడివేలు తనకు 30 ఏళ్లుగా మంచి మిత్రుడని పేర్కొన్నారు. తనకు ఆయన్ను కించపరచాలనే ఉద్దేశం లేదన్నారు. అలాంటిది తనపై వడివేలు ఎందుకు ఫిర్యాదు చేశారో అర్థం కావడం లేదన్నారు. ప్రస్తుతం వడివేలు ఆగ్రహంతో ఉన్నారని, తర్వాత ఆయనకు అన్ని వివరిస్తారని తెలిపారు. వడివేలుతో స్నేహానికి దూరం కావడం తనకు ఇష్టం లేదని మనోబాలా పేర్కొన్నారు. చదవండి : మరోసారి వివాదాల్లో హాస్య నటుడు వడివేలు -
ఇక తెలుగులోనూ బిజీ
‘‘మహానటి హిట్‌తో స్ట్రెయిట్ తెలుగు సినిమా అవకాశాలు పెరిగిపోయాయి’’ అంటున్నారు మనోబాలా. డబ్బింగ్ సినిమాల ద్వారా మనందరికీ నటుడు మనోబాలా సుపరిచితులే. నటుడిగా, దర్శకుడిగా, ప్రొడ్యూసర్‌గా తమిళంలో సూపర్ బిజీగా ఉంటారాయన. అప్పుడప్పుడు తెలుగు స్ట్రయిట్ సినిమాల్లో కూడా కనపడుతుంటారు. రీసెంట్గా ‘మహానటి’ సినిమాలో తమిళ దర్శకుడిగా కనిపించి కాసేపు నవ్వించారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘మహానటి’ సూపర్ సక్సెస్‌తో డైరెక్ట్ తెలుగు సినిమాలకు చాన్సులు వస్తున్నాయి. నాగార్జున, నానీ మల్టీస్టారర్ మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నాను. మంచి రోల్ దొరికింది.. సంతోషం’’ అని పేర్కొన్నారాయన. -
తమిళ హీరోకి బిగ్ బి అవార్డు
తమిళ సినిమా: విలక్షణ నటుడు విజయ్‌సేతుపతి... అమితాబ్‌బచ్చన్ ఐకాన్ అవార్డును అందుకున్నారు. 15వ చెన్నై అంతర్జాతీయ చిత్రోత్సవాలు గత 14వ తేదీ నుంచి చెన్నైలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. గురువారం సాయంత్రం స్థానిక దేవి థియేటర్లో జరిగిన ముగింపు కార్యక్రమంలో ఉత్తమ చిత్రాలకు అవార్డులను అందించారు. ఉత్తమ చిత్రం అవార్డును ఒరు కిడారియిన్ కరుణై మను గెలుచుకుంది. సురేశ్ చంగయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈరోస్ఇంటర్నేషనల్ మీడియా సంస్థ నిర్మించింది. ద్వితీయ ఉత్తమ చిత్రం – విక్రమ్‌వేదా గెలుచుకుంది. బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు అమితాబ్ బచ్చన్ పేరుతో అందించే అవార్డు విజయ్‌సేతుపతిని వరించింది. అదే విధంగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన మానగరం చిత్రం ప్రత్యేక జ్యూరీ అవార్డును గెలుచుకుంది. కురంగుబొమ్మై చిత్రంలో నటించిన ప్రముఖ దర్శకుడు భారతీరాజా ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకున్నారు. నటనా శిక్షణ విద్యార్థుల కోసం నెలకొల్పిన అమ్మ అవార్డును డెయిసీ చిత్రం గెలుచుకుంది. ఈ చిత్రానికి ఏ.నారాయణమూర్తి దర్వకత్వం వహించారు. కార్యక్రమంలో నటుడు కే.భాగ్యరాజ్, సుహాసిని, మనోబాల సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
మనీ కోసం జానకి పాట
తమిళసినిమా: డబ్బెవరికి చేదు పిచ్చోడా! అన్నది పాట మాత్రమే కాదు. ప్రస్తుతం అదే ప్రపంచంగా మారిందన్నది ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.కాగా గాయని ఎస్.జానకి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గానకోకిల అంటే ఎస్.జానకినే. ఆమె ఆలపించిన గానామృతాలెన్నో. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో తన మధురమైన గానంతో సంగీత ప్రియులను మైమరపించిన జానకి ఇటీవల పాడడం తగ్గించుకున్నారు. తమిళంలో చివరిగా జీవా నటించిన తిరునాళ్ చిత్రంలో పాడారు. 80 వసంతంలోకి అడుగిడిన ఎస్.జానకి ఇకపై పాడరాదని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత చాలా మంది దర్శక నిర్మాతలు అడిగినా పాడలేదు. అలాంటిది ఇటీవల మనీ కోసం ఒక పాట పాడేశారు. అయితే నిజంగా డబ్బు కోసం ఈ గాన సరస్వతి పాడలేదు. మనీ అనే తమిళ చిత్రం కోసం పాడారు. ఆర్ఆర్.సినీ ప్రొడక్షన్ పతాకంపై రాజు, రఫిక్ నిర్మించిన ఈ చిత్రానికి ఆర్డీ.రాగన్ దురైరాజన్ కథ, దర్శకత్వం, సంగీతం బాధ్యతలను నిర్వహించారు. ఈయన ఇంతకు ముందు పలు దేశ విదేశాల్లో అనేక సంగీత విభావరిలు నిర్వహించారు. వాటిలో కొన్నింటిలో ఎస్.జానకి పాలు పంచుకున్నారట. ఆ సన్నిహితంతో మనీ చిత్రంలో ఆరో ఆరారో అనే మంచి పాటను అద్భుతంగా పాడారట. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శకుడు వెల్లడించారు. మనీ చిత్ర ఆడియోను జాగ్వుర్‌తంగం అతిథిగా పాల్గొ ని ఆవిష్కరించా రు. ఇందులో నటుడు నితిన్‌సత్య, నాజర్, మనోబాల, యోగిబాబు, సింగముత్తు ప్రధాన పాత్రలు పోషించారు. -
465... అసలేం జరిగింది?
కార్తీక్ రాజా, నిరంజన, మనోబాల ముఖ్య పాత్రల్లో సాయిసత్యం దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా ‘465’. శివపుత్ర క్రియేషన్స్ పతాకంపై అడ్డా వెంకట్రావు సమర్పణలో కుసుమ రామ్‌సాగర్ ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘హారర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘465’. ఈ చిత్రం తమిళనాడులో ఘనవిజయం సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇంతవరకు వచ్చిన హారర్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. శశాంక్ రవిచంద్రన్ రీ–రికార్డింగ్ ఈ చిత్రానికి హైలైట్. అనువాద కార్యక్రమాలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. తమిళంలోలా తెలుగులోనూ మా చిత్రం విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. త్వరలో ఆడియో, సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శశాంక్ రవిచంద్రన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, కెమెరా: పి.ఆర్.సుందర్, నిర్వహణ: యస్.కె. రఫీ, ఎ.టి. కృష్ణన్.