తమిళ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కమెడియన్, డైరెక్టర్ మనోబాల(69) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మనోబాల మరణంపై సెలబ్రిటీలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
1979లో మనోబాల నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. పుట్టి వార్పుగల్ ఆయన నటించిన తొలి చిత్రం. సహాయ నటుడిగా వందల సినిమాలు చేసిన ఆయన భారతీ రాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. అనంతరం 1982లో అగయ గంగై సినిమాతో డైరెక్టర్‌గా మారారు. దాదాపు పాతిక చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్‌లో నటించారు. కొన్ని సీరియల్స్‌కు దర్శకత్వం కూడా వహించారు.
తమిళ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో హాస్యనటుడిగా మెప్పించిన మనోబాల తెలుగులోనూ పలు చిత్రాలు చేశారు. కథానాయకుడు, పున్నమి నాగు, మహానటి, దేవదాసు, రాజ్‌దూత్, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ ఆయన సుపరిచితులే! ఇన్నేళ్ల కెరీర్‌లో 450కి పైగా చిత్రాలు చేశారు. ఆయన చివరగా కాజల్ అగర్వాల్ నటించిన ఘోస్టీ చిత్రంలో కనిపించారు.
Just in : Shell shocked to hear that character actor, comedian and director #Manobala passed away at a Chennai hospital! #OmShanti pic.twitter.com/5mKWygoOju
— Sreedhar Pillai (@sri50) May 3, 2023
చదవండి: స్టార్ హీరో విక్రమ్‌కు గాయాలు
Comments
Please login to add a commentAdd a comment