![Comedian Actor Manobala Died Due To This Reason - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/4/Manobala.jpg.webp?itok=-_KOI3-W)
బహుముఖ ప్రజ్ఞాశాలి మనోబాల (69) ఇకలేరు. కోలీవుడ్‌లో కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు, దర్శకుడు, నిర్మాతగా రాణించారు. తంజావూర్ జిల్లా మరుంసూర్‌కి చెందిన ఈయన 1953 డిసెంబర్ 8న జన్మించారు. మనోబాల అసలు పేరు బాలచందర్. చిత్రలేఖనానికి సంబంధించిన విద్యను అభ్యసించిన ఈయన ఆ తరువాత చైన్నెకి చేరి భారతీరాజా వద్ద సహాయదర్శకుడిగా చేరారు. చదవండి: నాన్న చితికి కూడా నా వద్ద డబ్బులు లేవు: రంగస్థలం మహేశ్
డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ పలు చిత్రాలకు పని చేశారు. అదే విధంగా పుదియ వార్పుగళ్ చిత్రంలో చిన్నపాత్రలో కనిపించారు. అయితే కేఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన పట్పుక్కాగ చిత్రంతో పూర్తిస్థాయి నటుడిగా మారారు. ఆ తరువాత దర్శకుడిగా అవతారం ఎత్తి ఆకాయ గంగై చిత్రాన్ని రూపొందించారు. రజనీకాంత్ హీరోగా ఊర్‌క్కావలన్, విజయకాంత్‌తో ఎన్ పురుష న్ దాన్ ఎనక్కు మట్టుమ్‌దాన్ చిత్రం వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు.
కె.భాగ్యరాజ్, మణివన్నన్, కె.రంగరాజ్, మనోజ్‌కుమార్ వంటి దర్శకుల కోవలో చేరి మంచి చిత్రాల దర్శకుడి గా పేరు గడించారు. హాస్య నటుడిగా ప్రేక్షకులను అలరించిన మనోబాలా ధూమపానానికి బానిసగా మారి.. రోజుకు 100 సిగరెట్లు పీల్చేసేవారని చెబుతారు. ఈ కారణంగానే ఆయన కాలేయం దెబ్బతింది.
చదవండి: సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ
కొన్ని నెలల క్రితం ఈ సమస్య కారణంగానే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈనేపథ్యంలో బుధవారం కన్నుమూశారు. ఈయనకు భార్య, కొడుకు ఉన్నారు. మనోబాల మృతికి ముఖ్యమంత్రి స్టాలిన్ నుంచి రజనీకాంత్, కమలహాసన్ తదతర పలువురు సినీ రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment