
మనోబాలా
‘‘మహానటి హిట్‌తో స్ట్రెయిట్ తెలుగు సినిమా అవకాశాలు పెరిగిపోయాయి’’ అంటున్నారు మనోబాలా. డబ్బింగ్ సినిమాల ద్వారా మనందరికీ నటుడు మనోబాలా సుపరిచితులే. నటుడిగా, దర్శకుడిగా, ప్రొడ్యూసర్‌గా తమిళంలో సూపర్ బిజీగా ఉంటారాయన. అప్పుడప్పుడు తెలుగు స్ట్రయిట్ సినిమాల్లో కూడా కనపడుతుంటారు. రీసెంట్‌గా ‘మహానటి’ సినిమాలో తమిళ దర్శకుడిగా కనిపించి కాసేపు నవ్వించారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘మహానటి’ సూపర్ సక్సెస్‌తో డైరెక్ట్ తెలుగు సినిమాలకు చాన్సులు వస్తున్నాయి. నాగార్జున, నానీ మల్టీస్టారర్ మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నాను. మంచి రోల్ దొరికింది.. సంతోషం’’ అని పేర్కొన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment