Mahanati Savithri
-
సావిత్రి గారి వల్లే నేను సక్సెస్ అయ్యాను: లలితా జువెల్లర్స్ ఎండీ
‘డబ్బులు ఊరికే రావు’ అనే డైలగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయ్యారు లలితా జువెల్లర్స్ ఎండీ కిరణ్ కుమార్. తన బ్రాండ్‌కు తానే అంబాసిడర్‌గా వ్యవహరించి లలితా జ్యువెల్లరి ఆభరాలను ప్రమోట్ చేసుకున్నారు. వ్యాపారవేత్తగా సక్సెస్ అయి.. వేల కోట్లకు అధిపతి అయిన ఆయన మహానటి సావిత్రి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తాను ఇంత పెద్ద సెక్సెస్ అవ్వడానికి కారణం మహానటి సావిత్రి అని తాజాగా ఓ ఇంటర్య్వూలో పేర్కొన్నారు. సావిత్రి ఇంట్లోనే వ్యాపారం ప్రారంభించానని, ఆమె వల్లే తాను సక్సెస్ అయ్యానన్నారు. చదవండి: యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం కాగా ఆయన చెన్నైలోని మహానటి సావిత్రి ఇంటిని కొనుగోలు చేసి అక్కడ వ్యాపారం విస్తరించుకున్నారట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సావిత్రిగారి ఇంటితో తనకు ఎమోషనల్ బాండింగ్ ఉందని, ఎంతో ఇష్టంతో సావిత్రి గారి ఆస్తిని కొన్నానని కిరణ్ కుమార్ తెలిపారు. సావిత్రి పేరు మీద ఆమె పిల్లలు అప్పట్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టారని, అక్కడ షాప్ రెంట్‌కు తీసుకుని బంగారం షాప్ స్టార్ చేశానన్నారు. సావిత్రి గారి ఆశీర్వాదం వల్లే తన వ్యాపారం బాగా నడిచిందని, ఇప్పుడు తాను ఇంత పెద్ద సక్సెస్ అయ్యానని పేర్కొన్నారు. అందుకే ఇప్పటికీ ఆ ఇంటి పేరు ఆమెదే ఉందన్నారు. ఆ బిల్డింగ్ లలితా కార్పొరేట్ ఆఫీస్ అని రాశాము గానీ.. సావిత్రి గణేశన్ పేరు అలానే ఉంచామన్నారు. అయితే ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అమ్మ ఆస్తి నుంచి వచ్చిన ఇల్లు అదేనని, దానిని పడగొట్టి ఓ కమర్షియల్ బిడ్డింగ్ కట్టామన్నారు. ‘దానిని లలితా జువెల్లర్స్ ఎండీ కిరణ్ రెంట్‌కు తీసుకుని షాప్ పెట్టారు. ఆయనకు బాగా కలిసి వచ్చింది. దాంతో మేం దానిని అమ్మాలకున్నప్పుడు తనకే ఇవ్వాలని కోరాడు. అందుకే ఆయనకు ఆ బిల్డింగ్ అమ్మేసి ప్రస్తుతం ఉంటున్న ఇంటిని కొనుక్కున్నాం’ అని చెప్పుకొచ్చారు. అనంతరం కిరణ్ కుమార్‌కే ఆ ఆస్తిని అమ్మడానికి ఓ కారణం ఉందని కూడా చెప్పారు. చదవండి: ‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు ‘అమ్మకు బంగారం అంటే చాలా ఇష్టం. కిరణ్ కుమార్‌ది బంగారం షాపే. అమ్మకు కార్ల పిచ్చి ఉన్నట్టే.. కిరణ్‌కి కూడా ఉంది. ‘‘అమ్మను ఆయన బాగా అభిమానిస్తారు. బిల్డింగ్ అమ్మిన తర్వాత ఎంట్రన్స్‌లో ఉన్న అమ్మ బొమ్మను తీసుకువెళ్తుంటే దానిని అక్కడే ఉంచాలని కోరాడు. ‘ఇది నేను కొన్నంత మాత్రానా ఈ ఆస్తి మీది కాకుండా పోదు. ఇక్కడి నుంచి ఏమైనా తీసుకువెళ్లండి. కానీ, సావిత్రి అమ్మ ఫొటో తీసుకు వెళ్లొద్దు’ అని కిరణ్ కోరాడు’ అని ఆమె చెప్పింది. అంతేకాదు తనని తమ్ముడిగా భావించమంటూ అక్కయ్య అని కిరణ్ అప్యాయంగా పిలుస్తారంటూ విజయ చాముండేశ్వరి తెలిపారు. -
సావిత్రి గురించి షాకింగ్ విషయం చెప్పిన సీనియర్ నటి ఝాన్సీ
సీనియర్ నటి ఝాన్సీ.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు ఓ అద్దే ఇంట్లో ఒంటరిగా జీవితాన్ని గడుపుతోంది. దాదాపు 500లకు పైగా చిత్రాల్లో నటించిన ఆమె చెన్నైలో లగ్జరీ ఇంట్లో రాజసంగా బ్రతికారు. కానీ ఒక్క మూవీ ఫ్లాప్‌తో ఆస్తులన్నీ అమ్మేసిన పరిస్థితి ఎదురైంది. దీంతో హైదరాబాద్‌లోని ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నారు ఆమె. 78 ఏళ్ల వయసులో కష్టాలు పడుతూ పుట గడవడం కూడా ఇబ్బందిగా మారిందట ఆమె జీవితం. చదవండి: అందుకే అప్పుడు సమంతను.. ఇప్పుడు దీపికాను ట్రోల్ చేస్తున్నారు: నటి రమ్య స్క్రీన్ హీరోయిన్గా, నటిగా ఆకట్టుకున్న ఆమె కళ్లతోనే హావభావాలను పలికించేవారు. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఝాన్సీ చాలా ఏళ్ల తర్వాత తెరముందుకు వచ్చారు. రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌తో ఆమె ముచ్చటిస్తూ తన వ్యక్తిగత జీవితం గురించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే మహానటి సావిత్రి గురించిన ఓ షాకింగ్ విషయం రివీల్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో ఎక్కువగా ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. సావిత్రి, కేఆర్ విజయలతో మాట్లాడేదాని. అంతేకాదు తరచూ సావిత్రి ఇంటికి కూడా వెళ్లేదాన్ని. నాకంటే ముందే సావిత్రిగారు సినిమాల్లోకి వచ్చారు. తననే స్ఫూర్తిగా తీసుకుని నటించేవాళ్లం. తెరపై ఆమె అందంగా, హావభావాలను పలికించేవారు. సావిత్రిలా నటించాలని నటనలో తనని అనుసరించేవారు. సావిత్రి గారు అంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చారు. అయితే సావిత్రి చివరి రోజుల్లో వెళ్లి చూశారా? అని ప్రశ్నించగా.. ‘ఆ సమయంలో సావిత్రిని చూడలేకపోయానని బాధపడ్డారు. అసలు ఆవిడని చూడలేకపోయేవాళ్లమంట. అంత మనిషి చిన్న పిల్లలా అయిపోయారట. అందుకే తనని ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేనని నేను వెళ్లలేదు. చదవండి: విషాదం.. అవతార్ 2 సినిమా చూస్తూ వ్యక్తి మృతి అయితే ఎంతో రాజసంగా బతికిన సావిత్రి గురించిన ఓ వార్త నన్ను చాలా బాధించింది. అనారోగ్యం కారణంగా ఆమె కొన్ని నెలలు కొమాలో ఉన్నారు. ఆ సమయంలోవైద్యం చేయించేందుకు డబ్బుల ఆమె భర్త జెమిని గణేశన్ ఓ ప్రకటన ఇచ్చారు. సావిత్రి చికిత్స కోసం డబ్బు కావాలని, దాతలు ఈ అడ్రస్ డబ్బు పంపించగలరు అంటూ ఆయన పత్రిక ప్రకటన ఇచ్చారు. అది చూసి నేను చాలా బాధపడ్డాను. ఎంతో ధనవంతురాలు, మహానటి అయిన ఆమె జీవితం చివరికి ఇలా అయ్యిందేంటని అనిపించింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరిగా.. జాగ్రత్తపడకపోవడం, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం వల్లే సావిత్రి జీవితం ఇలా అయ్యిందేమో అని ఆమె అభిప్రాయపడ్డారు. -
నెక్ట్స్ మహానటి ఎవరు? ఆ స్టార్ హీరోయిన్ పేరు చెప్పిన అగ్ర నిర్మాతలు
నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్-2’. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో 5 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ జరిగిన ఈ టాక్ షోకు లేటెస్ట్ ఎపిసోడ్‌కు ఇద్దరు అగ్ర నిర్మాతలు అతిథులు వచ్చి సందడి చేశారు. దివంగత నటులు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు(సీనియర్ ఎన్టీఆర్) శత జయంతి సందర్భంగా అన్‌స్టాబుల్ స్పెషల్ ఎపిసోడ్‌ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ షో స్పెషల్ గెస్ట్లుగా టాలీవుడ్ బడా నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు.. దర్శకుడు రాఘవేంద్రరావు అతిథులుగా విచ్చేశారు.ఈ సందర్భంగా షోలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత జనరేషన్లో హీరోయిన్లలో మహానటి ఎవరంటూ బాలయ్య.. అల్లు అరవింద్, సురేశ్ బాబులను ప్రశ్నించాడు. దీనికి వీరద్దరు ఇచ్చిన సమాధానం ఆసక్తిని సంతరించుకుంది. అనుకొకుండానే ఇద్దరు నిర్మాతల ఒకే హీరోయిన్ పేరు చెప్పడం విశేషం. నెక్ట్స్ మహానటి ఎవరని అడగ్గానే వీరిద్దరు పలకపై సమంత పేరు రాశారు. సురేశ్ బాబు సమంత అనే సమాధానం చెప్పగానే అల్లు అరవింద్ కూడా తాను అదే పేరు రాశానని చెప్పారు. ఇప్పుడు ఉన్న వాళ్లలో మహానటి అవగలిగితే సమంత అనే సురేశ్ బాబు తన అభిప్రాయం చెప్పారు. దీంతో ఈ వీడియోను సమంత ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో వైరల్ చేస్తున్నారు. సమంత ఫ్యాన్‌క్లబ్ ట్విటర్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారతీయ సినీ పరిశ్రమలో మహానటి సావిత్రి చెరగని ముద్ర వేసుకున్నారు. తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం ఓ చరిత్రగా నిలిచింది. ఆమె తర్వాత మళ్ళీ అలాంటి మహానటి రారు, రాలేరు అని అంటారు. అంతలా తన నటనతో కట్టిపడేశారు ఆమె. ఆమె తరువాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటి సౌందర్య అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నటన పరంగా, వ్యక్తిత్వం పరంగా సౌందర్య ఇండస్ట్రీలో, అభిమానుల్లో మంచి ఆదరణ పొందారు. సావిత్రి తర్వాత సావిత్రి అనేలా సౌందర్య అద్భుతమైన నటనతో తెలుగు వారి హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో సమంతను మహానటిగా ఇద్దరు అగ్ర నిర్మాతలు పేర్కొనడంతో ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. Coming from both legendary producers of the industry at the same time ❤️ #Mahanati #Samantha 😍🤩 its all your dedication and hardwork angel 🙇 @Samanthaprabhu2 You earned it 💪 and you deserve it 🫶 #SamanthaRuthPrabhu pic.twitter.com/J6otq5o9pf — Samantha Fans (@SamanthaPrabuFC) December 3, 2022 -
అందుకే నిత్యామీనన్‌ను వద్దనుకున్నారా? రివీల్ చేసిన నిర్మాత
దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే కీర్తికి స్టార్ హీరోయిన్ అన్న ఇమేజ్ను తీసుకొచ్చింది. ఓవర్ నైట్ స్టార్డమ్తో కీర్తి కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచిందీ సినిమా. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డు కూడా దక్కింది. అయితే ఈ ప్రాజెక్ట్ కీర్తి సురేష్‌కి ముందు వేరే హీరోయిన్ దగ్గరికి వెళ్లిందట. ఈ విషయాన్ని స్వయంగా వైజయంతీ మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ వెల్లడించారు. ఓ ప్రముఖ షోలో పాల్గొన్న ఆయన మహానటి ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సినిమాకు కీర్తికి ముందు ఓ మలయాళ నటిని అనుకున్నాం. కానీ కథ చెప్పాక అందులో మద్యం తాగే సన్నివేశాలు ఉంటే నేను చేయను అంటూ కండిషన్స్ పెట్టింది. దీంతో ఆమెను తీసుకోవడానికి వీల్లేదు అని నేనే డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు చెప్పాను. కట్ చేస్తే కీర్తి సురేష్ చేతుల్లోకి ఈ సినిమా వెళ్లింది అంటూ చెప్పుకొచ్చారు. ఆ హీరోయిన్ పేరు చెప్పడానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు.అయితే మహానటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడే మలయాళ హీరోయిన్ నిత్యామీనన్ పేరు తెరపైకి వచ్చింది. అంతేకాకుండా సావిత్రి పాత్రలో ఆమె ఫోటోలు కూడా కొన్ని బయటికొచ్చాయి. ఏది ఏమైనా నిత్యామీనన్ ఓ మంచి సినిమాను దూరం చేసుకుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
సినిమాల్లో హింసకు తావివ్వొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సినిమాల్లో అశ్లీలత, అసభ్యత, హింసకు తావివ్వరాదని, ప్రజలపై సినిమా చూపే ప్రభావాన్ని దర్శక నిర్మాతలు తెలుసుకోవాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చిత్రరంగానికి పిలుపునిచ్చారు. 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ఉపరాష్ట్రపతి సోమవారం ఇక్కడ ప్రదానం చేసి ప్రసంగించారు. ‘సినిమా శక్తిమంతమైన మాధ్యమం. సామాజిక మార్పునకు సాధనంగా వినియోగించాలి. ముఖ్యంగా యువత మనసుపై సినిమా ప్రభావం చూపుతుంది. అందువల్ల విలువలను పెంచేదిగా సినిమా ఉండాలి’ అని పేర్కొన్నారు. ‘మహిళలపై అత్యాచారం, హింస ప్రబలుతోంది. ఈ ధోరణిని ఎదుర్కోవడానికి సామాజిక సందేశం సినిమాల ద్వారా ప్రజలకు చేరాలి’ అని పిలుపునిచ్చారు. మన సినిమాలు భారతీయతను ప్రపంచానికి చాటి చెప్పా లని సందేశం ఇస్తూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఇతర సామాజిక అంశాల కేటగిరీలో ఉత్తమ చిత్రంగా ఎంపికైన హిందీ చిత్రం ‘ప్యాడ్‌మ్యాన్’కుగాను అక్షయ్‌కుమార్ అవార్డును స్వీకరించారు. అవార్డులు అందుకున్న తెలుగు సినీ ప్రముఖులు.. మహానటి చిత్రంలో అత్యుత్తమ అభినయానికి కీర్తి సురేష్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు కింద ఆమె రజత కమలం, రూ. 50 వేల నగదు అందుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘మహానటి’ ఎంపికైనందుకు ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ పురస్కారాన్ని అందుకున్నారు. రూ. లక్ష నగదు పురస్కారాన్ని ఈ అవార్డుతోపాటు అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డుకు ‘చి.ల.సౌ’ చిత్రం ఎంపికైనందున చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రజత కమలం, రూ. 50 వేల పురస్కారం అందుకున్నారు. ఉత్తమ ఆడియోగ్రఫీ అవార్డు రంగస్థలం చిత్రానికిగాను ఎం.ఆర్.రాజాకృష్ణన్ అందుకున్నారు. ఈ అవార్డుతోపాటు ఆయన రజత కమలం, రూ. 50 వేల నగదు పురస్కారం అందుకున్నారు. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డును మహానటి చిత్రానికిగాను ఇంద్రాణీ పట్నాయక్, గౌరవ్‌షా, అర్చనా రావ్ అందుకున్నారు. ఈ పురస్కారంతోపాటు రజత కమలం, రూ. 50 వేల నగదు అందుకున్నారు. ‘అ’ చిత్ర మేకప్ ఆర్టిస్ట్ రంజిత్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు స్వీకరించారు. రజత కమలం, రూ. 50 వేల నగదు అందుకున్నారు. ‘అ’ చిత్రానికిగాను సృష్టి క్రియేటివ్ స్టూడియో, యునిఫై మీడియా స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు అందుకున్నారు. ఈ పురస్కారం కింద రజత కమలం, రూ. 50 వేల నగదు అందుకున్నారు. -
అభినేత్రికి అభినందనలు
‘మహానటి’కి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న ఆనందంలో ఉన్నారు కీర్తీ సురేశ్. అందాల అభినేత్రి సావిత్రి పాత్రలో కీర్తి అద్భుతంగా ఒదిగిపోయారని ప్రత్యేకంగా చెప్పొచ్చు. అందుకే ఈ తరం అభినేత్రి అని ఆమెను చాలామంది కీర్తిస్తున్నారు. అందరి అభినందనలతో ఉత్సాహంగా ఉన్నారు కీర్తి. ఇటీవల చిరంజీవి కూడా తన అభినందనలతో పాటు కీర్తీ సురేశ్‌కు ఆశీస్సులు అందించారు. సైమా అవార్డ్స్ ఫంక్షన్‌కి అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. సావిత్రిలా డ్రెస్ చేసుకుని కీర్తీ సురేశ్ ఈ అవార్డు వేడుకకు హాజరయ్యారు. అక్కడ చిరంజీవి అభినందనలు అందుకుంటున్న సమయంలో క్లిక్‌మన్న ఫోటో ఆకట్టుకునే విధంగా ఉంది. ‘సైరా’కు వాయిస్ ఓవర్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రామ్‌చరణ్ నిర్మించారు. ఈ సినిమా టీజర్ ఆగస్ట్ 20న రిలీజ్ కానుంది. ఈ టీజర్‌కు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘‘టీజర్‌కు వాయిస్ ఓవర్ అందించినందుకు థ్యాంక్యూ కల్యాణ్ బాబాయ్’’ అని రామ్‌చరణ్ పేర్కొన్నారు. -
ఈ అవార్డు మా అమ్మకు అంకితం
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా కీర్తీ సురేశ్ టైటిల్ రోల్లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘మహానటి’ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా కీర్తీ సురేశ్, నాగ్ అశ్విన్‌తో ‘సాక్షి’ స్పెషల్ టాక్. ► హార్టీ కంగ్రాట్స్. 1990లో ‘కర్తవ్యం’ సినిమాకి విజయశాంతి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 28 ఏళ్ల తర్వాత తెలుగు నుంచి ఉత్తమ కథానాయిక అవార్డు గెలుచుకున్న నటి మీరే... కీర్తీ సురేశ్: చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ అవార్డును మా అమ్మకు అంకితం చేస్తున్నాను. అమ్మ (మలయాళ నటి మేనక) నటించిన ఓ మలయాళం సినిమా నేషనల్ అవార్డుకి నామినేట్ అయింది. కానీ అవార్డు రాలేదు. అలా అమ్మ కల నెరవేరలేదు. అప్పుడే తనకోసం ఓ అవార్డు తీసుకురావాలని అనుకున్నాను. ‘నీ కోసం జాతీయ అవార్డు తీసుకొస్తాను’ అని అమ్మతో కూడా చెప్పాను. ఇప్పుడు అది నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్లవుతోంది. ఇంత త్వరగా జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదు. అమ్మ కల మాత్రమే కాదు.. ప్రతిష్టాత్మక అవార్డు తీసుకోవాలనే నా కల నెరవేరినట్టుంది. ఇది కేవలం మొదలే.. నా జర్నీ ఇంకా చాలా ఉంది (నవ్వుతూ). ► ఈ సందర్భంగా సావిత్రిగారి గురించి రెండు మాటలు... సావిత్రిగారి ఆశీస్సులు, సపోర్ట్ లేకపోతే ఇంత దూరం కచ్చితంగా వచ్చేవాళ్లం కాదు. సావిత్రి అమ్మ, ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి అమ్మకు చాలా చాలా థ్యాంక్స్. సినిమా చేస్తున్నప్పుడు వచ్చిన అడ్డంకులన్నీ సావిత్రమ్మ ఆశీస్సులతోనే ఎదుర్కొన్నాం. ఆవిడ ఎప్పుడూ మమ్మల్ని గైడ్ చేస్తూనే వచ్చారని నా ఫీలింగ్ ► ‘మాయాబజార్’లోని ‘అహ నా పెళ్లంట’ ఎపిసోడ్లో బాగా చేశారు. ఎన్ని టేక్స్ తీసుకున్నారు? ఆ సినిమాలో ఆ పాట అందరికి ఫేవరెట్ కూడా. ఆ సన్నివేశానికి 40– 50 టేకులు తీసుకున్నాను. షూట్ చేసే మూడు రోజుల ముందే ప్రిపరేషప్ మొదలుపెట్టాను. టేక్ చేసిన ప్రతిసారీ పర్ఫెక్ట్గా రావాలనుకునే చేశాను. ఫైనల్లీ చేయగలిగాను. చాలా బాగా చేశావని అందరూ అభినందించారు. అయితే ఇప్పుడు చూసుకుంటే నాకు చిన్నచిన్న తప్పులు కనిపిస్తాయి (నవ్వుతూ). ► ఇంత బాధ్యత ఉన్న పాత్ర చేస్తున్నాం అని నిద్రలేని రాత్రులు ఏమైనా? ‘మహానటి’ కోసం చాలా నిద్రలేని రాత్రులు గడిపాను. పాత్రలోనుంచి బయటకు రావడం చాలా కష్టంగా ఉండేది. ఎమోషనల్ సీన్స్ చేసినా ఏం చేసినా షూటింగ్ పూర్తయిన తర్వాత చాలా కష్టంగా ఉండేది. రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను. నిద్రలేకపోతే ఆ ఎఫెక్ట్ మర్నాడు షూటింగ్ మీద పడుతుందని భయం. సావిత్ర అమ్మ పాత్ర నా మీద చాలా ప్రభావం చూపించింది. ► కాస్ట్యూమ్స్‌కి కూడా అవార్డ్ వచ్చింది. అలనాటి సావిత్రిగారు వేసుకున్న కాస్ట్యూమ్స్ పోలినవి ఈనాటి కీర్తి వేసుకున్నప్పుడు ఏమనిపించింది? కాస్ట్యూమ్ డిజైనర్లు్ల కూడా చాలా కష్టపడ్డారు. ఆవిడ ఫిట్టింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఫిట్టింగ్ దొరకడం లేదు కూడా. ఆ ఫిట్టింగ్ ఉంటే తప్ప షాట్‌కి రాను అని చెప్పేదాన్ని. ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు లేనంత ‘టైట్ బ్లౌజులు’ వేసుకునేవారు. కష్టం అనిపించినప్పటికీ నేనూ అదే ఫిటింగ్నే ప్రిఫర్ చేశాను. ఇక లావుగా కనపడాల్సిన సీన్స్‌లో ప్రొస్థెటిక్ మేకప్ కూడా ఉపయోగించాం. సమ్మర్లో చిత్రీకరించాం. ప్రొస్థెటిక్ మేకప్‌కి నాలుగు గంటలు పట్టేది. ► ఈ సినిమాలో మిమ్మల్ని సావిత్రి పాత్రకు ప్రకటించినప్పుడు కొందరు ‘మిస్ ఫిట్’ అన్నారు. విమర్శలు కూడా వచ్చాయి..? సావిత్రిగారు మహానటి. ఆమె పాత్రకు న్యాయం చేయగలను అనే నమ్మకంతోనే ఒప్పుకున్నారు. అయితే ముందు క్రిటిసిజమ్ వచ్చిందని నాకు తెలియదు. తర్వాత చాలామంది చెప్పారు. అలాగే సినిమా ప్రమోట్ చేస్తున్నప్పుడు తెలిసింది. అప్పుడు కొంచెం టెన్షన్ అనిపించింది. పోస్టర్, టీజర్ వచ్చినప్పుడు అందరికీ నమ్మకం కలిగింది. అందరూ అభినందించారు. మంచి రెస్పాన్స్ రావడంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ► ‘మహానటి’ సినిమా గుర్తుగా ఏదైనా మీతో దాచుకున్నారా? ఈ సినిమాకు నా మనసులో స్పెషల్ ప్లేస్ ఉంది. ‘మహానటి’ చివరి రోజు చిత్రీకరణలో నేను ధరించిన చీరను గిఫ్ట్‌గా ఇచ్చారు నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంకా దత్. అదే నా దగ్గరున్న మెమొరీ. పేరు చెడగొట్టకూడదనుకున్నాను – నాగ్ అశ్విన్ ‘మహానటి’ దర్శకుడు నేషనల్ లెవల్లో గుర్తింపు రావడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ‘మహానటి’కి మూడు అవార్డులు వచ్చాయి. నేషనల్ లెవల్లో గట్టి పోటీ ఇచ్చిన కీర్తీ సురేశ్ అవార్డు సాధించడం సంతోషంగా ఉంది. సావిత్రిగారి టైమ్‌లో ఆమెకు నేషనల్ అవార్డు రాలేదు. కానీ అవార్డ్‌కు తగినంత పెర్ఫార్మెన్స్లు చాలా ఇచ్చారు. ఆమె మీద తీసిన సినిమాతో నేషనల్ అవార్డు తీసుకురాగలిగాం. ఇది ఊహించలేదు. కానీ మంచి ప్రశంసలు, అభినందనలు వస్తాయని చాలా మంది చెప్పారు. సినిమా రిలీజ్ అయి కూడా చాలా రోజులైంది. మర్చిపోయాను కూడా. సినిమాలో చాలెంజ్‌లు, కష్టాలు అన్నీ ఉంటాయి. కానీ ఈ సినిమాతో మాకు బాధ్యత ఎక్కువ ఉండేది. సావిత్రి అమ్మ మీద సినిమా తీస్తున్నాం. అవకాశాన్ని వృథా చేసుకోకూడదు అని కష్టపడ్డాం. సావిత్రిగారికి చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్లు మా సినిమా చూస్తే సంతృప్తి చెందాలి అన్నదే నా ముఖ్య ఉద్దేశం. బాక్సాఫీస్ గురించి కూడా ఎక్కువగా ఆలోచించలేదు. రిలీజ్ అయిన తర్వాత ‘న్యాయం చేశారు, చెడగొట్టలేదు’ అంటే చాలు అనుకున్నాను. ఆమె లైఫ్ అంతా షూటింగ్ గ్యాప్‌లో జరిగిందే కదా. సమస్య అయినా ప్రేమ అయినా షూటింగ్స్ మధ్యలోనే జరిగాయి. సినిమా కూడా అలానే తీశాను. మనకు చాలా కథలున్నాయి. వాళ్లందరి గురించి కూడా సినిమాలు తీయాలి. తీసేవాళ్లు మాత్రం చాలా నిజాయితీగా వెతికి, నిజాయితీగా తీయాలి. నెక్ట్స్ కొత్త కథలు చెప్పాలనుంది. ప్రస్తుతం ఓ కథను రాస్తున్నాను. తొందర తొందరగా సినిమా తీసేయాలని లేదు. ఇప్పుడు చేయబోతున్న సినిమా మాత్రం నా గత సినిమాలకు భిన్నంగా ఉంటుంది. -
ఇండియన్ పనోరమకి మహానటి
అందాల అభినేత్రి సావిత్రి జీవితంపై తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. టైటిల్ రోల్‌ను కీర్తీ సురేశ్, ఇతర ముఖ్య పాత్రలను సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు పోషించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ‘మహానటి’ చిత్రం ఈ ఏడాది మేలో విడుదలై ఘనవిజయం సాధించింది. అలాగే ఇప్పటికే ఈ చిత్రం పలు చిత్రోత్సవాలకు ఎంపికైంది. తాజాగా ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ‘ఇండియన్ పనోరమ’లో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ప్రదర్శన కోసం ఈ సినిమా ఎంపికైంది. 49వ ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ఉత్సవాలు ఈనెలలో గోవాలో జరగనున్నాయి. అందులో భాగంగా ‘మహానటి’ చిత్రాన్ని అక్కడ ప్రదర్శిస్తారు. హిందీ, తమిళ, మలయాళం, తుళు... ఇలా భారతీయ భాషల నుంచి 22 చిత్రాలు ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు అర్హత పొందాయి. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది ఆ గౌరవం ‘మహానటి’కి దక్కింది. -
విదేశాల్లోనూ మహా విజయం
జనరల్‌గా బయోపిక్ అంటే ఏవోవో వివాదాలు వినిపిస్తుంటాయి. ‘మహానటి’ సినిమా విషయంలో కొన్ని విమర్శలు వచ్చినా ఎక్కువ ప్రశంసలే వచ్చాయి. అలనాటి అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన సినిమా ‘మహానటి’. తమిళంలో ‘నడిగర్ తిలకం’ అనే టైటిల్‌తో విడుదల చేశారు. సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్ వెండితెరపై కనిపించారు. సమంత, దుల్కర్ సల్మాన్, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. స్వప్నాదత్, ప్రియాంకా దత్ నిర్మించారు. ఈ ఏడాది మే 9న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వేదికపై మంచి గౌరవం లభించింది. ‘ఈక్వాలిటీ ఇన్ సినిమా’ అనే అవార్డు ‘మహానటి’ చిత్రాన్ని వరించింది. ఈ అవార్డును అందుకున్నారు ‘మహానటి’ టీమ్. అంతేకాదు ఇందులో కథానాయికగా నటించిన కీర్తీ సురేశ్ ఉత్తమ నటి విభాగంలో నామినేట్ అయ్యారు. ‘‘ఓ అద్భుతమైన చిత్రం నిర్మించి ఈ అవార్డు అందుకున్నందుకు గర్వంగా ఉంది. ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ ఘనవిజయం సాధించింది. బాక్సాఫీస్ నంబర్స్ ఇందుకు సాక్ష్యంగా నిలిచాయి’’ అన్నారు స్వప్నాదత్. -
అరుదైన ఘనత
వంద రోజుల క్లబ్లో చేరి ‘రంగస్థలం’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా మరో ఘనతను సాధించింది. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2018’ (ఐఎఫ్ఎఫ్ఎమ్) స్క్రీనింగ్‌కి ఎంపిౖకై, బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ఐఎఫ్ఎఫ్ఎమ్ వేడుకలు ఆగస్టు 10 నుంచి 22వరకు జరగనున్నాయి. రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మించారు. ‘రంగస్థలం’ స్క్రీనింగ్ సమయానికి రామ్‌చరణ్ మెల్బోర్న్ వెళ్లనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే నటి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘మహానటి’ సినిమా కూడా ఐఎఫ్ఎఫ్ఎమ్ స్క్రీనింగ్‌కు సెలక్ట్ అయిందని సమాచారం. వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రియాంకా దత్, స్వప్నా దత్ నిర్మించారు. సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్ నటించారు. సమంత, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్ తదితరులు నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి భారీ ఎత్తున ప్రేక్షకాదరణ లభించింది. ఇలా ఈ ఏడాది వేసవిలో రిలీజైన ‘మహానటి, రంగస్థలం’ సినిమాలు అరుదైన ఘనతను సాధించాయి. -
ఇక తెలుగులోనూ బిజీ
‘‘మహానటి హిట్‌తో స్ట్రెయిట్ తెలుగు సినిమా అవకాశాలు పెరిగిపోయాయి’’ అంటున్నారు మనోబాలా. డబ్బింగ్ సినిమాల ద్వారా మనందరికీ నటుడు మనోబాలా సుపరిచితులే. నటుడిగా, దర్శకుడిగా, ప్రొడ్యూసర్‌గా తమిళంలో సూపర్ బిజీగా ఉంటారాయన. అప్పుడప్పుడు తెలుగు స్ట్రయిట్ సినిమాల్లో కూడా కనపడుతుంటారు. రీసెంట్గా ‘మహానటి’ సినిమాలో తమిళ దర్శకుడిగా కనిపించి కాసేపు నవ్వించారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘మహానటి’ సూపర్ సక్సెస్‌తో డైరెక్ట్ తెలుగు సినిమాలకు చాన్సులు వస్తున్నాయి. నాగార్జున, నానీ మల్టీస్టారర్ మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నాను. మంచి రోల్ దొరికింది.. సంతోషం’’ అని పేర్కొన్నారాయన. -
మహానటి స్పెషల్ స్క్రీన్ టెస్ట్
1 దర్శకుడిగా ‘మహానటి’ నాగ్ అశ్విన్‌కి రెండో సినిమా. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఏంటో తెలుసా? ఎ) పెళ్ళిచూపులు బి) ఘాజీ సి) అర్జున్ రెడ్డి డి) ఎవడే సుబ్రమణ్యం 2 సావిత్రి పెళ్లి చేసుకున్న జెమినీ గణేశన్ హీరో కాకముందు సినీ పరిశ్రమలో ఏ శాఖలో పని చేసేవారు? ఎ) దర్శకుడు బి) ఎడిటర్ సి) సింగర్ డి) కాస్టింగ్ మేనేజర్ 3 ‘మహానటి’ చిత్రంలో సావిత్రి స్నేహితురాలు సుశీలగా నటించిన నటి ఎవరో తెలుసా? ఆమె గతేడాది నటించిన ఓ తెలుగు సినిమా బ్లాక్‌బస్టర్ హిట్? ఎ) షాలినీ పాండే బి) సమంత సి) అనుష్క డి) మాళవికా నాయర్ 4 సావిత్రి మొదట మద్రాసులో అడుగుపెట్టినప్పుడు ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో నటించారు. అయితే హీరోయిన్గా కాదు. ఆ సినిమా పేరేంటి? ఎ) పాతాళభైరవి బి) సంసారం సి) పలలెటూరి పిల్ల డి) అర్ధాంగి 5 1957లో వచ్చిన ‘మాయా బజార్’ చిత్రంలో సావిత్రి ఓ పాత్రను అనుకరించారు. ఆమె ఏ పాత్రను అనుకరించారో తెలుసా? ఎ) కృష్ణుడు బి) అర్జునుడు సి) అభిమన్యుడు డి) ఘటోత్కచుడు 6 అక్కినేని నాగేశ్వరరావుతో సావిత్రి నటించిన ‘దేవదాసు’ చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? ఎ) వేదాంతం రాఘవయ్య బి) ఘంటసాల బలరామయ్య సి) విఠలాచార్య డి) కమలాకర కామేశ్వరరావు 7 ‘మహానటి’ చిత్రదర్శకుడు నాగ్ అశ్విన్ ‘తొడరి’ అనే ఓ తమిళ సినిమా చూస్తున్నప్పుడు కీర్తీ సురేశ్‌ను సావిత్రిలా ఊహించుకున్నారట. ఆ తమిళ సినిమాలో హీరో ఎవరో తెలుసా? ఎ) బాబీ సింహ బి) శివ కార్తికేయన్ సి) ధనుష్ డి) సూర్య 8 1962వ సంవత్సరంలో ‘సావిత్రి గణేశ్’ పేరు మీద ‘వడ్డివారి పాలెం’అనే గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మించారు. అది ఏ జిల్లాలో ఉందో తెలుసా? ఎ) నెల్లూరు జిల్లా బి) కృష్ణా జిల్లా సి) గుంటూరు జిల్లా డి) చిత్తూరు జిల్లా 9 ‘మహానటి’ కథ వినమని ఓ హీరో కీర్తీ సురేశ్‌ను రికమెండ్ చేసి, ఆ చిత్రదర్శకుణ్ణి ఆమెకి పరిచయం చేశారు. సినిమా రిలీజైన తర్వాత ఆ హీరోకు కృతజ్ఞతలు తెలిపారామె. ఆ తెలుగు హీరో ఎవరు? ఎ) విజయ్ దేవరకొండ బి) నానీ సి) రామ్ డి) దుల్కర్ సల్మాన్ 10 సావిత్రి దర్శకత్వం వహించిన మొదటి సినిమా పేరేంటో తెలుసా? ఎ) చిన్నారి పాపలు బి) మాతృదేవత సి) చిరంజీవి డి) వింత సంసారం 11 సినిమాల్లోకి రాకముందు సావిత్రి ఓ నాటక సమాజంలో డాన్స్ చేసేవారు. ఆ నాటక సమాజ యజమాని తర్వాతి కాలంలో సినిమాల్లో అద్భుతంగా రాణించిన నటుడు. ఎవరా నాటక సంఘ యజమాని? ఎ) గుమ్మడి బి)చిత్తూరు వి.నాగయ్య సి) ఎస్వీ. రంగారావు డి) కొంగర జగ్గయ్య 12 ‘మహానటి’లో ఓ సీన్లో యస్వీ రంగారావు పాత్రను చేసిన మోహన్‌బాబు సావిత్రి పాత్రధారి కీర్తీ సురేశ్‌కు ఓ సీన్లో భోజనం పెట్టించినట్లు చూపిస్తారు. కానీ ఒరిజినల్‌గా ఆ టైమ్‌లో భోజనం పెట్టింది వేరే నటుడని కొందరు అంటున్నారు. వాళ్లు చెప్పిన ఆ నటుడెవరు? ఎ) రమణా రెడ్డి బి) గుమ్మడి సి) రేలంగి డి) కాంతారావు 13 సావిత్రి భర్త జెమినీ గణేశన్ అసలు పేరు ‘రామస్వామి గణేశన్’. ఆమె ఆయన్ని ఏ సంవత్సరంలో వివాహం చేసుకున్నారో తెలుసా? ఎ) 1950 బి) 1951 సి) 1952 డి) 1954 14 1960వ సంవత్సరంలో సావిత్రి రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. ఆమెకు అవార్డు తెచ్చిన ఆ సినిమా పేరేంటో తెలుసా? ఎ) చివరకు మిగిలేది బి) తొలిప్రేమ సి) బాంధవ్యాలు డి) మూగజీవులు 15 ‘మహానటి’ చిత్రంలో కె.వి. చౌదరి పాత్రను పోషించిన నటుడెవరు? ఎ) మోహన్ బాబు బి) రాజేంద్ర ప్రసాద్ సి) నాగచైతన్య డి) క్రిష్ 16 సావిత్రి ఏ సంవత్సరంలో తనువు చాలించారో తెలుసా? ఎ) 1978 బి) 1991 సి) 1988 డి) 1981 17 సావిత్రి భర్త జెమినీ గణేశన్ ఆమెని ఏమని పిలిచేవారో కనుక్కోండి? ఎ) శ్రీమతి గారు బి) అమ్మణి సి) అమ్మాడి డి) బేబి 18 దిగ్దర్శకుడు కె.వి రెడ్డి ఓ చిన్న డాన్స్ సీక్వెన్స్‌లో నటించటానికి సావిత్రిని ఆడిషన్ చేశారు. అది చాలా చిన్న పాత్ర. అది ఏ సినిమా కోసమో తెలుసా? ఎ) రూపవతి బి) దేవదాసు సి) పాతాళభైరవి డి) ఆదర్శం 19 ‘దేవదాసు’ చిత్రంలో పార్వతి పాత్రకు మొదట అనుకున్న నటి సావిత్రి కాదు. మరి ఆ నటెవరో తెలుసా? ఎ) షావుకారు జానకి బి) భానుమతి సి) అంజలీదేవి డి) జమున 20 సావిత్రి నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో తెలుసా? ఎ) మూగ మనసులు బి) చదువుకున్న అమ్మాయిలు సి) డాక్టర్ చక్రవర్తి డి) తోడి కోడళ్లు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (డి) 2) (డి) 3) (ఎ)4) (బి) 5) (డి) 6) (ఎ) 7) (సి) 8) (సి) 9) (బి) 10) ఎ 11) (డి) 12) (బి) 13) (సి) 14) (ఎ) 15) (బి) 16) (డి) 17) (సి)18) (సి) 19) (ఎ)20) (ఎ) నిర్వహణ: శివ మల్లాల -
సావిత్రి గొప్పే.. మా నాన్న కాదా?
పిల్లలకు తండ్రంటే చాలా ప్రేమ ఉంటుంది. ఆ తండ్రి గొప్ప స్టార్ అయితే ఆ ప్రేమ ఇంకా ఎక్కువ ఉంటుంది.‘మహానటి’ సినిమా సావిత్రిని వర్తమానంలోకి తెచ్చింది.అలాగే జెమినీ గణేశన్‌ను కూడా. జెమినీ మీద తెలుగు సమాజంలో ఉన్న అపోహలను ‘మహానటి’ సినిమా దూరం చేసిందని అనుకునేవారు ఇప్పుడు ఉన్నారు. కానీ జెమినీ మొదటి భార్య అలమేలు కుమార్తె కమలా సెల్వరాజ్ మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నారు.ఆమె తరఫు వాదన ఏమిటో విందాం. ► ‘మహానటి’ సినిమా విషయంలో మీ స్పందనలు తెలుస్తున్నాయి. ఆ సినిమా గురించి మీ అభ్యం తరం ఏమిటి? మా నాన్నగారు సావిత్రమ్మను చూసి అసూయ పడినట్లుగా చూపించారు. మా నాన్నగారు పెద్ద స్టార్. శివాజీ గణేశన్, ఎం.జి.ఆర్‌లతో పాటు మా నాన్న కూడా స్టార్డమ్ చూశారు. అలాంటి వ్యక్తి సావిత్రమ్మను చూసి అసూయ పడాల్సిన అవసరం ఉందంటారా? అలాగే సావిత్రమ్మ ఆకర్షణలో మా నాన్నగారు ఆమె వెంట తిరిగినట్లు చూపించారు. సావిత్రిగారు మా నాన్న వెంట తిరిగి ఉండొచ్చు కదా. అలాగే ఆమె మద్యానికి ఎలా బానిసయ్యారో ఎవరూ చెప్పలేరు. అందులో మా నాన్న ప్రమేయం ఉన్నట్టు చూపడం సరికాదు. ► ‘మహానటి’ సినిమా చూసి జెమినీ గణేశన్ మీద అపోహలు తొలిగాయని ఇక్కడ తెలుగు ప్రేక్షకులు అంటున్నారు. అంటే మీ నాన్నను పాజిటివ్‌గా చూపించినట్టే కదా? నిజంగానే మా నాన్నగారు మంచి వ్యక్తే. అన్నేసి లవ్ సీన్స్ తీయడం ఎందుకు? సావిత్రిగారు గొప్ప స్టార్ అని ఎలివేట్ చేశారు. మా నాన్నగారు కూడా పెద్ద స్టార్. అది ఎలివేట్ చేసినట్లు అనిపించలేదు. ఆయనేదో అవకాశాలు తగ్గిపోయి బాధపడినట్లు చూపించారు. అది నిజం కాదు. సావిత్రమ్మను ఆయన మోసం చేయాలని ఏనాడూ అనుకోలేదు. ‘నా భార్య’ అని సమాజానికి చెప్పారు. మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే అసలు పెళ్లి చేసుకునేవారు కాదు. పైగా ఇద్దరు ప్రముఖ వ్యక్తుల జీవితాల గురించి సినిమా తీస్తున్నప్పుడు ఆ ఇద్దరికీ సంబంధించిన వ్యక్తులతో మాట్లాడాలి. సావిత్రమ్మ తరఫున వాళ్ల పిల్లలతో మాట్లాడినట్లే నాన్నగారి తరఫున మాతో మాట్లాడి ఉండాలి. అప్పుడు ఇంకా చాలా విషయాలు చెప్పేదాన్ని. అసలైన నిజాలతో సినిమా ఇంకా బాగా వచ్చి ఉండేది. ► సినిమా విషయంలో మీ ఒపీనియన్ మీది.. సావిత్రిగారి కూతురు విజయ చాముండేశ్వరిగారి ఒపీనియన్ ఆమెది.. ఈ సినిమా మీలో మనస్పర్థలు రావడానికి కారణం అవుతుందా? అస్సలు కాదు. మేమంతా చాలా బాగుంటాం. సినిమా విషయంలో ఎవరి ఒపీనియన్ వాళ్లకు ఉంటుంది. అది మా పర్సనల్ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపించదు. మేమంతా ఎప్పటిలానే బాగుంటాం. ► సావిత్రిగారితో మీకున్న మెమొరీస్ గుర్తు చేసు కుంటారా? సావిత్రి గారిది చాలా లవింగ్, కైండ్ నేచర్. చాలా ఆప్యాయత చూపించేవారు మా మీద. ఎవరికైనా మమ్మల్ని పరిచయం చేసేటప్పుడు నా మొదటి అమ్మాయి, రెండో అమ్మాయి అని మమ్మల్ని పరిచయం చేశాకే వాళ్ల పిల్లల్ని (విజయ చాముండేశ్వరి, సతీష్‌ను) పరిచయం చేసేవారు. నేను మెడికల్ కాలేజ్‌లో చదువుతున్న రోజుల్లో సావిత్రిగారు విజిట్ చేసేవారు. నాకు హెయిర్ కట్ చేసేవారు. కాశ్మీర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్లారు. ఆ ట్రావెల్‌ని ఎంజాయ్ చేశాం. ఆవిడ నైస్ పర్సన్. ► సావిత్రమ్మగారితో మీ అమ్మ అలమేలుగారి ఈక్వేషన్ గురించి? ఇంట్లో హింసిస్తున్నారంటూ అర్ధరాత్రి సావిత్రిగారు ఏడ్చుకుంటూ మా ఇంటికొస్తే మా అమ్మగారు ఇంట్లోకి రానిచ్చారు. ఏనాడూ ఒక్క మాట అన్నది లేదు. సావిత్రిగారు కూడా మా అమ్మగారంటే ఎంతో అభిమానంగా ఉండేవారు. మా అమ్మకి మేం నలుగురు కూతుళ్లం. పుష్పవల్లి అమ్మకు ఇద్దరు కూతుళ్లు. సావిత్రమ్మకు ఒక కూతురు, కొడుకు. పిల్లలందరం బాగుండేవాళ్లం. మా అమ్మగారు, పుష్పవల్లి అమ్మ, సావిత్రమ్మగారు.. మమ్మల్నందర్నీ సమానంగా చూసేవారు. ► ‘మా నాన్నగారు డిగ్నిఫైడ్ పర్సన్’ అని ఇంతకు ముందు మీరన్నారు. మరి కట్టుకున్న భార్య ఉండగా వేరే అమ్మాయిలతో ఆయన ఎఫైర్స్ గురించి మీరేమంటారు? మా నాన్నగారు కావాలని ఎవరి చుట్టూ తిరగలేదు. ఆయన చాలా హ్యాండ్సమ్ మ్యాన్. బాగా చదువుకున్నారు. స్టార్ హీరో. ఆయన చుట్టూనే అమ్మాయిలు తిరిగేవారు. నాన్నను ప్రేమించినవాళ్లంతా సింగిల్ ఉమన్. పుష్పవల్లిగారు, సావిత్రిగారు.. ఇద్దరూ పెళ్లి కానివాళ్లే. ప్లస్ మా నాన్నగారు తనకు పెళ్లయిన విషయాన్ని ఎవరి దగ్గరా దాచి పెట్టలేదు. పుష్పవల్లి అమ్మను నాన్న పెళ్లి చేసుకోలేదు. ఆమె ద్వారా ఆయనకు ఇద్దరు కూతుళ్లు పుట్టారు. వాళ్లకు ఐడెంటిటీ ఇవ్వడం కోసం తన పిల్లలే అని యాక్సెప్ట్ చేశారు. అంతేకానీ మా నాన్నగారు మ్యారీడ్ ఉమెన్ లైఫ్‌లోకి ఎంటరై, వాళ్ల కాపురాలను నాశనం చేయలేదు. ► సావిత్రమ్మగారిని పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మగారు పడిన బాధ మీకు తెలుసా? అప్పుడు మేం చిన్నపిల్లలం. ఏం జరుగుతుందో తెలియని వయసు. అయితే బాగా ఏడ్చేదని మాత్రం తెలుసు. మా ఇంటి పక్కన విజ్జీయమ్మ అని ఉండేవారు. ఆవిడ దగ్గర చెప్పుకుని బాధపడేవారు. అయితే పిల్లల దగ్గర తన బాధను చెప్పుకోలేదు. ► స్కూల్లో మీ ఇంటి విషయాల గురించి మీ స్నేహితులు అడిగేవారా? అలా జరుగుతుందని అమ్మకు తెలుసు కాబట్టి, ఎవరేం అడిగినా ‘మాకు తెలియదు’ అని చెప్పమన్నారు. ‘మీ నాన్నగారు సావిత్రిని పెళ్లి చేసుకున్నారట?’ అని ఎవరైనా అడిగితే అమ్మ చెప్పమన్నట్లే ‘మాకు తెలియదు’ అనేవాళ్లం. ► విజయ చాముండేశ్వరిగారు మీ అమ్మగారి గురించి కానీ మీ గురించి కానీ ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. తన తండ్రి గురించి కూడా తప్పుగా చెప్పలేదు... అవును. నేనూ ఎవర్నీ విమర్శించడంలేదు. విజ్జీ నన్ను సొంత అక్కలానే అనుకుంటుంది. నేను నా సొంత చెల్లెలిలానే అనుకుంటాను. మాలో మాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. సావిత్రమ్మగారు మమ్మల్ని బాగా చూసినట్లే మా అమ్మగారు కూడా విజ్జీని, తన తమ్ముడు సతీష్‌ని బాగా చూసేవారు. మా అక్క రేవతి పెళ్లప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది వచ్చారు. అమ్మ నాలుగు గోడల మధ్య పెరిగిన వ్యక్తి. అంత మంది మధ్యలోకి రావడానికి ఆవిడ ఇబ్బందిపడ్డారు. అప్పుడు సావిత్రమ్మే అన్నీ చూసుకున్నారు. చాలామంది రేవతక్క సావిత్రమ్మ కూతురు అనుకున్నారు. ► సావిత్రమ్మగారు చనిపోకముందే విజయ చాముండేశ్వరిగారి పెళ్లి జరిగింది. ఆ తర్వాత సతీష్ మీ ఇంట్లో ఉండేవారట? సావిత్రమ్మగారు చనిపోయాక ‘విజ్జీ అక్కతో ఉంటావా? నాతో పాటు ఉంటావా?’ అని నాన్నగారు సతీష్‌ని అడిగితే.. ‘మీతో ఉంటాను నాన్నా’ అన్నాడు. దాంతో నాన్నగారు మా ఇంటికి తీసుకొచ్చేశారు. మా అమ్మగారు సతీష్‌ని తన సొంత కొడుకులానే చూసుకున్నారు. మేం కూడా మా తమ్ముడనే అనుకున్నాం. సతీష్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నాన్నగారు ఏమీ అనలేదు. సతీష్‌కి కొడుకు పుడితే పుట్టు వెంట్రుకలు తీయించడానికి నేనే పళని గుడికి తీసుకెళ్లాను. మేమంతా అంత బాగుంటాం. ► మరి.. ముంబైలో సెటిలైన నటి రేఖ (పుష్పవల్లి కూతురు)గారితో మీరంతా టచ్‌లోనే ఉన్నారా? మేమంతా నెలకోసారి ఫోన్లో మాట్లాడుకుంటాం. వీలు చేసుకుని ఆర్నెల్లకోసారి కలుస్తాం. ► సావిత్రిగారి ఆస్తుల్ని జెమినీగారు తీసుకున్నారని రూమర్ ఉండేది.. అది నిజం కాదు. నాన్నగారి ఆస్తిని ఆవిడ, ఆవిడ ఆస్తులను నాన్నగారు తీసుకోలేదు. అసలు మా నాన్నగారు తన పేరు మీద ఆస్తులు కొనేవారు కాదు. మా అమ్మ పేరు మీదనో, నానమ్మ పేరు మీదనో కొనేవారు. ► సావిత్రిగారు కోమాలోకి వెళ్లిపోయి ఆస్పత్రిలో చేరే నాటికి ఆవిడకు ఆస్తులు లేవని చాలామంది చెప్పుకుంటారు... ఆవిణ్ణి చాలామంది మోసం చేశారు. నాన్నగారు చెప్పాలని ప్రయత్నిస్తే చాన్స్ ఇవ్వలేదు. ఆయన్ను దగ్గరికి రానివ్వలేదు. బంధువులు కొందరు, ఇంట్లో పని చేసినవాళ్లు కొందరు ఎవరి చేతికి చిక్కినవి వాళ్లు తీసుకెళ్లిపోయారు. ఆవిడ ఆస్పత్రిలో చేరాక మా నాన్నగారు చూసుకోలేదని చాలామంది అంటారు. అది నిజం కాదు. మొత్తం హాస్పిటల్ ఖర్చంతా ఆయనే కట్టారు. ► సావిత్రిగారి అంత్యక్రియలు మీ ఇంట్లోనే జరిగాయి కదా? అవును. మా అమ్మగారు, పుష్పవల్లి అమ్మగారు దగ్గరుండి చేశారు. భర్త బతికి ఉండగా చనిపోయిన స్త్రీ చివరి యాత్ర ఎలా జరుగుతుందో అలా సంప్రదాయానుసారం మా అమ్మ దగ్గరుండి చేయించారు. ► ఫైనల్లీ సావిత్రిగారిలా కీర్తీ సురేశ్ నటన, జెమినీగారిలా దుల్కర్ నటన మీకు నచ్చాయా? కీర్తీ సురేశ్ అచ్చంగా సావిత్రమ్మల్లా మౌల్డ్ అయ్యారు. దుల్కర్ బాగా యాక్ట్ చేశారు. అయితే నాన్నగారు అందగాడు. కళ్లతోనే చెప్పాలనుకున్న విషయాలను కన్వే చేసేవారు. ఆయనలాంటి అందగాడు, నటుడు రారు. ఆయనకు రీప్లేస్మెంట్ లేదు. ► సావిత్రిగారి జీవితం నాశనం కావడానికి ఆవిడే కారణం అంటారా? నా ఒపీనియన్ అదే. ఆమె కొంచెం యారోగెంట్‌గా ఉండేవారు. అలాగని మంచి మనిషి కాదని కాదు. అందరికీ సహాయం చేసేవారు. కానీ మొండి మనిషి. నాన్నతో పాటు ఉన్నప్పుడు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలన్నీ చక్కగా చూసుకునేవారు. ఆయనకు దూరమయ్యాక చుట్టూ ఉన్నవాళ్లు ఆమెను మోసం చేయడం మొదలుపెట్టారు. మోసపోవద్దని చెప్పడానికి వెళ్లిన నాన్నను నానా మాటలు అన్నారు. ఆవిడ జీవితం అలా కావడానికి ఆమే కారణం. ► మీ అక్కాచెల్లెళ్ల గురించి చెబుతారా? మా నాన్నగారు ఎడ్యుకేషన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. మమ్మల్ని బాగా చదివించారు. మేం నలుగురుం బాగా స్థిరపడ్డాం. మా అక్క రేవతి పెద్ద డాక్టర్, నేను కూడా డాక్టర్. చెల్లెలు జయలక్ష్మీ డాక్టర్, చిన్న చెల్లెలు నారాయణి మంచి జర్నలిస్ట్. మా అందరికీ చాలా మంచి పేరుంది. కమలా సెల్వరాజ్, అలమేలు, జెమినీ గణేశన్, రేవతి (పైన) నారాయణి, జయలక్ష్మి నానమ్మ, నాన్న, అమ్మ అలమేలు, ఒళ్లో జయలక్ష్మి (పై వరస) నారాయణి, రేవతిలతో కమల – ఇంటర్వ్యూ: డి.జి. భవాని – కర్టెసీ: సంజయ్, చెన్నై -
లెక్క పెట్టకుండా తీస్తే లెక్క లేనంత వస్తుంది
‘‘నిన్నటికి నిన్న వచ్చిన ‘బాహుబలి’ మన తెలుగు సినిమా అని రొమ్ము విరిచి చెప్పుకున్నాం. ‘మహానటి’ లాంటి సినిమాతో మళ్లీ అంతే ఫీలింగ్ కలిగింది. తెలుగు ఇండస్ట్రీ గర్వించే సినిమా ఇది. తెలుగు సినిమాను ప్రేమించే ప్రతి ప్రేక్షకుడు ‘మహానటి’ని గుండెల్లో పెట్టుకుంటారు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్నా సినిమాస్ పతాకంపై ప్రియాంకా దత్ నిర్మించిన ‘మహానటి’ గత బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. టైటిల్ రోల్లో కీర్తీ సురేష్ నటించారు. ఈ చిత్రబృందాన్ని అల్లు అరవింద్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా చూశాక నాగ్ అశ్వి¯Œ కి కాల్ చేసి సూపర్ హిట్, బ్లాక్‌బస్టర్ వంటి పిచ్చి పదాలు వాడకుండా ‘థ్యాంక్యూ ఫర్ మేకింగ్ అజ్ ప్రౌడ్’ అని చెప్పాను. స్వప్న, ప్రియాంక, అశ్వినీదత్ గారు తప్ప ఈ సినిమాను ఇంకెవ్వరూ తీయలేరు. లెక్కపెట్టి తీస్తే ఎంత లెక్కపెడితే అంతే వస్తుంది. లెక్క పెట్టకుండా తీస్తే లెక్కలేనంత వస్తుంది. సినిమా ఈజ్ నాట్ ఎ నంబర్.. ఇట్స్ ఏ ఎక్స్పీరియన్స్ ‘మహానటి ఈజ్ ప్రైజ్లెస్’’ అని చెప్పారు. ‘‘సినిమా ఇండస్ట్రీలో రకరకాల హిట్స్ స్తాయి. కానీ కొన్ని మాత్రం ఇండస్ట్రీ స్థాయిని పెంచేవి వస్తుంటాయి. ‘మహానటి’ ఆ కోవకు చెందినదే. సావిత్రి, జెమినీ గణేశన్‌ల ప్రేమకథను ‘దేవదాసు’తో ముడిపెట్టడంతో పాటు ఆమె మందు అలవాటు చేసుకునే సన్నివేశం వంటివి పొయెటిక్‌గా, సెటిల్డ్‌గా చెప్పిన విధానం అద్భుతం’’ అన్నారు రాజమౌళి. రమేశ్ ప్రసాద్, కేయస్ రామారావు, శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, పి. కిరణ్, బి.వి.యస్.యన్ ప్రసాద్, పరుచూరి సోదరులు, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, కరుణాకరన్, మారుతి, నందినీ రెడ్డి, సంపత్ నంది, త్రినాథ్ రావు నక్కిన, విజయ్‌కుమార్ కొండా తదితరులు పాల్గొన్నారు. -
అశ్వనీదత్‌గారికి ఆ లోటు తీరిపోయింది
‘‘నా అభిమాన నటి సావిత్రి అనే విషయం అందరికీ తెలిసిందే. ‘పునాది రాళ్లు’ సినిమాలో సావిత్రిగారు హీరో తల్లి పాత్రలో నటిస్తే.. నేను హీరో ఫ్రెండ్స్‌లో ఒకడిగా నటించాను. రెండు మూడు సన్నివేశాలు సావిత్రి గారితో కలిసి నటించే అవకాశం కలగడం నా అదృష్టం. మంచి ఆర్టిస్ట్‌గా ఎదగాలని అప్రిషియేట్ చేశారు. అలాంటి మహనటిపై సినిమా తీయడం. అది కూడా అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో తన కుమార్తెలు స్వప్నా, ప్రియాంకలు చేయడం ఆనందంగా ఉంది. నాగ్ అశ్విన్ అత్యద్భుతంగా తీశాడు’’ అన్నారు చిరంజీవి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తీ సురేశ్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘మహానటి’. వైజయంతి మూవీస్. స్వప్నా సినిమాస్ బ్యానర్‌పై ప్రియాంకా దత్ నిర్మించారు. సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ముఖ్య తారలుగా నటించారు. ఈ నెల 9న సినిమా రిలీజ్ అయింది. సినిమా చూసిన చిరంజీవి చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘సావిత్రి బయోపిక్‌ను నాగ్ అశ్విన్ చేస్తున్నాడు అనగానే కొంచెం సందేహం కలిగింది. సావిత్రి గురించి ఏం తెలుసు? ఎంత వరకూ న్యాయం చేయగలడని అనుకున్నాను. కానీ అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా చూశాక ఎంత రీసెర్చ్ చేశాడో అర్థం అయింది. తెలుగు సినిమా స్థాయిని, ఖ్యాతినీ పెంచిన వాళ్లలో అశ్విన్ నిలిచారు. సావిత్రిగా కీర్తీ సురేశ్ జీవించింది. జెమినీ పాత్ర చేసిన దుల్కర్‌ని అభినందిస్తున్నాను. సమంత, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ తెలుసుకొని నటించారు. మంచి కమర్షియల్ తీశాను కాని క్లాసిక్ సినిమా తీయలేకపోయాను అని అనేవారు అశ్వనీదత్‌గారు. స్వప్నా, ప్రియాంక తండ్రికి ఆలోటు లేకుండా ‘మహానటి’ సినిమాను బహుమతిగా అందించారు. ఈ సినిమాకు రివార్డులే కాదు అవార్డులు కూడా వస్తాయి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రిలీజ్ అయిన మే9నే ‘మహానటి రిలీజ్ అవ్వడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వనీదత్, నాగ్ అశ్విన్, స్వప్నా, ప్రియాంకా పాల్గొన్నారు. -
కొన్ని క్షణాలు నేను అశ్విన్ అయ్యా
సుకుమార్ కాసేపు నాగ్ అశ్విన్ అయ్యారు. ‘‘నేను సుకుమార్‌ని కాదు’’ అని అసలు విషయం చెప్పకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. ఎందుకలా? అంతలా సుకుమార్ మౌనంగాఉండిపోవ డానికి కారణం ఏంటి? ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ‘ప్రియ’మైన అశ్విన్, ‘మహానటి’ సినిమా చూసి బయటకి వచ్చి, నీతో మాట్లాడదామని నీ నంబర్‌కి ట్రై చేస్తున్నాను.. ఈలోగా ఒక ఆవిడ వచ్చి ‘‘నువ్వు డైరెక్టరా బాబు’’ అని అడిగింది. అవునన్నాను... అంతే.. నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది ‘‘ఎంత బాగా చూపించావో బాబు.. మా సావిత్రమ్మని’’ అంటూ.. నా కళ్లల్లో నీళ్లు.. నేను నువ్వు కాదని ఆవిడకి చెప్పలేకపోయాను.. ఆవిడ ప్రేమంతా నేనే తీసుకున్నాను.. మనసారా... ఆవిడ నన్ను దీవించి వెళ్లిపోయింది.. కొన్ని క్షణాలు నువ్వే నేనైపోయాను ఆనందంతో.. ఇంతకన్నా ఏం చెప్తాను.. నా అనుభూతి ఈ సినిమా గురించి.– సుకుమార్ (కొన్ని క్షణాల అశ్విన్) (గమనిక: ఆవిడకి ఎప్పటికీ నేను నువ్వు కాదని తెలియకపోతే బావుండు..) అంటూ ‘ఫేస్బుక్’ ద్వారా దర్శకుడు సుకుమార్ తన అనుభూతిని పంచుకున్నారు. సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘మహానటి’ బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా చూసి, థియేటర్ నుంచి బయటికొచ్చిన సుకుమార్‌కి ఎదురైన అనుభవాన్ని ఈ విధంగా పంచుకున్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
మహాద్భుతం
‘‘సావిత్రిగారి గురించి రాసే అర్హత తెచ్చుకున్నాకే ఆమె కథ రాస్తా’... ‘మహానటి’లో జర్నలిస్ట్ మధురవాణి ఇలానే అంటుంది. కానీ సావిత్రి లైఫ్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాక, ఇన్స్పైర్ అయ్యి అనుభవం పెరిగే వరకూ ఆగకుండా రాస్తుంది. ఆ మాటకొస్తే.. ‘మహానటి’ తీయడానికి దర్శకుడు నాగ్ అశ్విన్ వయసు, అనుభవం ఎంత? చాలా చాలా తక్కువ. అయినా కన్విక్షన్, ప్యాషన్ ఉంటే వయసు, అనుభవంతో పనేంటి? పైగా సావిత్రి లైఫ్ హిస్టరీ తెలుసుకున్నాక నాగ్ అశ్విన్‌కి ఆమె అంటే విపరీతమైన అభిమానం ఏర్పడింది. అదే ‘మహానటి’ జీవితాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించేలా చేసింది. టైటిల్ రోల్లో కీర్తీ సురేష్, జెమినీ గణేశన్‌గా దుల్కర్ సల్మాన్ తదితర తారలతో వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్‌పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం బుధవారం విడుదలైంది. సినిమా చూసినవాళ్లు ‘నాగ్ అశ్విన్ బ్రహ్మాండంగా తీశాడు.. కీర్తీ నటన అద్భుతం’ అంటు న్నారు. ట్వీటర్ ద్వారా కొందరు ప్రముఖులు తమ అనుభూతిని పంచుకున్నారు. 28 ఏళ్ల క్రితం ఇదే రోజున (మే, 9) భారీ వర్షం. చాలా పెద్ద సినిమా (జగదేక వీరుడు అతిలోక సుందరి) తీశామనే ఆనందం. ఎలా ఆడుతుందో అనే భయం. ఎప్పుడు వరద ఆగుతుందో అనే ఎదురుచూపు.. ఎట్టకేలకు సాయంత్రం నుంచి సినిమా హాళ్ల వైపు జనాలు కదిలారు. మరుసటిరోజు నుంచి వరద థియేటర్లలో అభిమానుల రూపంలో రావడం మొదలైంది. మా అశ్వనీదత్‌గారికి ఆ రోజు ఎంత ఆనందం వేసిందో ఇప్పటికీ మర్చిపోలేదు. సరిగ్గా అదే రోజున ‘మహానటి’ విడుదలైంది. ఆ రోజున ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో ఈ రోజు ‘మహానటి’ నిర్మించడానికీ అంతే ధైర్యం కావాలి. సావిత్రిగారి చరిత్రను తరతరాలకు అందించిన స్వప్న సినిమా, వైజయంతీ మూవీస్‌కి ధన్యవాదాలు. సావిత్రి పాత్రలో కీర్తీ జీవించింది. జెమినీ గణేశన్‌గా దుల్కర్ నటన అద్భుతం. నాగ్ అశ్విన్, చిత్ర యూనిట్‌కు నా అభినందనలు. – దర్శకుడు కె. రాఘవేంద్ర రావు మహానటి క్లాసిక్, ఇన్స్పిరేషనల్ బయోపిక్. కీర్తీ సురేశ్ ‘మాయాబజార్’ డ్యాన్స్‌లతో సావిత్రిగారిని తిరిగి తీసుకువచ్చింది. సమంతా అదరగొట్టింది. టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఇలాంటి క్లాసిక్ మాకు అందించినందుకు వైజయంతీ మూవీస్‌కు స్పెషల్ థ్యాంక్స్. – ‘మెర్సల్’ ఫేమ్ దర్శకుడు అట్లీ సావిత్రిగారిలా కీర్తీ సురేశ్ పెర్ఫార్మెన్స్ నేను చూసిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ల్లో ఒకటి. కేవలం ఇమిటేటింగ్ కాదు, సావిత్రి గారి పాత్రకు ప్రాణం పోసింది. దుల్కర్ ఈజ్ ఫెంటాస్టిక్. నేను అతని ఫ్యాన్ అయిపోయా. కంగ్రాట్స్ నాగ్ అశ్విన్, స్వప్నా. మీ నమ్మకం, డిటర్మినేషన్ అద్భుతం. – దర్శకుడు రాజమౌళి థ్యాంక్యూ నాగ్ అశ్విన్.. ఈ సినిమా తీసినందుకు. సావిత్రిగారు అమరులు. నీ రైటింగ్, నీ రీసెర్చ్, నీ స్క్రీన్‌ప్లే గురించి మాట్లాడటానికి నా దగ్గర మాటలు లేవు. నాగీ ఆలోచనను, అతని కన్విక్షన్‌ను నమ్మి ఈ సినిమాను నిర్మించినందుకు స్వప్నా, ప్రియాంకకు కంగ్రాట్స్. టేక్ ఏ బౌ గర్ల్స్. సమంతా.. ఇలాంటి పాత్ర ఎంచుకోవడం గ్రేట్. నీ రోల్‌ను కమాండబుల్గా చేశావు. క్లైమాక్స్‌లో నీ నటన చాలా రోజులు గుర్తుండిపోతుంది. – దర్శకుడు వంశీ పైడిపల్లి నాగ్ అశ్విన్ నన్ను సావిత్రిగారి ఎరాలోకి తీసుకువెళ్లిపోయారు. ఏం సినిమా... ఇలాంటి పాత్ర చేసే అవకాశం కీర్తీ సురేశ్‌కి రావడం నిజంగా బ్లెస్డ్. అక్కినేని నాగేశ్వరరావుగారిలా చైతన్య సూపర్బ్. స్వప్నా అండ్ టీమ్‌కు కంగ్రాట్స్. – దర్శకుడు మారుతి నాగ్ అశ్విన్, స్వప్నా, వైజయంతి మూవీస్ బోల్డ్ ఆలోచన ఇది. అద్భుతమైన నటీనటులతో సినిమా ఎగ్జిక్యూట్ చేశారు. నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నా. ప్రతి ఒక్కరి నటన నచ్చింది. ‘కీర్తీ యూ కిల్డ్ ఇట్’. సమంతా.. నన్ను ఏడిపించేశావ్. దుల్కర్.. నువ్వు సూపర్. మోహన్‌బాబుగారు, విజయ్, క్రిష్, ప్రకాశ్ రాజ్ అందరూ కన్విన్సింగ్‌గా చేశారు. తాత రోల్లో చైతన్యను చూడటం హ్యాపీగా ఉంది. హార్ట్ ఈజ్ హ్యాపీ. – సుశాంత్ -
చిన్నప్పటి నుంచి చివరి క్షణం వరకూ...
‘‘సావిత్రిగారి బయోపిక్ తీయాలనే ఆలోచన ఎప్పుడో కలిగింది. కానీ ఆవిడ గురించి తెలుసుకున్న కొద్దీ తీయాలనే కోరిక ఇంకా బలంగా పెరిగింది. సావిత్రిగారి రియల్ లైఫ్, రీల్ లైఫ్ ఒకేలా నడిచాయి. స్క్రీన్ ప్లే కూడా అలానే డిజైన్ చేస్తూ కథ రాసుకున్నాను. సావిత్రిగారి లైఫ్‌లో చిన్నప్పటి నుంచి తుది శ్వాస విడిచే వరకూ జరిగిన అన్ని ముఖ్యమైన సంఘటనలు సినిమాలో ఉంటాయి’’ అన్నారు నాగ్ అశ్విన్. సావిత్రిగా కీర్తీ సురేశ్ నటించిన చిత్రం ‘మహానటి’. సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ముఖ్య తారలుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్ పతాకంపై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ – ‘‘కీర్తీ సురేశ్ అద్భుతంగా నటించింది. ఈ సినిమా చూశాక ఆడియన్స్‌కు ఆవిడ మీద గౌరవం పెరుగుతుంది. స్వప్నా, ప్రియాంకా ఇచ్చిన క్రియేటీవ్ సపోర్ట్ సూపర్. ఈ బ్యానర్లో కాకపోయుంటే ఇంత గొప్పగా తీసుండకపోవచ్చేమో. మిక్కీ చాలా మంచి మ్యూజిక్ అందించాడు. ఎన్టీఆర్ గారి పాత్ర కోసం తారక్‌ని అడిగాం. కుదరలేదు. అయినా అభిమానులకోసం చిన్న ట్రీట్ ఏర్పాటు చేశాం. 99 శాతం నిజమైన సంఘటనలతోనే రూపొందించాం. ప్రతీ సీన్ వాస్తవానికి లింక్ అయి ఉంటుంది. సావిత్రి గారు యాక్ట్ చేసిన ముఖ్యమైన 11 సినిమాలను టచ్ చేశాం. -
మహానటి పెద్ద సవాల్
‘‘నేనెప్పుడూ ప్రయోగాలు చేయడానికే ఇష్టపడతాను. నా ప్రతి సినిమాలో చేశాను కూడా. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల వెనక పరిగెత్తకుండా నాకు నచ్చిన సినిమాలే చేస్తుంటాను’’ అన్నారు సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మహానటి’. కీర్తీ సురేశ్, సమంత, నాగచైతన్య, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ముఖ్య తారలుగా నటించారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటించారు. మిక్కీ జె. మేయర్ స్వరాలు అందించారు. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్ పతాకంపై ప్రియాంకాదత్ నిర్మించిన ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మిక్కీ జె.మేయర్ మాట్లాడుతూ– ‘‘నటిగా సావిత్రిగారు ఏంటి? అనేది అందరికీ తెలుసు. కానీ ఆమె జీవిత విశేషాలు పూర్తిగా ఎవరికీ తెలియవు. ఆ విషయాలు ‘మహానటి’ చిత్రంతో తెలుస్తాయి. ఈ సినిమాకు సంగీత దర్శకునిగా పని చేయడం పెద్ద చాలెంజ్లా అనిపించింది. పాటల కోసం ఏడాదిన్నర కష్టపడ్డాను. సావిత్రిగారి పాత సినిమాలు చూశాను. ఆ సినిమాల్లో సంగీత శైలి, ఆమె నటన ఎలా ఉన్నాయో పరిశీలించాను. సీతారామశాస్త్రిగారు లిరిక్స్ రాశారు. ఆయన నాకు హెల్ప్ చేశారు. ‘మహానటి’ నా కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ సినిమాకు పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నాగ్ అశ్విన్ విజన్ సూపర్. ‘హ్యాపీడేస్’ లాంటి సినిమాలు కెరీర్లో ఒక్కసారే వస్తాయి. ప్రతి సినిమా ‘హ్యాపీడేస్’ అవ్వదు’’ అన్నారు. -
మేలో మెలోడీలు
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మహానటి’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సావిత్రి పాత్రను కీర్తీ సురేశ్ పోషించారు. సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్ బ్యానర్‌పై ప్రియాంకా దత్ నిర్మించారు. ‘మహానటి’ సినిమా ఆడియోను మే 1న విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదలైన మొదటి పాట ‘మూగ మనసులు’కు విశేష స్పందన లభిస్తోంది. మిక్కీ జె.మేయర్ కంపోజ్ చేసిన పాటలు అలనాటి పాటలకు దీటుగా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. మే 9న ఈ చిత్రం విడుదల కానుంది. -
వాళ్లే నన్ను మెచ్చుకుంటారు : కీర్తి సురేశ్
లెజండరీ వ్యక్తుల జీవితం ఆధారంగా తెరకెక్కే సినిమాల్లో నటించే అవకాశం రావాలంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ప్రస్తుతం ఆ అదృష్టం కీర్తి సురేశ్‌కు దక్కింది. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో ఆమె టైటిల్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే మహానటి టీజర్ కూడా విడుదలైంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ పూర్తిగా లీనమైపోయిందంటూ కొందరు మెచ్చుకొంటుంటే.. మరి కొందరు మాత్రం ఆ పాత్రకు కీర్తి న్యాయం చేయలేక పోయారంటూ ట్రోల్ చేస్తున్నారు. తనకు సంబంధించి ఇలా మిశ్రమ స్పందన రావడంతో కీర్తి సురేశ్ ఒకింత ఉద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. ఒక వేడుకలో పాల్గొన్న కీర్తి మాట్లాడుతూ.. ఇప్పుడు నన్ను విమర్శిస్తున్న వారే సినిమా విడుదలైన తర్వాత మెచ్చుకుంటారు అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ పాత్ర కోసం కీర్తి ఎంతగానో కష్టపడిందని.. అందుకే ఈ విధంగా స్పందించిందని ఆమె సన్నిహితులు తెలిపారు. -
సావిత్రి కీర్తి
సావిత్రిని ప్రేమించాలా? గౌరవించాలా?అప్పటి ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగినవాళ్లకు ఎప్పటికీ ఉండే సందిగ్ధమే ఇది.అవేం కాదు కానీ సావిత్రిని కీర్తించాల్సిందే.సజీవంగా ఇంకో సావిత్రిలా నటించడం, పాత్రలో జీవించడం ఆల్మోస్ట్ ఇంపాజిబుల్. అయినా ‘మహానటి’... సావిత్రి ‘కీర్తి’కి అద్దం పడుతుంది. ‘మహానటి’ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ‘ఎవరీ నాగ్ అశ్విన్’? ‘ఎవడే సుబ్రమణ్యం’ రిలీజ్ తర్వాత చాలామంది అడిగిన ప్రశ్న ఇది. ఒక కొత్త దర్శకుడు తీసిన సినిమాలా లేదే? కాన్సెప్ట్ వండర్ఫుల్. ‘ఎవడే.. ’ సినిమాని చూసినవాళ్లు వ్యక్తపరిచిన అభిప్రాయం ఇది. ఫస్ట్ మూవీకే ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్న నాగ్ అశ్విన్ వెంటనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ తీస్తాడని చాలామంది ఊహించి ఉంటారు. అయితే ఎవరూ ఊహించని విధంగా మహానటి సావిత్రి బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు. అసలీ ఆలోచన నాగ్ అశ్విన్‌కి ఎప్పుడు వచ్చింది? అంటే.. ‘ఎవడే సుబ్రమణ్యం’ తీస్తున్నప్పుడే. నెక్స్›్టసినిమా ఏంటి? అని చిత్రనిర్మాత స్వప్నా దత్ అడిగితే.. సింపుల్‌గా సావిత్రిగారి లైఫ్ హిస్టరీ అన్నారు నాగ్. అంత పెద్ద ప్రాజెక్ట్‌ని తలెత్తుకోవడం అంటే తల పండిపోయిన దర్శకుల వల్లే సాధ్యం. అందుకే స్వప్న షాకయ్యారు. నాగ్‌కి కూడా సెకండ్ థాట్ లేకపోలేదు. ‘మన అనుభవం, వయసు సరిపోతుందా?’ అని ఆలోచించారు. ఎంతగా ఆలోచించారంటే దాదాపు రెండేళ్లు. ఫైనల్లీ ఈ మూవీ తీయాలని ఫిక్సయ్యారు. నాగ్ అశ్విన్‌కి సావిత్రి గురించి ఏం తెలుసు? చిన్నప్పుడు చూసిన విషయాలు, జరిగిన సంఘటనలు మనసులో నిలిచిపోతాయ్. అలా చిన్నప్పుడు అమ్మమ్మతో పాటు చూసిన సావిత్రి సినిమాలు నాగ్ అశ్విన్‌కి ఆమెను పరిచయం చేశాయి. మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ.. చిత్రాలు చూసిన నాగ్ అశ్విన్‌కి సావిత్రి ఎంత గొప్ప నటో అర్థమైంది. పెద్దయ్యాక సావిత్రి జీవితం గురించి తెలుసుకుని చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఫైనల్లీ తన రెండో సినిమాకి ఆమె జీవిత కథనే ఎంచుకున్నారు. కొన్ని పుస్తకాల రిఫరెన్స్, కొందరు దర్శకులు చెప్పిన విశేషాలు, సావిత్రి సినిమాలు చూసి... ఎంతో రీసెర్చ్ చేసి, ఈ కథ తయారు చేసుకున్నారు. నేను సావిత్రిగారిలానా..? భయపడ్డ కీర్తీ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు సావిత్రి క్యారెక్టర్‌కి ఏ హీరోయిన్నీ అనుకోలేదు. పూర్తయ్యాక ‘కీర్తి సురేష్’ అయితే బాగుంటుందని దర్శకుడికి అనిపించింది. కానీ ప్రియాంకా దత్, స్వప్నా దత్‌కి మాత్రం కీర్తీ్త సూట్ అవుతుందా? అని డౌట్. అయితే వైజయంతీ మూవీస్ అధినేత (ప్రియాంక, స్వప్న, స్రవంతిల తండ్రి) అశ్వనీదత్‌కి మాత్రం డౌటే లేదు. ‘కీర్తీ యాప్ట్’ అన్నారు. సో.. సావిత్రిగా కీర్తీయే అని ఫిక్సయ్యారు. కీర్తీకి కథ చెప్పడానికి వెళ్లారు. కథ విన్నప్పుడు అంత పెద్ద హీరోయిన్, మహానటి పాత్రను నేను పోషించగలనా? అని డౌట్ పడ్డారు కీర్తీ్త. అయితే ‘మీ మీద మాకు నమ్మకం ఉంది. మీరు చేయగలుగుతారు’ అని ఆమెను ఒప్పించారు. ‘దేవదాసు’లోని పార్వతి గెటప్‌లో టెస్ట్ షూట్ ఏదైనా క్యారెక్టర్‌కి ఒక హీరోయిన్ని అనుకున్నాక లుక్ టెస్ట్ చేశాక కానీ పూర్తి సంతృప్తి లభించదు. వన్ ఫైన్ డే కీర్తీకి సావిత్రిలా మేకప్ చేసి, టెస్ట్ షూట్ చేశారు. మేకప్ వేసుకుని కీర్తీ బయటకు రాగానే ‘పర్ఫెక్ట్ చాయిస్’ అని టీమ్ ఫిక్సయింది. నాగ్ అశ్విన్ విజన్‌కు ఆశ్చర్యపోయారట. ఫస్ట్ టెస్ట్ షూట్‌కి ‘దేవదాసు’ చిత్రంలో సావిత్రి చేసిన పారు గెటప్‌ని ప్లాన్ చేశారు. ఆ ఫొటోషూట్ చూసి ‘అదుర్స్’ అననివాళ్లు లేరు. ఫోర్ ఏజ్ గ్రూప్స్‌లో సావిత్రి క్యారెక్టర్ ఒకటి కాదు.. రెండు కాదు.. వందకు పైగా గెటప్స్‌లో కీర్తి సురేష్‌తో ఫొటోషూట్ చేశారు. ఇంతకీ సినిమాలో సావిత్రి క్యారెక్టర్ ఏయే ఏజ్‌లో కనిపిస్తుంది? అంటే.. మొత్తం నాలుగు దశలలో కనిపిస్తారు. టీనేజ్, యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్, ఓల్డేజ్‌లో ఈ పాత్ర ఉంటుందని తెలిసింది. అంటే.. సినిమాల్లోకి వచ్చిన కొత్త, స్టార్‌డమ్‌కి చేరుకున్న దశ, సినిమాలకు దూరం కావడం, ఆ తర్వాతి దశను చూపిస్తారని ఊహించవచ్చు. మెయిన్ షూట్ మొదలయ్యాక సావిత్రిలా తయారవ్వడానికి కీర్తీకి సుమారు రెండు గంటలు పట్టేది. సావిత్రి ఫొటో పక్కన పెట్టుకుని అది చూస్తూ రెడీ అయ్యేవారట. అందుకే ఫొటోలు లీక్ కాలేదు జన్రల్‌గా పెద్ద సినిమాలకు సంబంధించి తమంతట తాము అధికారికంగా ఫొటోలు విడుదల చేసేవరకూ అవి బయటకు లీక్ కాకూడదనుకుంటారు. దర్శకుడు శంకర్ అయితే షూటింగ్ లొకేషన్లోకి ఎవరూ సెల్‌ఫోన్ తీసుకు రాకూడదని నిబంధన విధించారు. అయినా ‘2.0’ ఫొటోలు లీకయ్యాయి. అయితే ‘మహానటి’ ఫొటోలు చిత్రబృందం విడుదల చేసేవరకూ బయటకు రాకపోవడం విశేషం. పైగా సినిమాకి పని చేసిన అందరూ సెల్ఫోన్లు తీసుకెళ్లేవారట. అయినా ఎవరూ దొంగచాటుగా ఫొటోలు లీక్ చేయకపోవడానికి కారణం సావిత్రి మీద ఉన్న గౌరవం అని యూనిట్ సన్నిహిత వర్గాల్లో ఒకరు తెలిపారు. అందరూ ఎంతో ప్రేమించి, ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారని పేర్కొన్నారు. దీన్నిబట్టి యూనిట్ మెంబర్స్ సినిమాని ఓన్ చేసుకుంటే ‘లీక్’ అనేది ఉండదని అర్థం చేసుకోవచ్చు. అవుట్ డోర్ షూటింగ్స్ అప్పుడు యూనిట్‌కి తిప్పలు తప్పలేదు. ఎవరో చాటుమాటుగా ఫొటోలు తీయడానికి ప్రయత్నించడం, వాళ్లను వారించడం జరిగేది. అహ నా పెళ్లంట, వివాహ భోజనంబు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన ‘మాయాబజార్’ సెట్లో తీసిన అహ నా పెళ్లంట, వివాహ భోజనంబు పాటలు హైలైట్‌గా నిలుస్తాయట. ఈ సెట్‌ని క్రియేట్ చేయడానికి సుమారు 100 మంది 20 రోజులు వర్క్ చేశారు. కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ఆర్టిస్టులు వచ్చారట. 97 ఏళ్ల పెయింటర్.. నారాయణ ఇప్పుడు ఏదైనా డిజిటల్లో సులువుగా చేసుకోవచ్చు. అయితే న్యాచురాల్టీ కోసం మ్యానువల్ వర్క్ చేయించడం కూడా జరుగుతుంటుంది. అలా ఈ సినిమాలో కనిపించే మబ్బులు, చెట్లను పెయింటింగ్ వేయించారట. బాలీవుడ్ చిత్రాలు ‘మొఘలీ ఆజామ్, ప్యాసా’ వంటివాటికి హ్యండ్ పెయింటింగ్స్ చేసిన నారాయణ ‘మహానటి’కి పెయింటర్‌గా చేశారు. ఆయన వయసు 97. ఆ వయసులో ఆయన 20 అడు గుల నిచ్చెన ఎక్కి పెయింటింగ్స్ వేయడం యూనిట్లో ఉన్న చిన్నవాళ్లకు ఇన్స్పిరేషన్. ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నప్పుడు గతంలో తాను ఒక సావిత్రి సినిమాకి వర్క్ చేశానని, ఆ సినిమా పేరు గుర్తు లేదని నారాయణ అన్నారట. నారాయణకు ఇదే చివరి సినిమా. మొన్నీ మధ్యనే ఆయన మరణించారు. అక్కడక్కడా బ్లాక్ అండ్ వైట్.. మిగతాది కలర్.. మహానటికి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డానీ సంచెజ్ లోపెజ్‌ని తీసుకున్నారు. ఆయన ప్రొఫైల్ చూసి, నాగ్ అశ్విన్ ఇన్స్పైర్ అయ్యారట. ఇండియా మీద డానీకి ఉన్న గౌరవం చూసి, ఈ సినిమాకి కెమెరామేన్‌గా తీసుకున్నారట. సినిమా ఆల్మోస్ట్ కలర్లో ఉంటుంది. అక్కడక్కడా బ్లాక్ అండ్ వైట్ సీన్స్ కనిపిస్తాయి. కెమెరా వర్క్ ఐఫీస్ట్‌గా నిలుస్తుందట. అందుకు శనివారం రిలీజైన టీజర్ ఓ ఉదాహరణ. నాలుగు రకాల బొట్లు సావిత్రిని గుర్తు చేసుకోగానే ఆమె చక్కని ముఖారవిందం మన కళ్ల ముందు మెదులుతుంది. అలాగే ఎక్కువగా నిలువు బొట్టులో గుర్తొస్తారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ మొత్తం నాలుగు రకాల బొట్లు వాడారని తెలిసింది. రకరకాల సైజ్‌లో నిలువు బొట్టు, గుండ్రని బొట్టు వాడారట. మామూలుగా సావిత్రి మిడిల్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఒకలాంటి బొట్టు, పెద్ద వయసులో ఇంకో రకం బొట్టు, ఇంట్లో ఉన్నప్పుడు విభూది పెట్టుకునేవారట. ఆ విషయాలను ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి దగ్గర తెలుసుకుని, అలానే ఫాలో అయ్యారట. అప్పట్లో కళ్లకు కాటుక వాడేవారు. ఈ సినిమాలో కీర్తీ కూడా కాటుక దిద్దుకున్నారు. పై రెప్పలకు మాత్రం ఐలైనర్ వాడారట. చెన్నై నుంచి సవరాలు సావిత్రి జుత్తు కొంచెం వంకీలు తిరిగి ఉంటుంది. కీర్తి సురేష్ హెయిర్ కూడా దాదాపు అలానే ఉన్నప్పటికీ ఇంకొంచెం కర్లీగా చేయించుకున్నారట. జడ, ముడి.. ఇలా రకరకాల స్టైల్స్‌లో ఆమె కనిపిస్తారట. పొడవాటి జుత్తు కోసం చెన్నై నుంచి సవరాలు తెప్పించుకున్నారట. అలాగే, ముంబై నుంచి హెయిర్ స్టైలిస్ట్‌ని పిలిపించుకున్నారట. ఇవన్నీ కూడా కీర్తీ తనంతట తాను ఎక్కువ కేర్ తీసుకుని, ప్లాన్ చేసుకున్నారట. వందకు పైగా చీరలు.. సావిత్రి కట్టూ బొట్టూ అందరికీ ఇష్టం. నిజానికి ఇప్పుడు ‘డిజైనర్ శారీస్, బ్లౌజెస్’ అంటున్నారు కానీ అవి అప్పటి ఫ్యాషనే. అప్పటి చీరలను, జాకెట్టులను తయారు చేయించడానికి బాలీవుడ్ డిజైనర్ గౌరంగ్ షాని పిలిపించారు. ‘మహానటి’ కథ విన్నాక ‘నేనీ సినిమాని కచ్చితంగా చేస్తా’ అన్నారట. అప్పట్లో సావిత్రి కట్టిన చీరలను తయారు చేయడానికి ఆయన బోలెడంత రీసెర్చ్ చేశారు. పది మంది టీమ్‌తో నాలుగు నెలల పాటు రీసెర్చ్ చేసి, ‘స్పె షల్ ఫ్యాబ్రిక్’ తెప్పించి, చీరలు డిజైన్ చేశారు. ఒక్క ‘మాయాబజార్’ ఘట్టంలో వచ్చే చీర నేయడానికే మూడు నెలలు పట్టిందట. ఇక, నగల తయారీకి ఆరు నెలలు పట్టింది. అచ్చంగా జెమినీలా.. సావిత్రి జీవితంలో తమిళ నటుడు జెమినీ గణేశన్ కీలక వ్యక్తి. ఆయన్ను ప్రేమించి, పెళ్లాడారామె. జెమినీ తమిళీయుడు కాబట్టి, ఆ పాత్రను వేరే భాషకు చెందిన నటుడితో చేయించాలనుకున్నారు. మమ్ముట్టి తనయుడు, హీరోగా దూసుకెళుతోన్న దుల్కర్ సల్మాన్ అయితే బాగుంటుందని తనని అప్రోచ్ అయ్యారు. దుల్కర్ సెకండ్ థాట్ లేకుండా సినిమా ఒప్పుకున్నారట. ఆయన కాస్ట్యూమ్స్‌ని అర్చనా రావ్ డిజైన్ చేశారు. నైన్టీన్ఎయిటీస్లో మధురవాణి క్యారెక్టర్ ఇందులో సమంత జర్నలిస్ట్ మధురవాణిగా కనిపించనున్నారు. ఈ పాత్ర నైన్టీన్ఎయిటీస్లో ఉంటుంది. అంటే.. సావిత్రి కెరీర్ ఎండింగ్లో వచ్చే పాత్ర అని ఊహించవచ్చు. సో.. సావిత్రి లైఫ్ స్టోరీ గురించి తెలుసుకోవాలనో, ఆమె జీవితం గురించి రాయాలని ఆరాటపడే జర్నలిస్ట్గానో సమంత కనిపిస్తారని ఊహించవచ్చు. వాస్తవానికి టైటిల్ రోల్ చేసింది కీర్తి సురేషే అయినా సినిమాని లీడ్ చేసేది మాత్రం మధురవాణి పాత్రే అట. మిడ్డీస్, చుడీదార్స్, శారీస్లో సమంత కనిపిస్తారని తెలిసింది. ఫొటో జర్నలిస్ట్‌గా విజయ్ దేవరకొండ కనిపిస్తారట. అలనాటి కారు.. కెమెరా ‘మహానటి’ టీజర్లో అలనాటి కారు కనిపించడం గమనించే ఉంటారు. అప్పటి కెమెరాలు, గ్రామ్‌ఫోన్ ఇలా.. ఎన్నో వస్తువులు మనకీ సినిమాలో కనిపిస్తాయి. ఇప్పటికీ అవి లభ్యమవుతున్నాయి. దొరకనవి చేయించారు. కొన్ని రెంట్‌కి తీసుకున్నారు. షూట్ మొదలుపెట్టక ముందే ఒక బ్యాంక్ తయారు చేసుకున్నారట. కావాల్సిన వస్తువులన్నీ సేకరించాకే షూట్ మొదలుపెట్టారని సమాచారం. మాయాబజార్ ప్రియదర్శిని మాయాబజార్లో ప్రియదర్శిని హైలైట్. ఈ పెట్టె తయారీకి 15 రోజులు పట్టిందట. మూడుసార్లు తయారు చేయించినా సంతృప్తిగా అనిపించలేదట. నాలుగో ప్రియదర్శిని పర్ఫెక్ట్గా కుదరడంతో దాన్ని ఓకే చేశారు. ‘శివమ్, ఘాజీ’ సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా చేసిన అవినాష్ కొల్లా వర్క్ చేశారు. సీనియర్ ఆర్ట్ డిజైనర్ ‘తోట తరణి’ ఇన్పుట్స్ కూడా తీసుకున్నారు. -
స్వీట్ వాయిస్
సమంత మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆమె గొంతు విన్నవాళ్లైతే టకీమని స్వీట్‌గా ఉంటుందని చెప్పేస్తారు. సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ సమంత సొంత గొంతు వినిపించలేదు. ‘మహానటి’ ద్వారా వినిపించనున్నారట. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతోన్న ‘మహానటి’లో సమంత కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనుకున్నారని సమాచారమ్. నిజానికి సమంత చక్కగా తెలుగు మాట్లాడతారు. ఆ చిలక పలుకులు వినడం అభిమానులకు వీనుల విందుగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్‌పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. -
ఇప్పుడు భానుమతిగా..
తమిళసినిమా: ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రలో ఒదిగిపోవడం నటి అనుష్కకు వెన్నతో పెట్టిన విద్య. అరుంధతిలో అందంతో పాటు రౌద్రం చూపించినా, రుద్రమదేవిలో వీరత్వం చూపినా, బాహుబలిలో శౌర్యప్రరాక్రమాలను ప్రదర్శించినా, భాగమతిలో భయబ్రాంతులకు గురి చేసినా అద్భుతమైన నటనతో తనకు తానే అని చాటుకున్న అందరి స్వీటీ అనుష్క. త్వరలో గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్న అనుష్క అంతకు ముందు ప్రఖ్యాత నటీమణి భానుమతిగా మారనున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఇతివృత్తంతో ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు)గా తెరకెక్కుతున్న నడిగైయార్ తిలగం(తెలుగులో మహానటి) చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పలు విశేషాలతో కూడుకున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో సావిత్రిగా యువ నటి కీర్తీసురేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్రను ఈమె పోషించడంపై సీనియర్ నటి, సావిత్రి సమకాలీన నటి జమున ఆక్షేపణను వ్యక్తం చేసినట్లు మీడియాల్లో వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో చిత్రంపై మరింత ఉత్సుకత కలుగుతోంది. ఇందులో సావిత్రితో అనుబంధం ఉన్న పలువురు గొప్పగొప్ప నటీనటుల పాత్రల్లో యువ తారాగణం నటిస్తున్నారు. ముఖ్యంగా విలేకరి పాత్రలో నటి సమంత, సావిత్రి భర్త జెమినీగణేశన్‌గా మలయాళ యువ నటుడు దుల్కర్సల్మాన్, మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో అర్జున్‌రెడ్డి చిత్రం ఫేమ్ విజయ్‌దేవరకొండ, ఎస్వీ.రంగారావు పాత్రలో మోహన్‌బాబు నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా నటి భానుమతిగా అనుష్క నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికీ ఇదే నిజమైతే ఈ చిత్ర కలరే మారిపోతుంది. -
సేమ్ టు సేమ్ సావిత్రి
సినిమా రిలీజ్కాక ముందే సేమ్ టు సేమ్ సావిత్రి అనేస్తున్నారేంటీ అనుకుంటున్నారా? ఇక్కడ చెప్పబోతున్నది అభినయం గురించి కాదండి, అలవాట్ల గురించి. నాకూ సావిత్రి గారికి కామన్ ఇంట్రెస్ట్‌లు చాలానే ఉన్నాయి అంటున్నారు కీర్తీ సురేష్. ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రను కీర్తీ సురేష్ పోషిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సావిత్రి పాత్రను పోషించడానికి చాలా హోమ్ వర్కే చేశారట Mీ ర్తి. సావిత్రిగారి గురించి ఇంకా బాగా తెలుసుకోవటానికి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరితో కూడా మాట్లాడారట. అప్పుడు తనకూ సావిత్రికీ సంబంధించిన చాలా కామన్ ఇంట్రెస్ట్‌లు తెలుసుకున్నారట కీర్తీ. ఆ విషయం గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘విజయ చాముండేశ్వరిగారు వాళ్ల అమ్మగారి మేనరిజమ్స్, హావభావాలు, వాళ్ల ఇద్దరు మధ్య బాండ్ గురించి చాలా బాగా మాట్లాడారు. కొన్ని రోజుల తర్వాత ఒక నాలుగు పేజీలు ఉన్న లెటర్‌ను పంపించారామె. ఆ లెటర్ చదివిన తర్వాత సావిత్రిగారికీ నాకు కొన్ని విషయాలు కలవడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. సావిత్రిగారు స్విమ్మింగ్ చేసేవారు. నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. మా ఇద్దరికీ టీ అంటే చాలా ఇష్టం. ఆమె క్రికెట్ ఆడేవారు. నేను స్కూల్ డేస్‌లో క్రికెట్ బాగా ఆడేదాన్ని. తనకు కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. నాక్కూడా ఇష్టమే..’’ అని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు కీర్తీ. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాను మార్చి 29న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.