నాగ్ అశ్విన్
‘‘సావిత్రిగారి బయోపిక్ తీయాలనే ఆలోచన ఎప్పుడో కలిగింది. కానీ ఆవిడ గురించి తెలుసుకున్న కొద్దీ తీయాలనే కోరిక ఇంకా బలంగా పెరిగింది. సావిత్రిగారి రియల్ లైఫ్, రీల్ లైఫ్ ఒకేలా నడిచాయి. స్క్రీన్ ప్లే కూడా అలానే డిజైన్ చేస్తూ కథ రాసుకున్నాను. సావిత్రిగారి లైఫ్‌లో చిన్నప్పటి నుంచి తుది శ్వాస విడిచే వరకూ జరిగిన అన్ని ముఖ్యమైన సంఘటనలు సినిమాలో ఉంటాయి’’ అన్నారు నాగ్ అశ్విన్. సావిత్రిగా కీర్తీ సురేశ్ నటించిన చిత్రం ‘మహానటి’.
సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ముఖ్య తారలుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్ పతాకంపై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ – ‘‘కీర్తీ సురేశ్ అద్భుతంగా నటించింది. ఈ సినిమా చూశాక ఆడియన్స్‌కు ఆవిడ మీద గౌరవం పెరుగుతుంది. స్వప్నా, ప్రియాంకా ఇచ్చిన క్రియేటీవ్ సపోర్ట్ సూపర్. ఈ బ్యానర్‌లో కాకపోయుంటే ఇంత గొప్పగా తీసుండకపోవచ్చేమో. మిక్కీ చాలా మంచి మ్యూజిక్ అందించాడు. ఎన్టీఆర్ గారి పాత్ర కోసం తారక్‌ని అడిగాం. కుదరలేదు. అయినా అభిమానులకోసం చిన్న ట్రీట్ ఏర్పాటు చేశాం. 99 శాతం నిజమైన సంఘటనలతోనే రూపొందించాం. ప్రతీ సీన్ వాస్తవానికి లింక్ అయి ఉంటుంది. సావిత్రి గారు యాక్ట్ చేసిన ముఖ్యమైన 11 సినిమాలను టచ్ చేశాం.
Comments
Please login to add a commentAdd a comment