![Rangasthalam and Mahanati heading Melbourne Film Festival - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/13/ranhgas.jpg.webp?itok=VWdVeS7C)
రామ్ చరణ్, కీర్తీ సురేశ్
వంద రోజుల క్లబ్‌లో చేరి ‘రంగస్థలం’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా మరో ఘనతను సాధించింది. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 2018’ (ఐఎఫ్‌ఎఫ్‌ఎమ్) స్క్రీనింగ్‌కి ఎంపిౖకై, బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ఐఎఫ్‌ఎఫ్‌ఎమ్ వేడుకలు ఆగస్టు 10 నుంచి 22వరకు జరగనున్నాయి. రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మించారు.
‘రంగస్థలం’ స్క్రీనింగ్ సమయానికి రామ్‌చరణ్ మెల్‌బోర్న్ వెళ్లనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే నటి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘మహానటి’ సినిమా కూడా ఐఎఫ్‌ఎఫ్‌ఎమ్ స్క్రీనింగ్‌కు సెలక్ట్ అయిందని సమాచారం. వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రియాంకా దత్, స్వప్నా దత్ నిర్మించారు. సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్ నటించారు. సమంత, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్ తదితరులు నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి భారీ ఎత్తున ప్రేక్షకాదరణ లభించింది. ఇలా ఈ ఏడాది వేసవిలో రిలీజైన ‘మహానటి, రంగస్థలం’ సినిమాలు అరుదైన ఘనతను సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment