Indian Film Festival of Melbourne
-
మెల్బోర్న్లో మైండ్ బ్లోయింగ్ క్రేజ్.. వరల్డ్ కప్ తో రామ్ చరణ్ (ఫొటోలు) (ఫొటోలు)
-
విదేశాల్లోనూ మహా విజయం
జనరల్‌గా బయోపిక్ అంటే ఏవోవో వివాదాలు వినిపిస్తుంటాయి. ‘మహానటి’ సినిమా విషయంలో కొన్ని విమర్శలు వచ్చినా ఎక్కువ ప్రశంసలే వచ్చాయి. అలనాటి అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన సినిమా ‘మహానటి’. తమిళంలో ‘నడిగర్ తిలకం’ అనే టైటిల్‌తో విడుదల చేశారు. సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్ వెండితెరపై కనిపించారు. సమంత, దుల్కర్ సల్మాన్, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. స్వప్నాదత్, ప్రియాంకా దత్ నిర్మించారు. ఈ ఏడాది మే 9న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వేదికపై మంచి గౌరవం లభించింది. ‘ఈక్వాలిటీ ఇన్ సినిమా’ అనే అవార్డు ‘మహానటి’ చిత్రాన్ని వరించింది. ఈ అవార్డును అందుకున్నారు ‘మహానటి’ టీమ్. అంతేకాదు ఇందులో కథానాయికగా నటించిన కీర్తీ సురేశ్ ఉత్తమ నటి విభాగంలో నామినేట్ అయ్యారు. ‘‘ఓ అద్భుతమైన చిత్రం నిర్మించి ఈ అవార్డు అందుకున్నందుకు గర్వంగా ఉంది. ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ ఘనవిజయం సాధించింది. బాక్సాఫీస్ నంబర్స్ ఇందుకు సాక్ష్యంగా నిలిచాయి’’ అన్నారు స్వప్నాదత్. -
అరుదైన ఘనత
వంద రోజుల క్లబ్లో చేరి ‘రంగస్థలం’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా మరో ఘనతను సాధించింది. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2018’ (ఐఎఫ్ఎఫ్ఎమ్) స్క్రీనింగ్‌కి ఎంపిౖకై, బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ఐఎఫ్ఎఫ్ఎమ్ వేడుకలు ఆగస్టు 10 నుంచి 22వరకు జరగనున్నాయి. రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మించారు. ‘రంగస్థలం’ స్క్రీనింగ్ సమయానికి రామ్‌చరణ్ మెల్బోర్న్ వెళ్లనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే నటి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘మహానటి’ సినిమా కూడా ఐఎఫ్ఎఫ్ఎమ్ స్క్రీనింగ్‌కు సెలక్ట్ అయిందని సమాచారం. వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రియాంకా దత్, స్వప్నా దత్ నిర్మించారు. సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్ నటించారు. సమంత, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్ తదితరులు నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి భారీ ఎత్తున ప్రేక్షకాదరణ లభించింది. ఇలా ఈ ఏడాది వేసవిలో రిలీజైన ‘మహానటి, రంగస్థలం’ సినిమాలు అరుదైన ఘనతను సాధించాయి. -
ఒకే వేదికపై బాహుబలి, పెళ్లిచూపులు
భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన సినిమా బాహుబలి. రీజినల్ సినిమా వంద కోట్లు వసూళు చేస్తేనే గగనం అనుకుంటున్న సమయంలో ఏకంగా 1500 కోట్లకు పైగా కొల్లగొట్టి తెలుగు సినిమా స్టామినాను ప్రూవ్ చేసింది ఈ సినిమా. అయితే ఇంతటి భారీ చిత్రంతో పాటు సమానం గౌరవాన్ని పొందింది ఓ చిన్న సినిమా. త్వరలో మెల్బోర్న్లో జరగనున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో బాహుబలితో పాటు మరో తెలుగు సినిమా పెళ్లిచూపులును కూడా ప్రదర్శించినున్నారు. ప్రతిష్టాత్మకంగా భావించే మెల్బోర్స్ ఫిలిం ఫెస్టివల్లో పలు భారతీయ భాషలకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించనున్నారు. వీటిలో తెలుగు నుంచి బాహుబలి, పెళ్లిచూపులు చిత్రాలు మాత్రమే ఎంపికయ్యాయి. -
ఒక్క ఛాన్స్... వెరీ రేర్ ఛాన్స్!
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కి అరుదైన అవకాశం లభించింది. ఇప్పటి వరకూ ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్ వేదికల్లో రెడ్ కార్పెట్‌పై హొయలొలికించిన ఈ బ్యూటీకి తాజాగా ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’(ఐ.ఎఫ్.ఎఫ్.ఎమ్) వేడుకల్లో సందడి చేసే అవకాశం వచ్చింది. ప్రతి ఏడాది ఆస్ట్రేలియాలో అట్టహాసంగా జరిగే ఈ వేడుకలు ఈ ఏడాది ఆగస్టులో జరగనున్నాయి. ఫ్రాన్స్‌లో జరిగే ‘కాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ వంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్స్‌లో పాల్గొన్న ఐశ్వర్యకు ఐ.ఎఫ్.ఎఫ్.ఎమ్‌లో పాల్గొనడం అరుదైన అవకాశమేంటి? అనే డౌట్ వస్తోందా? అక్కడే విశేషం ఉంది. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’ వేడుకల్లో భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఐశ్వర్య ఎగురవేయనున్నారు. మెల్బోర్న్లో ఇండియా జాతీయ జెండా ఎగురవేసే తొలి భారతీయ మహిళ ఐశ్వర్యారాయ్ కావడం విశేషం. ఇప్పటి వరకూ ఏ నటికీ రాని అవకాశం ఐష్‌కి రావడం అరుదైనదే కదా!