best film
-
సలార్‌తో పోటీ పడిన సినిమా.. ఉత్తమ చిత్రంగా అవార్డ్!
సైమా అవార్డ్స్-2024లో కన్నడ స్టార్ దర్శన్ నటించిన చిత్రం సత్తా చాటింది. శాండల్‌వుడ్‌లో ఉత్తమ చిత్రంగా అవార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ కన్నడలో గతేడాది రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. దర్శన్ హీరోగా నటించిన యాక్షన్ సినిమా కాటేరా.. గతేడాది డిసెంబర్లో బాక్సాఫీస్ వద్ద ఏకంగా ప్రభాస్ సలార్‌తో పోటీ పడి రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా ఈ చిత్రానికి సంగీతమందించిన హరికృష్ణ ఉత్తమ సంగీత దర్శకుడిగా సైమా అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు. కాగా.. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని దర్శకుడు తరుణ్ సుధీర్ తెరకెక్కించారు. కాటేరా సినిమాలో దర్శన్ సరసన ఆరాధన రామ్ హీరోయిన్గా మెప్పించింది. సీనియర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు అయిన ఆరాధన రామ్ కాటేరా మూవీతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. (ఇది చదవండి: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ సినిమా తెలుగు వర్షన్)జైలులో దర్శన్అయితే ఈ మూవీ సూపర్ హిట్ తర్వాత ఊహించని విధంగా దర్శన్ ఓ హత్యకేసులో అరెస్టయ్యారు. ప్రియురాలిని వేధిస్తున్నాడంటూ ఓ అభిమాని హత్య చేయడం కన్నడ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ప్రస్తుతం దర్శన్, అతని ప్రియురాలు సైతం జైలులోనే ఉన్నారు. ఇటీవలే ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. Best Film #KAATERA #SIIMA #SIIMAAwards #SIIMAinDubai #Dboss #D56 pic.twitter.com/Pvx3ixJCDp— Filmy Corner ꭗ (@filmycorner9) September 14, 2024Congratulations Harikrishna for winning Best Music Director award in SIIMA for #Kaatera 🎊Thank you for giving this gem of a song to us, We will cherish forever❤️#DBoss @dasadarshanpic.twitter.com/fULQhP4tsK— King Kariya (@KingKariyaa) September 14, 2024𝗦𝗜𝗜𝗠𝗔 𝟮𝟬𝟮𝟰: Best Film (Kannada) award goes to #Kaatera #DBoss #RocklineEntertainment #SIIMA2024 #SIIMAAwards pic.twitter.com/jqitWHmMDu— Bhargavi (@IamHCB) September 14, 2024 -
అరుదైన ఘనత
వంద రోజుల క్లబ్లో చేరి ‘రంగస్థలం’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా మరో ఘనతను సాధించింది. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2018’ (ఐఎఫ్ఎఫ్ఎమ్) స్క్రీనింగ్‌కి ఎంపిౖకై, బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ఐఎఫ్ఎఫ్ఎమ్ వేడుకలు ఆగస్టు 10 నుంచి 22వరకు జరగనున్నాయి. రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మించారు. ‘రంగస్థలం’ స్క్రీనింగ్ సమయానికి రామ్‌చరణ్ మెల్బోర్న్ వెళ్లనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే నటి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘మహానటి’ సినిమా కూడా ఐఎఫ్ఎఫ్ఎమ్ స్క్రీనింగ్‌కు సెలక్ట్ అయిందని సమాచారం. వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రియాంకా దత్, స్వప్నా దత్ నిర్మించారు. సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్ నటించారు. సమంత, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్ తదితరులు నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి భారీ ఎత్తున ప్రేక్షకాదరణ లభించింది. ఇలా ఈ ఏడాది వేసవిలో రిలీజైన ‘మహానటి, రంగస్థలం’ సినిమాలు అరుదైన ఘనతను సాధించాయి. -
నా ఉద్దేశంలో బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ అదే
ఫిల్మ్ ప్రిజర్వేషన్, ఫిల్మ్ పై సినిమాలు తీయడంలోని ప్రాముఖ్యత గురించిన ఈవెంట్లో పాల్గొనడానికి హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఇండియా వచ్చిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో క్రిస్టోçఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ‘ఇంటర్స్టెల్లార్, డంకర్క్’ సినిమాలను ప్రదర్శించారు. అలాగే నోలన్ కొన్ని ఇండియన్ సినిమాలు చూశారు. ఈ సందర్భంగా నోలన్ మాట్లాడుతూ –‘‘ఇండియన్ ఫిల్మ్ మేకర్స్‌ను కలవాలని, వాళ్ల స్టైల్ తెలుసుకోవాలని చాలాసార్లు అనుకున్నాను. ఈ ప్రయాణం ద్వారా అది నెరవేరింది. ఈ విజిట్‌లో సత్యజిత్ రే తీసిన ‘పథేర్ పాంచాలి’ (1955) సినిమా చూశాను. నా దృష్టిలో ‘పథేర్ పాంచాలి’ బెస్ట్ ఇండియన్ ఫిల్మ్. దర్శకుడు సత్యజిత్ రే చేసిన ఎక్స్ట్రార్డినరీ వర్క్ ఇది. ఫ్యూచర్లో మరికొన్ని ఇండియన్ సినిమాలు చూడాలనుకుంటున్నాను. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంది. ఇప్పుడు ఇండియాకు రావటానికి అది కూడా ఒక కారణమే’’ అని అన్నారాయన. -
నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ ఇది : నాగార్జున
‘‘కమర్షియల్ సినిమాలు ఎప్పుడైనా చెయ్యొచ్చు. అటువంటి సినిమాలు సుమారు 90 చేశా. కానీ, ఇలాంటి ఆధ్యాత్మిక, భక్తిరస సినిమాల్లో నటించే ఛాన్సులు అందరికీ దక్కవు. నాకు ఈ ఛాన్సులు రావడం అదృష్టంగా భావిస్తున్నా. నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ ఇది’’ అన్నారు అక్కినేని నాగార్జున. వేంకటేశ్వరస్వామి భక్తుడు హాథీరామ్ బాబాగా ఆయన నటించిన సినిమా ‘ఓం నమో వేంకటేశాయ’. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ. మహేశ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ – ‘‘దేవుణ్ణి చూడాలనుకున్న ఓ వ్యక్తి తిరుమల చేరుకున్న తర్వాత ఎలాంటి ఆధ్యాత్మిక భావనకు లోనయ్యా డనేది ఈ సినిమా. ఎంత వసూలు చేస్తుంది? ఎప్పుడు విడుదలవుతుంది? వంటి టెన్షన్లు లేకుండా హ్యాపీగా నటించాను. అసలు దేవుడు ఉన్నాడా? లేడా? అనేది పక్కన పెడితే... ఇటువంటి సినిమాలు చేయడం వల్ల ఓ క్రమశిక్షణ వస్తుంది. రాఘవేంద్రరావుగారి దర్శకత్వం, కీరవాణి సంగీతం, జేకే భారవి రచన, సాహిత్యం... అన్నీ నన్నో భక్తిభావంలోకి తీసుకువెళ్లాయి. రిలీజ్ తర్వాత వీళ్లందరికీ థ్యాంక్స్ చెప్పడం కుదరదు. అందుకే, ఇప్పుడు చెబుతున్నా. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులందరూ సంతోషంతో ఓ కొత్త అనుభూతికి లోనవుతారు’’ అన్నారు. కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘నాగార్జున కళ్లతోనే నటించాడు. ‘అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక..’ పాటలో అయితే నాగ్ నటన అద్భుతం. కృష్ణమ్మగా నటించిన అనుష్కతో పాటు చిత్ర బృందమంతా భక్తి భావంతో పనిచేశారు. సినిమా చూస్తుంటే.. రెండున్నర గంటలు ఆధ్యాత్మిక ప్రయాణం చేసినట్టే ఉంటుంది. విడుదల తర్వాత థియేటర్లన్నీ దైవక్షేత్రాలుగా మారతాయి’’ అన్నారు. నిర్మాత ఏ. మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాతో నా జన్మ ధన్యమైంది. మేమంతా ఓ కుటుంబంలా కలసి పనిచేశాం. శ్రీనివాసుడే మా అందర్నీ కలిపాడనుకుంటున్నా. భగవంతుడు, భక్తుడు కలసి ఆడే ఆటే ఈ సినిమా. చిత్రీకరణ పూర్తయిన తర్వాత కూడా నాగార్జున గడ్డం తీయలేదు. ఒకవేళ ఏవైనా సన్నివేశాలు మళ్లీ చిత్రీకరించాలంటే ఇబ్బంది అవుతుందని అలాగే ఉన్నారు. రాఘవేంద్రరావుగారు ఈ వయసులోనూ రోజుకి 14 గంటలు పనిచేశారు. శ్రీనివాసుడి భక్తులకు, నాగార్జున అభిమానులకు ఈ సినిమా ఓ అద్భుతమైన బహుమతిగా ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు విమలా రామన్, అస్మిత, సౌరభ్ జైన్, రచయిత జేకే భారవి, పాటల రచయితలు వేదవ్యాస, అనంత శ్రీరామ్, కళా దర్శకుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘నంది’ స్థానంలో సింహ అవార్డులు
• ఉత్తమ సినీ కళాకారుడికిఎన్టీఆర్ జాతీయ అవార్డు • రాష్ట్రంలో నిర్మించిన ఉత్తమ చిత్రాలు, • కళాకారులకు తెలంగాణ పురస్కారాలు • ప్రభుత్వానికి కమిటీ సిఫార్సులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మించే ఉత్తమ చలన చిత్రాలకు, అత్యుత్తమ ప్రతిభను ప్రద ర్శించే కళాకారులకు ‘సింహ’ పురస్కారాలు ఇవ్వాలని రాష్ట్ర చలనచిత్ర పురస్కారాల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో చలన చిత్ర పురస్కారాలను ‘నంది’ పేరుతో అందజేసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ఏర్పాటైన నేపథ్యంలో ఈ పురస్కారాలను ఏ విధంగా అందజేయాలనే దానిపై ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి నేతృత్వంలో సినీ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. మంగళవారం జరిగిన ఓ సమావేశంలో ఈ కమిటీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు తమ ప్రతిపాదనలను అందజేసింది. పురస్కారాలు ‘సింహం’ రూపంలో ఉండాలని.. మొత్తం నలభై విభాగాల్లో వీటిని అందజేయాలని కమిటీ సూచించింది. మొదటి విభాగంలో పురస్కారాలకు రూ.5 లక్షల చొప్పున నగదు పారితోషికం ఇవ్వాలని పేర్కొంది. తెలంగాణ ముద్ర చాటేలా చలనచిత్ర పురస్కారాలు ఇవ్వాలని అభిప్రాయపడింది. దీనికి సంబం« దించి సినిమాటోగ్రఫీ శాఖ ఓ ఫైలును సిద్ధం చేసి... గురువారం ముఖ్యమంత్రి కార్యాలయా నికి పంపింది. సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపిన అనంతరం ఉత్తర్వులు వెలువడనున్నాయి. సినీకళాకారులు, సాంకేతిక నిపుణులకు.. ⇔ ఉత్తమ దర్శకుడు, కథానాయకుడు, నాయికకు స్వర్ణ సింహాలు, రూ.లక్ష చొప్పున నగదు ⇔ ఉత్తమ సహాయ నటుడు, నటికి రూ.50 వేలు, స్వర్ణ సింహాలు ⇔ ఉత్తమ హాస్యనటునికి తామ్ర సింహం, రూ.50 వేలు ⇔ ఉత్తమ ప్రతినాయకునికి స్వర్ణ సింహం, రూ.50 వేలు ⇔ ఉత్తమ బాల నటులకు స్వర్ణ సింహం, రూ. 50 వేలు ⇔ తొలి చిత్ర దర్శకుడు, నటుడు, నటికి రూ.50 వేలు, రజత సింహం. ⇔ ఉత్తమ కథా రచయిత, మాటలు, పాటల రచయిత, సినిమాటోగ్రాఫర్‌కు స్వర్ణ సింహం, రూ.50 వేల నగదు ⇔ ఉత్తమ సంగీత దర్శకుడికి చక్రి పేరిట రూ.50 వేలు, స్వర్ణ సింహం ⇔ ఉత్తమ నేపథ్య గాయకుడు, గాయనిలకు రూ.50 వేలు, స్వర్ణసింహాలు ⇔ ఉత్తమ ఎడిటర్, కళాదర్శకుడు, నృత్యదర్శకుడు, ఆడియోగ్రాఫర్, కాస్ట్యూమ్ డిజైనర్, మేకప్ ఆర్టిస్టు, స్టంట్ డిజైనర్, డబ్బింగ్ కళాకారుడు, కళాకారిణి, విజువల్ ఎఫెక్టŠస్, ప్రత్యేక కేటగిరీ పురస్కారాల కింద తామ్ర సింహాలు, రూ. 50 వేలు. కమిటీ సిఫార్సులివీ.. ⇔ జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ నటులకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం. రూ.5 లక్షల పారితోషికం, స్వర్ణ సింహం ⇔ నటులు కాకుండా ఇతర సినీ ప్రముఖులకు పైడి జయరాజు పేరిట స్వర్ణ సింహం, రూ.5 లక్షలు. ⇔ తెలుగు సినీ ప్రముఖులకు రఘుపతి వెంకయ్యపురస్కారం, స్వర్ణసింహం, రూ.5 లక్షలు ⇔ తెలంగాణ సినీ ప్రముఖులకు కాంతారావు పురస్కారం, స్వర్ణసింహం, రూ.5లక్షలు ఉత్తమ చిత్రాలకు ⇔ ఉత్తమ చిత్రానికి రూ.5 లక్షలు, నిర్మాతకు స్వర్ణ సింహం; దర్శకుడు, హీరో, హీరోయిన్లకు సింహ పురస్కారాలు ⇔ ద్వితీయ ఉత్తమ చిత్ర నిర్మాతకు రజత సింహం, రూ.3 లక్షలు; దర్శకుడు, హీరో, హీరోయిన్లకు పురస్కారాలు ⇔ తృతీయ ఉత్తమ చిత్ర నిర్మాతకు కాంస్య సింహం, రూ.2 లక్షలు; దర్శకుడు, హీరో, హీరోయిన్లకు పురస్కారాలు ⇔ ఉత్తమ కుటుంబ చిత్రానికి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పురస్కారం. నిర్మాతకు స్వర్ణ సింహం, రూ.2 లక్షల నగదు ⇔ ఉత్తమ వినోదాత్మక చిత్రానికి స్వర్ణ సింహం, రూ.2 లక్షల నగదు ⇔ జాతీయ సమగ్రతను చాటే చిత్రానికి సరోజినీనాయుడు పురస్కారం. నిర్మాతకు రూ.2 లక్షల నగదు, స్వర్ణసింహం; దర్శకుడికి తామ్ర పురస్కారం ⇔ ఉత్తమ బాలల చిత్ర నిర్మాతకు స్వర్ణ సింహం, రూ.2 లక్షల నగదు; దర్శకుడికి రూ.లక్ష, తామ్ర సింహం ⇔ ద్వితీయ ఉత్తమ బాలల చిత్ర నిర్మాతకు రూ.లక్ష, రజత సింహం; దర్శకుడికి రూ.50 వేలు ⇔ బాలల చిత్ర విభాగంలో ఉత్తమ దర్శకుడికి రూ.లక్ష, స్వర్ణ సింహం ⇔ తెలుగు సినిమాపై ఉత్తమ గ్రంథానికి రూ.50 వేలు, తామ్ర సింహం ⇔ తెలుగు సినిమాపై ఉత్తమ విమర్శకుడికి రూ.30 వేలు,తామ్ర సింహం -
నా కెరీర్లో ఇదే బెస్ట్ ఫిల్మ్ - రామ్‌గోపాల్ వర్మ
‘‘వంగవీటితో పరిచయం ఉన్న వ్యక్తులకు ఆయన గురించి ఓ అవగాహన ఉంటుంది. దూరం నుంచి గమనిస్తూ, వింటున్న నాలాంటోళ్ల అవగాహన మరో విధంగా ఉంటుంది. రెండిటిలో ఏది నిజం అనేది ప్రశ్న కాదు. నాకు అర్థమైన, నా అవగాహన దృష్టితో ఈ సినిమా తీశా’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. విజయవాడ రాజకీయాలు, రౌడీయిజం నేపథ్యంలో ఆయన తీసిన సినిమా ‘వంగవీటి’. వంగవీటి మోహనరంగా, రాధా పాత్రల్లో సందీప్‌కుమార్, రత్నకుమారిగా నైనా గంగూలీ, దేవినేని మురళిగా ‘హ్యాపీడేస్’ ఫేమ్ వంశీ, దేవినేని గాంధీగా కౌటిల్య, దేవినేని నెహ్రూగా శ్రీతేజ, దేవినేని లక్ష్మిగా ప్రజ్ఞ నటించారు. దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక శనివారం రాత్రి విజయవాడలో జరిగింది. కేయల్ యూనివర్సిటీ చైర్మన్ కోనేరు సత్యనారాయణ ఆడియో సీడీలను ఆవిష్కరించి, వర్మకు అందజేశారు. వర్మ మాట్లాడుతూ - ‘‘వంగవీటి మోహన రంగా ర్యాలీ జరుగుతున్నప్పుడు ఓ సారి నేనూ పాల్గొన్నాను. నేను దర్శకుణ్ణి కాక ముందు నుంచీ ఈ కథ నాకు తెలుసు. అప్పుడు విజయవాడలో జరిగిన పరిస్థితులు, వాతావరణాన్ని స్టడీ చేసి ఆ అవగాహనతో నేనో దర్శకుణ్ణి అయ్యాను. ఈ సినిమాతో నాకున్న ఎమోషనల్ బాండింగ్ మరే సినిమాతోనూ లేదు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఫ్యాక్షన్ కావొచ్చు.. గ్యాంగ్‌స్టర్ కావొచ్చు లేదా హైదరాబాద్ గూండాయిజమ్ మీద తీసినవి కావొచ్చు. ఇరవై ఏడేళ్ల నా కెరీర్లో ‘వంగవీటి’ నా బెస్ట్ ఫిల్మ్. నేనే దర్శకుణ్ణి కాబట్టి, ఈ మాట చెప్పడం సరి కాదేమో కానీ చెబుతున్నా! వివాదాస్పదఅంశంతో నిజజీవిత పాత్రల ఆధారంగా ఈ సినిమా తీయడం వల్ల ఎంతోమందికి ఇబ్బంది కలుగుతుందని తెలిసినా కూడా ముందుకొచ్చిన నిర్మాతకు థ్యాంక్స్’’ అన్నారు. దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ - ‘‘క్రియేటివిటీతో పాటు దమ్ము, ధైర్యం, పౌరుషం ఉన్న దర్శకులు వర్మగారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మంచి ఆలోచనతో, స్పోర్టివ్‌గా చూస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. సంగీత దర్శకుడు రవిశంకర్ మాట్లాడుతూ - ‘‘వాస్తవిక కథతో తెరకెక్కిన ఇటువంటి చిత్రాలకు సంగీతం అందించడం చాలా ఇష్టం’’ అన్నారు. మరో సంగీత దర్శకుడు రాజశేఖర్ పన్నాల, పాటల రచయితలు సిరాశ్రీ, చైతన్య ప్రసాద్, హీరో హవీష్, వేదా సీడ్స్ ఎండీ తులసీధరమ్ చరణ్, పారిశ్రామికవేత్త తోటకూర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీమంతుడు నా కెరీర్లో కీలకం