సలార్‌తో పోటీ పడిన సినిమా.. ఉత్తమ చిత్రంగా అవార్డ్‌! | Kannada Hero Darshan Block Buster Movie Gets SIIMA Award | Sakshi
Sakshi News home page

Kaatera Movie: జైల్లో ఉన్న హీరో దర్శన్.. ఉత్తమ చిత్రంగా సైమా అవార్డ్!

Published Sun, Sep 15 2024 9:06 AM | Last Updated on Sun, Sep 15 2024 1:30 PM

Kannada Hero Darshan Block Buster Movie Gets SIIMA Award

సైమా అవార్డ్స్‌-2024లో కన్నడ స్టార్‌ దర్శన్‌ నటించిన చిత్రం సత్తా చాటింది. శాండల్‌వుడ్‌లో ఉత్తమ చిత్రంగా అవార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ క‌న్న‌డలో గతేడాది రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ కొట్టింది. దర్శ‌న్ హీరోగా న‌టించిన యాక్ష‌న్ సినిమా  కాటేరా.. గతేడాది డిసెంబర్‌లో బాక్సాఫీస్ వద్ద ఏకంగా ప్రభాస్‌ సలార్‌తో  పోటీ పడి రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది.  అంతేకాకుండా ఈ చిత్రానికి సంగీతమందించిన హరికృష్ణ ఉత్తమ సంగీత దర్శకుడిగా సైమా అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు. 

కాగా.. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని ద‌ర్శ‌కుడు త‌రుణ్ సుధీర్  తెర‌కెక్కించారు. కాటేరా సినిమాలో దర్శన్‌ సరసన ఆరాధ‌న రామ్ హీరోయిన్‌గా మెప్పించింది. సీనియ‌ర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు అయిన ఆరాధ‌న రామ్ కాటేరా మూవీతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీలక పాత్ర పోషించారు.  

(ఇది చదవండి: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా తెలుగు వర్షన్‌)

జైలులో దర్శన్

అయితే ఈ మూవీ సూపర్ హిట్‌ తర్వాత ఊహించని విధంగా దర్శన్ ఓ హత్యకేసులో అరెస్టయ్యారు. ప్రియురాలిని వేధిస్తున్నాడంటూ ఓ అభిమాని హత్య చేయడం కన్నడ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ప్రస్తుతం దర్శన్‌, అతని ప్రియురాలు సైతం జైలులోనే ఉన్నారు.  ఇటీవలే ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్‌ దాఖలు చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement